< లూకా 24 >

1 ఆదివారం తెల్లవారిన తరువాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు.
অথ সপ্তাহপ্রথমদিনেঽতিপ্রত্যূষে তা যোষিতঃ সম্পাদিতং সুগন্ধিদ্রৱ্যং গৃহীৎৱা তদন্যাভিঃ কিযতীভিঃ স্ত্রীভিঃ সহ শ্মশানং যযুঃ|
2 సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండడం చూసి లోపలికి వెళ్ళారు.
কিন্তু শ্মশানদ্ৱারাৎ পাষাণমপসারিতং দৃষ্ট্ৱা
3 కానీ ప్రభు యేసు దేహం వారికి కనబడలేదు. దాంతో వారికేమీ తోచలేదు.
তাঃ প্রৱিশ্য প্রভো র্দেহমপ্রাপ্য
4 అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు.
ৱ্যাকুলা ভৱন্তি এতর্হি তেজোমযৱস্ত্রান্ৱিতৌ দ্ৱৌ পুরুষৌ তাসাং সমীপে সমুপস্থিতৌ
5 వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు, “సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు?
তস্মাত্তাঃ শঙ্কাযুক্তা ভূমাৱধোমুখ্যস্যস্থুঃ| তদা তৌ তা ঊচতু র্মৃতানাং মধ্যে জীৱন্তং কুতো মৃগযথ?
6 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు
সোত্র নাস্তি স উদস্থাৎ|
7 మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారనీ, వారు ఆయనను సిలువ వేసి చంపుతారనీ, తిరిగి ఆయన మూడవ రోజున సజీవుడిగా లేస్తాడనీ మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి” అన్నారు.
পাপিনাং করেষু সমর্পিতেন ক্রুশে হতেন চ মনুষ্যপুত্রেণ তৃতীযদিৱসে শ্মশানাদুত্থাতৱ্যম্ ইতি কথাং স গলীলি তিষ্ঠন্ যুষ্মভ্যং কথিতৱান্ তাং স্মরত|
8 అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు.
তদা তস্য সা কথা তাসাং মনঃসু জাতা|
9 వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వారికందరికీ చెప్పారు.
অনন্তরং শ্মশানাদ্ গৎৱা তা একাদশশিষ্যাদিভ্যঃ সর্ৱ্ৱেভ্যস্তাং ৱার্ত্তাং কথযামাসুঃ|
10 ౧౦ ఇలా ఈ సంగతులను అపొస్తలులకు చెప్పిన స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వారితో ఉన్న యితర స్త్రీలూ.
১০মগ্দলীনীমরিযম্, যোহনা, যাকূবো মাতা মরিযম্ তদন্যাঃ সঙ্গিন্যো যোষিতশ্চ প্রেরিতেভ্য এতাঃ সর্ৱ্ৱা ৱার্ত্তাঃ কথযামাসুঃ
11 ౧౧ అయితే విన్నవారికి ఈ మాటలు పిచ్చి మాటలుగా అనిపించాయి. కాబట్టి వారెవరూ వీరి మాటలు నమ్మలేదు.
১১কিন্তু তাসাং কথাম্ অনর্থকাখ্যানমাত্রং বুদ্ধ্ৱা কোপি ন প্রত্যৈৎ|
12 ౧౨ అయితే పేతురు లేచి, సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ సమాధిలోకి తొంగి చూశాడు. అక్కడ నారబట్టలు మాత్రం కనిపించాయి. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.
১২তদা পিতর উত্থায শ্মশানান্তিকং দধাৱ, তত্র চ প্রহ্ৱো ভূৎৱা পার্শ্ৱৈকস্থাপিতং কেৱলং ৱস্ত্রং দদর্শ; তস্মাদাশ্চর্য্যং মন্যমানো যদঘটত তন্মনসি ৱিচারযন্ প্রতস্থে|
13 ౧౩ ఆ రోజే ఇద్దరు శిష్యులు యెరూషలేముకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయిస్ గ్రామానికి వెళ్తున్నారు.
১৩তস্মিন্নেৱ দিনে দ্ৱৌ শিয্যৌ যিরূশালমশ্চতুষ্ক্রোশান্তরিতম্ ইম্মাযুগ্রামং গচ্ছন্তৌ
14 ౧౪ జరిగిన ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు.
