< లూకా 23 >

1 అప్పుడు వారంతా కలసి ఆయనను పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు.
και ανασταν απαν το πληθοσ αυτων ηγαγον αυτον επι τον πιλατον
2 “ఇతడు మా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నాడు. సీజరుకి పన్ను చెల్లించ వద్దనీ తాను క్రీస్తు అనే రాజుననీ ఇతడు చెబుతుంటే విన్నాము” అని ఆయన మీద నేరారోపణ చేశారు.
ηρξαντο δε κατηγορειν αυτου λεγοντεσ τουτον ευρομεν διαστρεφοντα το εθνοσ και κωλυοντα καισαρι φορουσ διδοναι λεγοντα εαυτον χριστον βασιλεα ειναι
3 అప్పుడు పిలాతు, “నువ్వు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. దానికి ఆయన, “నువ్వే అంటున్నావు కదా” అన్నాడు.
ο δε πιλατοσ επηρωτησεν αυτον λεγων συ ει ο βασιλευσ των ιουδαιων ο δε αποκριθεισ αυτω εφη συ λεγεισ
4 పిలాతు ప్రధాన యాజకులతోనూ, జనంతోనూ, “ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించడం లేదు,” అన్నాడు.
ο δε πιλατοσ ειπεν προσ τουσ αρχιερεισ και τουσ οχλουσ ουδεν ευρισκω αιτιον εν τω ανθρωπω τουτω
5 అయితే వారు, “ఇతడు గలిలయ నుండి ఇక్కడ వరకూ యూదయ దేశమంతా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు” అని మరింత తీవ్రంగా నొక్కి చెప్పారు.
οι δε επισχυον λεγοντεσ οτι ανασειει τον λαον διδασκων καθ ολησ τησ ιουδαιασ αρξαμενοσ απο τησ γαλιλαιασ εωσ ωδε
6 పిలాతు ఈ మాట విని, “ఇతడు గలిలయ ప్రాంతం వాడా?” అని అడిగాడు.
πιλατοσ δε ακουσασ γαλιλαιαν επηρωτησεν ει ο ανθρωποσ γαλιλαιοσ εστιν
7 ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని తెలియగానే ఆయనను హేరోదు దగ్గరికి పంపించాడు. ఆ రోజుల్లో హేరోదు యెరూషలేములోనే ఉన్నాడు.
και επιγνουσ οτι εκ τησ εξουσιασ ηρωδου εστιν ανεπεμψεν αυτον προσ ηρωδην οντα και αυτον εν ιεροσολυμοισ εν ταυταισ ταισ ημεραισ
8 హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను గురించి అతడు ఎన్నో విషయాలు విని ఉన్నాడు. ఎంతో కాలంగా ఆయనను చూడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూడాలని కూడా ఆశిస్తున్నాడు.
ο δε ηρωδησ ιδων τον ιησουν εχαρη λιαν ην γαρ θελων εξ ικανου ιδειν αυτον δια το ακουειν πολλα περι αυτου και ηλπιζεν τι σημειον ιδειν υπ αυτου γινομενον
9 హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆయన అతనికి జవాబేమీ ఇవ్వలేదు.
επηρωτα δε αυτον εν λογοισ ικανοισ αυτοσ δε ουδεν απεκρινατο αυτω
10 ౧౦ ముఖ్య యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడే నిలబడి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ειστηκεισαν δε οι αρχιερεισ και οι γραμματεισ ευτονωσ κατηγορουντεσ αυτου
11 ౧౧ హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను అవమానించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు.
εξουθενησασ δε αυτον ο ηρωδησ συν τοισ στρατευμασιν αυτου και εμπαιξασ περιβαλων αυτον εσθητα λαμπραν ανεπεμψεν αυτον τω πιλατω
12 ౧౨ అంతకు ముందు హేరోదూ, పిలాతూ శత్రువులుగా ఉండేవారు. కానీ ఆ రోజు వారిద్దరూ స్నేహితులయ్యారు.
