< లూకా 16 >

1 ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు, “ఒక ధనవంతుడి దగ్గర ఒక అధికారి ఉన్నాడు. అతడు ఆ ధనవంతుని ఇంటి ఆర్ధిక వ్యవహారాలు చూసేవాడు. అతడు తన ఆస్తిని పాడు చేస్తున్నాడనే ఫిర్యాదు ధనవంతుడికి వచ్చింది.
Yesu nowachone jopuonjrene niya, “Ne nitie jamoko moro, ma ngʼat mane rito mwandune ne odonjne ni ketho gige.
2 అతడు ఆ అధికారిని పిలిపించి, ‘నీ గురించి నేను వింటున్నదేమిటి? నీ పనికి సంబంధించిన లెక్క అంతా అప్పగించు. ఇక పైన నువ్వు నిర్వహణాధికారిగా ఉండడానికి వీల్లేదు’ అన్నాడు.
Omiyo noluonge ire kendo nopenje ni, ‘En angʼo mawinjo kuomini? Chiw ane kwan kuom gigo duto mirito, nikech ok inyal bedo jarit giga kendo ngangʼ!’
3 అప్పుడతడు ‘యజమాని నన్ను నిర్వహణ పనిలో నుండి తీసివేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తవ్వకం పని నాకు చేతకాదు. భిక్షమెత్తాలంటే అవమానం.
“Jarit noparo kende owuon ni, ‘Abiro timo angʼo koro? Ruodha koro maya tija. Ok an ratego moromo ma dapur, to wiya kuot mondo akwechi.
4 నన్ను ఈ నిర్వాహకత్వపు పని నుండి తొలగించిన తరువాత నలుగురూ తమ ఇళ్ళలోకి నన్ను ఆహ్వానించాలంటే ఎలా చేయాలో నాకు తెలుసులే’ అనుకున్నాడు.
Angʼeyo gima abiro timo, ma ka aweyo tich ka, to ji biro rwaka utegi!’
5 ఆ తరువాత అతడు తన యజమానికి బాకీ ఉన్న వారందరినీ పిలిపించాడు. ఒకడితో, ‘నా యజమానికి నువ్వు ఎంత బాకీ ఉన్నావు?’ అని అడిగాడు.
“Omiyo noluongo jogope ruodhe achiel achiel. Nopenjo mokwongo ni, ‘In-gi gowi mar ruodha marom nadi?’
6 ‘మూడు వేల లీటర్ల నూనె’ అని అతడు జవాబిచ్చాడు. ఈ అధికారి ఆ వ్యక్తితో, ‘నీ పత్రంలో పదిహేను వందల లీటర్లని రాసుకో’ అన్నాడు.
“Nodwoke ni, ‘Debe mia aboro mag mo.’ “Jarit tich nowachone ni, ‘Bed piny piyo piyo, ikaw kitapi indikie ni, mia angʼwen.’
7 ‘నువ్వు ఎంత బాకీ ఉన్నావు?’ అని మరొకణ్ణి అడిగితే అతడు, ‘వంద మానికల గోదుమలు’ అని చెప్పాడు. నిర్వహణాధికారి అతనితో, ‘నీ పత్రంలో ఎనభై మానికలని రాసుకో’ అన్నాడు.
“Eka nopenjo ngʼat mar ariyo ni, ‘In to, gopi oromo adi?’ “Nodwoke ni, ‘Gunia alufu achiel mag ngano.’ “Nowachone ni, ‘Kaw kitapini, indike ni mia aboro.’