১৪তাসাং ঘটনানাং কথামকথযতাং
15 ౧౫ అలా వారు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండగా యేసు వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నాడు.
১৫তযোরালাপৱিচারযোঃ কালে যীশুরাগত্য তাভ্যাং সহ জগাম
16 ౧౬ అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే వారి కళ్ళు మూతలు పడ్డట్టు అయింది.
১৬কিন্তু যথা তৌ তং ন পরিচিনুতস্তদর্থং তযো র্দৃষ্টিঃ সংরুদ্ধা|
17 ౧౭ ఆయన, “మీరు నడుస్తూ పరస్పరం చర్చించుకుంటున్న విషయాలు ఏమిటి?” అని వారిని అడిగాడు. దాంతో వారు దుఃఖంతో నిండిపోయి నిలబడిపోయారు.
১৭স তৌ পৃষ্টৱান্ যুৱাং ৱিষণ্ণৌ কিং ৱিচারযন্তৌ গচ্ছথঃ?
18 ౧౮ వారిలో క్లెయొపా అనేవాడు, “యెరూషలేములో కాపురముంటూ ఈ రోజుల్లో అక్కడ జరుగుతున్న విషయాలు తెలియని వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకుంటా” అన్నాడు.
১৮ততস্তযোঃ ক্লিযপানামা প্রত্যুৱাচ যিরূশালমপুরেঽধুনা যান্যঘটন্ত ৎৱং কেৱলৱিদেশী কিং তদ্ৱৃত্তান্তং ন জানাসি?
19 ౧౯ ఆయన, “ఏ విషయాలు?” అని అడిగాడు. అప్పుడు వారు, “నజరేతు వాడైన యేసును గురించిన విషయాలే. ఆయన దేవుని దృష్టిలోనూ ప్రజలందరి దృష్టిలోనూ మాటల్లో పనుల్లో శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు.
১৯স পপ্রচ্ছ কা ঘটনাঃ? তদা তৌ ৱক্তুমারেভাতে যীশুনামা যো নাসরতীযো ভৱিষ্যদ্ৱাদী ঈশ্ৱরস্য মানুষাণাঞ্চ সাক্ষাৎ ৱাক্যে কর্ম্মণি চ শক্তিমানাসীৎ
20 ౨౦ మన ముఖ్య యాజకులూ అధికారులూ ఆయనను మరణశిక్షకు అప్పగించి, ఎలా సిలువ వేయించారో నీకు తెలియదా?
২০তম্ অস্মাকং প্রধানযাজকা ৱিচারকাশ্চ কেনাপি প্রকারেণ ক্রুশে ৱিদ্ধ্ৱা তস্য প্রাণাননাশযন্ তদীযা ঘটনাঃ;
21 ౨౧ ఇశ్రాయేలు ప్రజను విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం. ఈ విషయాలన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి.
২১কিন্তু য ইস্রাযেলীযলোকান্ উদ্ধারযিষ্যতি স এৱাযম্ ইত্যাশাস্মাভিঃ কৃতা| তদ্যথা তথাস্তু তস্যা ঘটনাযা অদ্য দিনত্রযং গতং|
22 ౨౨ అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దేహం కనిపించక తిరిగి వచ్చారు.
২২অধিকন্ত্ৱস্মাকং সঙ্গিনীনাং কিযৎস্ত্রীণাং মুখেভ্যোঽসম্ভৱৱাক্যমিদং শ্রুতং;
23 ౨౩ కొందరు దేవదూతలు తమకు కనబడి, ‘ఆయన బతికే ఉన్నాడు’ అని చెప్పారు అని మాకు తెలిపినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది.
২৩তাঃ প্রত্যূষে শ্মশানং গৎৱা তত্র তস্য দেহম্ অপ্রাপ্য ৱ্যাঘুট্যেৎৱা প্রোক্তৱত্যঃ স্ৱর্গীসদূতৌ দৃষ্টাৱস্মাভিস্তৌ চাৱাদিষ্টাং স জীৱিতৱান্|
24 ౨౪ మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు” అని ఆయనకు చెప్పారు.