εγενοντο δε φιλοι ο τε πιλατοσ και ο ηρωδησ εν αυτη τη ημερα μετ αλληλων προυπηρχον γαρ εν εχθρα οντεσ προσ εαυτουσ
13 ౧౩ అప్పుడు పిలాతు ముఖ్య యాజకులనూ అధికారులనూ ప్రజలనూ పిలిపించాడు.
πιλατοσ δε συγκαλεσαμενοσ τουσ αρχιερεισ και τουσ αρχοντασ και τον λαον
14 ౧౪ “ప్రజలు తిరగబడేలా చేస్తున్నాడంటూ మీరు ఈ వ్యక్తిని నా దగ్గరికి తీసుకువచ్చారు కదా. మీ ముందే నేను ఇతణ్ణి ప్రశ్నించాను. కానీ మీరితని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు నిజమనిపించడం లేదు.
ειπεν προσ αυτουσ προσηνεγκατε μοι τον ανθρωπον τουτον ωσ αποστρεφοντα τον λαον και ιδου εγω ενωπιον υμων ανακρινασ ουδεν ευρον εν τω ανθρωπω τουτω αιτιον ων κατηγορειτε κατ αυτου
15 ౧౫ హేరోదుకు కూడా ఏ దోషమూ కనిపించలేదు. హేరోదు ఇతణ్ణి నా దగ్గరకే తిరిగి పంపాడు కదా. మరణ శిక్షకు తగిన నేరమేదీ ఇతడు చేయలేదు.
αλλ ουδε ηρωδησ ανεπεμψα γαρ υμασ προσ αυτον και ιδου ουδεν αξιον θανατου εστιν πεπραγμενον αυτω
16 ౧౬ అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను” అన్నాడు.
παιδευσασ ουν αυτον απολυσω
17 ౧౭ పండగ సమయంలో పిలాతు ప్రజల కోసం ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక.
αναγκην δε ειχεν απολυειν αυτοισ κατα εορτην ενα
18 ౧౮ అయితే వారంతా, “వీణ్ణి చంపి మాకు బరబ్బను విడుదల చెయ్యండి” అని ఒక్కపెట్టున కేకలు వేశారు.
ανεκραξαν δε παμπληθει λεγοντεσ αιρε τουτον απολυσον δε ημιν βαραββαν
19 ౧౯ బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నాడు.
οστισ ην δια στασιν τινα γενομενην εν τη πολει και φονον βεβλημενοσ εισ φυλακην
20 ౨౦ పిలాతు యేసును విడుదల చేయాలని ఆశించి వారితో మళ్ళీ మాట్లాడాడు.
παλιν ουν ο πιλατοσ προσεφωνησεν θελων απολυσαι τον ιησουν
21 ౨౧ కాని వారంతా, “వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి” అని మరింతగా కేకలు వేశారు.
οι δε επεφωνουν λεγοντεσ σταυρωσον σταυρωσον αυτον
22 ౨౨ మూడవ సారి అతడు, “ఎందుకు? ఇతడేమి దుర్మార్గం చేశాడు? ఇతనిలో మరణ శిక్షకు తగిన నేరమేదీ నాకు కనపడలేదు. అందుచేత ఇతణ్ణి శిక్షించి వదిలేస్తాను” అన్నాడు.
ο δε τριτον ειπεν προσ αυτουσ τι γαρ κακον εποιησεν ουτοσ ουδεν αιτιον θανατου ευρον εν αυτω παιδευσασ ουν αυτον απολυσω
23 ౨౩ కాని వారంతా పట్టుబట్టి పెద్దగా కేకలు వేసి, “వీణ్ణి సిలువ వేయండి” అని అరిచారు. చివరికి వారి కేకలే గెలిచాయి.
οι δε επεκειντο φωναισ μεγαλαισ αιτουμενοι αυτον σταυρωθηναι και κατισχυον αι φωναι αυτων και των αρχιερεων
24 ౨౪ వారు కోరినట్టే జరగాలని పిలాతు తీర్పు తీర్చాడు.
ο δε πιλατοσ επεκρινεν γενεσθαι το αιτημα αυτων
25 ౨౫ వారు కోరినట్టే తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నవాణ్ణి విడుదల చేసి, యేసును వారికిష్టం వచ్చినట్టు చేయడానికి వారికి అప్పగించాడు.
