< లూకా 22 >

1 పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది.
Приближаваше се пак празник пријесних хлебова који се зове пасха.
2 ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు.
И гледаху главари свештенички и књижевници како би Га убили; али се бојаху народа.
3 అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు.
А сотона уђе у Јуду, који се зваше Искариот, и који беше један од дванаесторице.
4 దాంతో యూదా వెళ్ళి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో, అధికారులతో మాట్లాడాడు.
И отишавши говори с главарима свештеничким и са старешинама како ће им Га издати.
5 దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు.
И они се обрадоваше, и уговорише да му даду новце.
6 అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు.
И он се обрече, и тражаше згодно време да им Га преда тајно од народа.
7 పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది.
А дође дан пресних хлебова у који требаше клати пасху;
8 యేసు పేతురు యోహానులతో, “మీరు వెళ్ళి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు.
И посла Петра и Јована рекавши: Идите уготовите нам пасху да једемо.
9 వారు, “మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి?” అని అడిగారు.
А ови Му рекоше: Где хоћеш да уготовимо?
10 ౧౦ ఆయన, “మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి.
А Он им рече: Ето кад уђете у град, срешће вас човек који носи воду у крчагу; идите за њим у кућу у коју он уђе,
11 ౧౧ మా గురువు, ‘నేను నా శిష్యులతో కలసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?’ అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి.
И кажите домаћину: Учитељ вели: где је гостионица где ћу јести пасху с ученицима својим?
12 ౧౨ అతడు అన్ని సదుపాయాలూ ఉన్న ఒక పెద్ద మేడ గది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని వారితో చెప్పాడు.
И он ће вам показати велику собу прострту; онде уготовите.
13 ౧౩ సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధపరిచారు.
А они отидоше и нађоше као што им каза; и уготовише пасху.
14 ౧౪ సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు.
И кад дође час, седе за трпезу, и дванаест апостола с Њим.
15 ౧౫ అప్పుడాయన, “నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను.
И рече им: Врло сам желео да ову пасху једем с вама пре него пострадам;
16 ౧౬ ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.”
Јер вам кажем да је одселе нећу јести док се не сврши у царству Божијем.
17 ౧౭ తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, “మీరు దీన్ని తీసుకుని పంచుకోండి.
И узевши чашу даде хвалу, и рече: Узмите је и разделите међу собом;
18 ౧౮ ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
Јер вам кажем да нећу пити од рода виноградског док не дође царство Божије.
19 ౧౯ ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు.
И узевши хлеб даде хвалу, и преломивши га даде им говорећи: Ово је тело моје које се даје за вас; ово чините за мој спомен.
20 ౨౦ అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన.
А тако и чашу по вечери, говорећи: Ова је чаша нови завет мојом крви која се за вас пролива.
21 ౨౧ “వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు.
Али ево рука издајника мог са мном је на трпези.
22 ౨౨ దేవుని నిర్ణయం ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు” అన్నాడు,
И Син човечији, дакле, иде као што је уређено; али тешко човеку ономе који Га издаје!
23 ౨౩ ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు.
И они сташе тражити међу собом који би, дакле, од њих био који ће то учинити.
24 ౨౪ తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది.
А поста и препирање међу њима који би се држао међу њима да је највећи.
25 ౨౫ అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు.
А Он им рече: Цареви народни владају народом, а који њиме управљају, зову се добротвори.
26 ౨౬ మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి.
Али ви немојте тако; него који је највећи међу вама нека буде као најмањи, и који је старешина нека буде као слуга.
27 ౨౭ అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.
Јер који је већи, који седи за трпезом или који служи? Није ли онај који седи за трпезом? А ја сам међу вама као слуга.
28 ౨౮ “నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు.
А ви сте они који сте се одржали са мном у мојим напастима.
29 ౨౯ నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి,
И ја остављам вама царство као што је Отац мој мени оставио:
30 ౩౦ సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను.
Да једете и пијете за трпезом мојом у царству мом, и да седите на престолима и судите над дванаест кољена Израиљевих.
