< లూకా 2 >

1 ఆ రోజుల్లో రోమా పాలనలో ఉన్న ప్రపంచమంతటా జనసంఖ్య నిర్వహించాలని సీజరు అగస్టస్ ఆజ్ఞాపించాడు.
Hatnavah Sizar Augustus ni talaivan milu parei hanelah kâ a poe.
2 ఇది కురేనియస్ సిరియా దేశానికి గవర్నర్ గా ఉండగా జరిగిన మొదటి జనసంఖ్య.
Siria ram dawk Quirinius ni a uk navah, hote miilu pareinae teh hmaloe pasuek poung e lah ao.
3 అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ స్వగ్రామాలకు వెళ్ళారు.
Taminaw pueng teh min poe hanelah ama kho lengkaleng a ban awh.
4 యోసేపు కూడా దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరున్న దావీదు ఊరికి వెళ్ళాడు.
Devit e catoun lah kaawm e Joseph hoi a ham tangcoung lah kaawm e Meri teh min poe hanelah,
5 తనకు భార్యగా ప్రదానం జరిగి గర్భవతిగా ఉన్న మరియతో సహా వెళ్ళాడు.
Galilee ram Nazareth kho koehoi Judah ram Bethlehem telah min poe e Devit kho lah a cei roi. Hatnavah Meri e a von thung e camo teh a tang toe.
6 వారక్కడ ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి.
Bethlehem kho ao navah, camo khe nahan hnin a kuep toung dawkvah camin teh a khe.
7 ఆమె తన తొలిచూలు బిడ్డను కని, మెత్తని గుడ్డలతో చుట్టి, ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు.
A kâhat nahane hmuen ao hoeh dawkvah, camo teh hni hoi a kayo teh maito dokko dawk a pâ i roi.
8 ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు
Hote ram dawk, tukhoumnaw ni khohmo vah amamae tuhu hah kahrawngum vah a ring awh.
9 ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు.
Hatnavah Cathut e kalvantami buet touh ahnimouh koe a kamnue teh Cathut e raeng teh atengpam pheng a ang dawkvah, ahnimouh teh a lungtâsue awh teh a taki awh.
10 ౧౦ అయితే ఆ దూత, “భయపడకండి. ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.
Kalvantami nihai, na lungtâsue awh hanh awh, taminaw pueng hane, lunghawinae kamthang kahawi nangmouh koe na dei pouh awh. Hote kamthang kahawi ni tami pueng lunghawinae koe a pha sak han.
11 ౧౧ దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
Sahnin vah, Devit kho dawk, rungngangkung Bawi Khrih teh a khe toe.
12 ౧౨ మీకు కొండ గుర్తు ఒకటే. ఒక పసికందు మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకుని ఉండడం మీరు చూస్తారు” అని వారితో చెప్పాడు.
Nangmouh ni bangtelah hoi maw na panue awh han tetpawiteh, camo teh hni hoi a kayo vaiteh maito dokko dawk a payan e na hmu awh han telah atipouh.
13 ౧౩ ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి,
Hatnavah, kalvantaminaw hoi kalvanlae ransahu a kamnue awh teh, Bawipa a pholen awh.
14 ౧౪ “సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ. ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!” అంటూ దేవుణ్ణి స్తుతించారు.
Cathut teh lathoung poung lah bawilennae awm lawiseh. Talai van roumnae awm lawiseh, telah a ti awh.
15 ౧౫ ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు, “జరిగిన ఈ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు. మనం బేత్లెహేముకు వెళ్ళి చూద్దాం పదండి,” అని ఒకడితో ఒకడు చెప్పుకుని
Kalvantaminaw, kalvan lah a luen hnukkhu tukhoumnaw ni, maimanaw Bethlehem kho koe lah cet awh sei. Cathut ni na patue e hno khen a sei telah buet touh hoi buet touh a ka dei awh.
16 ౧౬ త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న పసికందును చూశారు.
Hathnukkhu, ahnimanaw teh karanglah a cei awh teh, Joseph hoi Meri ni maito dokko dawk a pâ i e camo hah a hmu awh.
17 ౧౭ ఆ పసికందును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు.
A hmu hnukkhu hoi amamouh ni a thai e camo e a kong hah hmuen tangkuem koe a pâpho awh.
18 ౧౮ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు.
Tukhoumnaw ni, a dei e lawk kathainaw pueng ni kângai lah a ru awh.
19 ౧౯ మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది.
Meri teh hote a konglamnaw pueng a pâkuem teh luepluep a pouk.