απελυσεν δε τον δια στασιν και φονον βεβλημενον εισ την φυλακην ον ητουντο τον δε ιησουν παρεδωκεν τω θεληματι αυτων
26 ౨౬ వారాయన్ని తీసుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెటూరి నుండి వస్తున్న కురేనీ ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తిని పట్టుకుని, యేసు వెంటే సిలువ మోయడానికి దాన్ని అతని మీద పెట్టారు.
και ωσ απηγαγον αυτον επιλαβομενοι σιμωνοσ τινοσ κυρηναιου ερχομενου απ αγρου επεθηκαν αυτω τον σταυρον φερειν οπισθεν του ιησου
27 ౨౭ పెద్ద జనసమూహం, ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలమంది స్త్రీలూ ఆయనను వెంబడించారు.
ηκολουθει δε αυτω πολυ πληθοσ του λαου και γυναικων αι και εκοπτοντο και εθρηνουν αυτον
28 ౨౮ యేసు వారివైపు తిరిగి, “యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి.
στραφεισ δε προσ αυτασ ο ιησουσ ειπεν θυγατερεσ ιερουσαλημ μη κλαιετε επ εμε πλην εφ εαυτασ κλαιετε και επι τα τεκνα υμων
29 ౨౯ వినండి, ‘గొడ్రాళ్ళు ధన్యులు, కనని గర్భాలూ పాలియ్యని స్తనాలూ ధన్యం’ అని చెప్పే రోజులు వస్తున్నాయి.
οτι ιδου ερχονται ημεραι εν αισ ερουσιν μακαριαι αι στειραι και κοιλιαι αι ουκ εγεννησαν και μαστοι οι ουκ εθηλασαν
30 ౩౦ అప్పుడు ‘మా మీద పడండి’ అని పర్వతాలతో, ‘మమ్మల్ని కప్పివేయండి’ అని కొండలతో ప్రజలు చెప్పడం మొదలుపెడతారు.
τοτε αρξονται λεγειν τοισ ορεσιν πεσετε εφ ημασ και τοισ βουνοισ καλυψατε ημασ
31 ౩౧ చెట్టు పచ్చిగా ఉన్నప్పుడే వారు ఇలా చేస్తే ఇక ఎండిన దానికేం చేస్తారో” అని చెప్పాడు.
οτι ει εν τω υγρω ξυλω ταυτα ποιουσιν εν τω ξηρω τι γενηται
32 ౩౨ ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు.
ηγοντο δε και ετεροι δυο κακουργοι συν αυτω αναιρεθηναι
33 ౩౩ వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు.
και οτε απηλθον επι τον τοπον τον καλουμενον κρανιον εκει εσταυρωσαν αυτον και τουσ κακουργουσ ον μεν εκ δεξιων ον δε εξ αριστερων
34 ౩౪ అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.
ο δε ιησουσ ελεγεν πατερ αφεσ αυτοισ ου γαρ οιδασιν τι ποιουσιν διαμεριζομενοι δε τα ιματια αυτου εβαλον κληρον
35 ౩౫ ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు, “వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు.
και ειστηκει ο λαοσ θεωρων εξεμυκτηριζον δε και οι αρχοντεσ συν αυτοισ λεγοντεσ αλλουσ εσωσεν σωσατω εαυτον ει ουτοσ εστιν ο χριστοσ ο του θεου εκλεκτοσ
36 ౩౬ ఇక సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ
ενεπαιζον δε αυτω και οι στρατιωται προσερχομενοι και οξοσ προσφεροντεσ αυτω
37 ౩౭ “నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు.
και λεγοντεσ ει συ ει ο βασιλευσ των ιουδαιων σωσον σεαυτον
38 ౩౮ “ఇతడు యూదుల రాజు” అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు.
ην δε και επιγραφη γεγραμμενη επ αυτω γραμμασιν ελληνικοισ και ρωμαικοισ και εβραικοισ ουτοσ εστιν ο βασιλευσ των ιουδαιων
39 ౩౯ వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు.