31 ౩౧ “సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు.
Рече пак Господ: Симоне! Симоне! Ево вас иште сотона да би вас чинио као пшеницу.
32 ౩౨ నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.”
А ја се молих за тебе да твоја вера не престане; и ти кад год обративши се утврди браћу своју.
33 ౩౩ కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు.
А он Му рече: Господе! С Тобом готов сам и у тамницу и на смрт ићи.
34 ౩౪ అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు.
А Он рече: Кажем ти, Петре! Данас неће запевати петао док се трипут не одрекнеш да ме познајеш.
35 ౩౫ ఇంకా ఆయన “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు.
И рече им: Кад вас послах без кесе и без торбе и без обуће, еда вам шта недостаде? А они рекоше: Ништа.
36 ౩౬ ఆయన, “కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేని వాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.
А Он им рече: Али сад који има кесу нека је узме, тако и торбу; а који нема нека прода хаљину своју и купи нож.
37 ౩౭ ‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు.
Јер вам кажем да још и ово треба на мени да се изврши што стоји у писму: И међу злочинце метнуше Га. Јер шта је писано за мене, свршује се.
38 ౩౮ శిష్యులు, “ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి” అన్నారు. ఆయన, “చాలు” అన్నాడు.
А они рекоше: Господе! Ево овде два ножа. А Он им рече: Доста је.
39 ౩౯ భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.
И изишавши отиде по обичају на гору Маслинску; а за Њим отидоше ученици Његови.
40 ౪౦ వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు.
А кад дође на место рече им: Молите се Богу да не паднете у напаст.
41 ౪౧ వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు.
И сам одступи од њих како се може каменом добацити, и клекнувши на колена мољаше се Богу
42 ౪౨ “తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.”
Говорећи: Оче! Кад би хтео да пронесеш ову чашу мимо мене! Али не моја воља него Твоја да буде.
43 ౪౩ అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు.
А анђео Му се јави с неба, и крепи Га.
44 ౪౪ ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది.
И будући у борењу, мољаше се боље; зној пак Његов беше као капље крви које капаху на земљу.
45 ౪౫ ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు.
И уставши од молитве дође к ученицима својим, и нађе их, а они спавају од жалости,
46 ౪౬ వారితో, “మీరెందుకు నిద్ర పోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి” అన్నాడు.
И рече им: Што спавате? Устаните, молите се Богу да не паднете у напаст.
47 ౪౭ ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు.
Док Он још пак говораше, гле, народ и један од дванаесторице, који се зваше Јуда, иђаше пред њима, и приступи к Исусу да Га целива. Јер им он беше дао знак: Кога целивам онај је.
48 ౪౮ అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు.
А Исус му рече: Јуда! Зар целивом издајеш Сина човечијег?
49 ౪౯ ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించి, “ప్రభూ, కత్తితో నరకమంటావా?” అని అడిగారు.
А кад они што беху с Њим видеше шта ће бити, рекоше Му: Господе, да бијемо ножем?
50 ౫౦ ఈలోగా వారిలో ఒకడు ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు.
И удари један од њих слугу поглавара свештеничког, и одсече му десно ухо.
51 ౫౧ దానికి యేసు, “అంతటితో ఆగండి” అని అతని చెవిని తాకి బాగుచేశాడు.
А Исус одговарајући рече: Оставите то. И дохвативши се до уха његовог исцели га.
52 ౫౨ తనను పట్టుకోడానికి వచ్చిన పెద్దలతో, ప్రధాన యాజకులతో, దేవాలయం అధికారులతో, “ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులతో దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా?
А главарима свештеничким и војводама црквеним и старешинама који беху дошли на Њ рече Исус: Зар као на хајдука изиђосте с ножевима и кољем да ме ухватите?
53 ౫౩ నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి ఆధిపత్యం” అన్నాడు.
Сваки дан био сам с вама у цркви и не дигосте руку на мене; али је сад ваш час и област таме.
54 ౫౪ వారు ఆయనను పట్టుకుని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడి ఇంట్లోకి తీసుకు వెళ్ళారు. పేతురు దూరంగా వారి వెనకే వెళ్ళాడు.
