< లూకా 17 >
1 ౧ ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం. కానీ అవి ఎవరి వల్ల వస్తాయో అతని స్థితి ఎంత భయానకమో!
Un Viņš uz tiem mācekļiem sacīja: “Bez tā tas nebūs, ka apgrēcības nenāk, bet vai tam, caur ko tās nāk.
2 ౨ అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డల్లో ఎవరికైనా ఆటంకం కలగజేయడం కంటే అతడి మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
Tam būtu labāki, ka tam dzirnu akmeni piekārtu pie kakla, un to iemestu jūrā, nekā tas vienu no šiem mazajiem apgrēcinātu.
3 ౩ మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి.
Sargājaties paši! Bet ja tavs brālis grēko pret tevi, tad pamāci to; un ja tas atgriežas, tad piedod tam.
4 ౪ అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”
Un ja tas ikdienas septiņ reiz grēko pret tevi un ikdienas septiņ reiz griezīsies pie tevis sacīdams: tas man ir žēl; tad tev būs viņam piedot.”
5 ౫ అప్పుడు అపొస్తలులు, “ప్రభూ, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి” అన్నారు.
Un tie apustuļi uz To Kungu sacīja: “Vairo mums ticību.”
6 ౬ ప్రభువు, “మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రంలో నాటుకు పో’ అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది.
Bet Tas Kungs sacīja: “Ja jums ticība būtu kā sinepju graudiņš, tad jūs varētu sacīt uz šo vīģes koku: izraujies ar saknēm un dēsties jūrā; un tas jums paklausītu.
7 ౭ “మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో, మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని ‘నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో’ అంటాడా? అనడు.
Un ja kādam jūsu starpā ir kalps, kas viņam ar un gana, vai viņš tam, kad tas no lauka nāk, sacīs: nāc tūdaļ un apsēdies?
8 ౮ పైగా ‘నాకు భోజనం సిద్ధం చెయ్యి. తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి. ఆ తరువాత నువ్వు తినవచ్చు’ అంటాడు.
Vai viņš tam nesacīs tā: sataisi man, ko es šo vakaru ēdīšu, apjozies un kalpo man, kamēr es ēdu un dzeru, un pēc tam arī tu ēdīsi un dzersi?
9 ౯ తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేశాడని యజమాని ‘నాపై దయ చూపించావు’ అని వాణ్ణి మెచ్చుకుంటాడా?
Vai viņš tam kalpam pateiksies, ka tas ir darījis, kas tam bija pavēlēts? Nedomāju.
10 ౧౦ అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తరువాత ‘మేము ఏ యోగ్యతా లేని సేవకులం. మేము చేయాల్సిందే చేశాం’ అని చెప్పాలి.”
Tā arī jūs, kad jūs visu esat darījuši, kas jums pavēlēts, tad sakāt: mēs esam nelietīgi kalpi, jo kas mums pienācās darīt, to esam darījuši.”
11 ౧౧ ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ
Un notikās, ka iedams uz Jeruzālemi Viņš staigāja vidū caur Samariju un Galileju.
12 ౧౨ ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు.
Un kad Viņš kādā pilsētiņā nāca, tad Viņam desmit spitālīgi vīri sastapās, tie stāvēja no tālienes,
13 ౧౩ “యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు.
Paceldami savu balsi, un sacīja: “Jēzu, mīļais Kungs, apžēlojies par mums!”
14 ౧౪ ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, యాజకులకు కనపడండి” అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు.
Un tos redzējis, Viņš uz tiem sacīja: “Ejat un rādieties tiem priesteriem.” Un notikās, ka tie aizejot tapa šķīsti.
15 ౧౫ వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి
Bet viens no tiem, redzēdams, ka viņš tapis šķīsts, griezās atpakaļ un teica Dievu ar skaņu balsi,
16 ౧౬ బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు.
Un krita uz savu vaigu pie Viņa kājām un Viņam pateicās; un tas bija viens Samarietis.
17 ౧౭ అందుకు యేసు, “పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఏరీ?
Un Jēzus atbildēja un sacīja: “Vai desmit nav tapuši šķīsti? Bet kur tad tie deviņi?
18 ౧౮ దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?” అన్నాడు.
Vai tad cits neviens nav atradies, kas atpakaļ būtu griezies un Dievam godu devis, kā vien šis svešinieks?”
19 ౧౯ “నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.
