< లూకా 14 >
1 ౧ ఒక విశ్రాంతి దినం ఆయన ఒక పరిసయ్యుల అధికారి ఇంట్లో భోజనానికి వెళ్ళాడు. అక్కడ ఆయనను అందరూ గమనిస్తున్నారు.
І сталось, як прийшов Він у господу до одного із старших фарисейських у суботу їсти хлїб, були й вони, назираючи Його.
2 ౨ అక్కడ వాపు రోగం ఉన్న ఒకడు ఆయనకు ఎదురుగా ఉన్నాడు.
І ось один чоловік у водянці (у водяній пухлинї) був перед Ним.
3 ౩ అప్పుడు యేసు, “విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా?” అని ధర్మశాస్త్ర బోధకులనూ పరిసయ్యులనూ అడిగాడు.
І озвавшись Ісус, рече до законників та Фарисеїв, глаголючи: Чи годить ся в суботу сцїляти?
4 ౪ వారు మాట్లాడలేదు. అప్పుడు ఆయన అతణ్ణి దగ్గరికి తీసుకుని అతని రోగం బాగు చేసి పంపించేశాడు.
Вони ж мовчали. І взявши сцїлив його, та й відпустив.
5 ౫ “మీలో ఎవరి గాడిదైనా ఎద్దైనా విశ్రాంతి దినాన గుంటలో పడిపోతే దాన్ని బయటకు తీయకుండా ఉంటారా?” అని వారిని అడిగాడు.
І, озвавшись до них, рече: В кого з вас осел або віл упаде в колодязь, чи зараз не витягне його субітнього дня?
6 ౬ ఈ ప్రశ్నకు వారు ఆయనకు జవాబేమీ ఇవ్వలేకపోయారు.
І не змогли вони відказати Йому знов проти сього.
7 ౭ ఆ విందుకు ఆహ్వానం అందినవారు భోజనపంక్తిలో అగ్ర స్థానాలను ఎన్నుకోవడం చూసి ఆయన ఇలా అన్నాడు,
Сказав же до запрошених приповість, постерігши, як перві місця вибирають, глаголючи до них:
8 ౮ “నిన్ను ఎవరైనా పెళ్ళి విందుకు పిలిస్తే అక్కడ అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గొప్పవాణ్ణి అతడు పిలిచి ఉండవచ్చు.
Коли запрошений ти від кого на весїллє, то не сідай на первому місці, щоб часом поважнїший тебе не був запрошений від него,
9 ౯ మిమ్మల్నిద్దర్నీ పిలిచినవాడు వచ్చి, ‘ఈయన్ని ఇక్కడ కూర్చోనివ్వు’ అనవచ్చు. అప్పుడు నువ్వు సిగ్గు పడి చివరి స్థానంలో కూర్చోడానికి వెళ్తావు.
і прийшовши той, хто запросив тебе й його, не сказав тобі: Дай сьому місце; а тодї доведеть ся тобі з соромом останнє місце заняти.
10 ౧౦ కాబట్టి నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘మిత్రమా, పై స్థానానికి వెళ్ళు.’ అనవచ్చు. అప్పుడు నీకు అందరి ముందూ గౌరవం కలుగుతుంది.
Нї, коди ти запрошений, прийшовши сїдай на останньому місці, щоб, як прийде, хто запросив тебе, сказав тобі: Друже, сїдай вище. Тодї буде тобі слава перед тими, що сидять з тобою.
11 ౧౧ తనను తాను గొప్ప చేసుకునేవాడు తగ్గడం, తగ్గించుకునేవాడు హెచ్చడం జరుగుతుంది.”
Бо кожен, хто нести меть ся вгору, принизить ся, хто ж принизуєть ся, пійде вгору.
12 ౧౨ తరువాత ఆయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు, “నువ్వు పగలైనా రాత్రి అయినా విందు చేసినప్పుడు నీ స్నేహితులనూ నీ సోదరులనూ నీ బంధువులనూ ధనికులైన నీ పొరుగువారినీ పిలవకు. ఎందుకంటే నువ్వు వారిని పిలిచావు కాబట్టి వారు నిన్ను తిరిగి పిలవవచ్చు. కాబట్టి ఆ విధంగా వారు నీ రుణం తీర్చుకుంటారు.
Рече ж і тому, що запросив його: Коли справляєш обід або вечерю, не клич приятелїв твоїх, нї братів твоїх, нї сусїд багатих; щоб часом і вони тебе не запросили, й не було тобі відплати.
13 ౧౩ అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలువు.
Нї, коли справляєш гостину, запрошуй убогих, калїк, кривих, слїпих;
14 ౧౪ నీకు తిరిగి ఉపకారం చేయడానికి వారి దగ్గరేమీ ఉండదు. కాబట్టి నువ్వు దీవెన పొంది ధన్యుడివి అవుతావు. చనిపోయిన నీతిమంతులు సజీవంగా లేచినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది” అని చెప్పాడు.
то будеш блажен бо не мають чим віддати тобі; віддасть ся бо тобі увоскресенню праведних.
15 ౧౫ ఆయనతో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, “దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు” అని ఆయనతో అన్నాడు.
Почувши ж се один з сидячихз Ним, каже Йому: Блажен, хто їсти ме хлїб у царстві Божім.
16 ౧౬ అప్పుడు ఆయన అతనితో ఇలా చెప్పాడు, “ఒక మనిషి పెద్ద విందు చేయించి చాలా మందిని పిలిచాడు.
Він же рече йому: Один чоловік справив вечерю велику, та й запросив многих;
17 ౧౭ విందుకు వేళయినప్పుడు అతడు ‘ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది, రండి’ అని తాను పిలిచిన వారితో చెప్పడానికి తన సేవకుణ్ణి పంపాడు.
