< లూకా 19 >
1 ౧ ఆయన ప్రయాణం చేస్తూ సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించి
So he entered Jericho and was passing through the town.
2 ౨ దానిగుండా వెళ్తున్నాడు. అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ముఖ్యపన్ను వసూలుదారు, ధనవంతుడు.
There was a man there, called Zaccheus, who was a chief of the tax- gatherers, and was wealthy.
3 ౩ ఇతడు యేసు ఎవరో చూడాలని ఆశించాడు. కాని జనసమూహం గుమిగూడడం వలనా ఇతడు పొట్టివాడు కావడం వలనా చూడలేకపోయాడు.
And he kept trying to see what sort of a man Jesus was; but he could not see because he was short.
4 ౪ అప్పుడు యేసు ఆ దారిలోనే వస్తున్నాడు, కాబట్టి అతడు ముందుగా పరిగెత్తి వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు.
So he ran on before him and climbed up into a sycamore tree to see him; for he was about to pass that way.
5 ౫ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి, “జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి” అన్నాడు.
As soon as Jesus came to the place, he looked up and said to him, "Come down quickly, Zaccheus, for today I must stay at your house."
6 ౬ అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకువెళ్ళాడు.
He made haste to climb down, and receive him joyfully.
7 ౭ అది చూసి అందరూ, “ఈయన ఒక పాపాత్ముడి ఇంటికి అతిథిగా వెళ్ళాడు” అని గొణగడం మొదలుపెట్టారు.
When they all saw it, they began to complain, saying "He has gone in to lodge with a man who is a sinner."
8 ౮ జక్కయ్య నిలబడి, “ఇదిగో ప్రభూ, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను. నేనెవరినైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే అతనికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను” అన్నాడు.
But Zaccheus stood up and said to the Lord, "I give half my property to the poor, Lord, and if I have defrauded any man of anything I am restoring it to him fourfold."
9 ౯ అందుకు యేసు, “ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే.
"Today is salvation come to this house," said Jesus "since Zaccheus here is a son of Abraham.
10 ౧౦ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు” అని చెప్పాడు.
"For the Son of man is come to seek and to save the lost."
11 ౧౧ వారు ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకంటే ఆయన యెరూషలేముకు దగ్గరలో ఉండడం వల్ల దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తుందని వారు అనుకుంటున్నారు.
As they were listening to his words he added this parable, because he was near Jerusalem and they thought that the kingdom of God was immediately to appear.
12 ౧౨ “గొప్ప వంశానికి చెందిన ఒక వ్యక్తి తన కోసం రాజ్యం సంపాదించుకుని రావాలని దూరదేశానికి ప్రయాణం అయ్యాడు.
So he said. "A certain nobleman went abroad to receive for himself royal power and to return.
13 ౧౩ దానికి ముందు తన సేవకులు పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణాలు ఇచ్చాడు. “నేను తిరిగి వచ్చే వరకూ మీరు వీటితో వ్యాపారం చేయండి” అని చెప్పాడు.
"And he summoned ten slaves of his, and gave them ten pounds, and said to them, "‘Trade with these until I come.’
14 ౧౪ అయితే అతని పట్టణంలోని పౌరులు అతణ్ణి ద్వేషించారు. ‘ఇతడు మమ్మల్ని పరిపాలించడం మాకు ఇష్టం లేదు’ అంటూ అతని వెనుకే రాయబారం పంపారు.
"But this fellow citizens hated him, and sent a deputation after him to say, ‘We do not wish this man to become our king.’
15 ౧౫ అయినా అతడు ఆ రాజ్యాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చాడు. తన దాసులు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని వారిని పిలిపించాడు.
"And upon his return after he had secured the royal power, he ordered the slaves to whom he had given the money to be called in, so that he might know what they had gained by trading.
16 ౧౬ “మొదటి వాడు వచ్చి, ‘అయ్యా, మీరిచ్చిన నాణెం మరో పది నాణేలను సంపాదించింది” అన్నాడు.
"And the first came before him, saying, ‘Master, your pound has made ten pounds.’
17 ౧౭ దానికి ఆ యజమాని, ‘భలే, మంచి సేవకా! నువ్వు ఈ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు.
"And he said to him, ‘Well done, good slave! Because you have been faithful in a very little, have authority over ten cities.’
18 ౧౮ ఇక రెండవ పనివాడు వచ్చాడు. ‘అయ్యా, మీరిచ్చిన నాణెంతో మరో ఐదు నాణాలు సంపాదించాను’ అన్నాడు.
"And the second came and said, ‘Master, your pound has made five pounds.’
19 ౧౯ యజమాని వాడితో, ‘నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు.
"Then he said to him also, ‘You shall be over five cities.’
20 ౨౦ అప్పుడు మరో పనివాడు వచ్చాడు. వాడిలా అన్నాడు, ‘అయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన నాణెం.
"And the next came to him and said, ‘Here master is your pound which I was keeping safe in a napkin.
21 ౨౧ దీన్ని జాగ్రత్తగా గుడ్డలో కట్టి దాచిపెట్టాను. నువ్వు కఠినుడివని నాకు తెలుసు. నువ్వు పెట్టని చోట తీసుకుంటావు, నాటని చోట పంట కోస్తావు,’ అన్నాడు.
"‘For I was afraid of you, because you are a hard man. You take what you did not sow.’