8 న్యాయం తప్పి వ్యవహరించిన ఆ అధికారి తెలివైన పని చేశాడని యజమాని అతణ్ణి మెచ్చుకున్నాడు. ఈ లోక సంబంధులు తమ వారి విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో వారు దేవుని ప్రజల కంటే తెలివైన వారు. (aiōn g165)
“Ruoth nopako jarit gige ma ok kareno nikech notiyo gi rieke. Nimar jopinyni ongʼeyo tiyo mariek gi jowadgi moloyo jogo mawuotho e ler. (aiōn g165)
9 అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకంటే ఆ ధనం మిమ్మల్ని వదిలి పోయినప్పుడు వారు తమ శాశ్వతమైన నివాసాల్లో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెబుతున్నాను. (aiōnios g166)
Awachonu ni tiuru gi mwandu mag piny mondo umakgo osiepe ne un uwegi, mondo ka chiengʼ ma mwandugo orumo, norwaku e kar dak mochwere. (aiōnios g166)
10 ౧౦ చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయాల్లో అన్యాయంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగానే ఉంటాడు.
“Ngʼat minyalo geno gi gima tin, inyalo gene bende gi gik mangʼeny, to ngʼat ma ok ja-adiera gi gima tin bende ok nyal bedo ja-adiera gi gik mangʼeny.
11 ౧౧ కాబట్టి మీరు అన్యాయమైన ధనం విషయంలోనే నమ్మకంగా లేకపోతే, ఇక నిజమైన ధనం మీకెవరిస్తారు?
Emomiyo ka ok usebedo jo-adiera e tiyo gi mwandu mar pinyni, en ngʼat mane mabiro genou gi mwandu madier?
12 ౧౨ మీరు ఇతరుల ధనం విషయంలో నమ్మకంగా లేకపోతే మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు?
To ka ok usebedo jo-adiera gi mwandu ngʼat machielo, en ngʼat mane madimiu mwandu ma maru uwegi?
13 ౧౩ ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతడు ఒకరిని ద్వేషించి రెండవ యజమానిని ప్రేమిస్తాడు. లేదా ఒకరికి కట్టుబడి ఉండి మరొకర్ని చిన్న చూపు చూస్తాడు. మీరు దేవుణ్ణీ సిరినీ సేవించలేరు.”
“Onge jatich manyalo tiyo ne ruodhi ariyo. Nimar obiro chayo achiel to ohero machielo, kata obiro chiwore ne achiel to ochayo machielo. Ok inyal tiyo ne Nyasaye kendo ne pesa.”
14 ౧౪ డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు.
Jo-Farisai mane ohero pesa nowinjo magi duto kendo neginyiero kagijaro Yesu.
15 ౧౫ ఆయన వారితో ఇలా అన్నాడు. “మీరు మనుషుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకునేవారే గానీ దేవునికి మీ హృదయాలు తెలుసు. మనుషులు ఘనంగా ఎంచేది దేవునికి అసహ్యం.
Nowachonegi niya, “Un ema utimoru joma kare e wangʼ ji, to Nyasaye ongʼeyo chunyu. Gima okaw ni ber ahinya gi ji, kuom Nyasaye en gima kwero.
16 ౧౬ బాప్తిసమిచ్చే యోహాను వచ్చేంతవరకూ ధర్మశాస్త్రమూ ప్రవక్తల బోధలూ ఉన్నాయి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతూ ఉన్నారు.
“Chik kod Jonabi ne nigi teko nyaka chop ndalo mar Johana. Chakre kanyo, Injili mar pinyruoth Nyasaye osebedo kilando, kendo ngʼato ka ngʼato riyore mondo odonjie.
17 ౧౭ ధర్మశాస్త్రంలో ఒక పొల్లయినా తప్పిపోవడం కంటే ఆకాశం, భూమీ నశించి పోవడమే తేలిక.
To yot mondo polo gi piny orum, moloyo ka nukta achiel matinie moloyo olal kuom Chik.
18 ౧౮ “భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
“Ngʼato mowere gi chiege mokendo dhako machielo, odonjo e richo mar terruok, to ngʼat mokendo dhako ma chwore oweyo, bende odonjo e richo mar terruok.
19 ౧౯ “ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఊదారంగు బట్టలు, ఖరీదైన బట్టలూ ధరించేవాడు. ప్రతి రోజూ విలాసంగా జీవించేవాడు.