А кад Га ухватише, одведоше Га и уведоше у двор поглавара свештеничког. А Петар иђаше за Њим издалека.
55 ౫౫ అప్పుడు కొంతమంది ఆ ఇంటి ఆవరణలో చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని ఉన్నారు. పేతురు కూడా వెళ్ళి వారితో కూర్చున్నాడు.
А кад они наложише огањ насред двора и сеђаху заједно, и Петар сеђаше међу њима.
56 ౫౬ అప్పుడు ఒక పనిపిల్ల మంట వెలుతురులో కూర్చుని ఉన్న పేతురును పరీక్షగా చూసి, “ఈ మనిషి కూడా అతనితో ఉన్నవాడే” అంది.
Видевши га, пак, једна слушкиња где седи код огња, и погледавши на њ рече: и овај беше с њим.
57 ౫౭ దానికి పేతురు, “అమ్మాయీ, అతనెవరో నాకు తెలియదు” అన్నాడు.
А он Га се одрече говорећи: Жено! Не познајем га.
58 ౫౮ కాసేపటికి మరొకడు పేతురును చూసి, “నువ్వు కూడా వారిలో ఒకడివే” అన్నాడు. దానికి పేతురు, “నేను కాదయ్యా” అన్నాడు.
И мало затим, виде га други и рече: и ти си од њих. А Петар рече: Човече! Нисам.
59 ౫౯ మరో గంట గడిచాక ఇంకొకడు పేతురును చూసి, “ఇతడు కచ్చితంగా అతనితో కూడా ఉన్నాడు. ఇతడు గలిలయ వాడే” అని నొక్కి చెప్పాడు.
И пошто прође око једног сахата, други неко потврђиваше говорећи: Заиста и овај беше с њим; јер је Галилејац.
60 ౬౦ అందుకు పేతురు, “నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు” అన్నాడు. అతడు ఇలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది.
А Петар рече: Човече! Не знам шта говориш. И одмах док он још говораше запева петао.
61 ౬౧ అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. “నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తరువాత కోడి కూస్తుందని” ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది.
И обазревши се Господ погледа на Петра, и Петар се опомену речи Господње како му рече: Пре него петао запева одрећи ћеш ме се трипут.
62 ౬౨ దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.
И изишавши напоље плака горко.
63 ౬౩ యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు.
А људи који држаху Исуса ругаху Му се, и бијаху Га.
64 ౬౪ ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు” అన్నారు.
И покривши Га, бијаху Га по образу и питаху Га говорећи: Прореци ко Те удари?
65 ౬౫ ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు.
И друге многе хуле говораху на Њ.
66 ౬౬ ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ముఖ్య యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు.
И кад свану, сабраше се старешине народне и главари свештенички и књижевници, и одведоше Га у свој суд
67 ౬౭ “నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు” అన్నారు. అందుకాయన, “నేను మీతో చెప్పినా మీరు నమ్మరు.
Говорећи: Јеси ли ти Христос? Кажи нам. А Он им рече: Ако вам и кажем, нећете веровати.
68 ౬౮ అంతే కాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు.
А ако вас и запитам, нећете ми одговорити, нити ћете ме пустити.
69 ౬౯ అయితే ఇకపై మనుష్య కుమారుడు బల ప్రభావాలున్న దేవుని కుడి వైపున కూర్చుని ఉంటాడు” అన్నాడు.
Одселе ће Син човечији седити с десне стране силе Божије.
70 ౭౦ “అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అన్నారు. ఆయన వారితో, “మీరన్నట్టు ఆయనను నేనే” అన్నాడు.
Сви пак рекоше: Ти ли си дакле син Божји? А Он им рече: Ви кажете да сам ја.
71 ౭౧ అందుకు వారు, “మనకిక సాక్షులతో పనేముంది? ఇతని నోటి మాట మనమే విన్నాం కదా” అన్నారు.
А они рекоше: Шта нам требају више сведочанства? Јер сами чусмо из уста његових.

< లూకా 22 >