Un Viņš uz to sacīja: “Celies un ej, tava ticība tev ir palīdzējusi.”
20 ౨౦ ఒకసారి పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని ఆయనను అడిగారు. దానికి ఆయన, “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు.
Un vaicāts no tiem farizejiem, kad Dieva valstība nāks, Viņš tiem atbildēja un sacīja: “Dieva valstība nenāk ārīgi nomanama.
21 ౨౧ ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. కాబట్టి దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి కుదరదు” అని వారికి జవాబిచ్చాడు.
Un arī nesacīs: redzi, še, vai: redzi, tur; jo redzi, Dieva valstība ir iekš jums.”
22 ౨౨ ఇంకా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “మనుష్య కుమారుడి రోజుల్లో ఒక రోజును చూడాలని మీరు ఎంతగానో కోరుకునే సమయం వస్తుంది. కానీ మీరు ఆ రోజును చూడరు.
Un Viņš sacīja uz tiem mācekļiem: “Nāks dienas, kad jūs vēlēsities vienu no Tā Cilvēka Dēla dienām redzēt, un neredzēsiet.
23 ౨౩ వారు, ‘ఇదిగో ఇక్కడుంది, అదిగో అక్కడుంది’ అంటారు. మీరు వెళ్ళవద్దు. అసలు వారిని అనుసరించవద్దు.
Un tie uz jums sacīs: redzi, še! Vai redzi, tur! Bet nenoejat, nedz dzenaties tam pakaļ.
24 ౨౪ ఆకాశంలో ఒక దిక్కున తళుక్కున మెరుపు మెరిసి ఆ వెలుగు మరో దిక్కు వరకూ ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆ రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు.
Jo itin kā zibens, kas zibinādams spīd no viena debess gala līdz otram debess galam, tā arīdzan būs Tas Cilvēka Dēls Savā dienā.
25 ౨౫ అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయనను పూర్తిగా నిరాకరించాలి.
Bet papriekš Viņam būs daudz ciest un tapt atmestam no šīs cilts.
26 ౨౬ “నోవహు రోజుల్లో జరిగినట్టు గానే మనుష్య కుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది.
Un itin kā bija Noas dienās, tā arīdzan būs Tā Cilvēka Dēla dienās.
27 ౨౭ నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ ప్రజలు తినడం తాగడం పెళ్ళిళ్ళకు ఇవ్వడం పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి అందర్నీ నాశనం చేసింది.
Tie ēda, dzēra, precēja un tapa precēti līdz tai dienai, kur Noā šķirstā iegāja, un grēku plūdi nāca un visus noslīcināja.
28 ౨౮ లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు.
Un tā kā notikās Lata dienās: tie ēda, dzēra, pirka, pārdeva, dēstīja, uztaisīja ēkas;
29 ౨౯ అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు.
Bet tai dienā, kad Lats izgāja no Sodomas, tad uguns un sērs lija no debess un visus nomaitāja.
30 ౩౦ “అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది.
It tāpat būs tai dienā, kur Tas Cilvēka Dēls parādīsies.
31 ౩౧ ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు.
Tanī dienā, kas būs uz jumta un viņa rīki namā, tas lai nekāpj zemē, tos paņemt; un tāpat, kas ir uz lauka, lai negriežās atpakaļ.
32 ౩౨ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి.
Pieminiet Lata sievu.
33 ౩౩ తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు.
Ja kas meklēs savu dzīvību paturēt, tas to zaudēs, un ja kas to zaudēs, tas to paturēs dzīvu.
34 ౩౪ నేను చెప్పేదేమిటంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని తీసుకుపోవడం, మరొకరిని విడిచి పెట్టడం జరుగుతుంది.
Es jums saku: tanī naktī divi būs vienā gultā, viens taps pieņemts un otrs atstāts.
35 ౩౫ ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు ఉండిపోతాడు.”
Divas kopā mals, - viena taps pieņemta un otra atstāta.
36 ౩౬ అప్పుడు శిష్యులు, “ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది” అని అడిగారు.
Divi būs laukā, viens taps pieņemts un otrs atstāts.”
37 ౩౭ దానికి జవాబుగా ఆయన, “శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి” అన్నాడు.
Un tie atbildēja un uz Viņu sacīja: “Kurā vietā, Kungs?” Bet Viņš uz tiem sacīja: “Kur ir maita, tur sakrāsies ērgļi.”