“Ne nitie jamoko moro mane rwako lewni mokikore kod lewni mayom ma nengogi tek, kendo nodak e ngima mamalo mar mor ndalo duto.
20 ౨౦ లాజరు అనే నిరుపేద కూడా ఉండేవాడు. ఇతనికి ఒంటినిండా కురుపులుండేవి. ఇతడు ధనవంతుని ఇంటి గుమ్మం ముందు పడి ఉండేవాడు.
E dhorangaye noketie jakwecho miluongoni Lazaro, ma adhonde nopongʼo dende
21 ౨౧ ధనవంతుని భోజన బల్ల పైనుంచి కింద పడే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు. అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి.
kendo nogombo chamo ngʼinjo molwar e bwo mesa jamokono. Kata mana guogi bende ne biro minangʼ adhondene.
22 ౨౨ ఆ నిరుపేద చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు. తరువాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.
“Sa nochopo ma jakwechono notho kendo malaika notingʼe, otere e bath Ibrahim. Jamoko bende notho kendo noyike.
23 ౨౩ “అతడు పాతాళంలో యాతనపడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి. (Hadēs g86)
Kane en e Piny Joma otho kisande malit, nongʼiyo malo to noneno Ibrahim gi kuma bor kod Lazaro e bathe. (Hadēs g86)
24 ౨౪ ‘తండ్రీ అబ్రాహామూ, నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను. లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు’ అని కేకలు పెట్టాడు.
Omiyo noluonge kowacho niya, ‘Wuora Ibrahim kecha kendo or Lazaro olut lith lwete e pi mondo okwena lewa, nikech an-gi rem malit e ligek majni.’
25 ౨౫ దానికి జవాబుగా అబ్రాహాము, ‘నాయనా, గుర్తుందా? నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు.
“To Ibrahim nodwoke ni, ‘Wuoda, parie ni e ndalo mar ngimani ne iyudo gik mabeyo, ka Lazaro to ne yudo gik maricho, to koroni oneno maber ka eri, to in inie rem malit.
26 ౨౬ అదీగాక ఇక్కడ నుండి మీ దగ్గరికి రావాలనుకునే వారు రాలేకుండా అక్కడి వారు మా దగ్గరికి రాకుండా మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది,’ అన్నాడు.
To bende moloyo ne mano duto, e kindwa kodi nitie hoho mangʼongo moseketi, mondo otam jogo madwaro aa ka obi iru kata ngʼato ok nyal ngʼado oa koru obi irwa koni.’
27 ౨౭ అప్పుడతడు, ‘అలాగైతే తండ్రీ, నాకు ఐదుగురు సోదరులున్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును మా ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను’ అన్నాడు.
“Nodwoko ni, ‘Koro akwayoi, wuora, or Lazaro odhi od wuora,
28 ౨౮
nimar an-gi owetena abich. Odhiyo osiemgi, mondo kik gin bende gibi e kar sand malitni.’
29 ౨౯ అందుకు అబ్రాహాము, ‘వారి దగ్గర మోషే, ప్రవక్తలూ ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి’ అన్నాడు.
“Ibrahim nodwoke ni, ‘Gin kod Musa gi Jonabi, owinjore giwinjgi.’
30 ౩౦ అతడు, ‘తండ్రీ, అబ్రాహామూ అలా అనకు, చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు’ అన్నాడు.
“Nowacho ni, ‘Ooyo wuonwa Ibrahim, to ka ngʼato oa kuom joma otho modhi irgi, to gibiro weyo richo.’
31 ౩౧ అందుకు అబ్రాహాము అతనితో, ‘మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు’” అన్నాడు.
“Nowachone ni, ‘Ka ok ginyal winjo Musa gi Jonabi, ok ginyal yie winjo kata ngʼato mochier oa kuom joma otho.’”

< లూకా 16 >