< లూకా 1 >
Будући да многи почеше описивати догађаје који се испунише међу нама,
2 ౨ మొదటి నుంచీ కళ్ళారా చూసిన వాక్య సేవకులు మనకు అప్పగించినట్టు మన మధ్య నెరవేరిన కార్యాలను గురించి వివరంగా రాయడానికి చాలా మంది పూనుకున్నారు.
Као што нам предаше који испрва сами видеше и слуге речи бише:
3 ౩ కాబట్టి నీకు ఉపదేశించిన సంగతులు కచ్చితంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలని వాటిని మొదటి నుండీ పరిశోధించి కూలంకషంగా తెలుసుకున్న నేను నీ కోసం
Намислих и ја, испитавши све од почетка, по реду писати теби, честити Теофиле,
4 ౪ వాటన్నిటినీ క్రమపద్ధతిలో రాయడం మంచిదని నాకు అనిపించింది.
Да познаш темељ оних речи којима си се научио.
5 ౫ యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు.
У време Ирода цара јудејског беше неки свештеник од реда Авијиног, по имену Зарија, и жена његова од племена Ароновог, по имену Јелисавета.
6 ౬ వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు.
А беху обоје праведни пред Богом, и живљаху у свему по заповестима и уредбама Господњим без мане.
7 ౭ అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు.
И не имаху деце; јер Јелисавета беше нероткиња, и беху обоје већ стари.
8 ౮ జెకర్యా ఒక రోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా
И догоди се, кад он служаше по свом реду пред Богом,
9 ౯ యాజకులు వారి సంప్రదాయం ప్రకారం చీట్లు వేస్తే ప్రభువు ఆలయం లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది.
Да по обичају свештенства дође на њега да изиђе у цркву Господњу да кади.
10 ౧౦ ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తున్నారు.
И све мноштво народа беше напољу и мољаше се Богу у време кађења.
11 ౧౧ ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడి వైపున అతనికి కనిపించాడు.
А њему се показа анђео Господњи који стајаше с десне стране олтара кадионог.
12 ౧౨ జెకర్యా అతనిని చూసి, కంగారుపడి భయపడ్డాడు.
И кад га виде Зарија уплаши се и страх нападе на њ.
13 ౧౩ అప్పుడా దూత అతనితో, “జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు.
А анђео рече му: Не бој се, Зарија; јер је услишена твоја молитва: и жена твоја Јелисавета родиће ти сина, и надени му име Јован.
14 ౧౪ అతని మూలంగా నీకు హర్షం, మహదానందం కలుగుతుంది. అతడు పుట్టడం వలన చాలా మంది సంతోషిస్తారు.
И биће теби радост и весеље, и многи ће се обрадовати његовом рођењу.
15 ౧౫ అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షారసం గానీ సారాయి గానీ సేవించడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు.
Јер ће бити велики пред Богом, и неће пити вино ни сикер; и напуниће се Духа Светог још у утроби матере своје;
16 ౧౬ ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు.
И многе ће синове Израиљеве обратити ка Господу Богу њиховом;
17 ౧౭ తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మళ్ళించి, అవిధేయులు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేలా చేస్తాడు. తద్వారా ప్రభువు కోసం సిద్ధపాటు కలిగిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలీయా ఆత్మతో బలప్రభావాలతో ప్రభువుకు ముందుగా వస్తాడు” అన్నాడు.
И он ће напред доћи пред Њим у духу и сили Илијиној да обрати срца отаца к деци и невернике к мудрости праведника, и да приправи Господу народ готов.
18 ౧౮ దేవదూతతో జెకర్యా, “ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాణ్ణి, నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు” అన్నాడు
И рече Зарија анђелу: По чему ћу ја то познати? Јер сам стар и жена је моја временита.
19 ౧౯ దూత, “నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు.
И одговарајући анђео рече му: Ја сам Гаврило што стојим пред Богом, и послан сам да говорим с тобом и да ти јавим ову радост.
20 ౨౦ నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు” అని అతనితో అన్నాడు.
И ево, онемећеш и нећеш моћи говорити до оног дана док се то не збуде; јер ниси веровао мојим речима које ће се збити у своје време.