২৪ততোস্মাকং কৈশ্চিৎ শ্মশানমগম্যত তেঽপি স্ত্রীণাং ৱাক্যানুরূপং দৃষ্টৱন্তঃ কিন্তু তং নাপশ্যন্|
25 ౨౫ అందుకాయన, “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా,
২৫তদা স তাৱুৱাচ, হে অবোধৌ হে ভৱিষ্যদ্ৱাদিভিরুক্তৱাক্যং প্রত্যেতুং ৱিলম্বমানৌ;
26 ౨౬ క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని వారితో అన్నాడు.
২৬এতৎসর্ৱ্ৱদুঃখং ভুক্ত্ৱা স্ৱভূতিপ্রাপ্তিঃ কিং খ্রীষ্টস্য ন ন্যায্যা?
27 ౨౭ ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి రాసిన మాటల అర్థాన్ని వారికి తెలియజేశాడు.
২৭ততঃ স মূসাগ্রন্থমারভ্য সর্ৱ্ৱভৱিষ্যদ্ৱাদিনাং সর্ৱ্ৱশাস্ত্রে স্ৱস্মিন্ লিখিতাখ্যানাভিপ্রাযং বোধযামাস|
28 ౨౮ ఇంతలో వారి గ్రామం వచ్చింది. ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్టు కనిపించింది.
২৮অথ গম্যগ্রামাভ্যর্ণং প্রাপ্য তেনাগ্রে গমনলক্ষণে দর্শিতে
29 ౨౯ దాంతో వారు, “పొద్దు వాలుతున్నది. చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు” అంటూ ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడా ఇంట్లోకి వెళ్ళాడు.
২৯তৌ সাধযিৎৱাৱদতাং সহাৱাভ্যাং তিষ্ঠ দিনে গতে সতি রাত্রিরভূৎ; ততঃ স তাভ্যাং সার্দ্ধং স্থাতুং গৃহং যযৌ|
30 ౩౦ ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకుని దానికోసం కృతజ్ఞతలు చెప్పి, విరిచి తినడానికి వారికిచ్చాడు.
৩০পশ্চাদ্ভোজনোপৱেশকালে স পূপং গৃহীৎৱা ঈশ্ৱরগুণান্ জগাদ তঞ্চ ভংক্ত্ৱা তাভ্যাং দদৌ|
31 ౩౧ అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి. వారు ఆయనను గుర్తు పట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా మాయమయ్యాడు.
৩১তদা তযো র্দৃষ্টৌ প্রসন্নাযাং তং প্রত্যভিজ্ঞতুঃ কিন্তু স তযোঃ সাক্ষাদন্তর্দধে|
32 ౩౨ అప్పుడు వారు, “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థం అయ్యేలా చెబుతున్నప్పుడు మన హృదయాలు దహించుకు పోతున్నట్టు అనిపించ లేదూ” అని చెప్పుకున్నారు.
৩২ততস্তৌ মিথোভিধাতুম্ আরব্ধৱন্তৌ গমনকালে যদা কথামকথযৎ শাস্ত্রার্থঞ্চবোধযৎ তদাৱযো র্বুদ্ধিঃ কিং ন প্রাজ্ৱলৎ?
33 ౩౩ అప్పుడే వారు లేచి తిరిగి యెరూషలేము వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులూ, వారితో ఉన్నవారూ కలుసుకుని
৩৩তৌ তৎক্ষণাদুত্থায যিরূশালমপুরং প্রত্যাযযতুঃ, তৎস্থানে শিষ্যাণাম্ একাদশানাং সঙ্গিনাঞ্চ দর্শনং জাতং|
34 ౩౪ “ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనిపించాడు” అని చెప్పుకుంటున్నారు. వారది విని
৩৪তে প্রোচুঃ প্রভুরুদতিষ্ঠদ্ ইতি সত্যং শিমোনে দর্শনমদাচ্চ|
35 ౩౫ దారిలో జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరిచిన వెంటనే తమకెలా ప్రత్యక్షమయ్యాడో తెలియజేశారు.
৩৫ততঃ পথঃ সর্ৱ্ৱঘটনাযাঃ পূপভঞ্জনেন তৎপরিচযস্য চ সর্ৱ্ৱৱৃত্তান্তং তৌ ৱক্তুমারেভাতে|
36 ౩౬ వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు.