20 ౨౦ ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్ళిపోయారు.
Tukhoumnaw teh amamouh koe pâpho pouh e patetlah a hmu awh navah Cathut a pholen awh teh a ban awh.
21 ౨౧ ఆ బిడ్డకి సున్నతి ఆచారం జరిగించవలసిన ఎనిమిదవ రోజున, ఆయన గర్భంలో పడక మునుపు దేవదూత పెట్టిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు.
Ataroe hnin a pha navah camo teh vuensoma awh, camo a von hoeh nahlan vah kalvantami ni min poe e patetlah Jisuh telah a phung awh.
22 ౨౨ మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయినాయి. “ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కాబట్టి ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతను గానీ రెండు పావురం పిల్లలను గానీ బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేముకు తీసుకు వెళ్ళారు.
Hathnukkhu hoi Mosi e kâlawk patetlah kâpasu thoungnae hnin a kuep navah, a manu hoi a na pa ni camo teh Jerusalem kho lah a ceikhai roi.
23 ౨౩
Ca caminnaw pueng teh Cathut hanelah thoungsak han telah kâlawk dawk thut tangcoung e patetlah Cathut koe a kâhnawng hnukkhu,
24 ౨౪
Âbakhu kahni touh hoi thuengnae na sak han telah kâlawk dawk a dei e patetlah a sak awh.
25 ౨౫ యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు.
Hatnavah Jerusalem kho dawk Simeon tie tami buet touh ao. Hote tami teh tamikalan, a lawk dawk kaawm e tami, Isarelnaw hloutnae ka ngaihawi e tami lah ao. Kathoung Muitha teh ahni dawk ao.
26 ౨౬ అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు.
Ahni teh Bawipa Khrih hah na hmu hoehnahlan na dout mahoeh telah, Kathoung Muitha e pâpho pouh e ka coe e tami lah ao.
27 ౨౭ ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు చంటి బిడ్డ యేసును దేవాలయంలోకి తెచ్చారు.
Hatnavah, ahni teh Muitha lahoi bawkim dawk a cei teh, a manu hoi a na pa ni Camo teh kâlawk patetlah sak hanelah a hrawi roi.
28 ౨౮ సుమెయోను తన చేతుల్లో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు,
Simeon ni ahni hah a tawm teh, Cathut a pholen.
29 ౨౯ “ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా!
Bawipa, na lawk patetlah nange na san kai lungmawngnae ka hmu toe.
30 ౩౦ అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన నీ రక్షణ నేను కళ్ళారా చూశాను.”
Bangkongtetpawiteh, Bawipa e miphunnaw tawmdawm hanelah hai thoseh,
31 ౩౧
Jentelnaw ang sak hanelah hai thoseh,
32 ౩౨
Isarel taminaw pueng hanelah rakueng tangcoung e rungngangnae teh atu ka mit hoi ka hmu toe telah a dei.
33 ౩౩ యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.
Hote lawk hah Joseph hoi Meri ni a thai navah kângai lah a ru roi.
34 ౩౪ అతడు వారిని దీవించి, మరియతో ఇలా అన్నాడు, “అనేకమంది హృదయాలోచనలు బయట పడేలా, ఇశ్రాయేలులో చాలా మంది పడడానికీ లేవడానికీ వివాదాస్పదమైన చిహ్నంగా దేవుడు ఈయనను నియమించాడు.
Simeon ni ahnimanaw hah yawhawinae a poe teh, Meri koevah, hete camo teh Isarelnaw moikapap rawp nahane hoi thaw nahanelah ao vaiteh, oun e lah ao nahanelah hruek e lah ao toe.
35 ౩౫ అంతేగాక నీ హృదయంలోకి ఒక కత్తి దూసుకు పోతుంది.”
Taminaw e pouknae pueng a kamnue nahanelah, na lungthin hai tahloi ni a sei han telah a dei.
36 ౩౬ దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో,
Asher miphun, Fanuel e canu Anna telah a min kâphung e profet napui a kum kacue e buet touh ao. Ahni teh a vâ hoi kum sari touh ao hnukkhu hoi,
37 ౩౭ ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది.
a kum, rui taroe kum pali totouh lahmai lah ao teh, ratoumnae hoi rawcahainae lahoi yah, khohmo khodai Cathut koe a kâpoe teh bawkim dawk ao.
38 ౩౮ ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది.
Ahni hai tang a kâen teh Cathut a pholen. Jerusalem kho dawk ratangnae kangaihawinaw pueng koe hote Como e a kong a dei pouh.