21 ౨౧ ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ, ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు.
И народ чекаше Зарију, и чуђаху се што се забави у цркви.
22 ౨౨ అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు.
А изишавши не могаше да им говори; и разумеше да му се нешто утворило у цркви; и он намигиваше им; и оста нем.
23 ౨౩ అతడు సేవ చేసే కాలం పూర్తి అయిన తరవాత ఇంటికి వెళ్ళి పోయాడు.
И кад се навршише дани његове службе отиде кући својој.
24 ౨౪ ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు ఇతరుల కంట బడలేదు.
А после ових дана, затрудне Јелисавета жена његова, и кријаше се пет месеци говорећи:
25 ౨౫ ఆమె, “దేవుడు నన్ను కనికరించి మనుషుల్లో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు” అనుకుంది.
Тако ми учини Господ у дане ове у које погледа на ме да ме избави од укора међу људима.
26 ౨౬ ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో
А у шести месец посла Бог анђела Гаврила у град галилејски по имену Назарет
27 ౨౭ దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం అయిన కన్య దగ్గరికి పంపించాడు. ఆ కన్య పేరు మరియ.
К девојци испрошеној за мужа, по имену Јосифа из дома Давидовог; и девојци беше име Марија.
28 ౨౮ ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో, “అనుగ్రహం పొందినదానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు” అని పలికాడు.
И ушавши к њој анђео рече: Радуј се, благодатна! Господ је с тобом, благословена си ти међу женама.
29 ౨౯ ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా,
А она, видевши га, поплаши се од речи његове и помисли: Какав би ово био поздрав?
30 ౩౦ దూత, “మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది.
И рече јој анђео: Не бој се, Марија! Јер си нашла милост у Бога.
31 ౩౧ ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు.
И ево затруднећеш, и родићеш Сина, и надени Му име Исус.
32 ౩౨ ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు.
Он ће бити велики, и назваће се Син Највишега, и даће Му Господ Бог престо Давида оца Његовог;
33 ౩౩ ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు. (aiōn )
И цароваће у дому Јаковљевом вавек, и царству Његовом неће бити краја. (aiōn )
34 ౩౪ మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది.
А Марија рече анђелу: Како ће то бити кад ја не знам за мужа?
35 ౩౫ ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు.
И одговарајући анђео рече јој: Дух Свети доћи ће на тебе, и сила Највишег осениће те; зато и оно што ће се родити биће свето, и назваће се Син Божји.
36 ౩౬ పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల.
И ево Јелисавета, твоја тетка, и она затрудне сином у старости својој, и ово је шести месец њој, коју зову нероткињом.
37 ౩౭ దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు.
Јер у Бога све је могуће што каже.
38 ౩౮ అందుకు మరియ, “నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక” అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు.
А Марија рече: Ево слушкиње Господње; нека ми буде по речи твојој. И анђео отиде од ње.
39 ౩౯ ఇది జరిగిన కొద్దికాలానికే మరియ లేచి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయి ఎలీసబెతుకు వందనం చేసింది.
А Марија уставши оних дана, отиде брзо у горњу земљу, у град Јудин.
И уђе у кућу Заријину, и поздрави се с Јелисаветом.
41 ౪౧ ఎలీసబెతు ఆ అభివందనం వినగానే, ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది.
И кад Јелисавета чу честитање Маријино, заигра дете у утроби њеној, и Јелисавета се напуни Духа Светог,
42 ౪౨ “స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది.
И повика здраво и рече: Благословена си ти међу женама, и благословен је плод утробе твоје.
43 ౪౩ నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం!
И откуд мени ово да дође мати Господа мог к мени?
44 ౪౪ నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు.
Јер гле, кад дође глас честитања твог у уши моје, заигра дете радосно у утроби мојој.
45 ౪౫ ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుందని నమ్మిన ఆమె ధన్యురాలు” అంది.
И благо оној која верова, јер ће се извршити шта јој каза Господ.
46 ౪౬ అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది.
И рече Марија: Велича душа моја Господа;
47 ౪౭ ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు.