і післав слугу свого часу вечері сказати запрошеним: Ійдїть, бо вже все готове.
18 ౧౮ అయితే వారంతా ఒక్కపెట్టున సాకులు చెప్పడం మొదలు పెట్టారు. మొదటివాడు ‘నేనొక పొలం కొన్నాను. వెంటనే వెళ్ళి దాన్ని చూసుకోవాలి. నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను’ అన్నాడు.
І почали рядом відпрошуватись усї. Первий сказав йому: Поле купив я, то мушу шити та подивитись на него. Прошу тебе, вибач менї.
19 ౧౯ మరొకడు ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను. ఇప్పుడు నేను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను’ అన్నాడు.
А другий сказав: Пять ярем волів купив я, і йду спробувати їх. Прощу тебе, вибач мені.
20 ౨౦ మరొకడు ‘నేను పెళ్ళి చేసుకున్నాను. కాబట్టి రాలేను’ అన్నాడు.
А знов другий сказав: Я одруживсь, тому й не можу прийти.
21 ౨౧ అప్పుడా పనివాడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి చెప్పాడు. దాంతో ఆ యజమాని కోపగించుకుని ఆ సేవకుడితో ‘నువ్వు త్వరగా ఊరి వీధుల్లోకీ, సందుల్లోకీ వెళ్ళి అక్కడ ఉన్న పేదలనూ వికలాంగులనూ గుడ్డివారినీ కుంటివారినీ తీసుకుని రా’ అన్నాడు.
І прийшовши слуга той, оповів панові своєму. Тодї прогнівившись господар, рече слузї своєму: Вийди хутко на дороги та на улицї городські, та вбогих, та калїк, та кривих, та слїпих поприводь сюди.
22 ౨౨ తరవాత ఆ పనివాడు వచ్చి ‘ప్రభూ, నువ్వు చెప్పినట్టే చేశాను. కానీ ఇంకా చోటు ఉంది’ అన్నాడు.
І рече слуга: Пане, сталось, як звелїв єси, та й ще в місце.
23 ౨౩ అప్పుడు ఆ యజమాని తన సేవకుడితో ‘నా ఇల్లు నిండిపోవాలి. కాబట్టి నువ్వు రాజ మార్గాల్లోకీ, కంచెల్లోకీ వెళ్లి అక్కడి వారిని బలవంతంగా తీసుకురా.
І рече пан до слуги: Вийди на шляхи та на загороди, та силуй увійти, щоб повна була господа моя.
24 ౨౪ నేను నీకు చెబుతున్నాను. నేను మొదట పిలిచిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’” అన్నాడు.
Глаголю бо вам, що ніхто з чоловіків тих запрошених не покоштує моєї вечері.
25 ౨౫ గొప్ప జన సమూహాలు ఆయనతో వస్తూ ఉన్నారు. ఆయన వారి వైపు తిరిగి ఇలా అన్నాడు,
Ійшло ж із Ним пребагато народу; й обернувшись рече до них:
26 ౨౬ “నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు.
Коли хто приходить до мене й не зненавидить батька свого, й матїр, і жінку, й діти, й братів, і сестер, та ще й свою душу, не може учеником моїм бути.
27 ౨౭ అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు.
І хто не носить хреста свого й не ходить слїдом за мною, не може бути учеником моїм.
28 ౨౮ “మీలో ఎవరైనా ఒక గోపురం కట్టాలని అనుకుంటే దాన్ని మొదలుపెట్టి కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో లెక్క చూసుకోడా?
Хто бо з вас, задумавши башту будувати, перше сївши не полїчить видатку, чи має на скінченнє?
29 ౨౯ అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తరువాత గోపురం పూర్తి చేయలేకపోతే,
щоб часом, як положить він основину, та, не спроможеть ся скінчити, всі, дивлячись, не стали сьміятись із него, кажучи:
30 ౩౦ చూస్తున్న వారంతా ‘ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడు గానీ ముగించ లేకపోయాడు’ అంటూ వేళాకోళం చేస్తారు.
Що сей чоловік почав будувати, та й не спроміг ся скінчити.
31 ౩౧ “అలాగే ఒక రాజు మరో రాజుపై యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఇరవై వేల మంది సైన్యంతో తన మీదికి వస్తున్నవాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా?
Або який цар, ідучи на войну, ударити на другого царя, сївши перше не порадить ся, чи можливо з десятьма тисячами устояти проти того, хто з дванайцятьма тисячами йде на него.
32 ౩౨ తన శక్తి చాలదనుకుంటే ఆ రాజు దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సంధి చేసుకోడానికి ప్రయత్నిస్తాడు కదా!
Коли ж нї, то ще як той далеко, посли піславши, просить примирря.
33 ౩౩ అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు.
Так оце всякий з вас, хто не відцураєть ся від усього свого достатку, не може моїм учеником бути,
34 ౩౪ “ఉప్పు మంచిదే. అయితే ఉప్పు తన సారాన్ని కోల్పోతే దానికి తిరిగి సారం దేనివల్ల కలుగుతుంది?
Добро сіль; коли ж сіль вітріє, то чим приправити?
35 ౩౫ అది భూమికి గానీ, ఎరువులా వాడడానికి గానీ పనికిరాదు. కాబట్టి దాన్ని బయట పారవేస్తారు. వినడానికి చెవులున్న వాడు విను గాక.”
Нї в землю, нї в гній не годить ся вона; геть викидають її. Хто має уші слухати, нехай слухає.