39 ౩౯ ఆ విధంగా యోసేపు, మరియ ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున ఆచారాలన్నీ పూర్తి చేసుకుని గలిలయలోని తమ స్వగ్రామం నజరేతుకు వెళ్ళిపోయారు.
A manu hoi na pa ni hai Cathut e kâlawk patetlah koung a tarawi hnukkhu, ama kho Galilee ram Nazareth kho lah a ban roi.
40 ౪౦ పసివాడు ఎదుగుతూ, బలపడుతూ జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుని దయ ఆయన మీద ఉంది.
Camo hai a roung teh lungangnae hoi akawi. Cathut e lungmanae teh ahni dawk ao.
41 ౪౧ పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళడం కద్దు.
Kum tangkuem ceitakhai pawi saknae tueng a pha navah a manu hoi a na pa teh Jerusalem kho lah ouk a cei awh.
42 ౪౨ ఆయన పన్నెండేళ్ళ ప్రాయంలో వాడుక చొప్పున వారు ఆ పండగకు యెరూషలేము వెళ్ళారు.
Jisuh kum hlaikahni touh a pha navah pawi e singyoe patetlah Jerusalem kho lah a cei awh teh,
43 ౪౩ ఆ రోజులు తీరిన తరువాత వారు తిరిగి వెళుతుండగా బాల యేసు యెరూషలేములో ఉండిపోయాడు. ఆయన తల్లిదండ్రులకు ఆ సంగతి తెలియలేదు.
pawi a baw hnukkhu vah a manu hoi a na pa teh a ban roi nah, camo Jisuh teh Jerusalem khovah ao e hah panuek roi hoeh.
44 ౪౪ ఆయన గుంపులో ఉన్నాడనుకుని, ఒక రోజు ప్రయాణం చేసి, తమ బంధువుల్లో, అయినవారిలో ఆయనను వెదకసాగారు.
A huikonaw hoi a tho mue telah a pouk dawkvah hnin touh lamcei a cei awh toe.
45 ౪౫ ఆయన కనబడక పోవడంతో ఆయనను వెదుక్కుంటూ యెరూషలేముకు తిరిగి వచ్చారు.
Camo teh a huikonaw koe ao hoeh toung dawkvah, Jerusalem kho lah bout a ban roi.
46 ౪౬ అప్పటికి మూడు రోజులైంది. ఆయన ఆలయంలో ఉపదేశకుల మధ్య కూర్చుని, వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలడుగుతూ ఉండగా చూశారు.
Hnin thum touh a ro hnukkhu vah, Jisuh teh bawkim dawk kacangkhainaw e rahak a tahung teh ahnimanaw hoi lawk kâ pacei awh e hah a manu hoi a na pa ni a hmu roi.
47 ౪౭ ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరాలకు అబ్బురపడ్డారు.
Jisuh e lungangnae hoi panuenae lawk ka thai e naw pueng ni a kângairu awh.
48 ౪౮ ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి, “కుమారా, ఎందుకిలా చేశావు? మీ నాన్న, నేను ఆందోళనగా నిన్ను వెదకుతున్నాం” అంది.
A na pa yuvâ ni ahni teh a kâhmo navah, a kângairu roi. A manu niyah ka ca bangkongmaw kaimouh roi koe telah koe na o. Na pa kaimouh roi ni ka puen roi dawkvah na tawng roi atipouh.
49 ౪౯ అందుకు ఆయన, “మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా?” అన్నాడు.
Jisuh ni bangkongmaw kai khuek na tawng roi vaw, kai teh a Pa e im dawk ka o han tie hah na panuek hoeh na maw.
50 ౫౦ కానీ ఆయన తమతో చెప్పిందేమిటో వారికి అర్థం కాలేదు.
Hateiteh, Jisuh ni a dei e a manu hoi a na pa ni thai panuek roi hoeh.
51 ౫౧ అప్పుడు ఆయన వారితో కలిసి బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసికుంది.
Hattoteh Jisuh ni ahnimouh koe a cei van teh Nazareth kho a pha navah a manu hoi a na pa e kâ a ngai pouh. A manu ni teh hete a konglamnaw pueng a lungthin dawk khik a pâkuem.
52 ౫౨ యేసు జ్ఞానంలోనూ, వయసులోనూ, దేవుని దయలోనూ, మనుషుల దయలోనూ దినదిన ప్రవర్థమానమవుతూ ఉన్నాడు.
Jisuh teh thoumthai lungangnae dawk a roung teh, Cathut hmalah hoi tami hmalah, minhmai kahawi a hmu.

< లూకా 2 >