22 ౨౨ అందుకా యజమాని, ‘చెడ్డ సేవకా, నీ నోటి మాట పైనే నీకు తీర్పు తీరుస్తాను. నేను పెట్టని చోట తీసుకుంటాను, నాటని చోట పంట కోస్తాను, కఠినుడినని నీకు తెలుసు కదా,
"He said to him, "‘By your own words I will Judge you, you wicked slave. You knew, did you, that I was a hard man taking up what I did not lay down, reaping what I did not sow.
23 ౨౩ అలాంటప్పుడు నా డబ్బుని వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా చేస్తే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునే వాణ్ణి కదా’ అని వాడితో చెప్పి,
"‘Then why did you not put my money into the bank, so that at my coming I might I might have gotten it back with interest?’
24 ౨౪ తన దగ్గర ఉన్న వారితో, “వీడి దగ్గర ఉన్న నాణెం తీసేసుకుని పది నాణాలు ఉన్న వాడికివ్వండి’ అన్నాడు.
"Then to those who stood by, he said, ‘Take the pounds from him and give it to him who has ten pounds.’
25 ౨౫ దానికి వారు, ‘అయ్యా అతని దగ్గర పది నాణాలు ఉన్నాయి కదా’ అన్నారు.
"‘Master,’ they said to him, ‘he already has ten pounds.’
26 ౨౬ అందుకు అతడు, ‘ఉన్న ప్రతి వాడికీ ఇవ్వడం, లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని మీకు చెబుతున్నాను.’
"‘I tell you that to every one who has it shall be given; and from him who has not shall be taken away even what he has.
27 ౨౭ మరోమాట, ‘నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వారిని వధించండి’ అన్నాడు.”
"‘Howbeit these enemies of mine who were not willing for me to become their King, bring them here, and slay them in my presence.’"
28 ౨౮ యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు ప్రయాణమై సాగిపోయాడు.
When he had so spoken he went on before, going up to Jerusalem.
29 ౨౯ ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనీ అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు.
When he was come near Bethphage and Bethany at the mount called The Olive Orchard,
30 ౩౦ “మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని మీద ఇంతవరకూ ఎవ్వరూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకు రండి.
he sent two of his disciples saying. "Go into the village in the front, and on entering it you will find an ass’s colt tied, on which no one has ever ridden.
31 ౩౧ ఎవరైనా ‘దీన్ని ఎందుకు విప్పుతున్నారు’ అని మిమ్మల్ని అడిగితే ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపించాడు.
"Untie it and bring it here. And if any one asks you, ‘Why are you untying the colt?’ Simply say, ‘The Master needs it.’"
32 ౩౨ ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు.
Then those who were sent out and found it as he had told them.
33 ౩౩ ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు, “మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని వారినడిగారు.
For as they were untying the colt, the owners said to them, "Why are you untying the colt?"
34 ౩౪ దానికి వారు, “ఇది ప్రభువుకు కావాలి” అన్నారు.
They answered, "The Master needs it."
35 ౩౫ తరువాత యేసు దగ్గరికి దాన్ని తోలుకు వచ్చారు. దానిపై తమ బట్టలు వేసి ఆయనను దానిపై కూర్చోబెట్టారు.
So they led it to Jesus, and, after throwing their outer garments on the colt, they placed Jesus on it.
36 ౩౬ ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు.
So he rode on, while they kept throwing their garments in the way.
37 ౩౭ ఒలీవ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు.
And when now he was coming near Jerusalem, and descending the Mount of Olives, the whole multitude of the disciples began to rejoice, and to praise God with a loud voice for the almighty works they had seen.
38 ౩౮ “ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు.
They cried, "Blessed is the King who comes in the name of the Lord! Peace in Heaven and glory in the Highest"
39 ౩౯ ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, “బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు.
And some of the Pharisees said to them out of the crowd, "Teacher reprove your disciples!"
40 ౪౦ ఆయన, “వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు.
"I tell you," he answered, "that if these should hold their peace, the very stones would cry out."
41 ౪౧ ఆయన యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని విషయం విలపించాడు.
And when he came into view of the city, as he approached it he broke into loud weeping,
42 ౪౨ “నువ్వు కూడా కనీసం ఈ రోజైనా శాంతి కోసం కావలసిన విషయాలను తెలుసుకుంటే నీకు ఎంత మేలు! కాని ఇప్పుడు అవి నీ కళ్ళకు కనిపించడం లేదు.
exclaiming. "Oh that at this time you knew, yes, even you, on what your peace depends! But now it is hidden from your eyes.
43 ౪౩ ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు.
"The time will come for you when your enemies will throw ramparts around you, and encompass you, and shut you in on every side, and raze you to the ground,
44 ౪౪ నీలో ఒక రాయిపై మరొక రాయి ఉండకుండాా కూల్చివేసే రోజు వస్తుంది” అన్నాడు.
"you and your children within you. And they will not leave in you one stone upon the another. Because you knew not the time of your visitation."
45 ౪౫ అప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ అమ్మకాలు చేసేవారితో,
Then Jesus went into the Temple and began to drive out dealers,
46 ౪౬ “‘నా మందిరం ప్రార్థన మందిరం’ అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగల గుహగా చేశారు” అంటూ వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు.
saying, "It is written, "The house of God shall be called a house of prayer, but you have made it a den of robbers."
47 ౪౭ ఆయన ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ, ప్రజల్లో ముఖ్యులు ఆయనను అంతం చేయాలని చూస్తూ వచ్చారు.
Day after day he continued to teach in the Temple. The high priests and scribes tried to have him put to death, so did the rulers of the people.
48 ౪౮ కాని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను విడిచి పెట్టకుండా ఆయన మాటలు వింటూ ఉన్నారు.
But they could not find how to do it, for the people all hung upon him, listening to him.