И обрадова се дух мој Богу Спасу мом,
48 ౪౮ నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం.
Што погледа на понижење слушкиње своје; јер гле, одсад ће ме звати блаженом сви нараштаји;
Што ми учини величину силни, и свето име Његово;
50 ౫౦ ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది.
И милост је Његова од кољена на кољено онима који Га се боје.
51 ౫౧ ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు.
Показа силу руком својом; разасу поносите у мислима срца њихових.
52 ౫౨ బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు
Збаци силне с престола, и подиже понижене.
53 ౫౩ ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు.
Гладне напуни блага, и богате отпусти празне.
Прими Израиља, слугу свог, да се опомене милости.
55 ౫౫ అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి, వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు, ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.” (aiōn )
Као што говори оцима нашим, Аврааму и семену његовом довека. (aiōn )
56 ౫౬ మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోయింది.
Марија пак седи с њом око три месеца, и врати се кући својој.
57 ౫౭ ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది.
А Јелисавети дође време да роди, и роди сина.
58 ౫౮ అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు.
И чуше њени суседи и родбина да је Господ показао велику милост своју на њој, и радоваху се с њом.
59 ౫౯ వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా
И у осми дан дођоше да обрежу дете, и хтеше да му надену име оца његовог, Зарија.
60 ౬౦ తల్లి, “అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది.
И одговарајући мати његова рече: Не, него да буде Јован.
61 ౬౧ అందుకు వారు, “నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా” అని,
И рекоше јој: Никога нема у родбини твојој да му је такво име.
62 ౬౨ “వాడికి ఏ పేరు పెట్టాలి?” అని తండ్రిని సైగలతో అడిగారు.
И намигиваху оцу његовом како би он хтео да му надену име.
63 ౬౩ అతడు పలక తెమ్మని, “బాబు పేరు యోహాను” అని రాశాడు. అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు.
И заискавши дашчицу, написа говорећи: Јован му је име. И зачудише се сви.
64 ౬౪ వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు.
И одмах му се отворише уста и језик његов и говораше хвалећи Бога.
65 ౬౫ అది చూసి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. ఈ సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు.
И уђе страх у све суседе њихове; и по свој горњој Јудеји разгласи се сав овај догађај.
66 ౬౬ జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి, “ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో!” అనుకున్నారు.
И сви који чуше метнуше у срце своје говорећи: Шта ће бити из овог детета? И рука Господња беше са њим.
67 ౬౭ అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు,
И Зарија отац његов напуни се Духа Светог, и пророкова говорећи:
68 ౬౮ “ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు.
Благословен Господ Бог Јаковљев што походи и избави народ свој,
69 ౬౯ తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.
И подиже нам рог спасења у дому Давида слуге свог,
70 ౭౦ మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు. దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు. ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను, అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు. (aiōn )
Као што говори устима светих пророка својих од века (aiōn )
Да ће нас избавити од наших непријатеља и из руку свих који мрзе на нас;
Учинити милост оцима нашим, и опоменути се светог завета свог,
Клетве којом се клео Аврааму оцу нашем да ће нам дати
74 ౭౪ మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది, పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో, పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే, మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.
Да се избавимо из руку непријатеља својих, и да му служимо без страха,
И у светости и у правди пред Њим док смо год живи.
76 ౭౬ ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి, వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా, ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.
И ти, дете, назваћеш се пророк Највишега; јер ћеш ићи напред пред лицем Господњим да Му приправиш пут;
Да даш разум спасења народу његовом за опроштење греха њихових,
По дубокој милости Бога нашег, по којој нас је походио исток с висине;
79 ౭౯ మన పాదాలను శాంతి మార్గంలో నడిపించేలా చీకటిలోను, చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది. ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు.”
Да обасјаш оне који седе у тами и у сену смртном; да упутиш ноге наше на пут мира.
80 ౮౦ ఆ బాలుడు ఎదిగి, ఆత్మలో బలం పుంజుకుంటూ, ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు.
А дете растијаше и јачаше духом, и беше у пустињи дотле док се не показа Израиљу.