৩৬ইত্থং তে পরস্পরং ৱদন্তি তৎকালে যীশুঃ স্ৱযং তেষাং মধ্য প্রোত্থয যুষ্মাকং কল্যাণং ভূযাদ্ ইত্যুৱাচ,
37 ౩౭ అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు.
৩৭কিন্তু ভূতং পশ্যাম ইত্যনুমায তে সমুদ্ৱিৱিজিরে ত্রেষুশ্চ|
38 ౩౮ అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు?
৩৮স উৱাচ, কুতো দুঃখিতা ভৱথ? যুষ্মাকং মনঃসু সন্দেহ উদেতি চ কুতঃ?
39 ౩౯ నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు.
৩৯এষোহং, মম করৌ পশ্যত ৱরং স্পৃষ্ট্ৱা পশ্যত, মম যাদৃশানি পশ্যথ তাদৃশানি ভূতস্য মাংসাস্থীনি ন সন্তি|
40 ౪౦ అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు.
৪০ইত্যুক্ত্ৱা স হস্তপাদান্ দর্শযামাস|
41 ౪౧ అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు.
৪১তেঽসম্ভৱং জ্ঞাৎৱা সানন্দা ন প্রত্যযন্| ততঃ স তান্ পপ্রচ্ছ, অত্র যুষ্মাকং সমীপে খাদ্যং কিঞ্চিদস্তি?
42 ౪౨ వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు.
৪২ততস্তে কিযদ্দগ্ধমৎস্যং মধু চ দদুঃ
43 ౪౩ ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు.
৪৩স তদাদায তেষাং সাক্ষাদ্ বুভুজে
44 ౪౪ తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు.
৪৪কথযামাস চ মূসাৱ্যৱস্থাযাং ভৱিষ্যদ্ৱাদিনাং গ্রন্থেষু গীতপুস্তকে চ মযি যানি সর্ৱ্ৱাণি ৱচনানি লিখিতানি তদনুরূপাণি ঘটিষ্যন্তে যুষ্মাভিঃ সার্দ্ধং স্থিৎৱাহং যদেতদ্ৱাক্যম্ অৱদং তদিদানীং প্রত্যক্ষমভূৎ|
45 ౪౫ అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు.
৪৫অথ তেভ্যঃ শাস্ত্রবোধাধিকারং দৎৱাৱদৎ,
46 ౪౬ “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ,
৪৬খ্রীষ্টেনেত্থং মৃতিযাতনা ভোক্তৱ্যা তৃতীযদিনে চ শ্মশানাদুত্থাতৱ্যঞ্চেতি লিপিরস্তি;
47 ౪౭ యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది.
৪৭তন্নাম্না যিরূশালমমারভ্য সর্ৱ্ৱদেশে মনঃপরাৱর্ত্তনস্য পাপমোচনস্য চ সুসংৱাদঃ প্রচারযিতৱ্যঃ,
48 ౪౮ మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.
৪৮এষু সর্ৱ্ৱেষু যূযং সাক্ষিণঃ|
49 ౪౯ “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు.
৪৯অপরঞ্চ পশ্যত পিত্রা যৎ প্রতিজ্ঞাতং তৎ প্রেষযিষ্যামি, অতএৱ যাৱৎকালং যূযং স্ৱর্গীযাং শক্তিং ন প্রাপ্স্যথ তাৱৎকালং যিরূশালম্নগরে তিষ্ঠত|
50 ౫౦ ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు.
৫০অথ স তান্ বৈথনীযাপর্য্যন্তং নীৎৱা হস্তাৱুত্তোল্য আশিষ ৱক্তুমারেভে
51 ౫౧ అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు.
৫১আশিষং ৱদন্নেৱ চ তেভ্যঃ পৃথগ্ ভূৎৱা স্ৱর্গায নীতোঽভৱৎ|
52 ౫౨ వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.
৫২তদা তে তং ভজমানা মহানন্দেন যিরূশালমং প্রত্যাজগ্মুঃ|
53 ౫౩ దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.
৫৩ততো নিরন্তরং মন্দিরে তিষ্ঠন্ত ঈশ্ৱরস্য প্রশংসাং ধন্যৱাদঞ্চ কর্ত্তম্ আরেভিরে| ইতি||

< లూకా 24 >