εισ δε των κρεμασθεντων κακουργων εβλασφημει αυτον λεγων ει συ ει ο χριστοσ σωσον σεαυτον και ημασ
40 ౪౦ కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా?
αποκριθεισ δε ο ετεροσ επετιμα αυτω λεγων ουδε φοβη συ τον θεον οτι εν τω αυτω κριματι ει
41 ౪౧ మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు.
και ημεισ μεν δικαιωσ αξια γαρ ων επραξαμεν απολαμβανομεν ουτοσ δε ουδεν ατοπον επραξεν
42 ౪౨ తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు.
και ελεγεν τω ιησου μνησθητι μου κυριε οταν ελθησ εν τη βασιλεια σου
43 ౪౩ అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
και ειπεν αυτω ο ιησουσ αμην λεγω σοι σημερον μετ εμου εση εν τω παραδεισω
44 ౪౪ అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది.
ην δε ωσει ωρα εκτη και σκοτοσ εγενετο εφ ολην την γην εωσ ωρασ ενατησ
45 ౪౫ సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది.
και εσκοτισθη ο ηλιοσ και εσχισθη το καταπετασμα του ναου μεσον
46 ౪౬ అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.” అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు.
και φωνησασ φωνη μεγαλη ο ιησουσ ειπεν πατερ εισ χειρασ σου παραθησομαι το πνευμα μου και ταυτα ειπων εξεπνευσεν
47 ౪౭ శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు.
ιδων δε ο εκατονταρχοσ το γενομενον εδοξασεν τον θεον λεγων οντωσ ο ανθρωποσ ουτοσ δικαιοσ ην
48 ౪౮ ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు.
και παντεσ οι συμπαραγενομενοι οχλοι επι την θεωριαν ταυτην θεωρουντεσ τα γενομενα τυπτοντεσ εαυτων τα στηθη υπεστρεφον
49 ౪౯ ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనను అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు.
ειστηκεισαν δε παντεσ οι γνωστοι αυτου μακροθεν και γυναικεσ αι συνακολουθησασαι αυτω απο τησ γαλιλαιασ ορωσαι ταυτα
50 ౫౦ యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు.
και ιδου ανηρ ονοματι ιωσηφ βουλευτησ υπαρχων ανηρ αγαθοσ και δικαιοσ
51 ౫౧ మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
ουτοσ ουκ ην συγκατατεθειμενοσ τη βουλη και τη πραξει αυτων απο αριμαθαιασ πολεωσ των ιουδαιων οσ και προσεδεχετο και αυτοσ την βασιλειαν του θεου
52 ౫౨ అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు శరీరాన్ని తనకిమ్మని అడిగాడు.
ουτοσ προσελθων τω πιλατω ητησατο το σωμα του ιησου
53 ౫౩ తరువాత ఆయన శరీరాన్ని సిలువపైనుండి దించి, సన్న నారబట్టతో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్నీ అంతకు ముందు ఎప్పుడూ ఉంచలేదు.
και καθελων αυτο ενετυλιξεν αυτο σινδονι και εθηκεν αυτο εν μνηματι λαξευτω ου ουκ ην ουδεπω ουδεισ κειμενοσ
54 ౫౪ అది సిద్ధపడే రోజు. విశ్రాంతి దినం మొదలు కాబోతూ ఉంది.
και ημερα ην παρασκευη σαββατον επεφωσκεν
55 ౫౫ అప్పుడు గలిలయ నుండి ఆయనతో వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధినీ, ఆయన దేహాన్నీ ఎలా ఉంచారో చూసి
κατακολουθησασαι δε γυναικεσ αιτινεσ ησαν συνεληλυθυιαι αυτω εκ τησ γαλιλαιασ εθεασαντο το μνημειον και ωσ ετεθη το σωμα αυτου
56 ౫౬ తిరిగి వెళ్ళి, సుగంధ ద్రవ్యాలూ, పరిమళ తైలాలూ సిద్ధం చేసుకున్నారు. తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినం ఏ పనీ లేకుండా ఉన్నారు.
υποστρεψασαι δε ητοιμασαν αρωματα και μυρα και το μεν σαββατον ησυχασαν κατα την εντολην

< లూకా 23 >