< లేవీయకాండము 8 >
1 ౧ యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.
Then spake Yahweh unto Moses, saying:
2 ౨ “నువ్వు అహరోనును, అతని కొడుకులను తీసుకు రా. వాళ్ళతో పాటు వాళ్ళ బట్టలూ, అభిషేకం చేయడానికి నూనే, పాపం కోసం బలి అర్పించడానికి ఒక ఎద్దూ, రెండు పొట్టేళ్ళూ, పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన ఒక బుట్టెడు రొట్టెలూ తీసుకు రా.
Take thou Aaron and his sons with him, and the garments, and the anointing oil, —and the sin-bearing bullock, and the two rams, and the basket of unleavened cakes;
3 ౩ సమాజంలో ప్రజలందర్నీ ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గరికి సమకూర్చు.”
and all the assembly, call thou together, —unto the entrance of the tent of meeting.
4 ౪ మోషే యెహోవా తనకు ఆదేశించినట్టుగా చేశాడు. సమాజంలో ప్రజలందరూ ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గరికి చేరుకున్నారు.
And Moses did, as Yahweh commanded him, —and the assembly was called together, unto the entrance of the tent of meeting.
5 ౫ అప్పుడు మోషే వాళ్ళందరితో “ఇలా చేయమని యెహోవా ఆజ్ఞాపించాడు” అన్నాడు.
Then said Moses unto the assembly, —This is the thing, which Yahweh hath commanded to be done.
6 ౬ తరువాత మోషే అహరోనునూ, అతని కొడుకులనూ తీసుకు వచ్చి వాళ్లకి స్నానం చేయించాడు.
So Moses brought near Aaron and his sons, —and bathed them with water,
7 ౭ తరువాత అహరోనుకు చొక్కా తొడిగి, అతనికి నడికట్టు కట్టాడు. అంగీ ధరింపజేసి ఏఫోదుని వేశాడు. అందంగా అల్లిన నడికట్టుని ఏఫోదు పైగా వేసి బిగించి కట్టాడు.
and put upon him the tunic and girded him with the band, and clothed him with the robe, and put upon him the ephod, and girded him with the curiously-woven band of the ephod, and bound it to him therewith;
8 ౮ అతనికి వక్షపతకం కట్టి దానిలో ఊరీమును, తుమ్మీమును ఉంచాడు.
and he put upon him the breastpiece, —and placed, in the breastpiece, the Lights and the Perfections;
9 ౯ అతనికి తలపాగా పెట్టాడు. ఆ పాగా ముందు భాగంలో పరిశుద్ధ కిరీటంలా బంగారు రేకుని ఉంచాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లుగా మోషే ఇదంతా చేశాడు.
and he put the turban upon his head, —and put upon the turban, on the forefront thereof the burnished plate of gold—the holy crown, As Yahweh commanded Moses.
10 ౧౦ తరువాత మోషే అభిషేకం చేయడానికి నూనె తీసుకున్నాడు. దానితో మందిరాన్నీ, మందిరంలో ఉన్న సమస్తాన్నీ అభిషేకించి వాటినన్నిటినీ శుద్ధీకరణం చేశాడు.
And Moses took the anointing oil, and anointed the habitation and all that was therein, —and hallowed them;
11 ౧౧ తరువాత ఆ నూనెలో కొంత బలిపీఠంపై ఏడుసార్లు చిలకరించాడు. బలిపీఠం దానికి సంబంధించిన పాత్రలను, గంగాళాన్నీ, దాని పీటనూ శుద్ధీకరణం చేసి వాటిని అభిషేకించాడు.
and he sprinkled thereof upon the altar seven times, —and anointed the altar, and all the utensils thereof and the laver and its stand to hallow them
12 ౧౨ తరువాత అతడు ఆ అభిషేకం చేసే నూనెలో కొంత తీసి అహరోనుని ప్రతిష్టించడానికి అతని తల పైన పోసి అభిషేకించాడు.
and he poured of the anointing oil, upon the head of Aaron, —and anointed him, to hallow him.
13 ౧౩ తరువాత మోషే యెహోవా తనకు ఆదేశించిన విధంగా అహరోను కొడుకులను తీసుకు వచ్చి వారికి పొడవాటి చొక్కాలు వేశాడు. వారికి నడికట్లు కట్టి, వారి తలల చుట్టూ నార బట్టలు కట్టాడు.
And Moses brought near the sons of Aaron and clothed them with tunics and girded them with bands, and wrapped round for them turbans, —As Yahweh commanded Moses.
14 ౧౪ ఆ తరువాత మోషే పాపం కోసం బలి అర్పణ చేయడానికి ఒక కోడెదూడని తీసుకు వచ్చాడు. అహరోనూ అతని కొడుకులూ పాపం కోసం బలి అర్పణ కాబోతున్న ఆ కోడె దూడ తలపై తమ చేతులుంచారు.
Then was led near the sin-bearing bullock, —and Aaron and his sons leaned their hands upon the head of the sin-bearing bullock,
15 ౧౫ మోషే దాన్ని వధించాడు. దాని రక్తాన్ని తీసి తన వేలితో బలిపీఠం కొమ్ములకి పూసి బలిపీఠాన్ని శుద్ధీకరించాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాడు. మోషే దాని కోసం పరిహారం చేసి దాన్ని ప్రతిష్టించాడు.
Then was it slain, and Moses took the blood and put [thereof] upon the horns of the altar round about, with his finger, and cleansed the altar from sin, —and the [remainder of the] blood, poured he forth at the base of the altar, and hallowed it putting a propitiatory-covering thereupon.
16 ౧౬ అప్పుడు మోషే దాని లోపలి భాగాలపై ఉన్న కొవ్వునంతా తీసి వేరు చేశాడు. కాలేయం పైనున్న కొవ్వును తీశాడు. మూత్రపిండాలనూ వాటిపైని కొవ్వునూ తీసి అంతా బలిపీఠంపై దహించాడు.
And he took all the fat that was on the inwards, and the caul of the liver, and the two kidneys and their fat, —and Moses made a perfume at the altar.
17 ౧౭ అయితే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టుగా మోషే ఆ కోడె దూడనూ, దాని చర్మాన్నీ, మాంసాన్నీ, పేడనూ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు.
But the bullock itself, and its skin and its flesh and its dung, consumed he with fire, outside the camp, —As Yahweh commanded Moses,
18 ౧౮ ఆ తరువాత మోషే దహనబలిగా ఒక పొట్టేలును తీసుకు వచ్చాడు. అహరోనూ, అతని కొడుకులూ ఆ పొట్టేలు తలపైన తమ చేతులుంచారు.
Then was brought near the ram for the ascending-sacrifice, —and Aaron and his sons leaned their hands upon the head of the ram;
19 ౧౯ అప్పుడు మోషే దాన్ని వధించిన తరువాత దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.
and it was slain, —and Moses dashed the blood against the altar round about;
20 ౨౦ అతడు ఆ పొట్టేలును ముక్కలుగా చేసాడు. దాని తలనూ, ఆ ముక్కలనూ, కొవ్వునూ దహించాడు.
and the ram itself, was cut up into its pieces, —and Moses made a perfume with the head and with the pieces and with the fat;
21 ౨౧ అతడు దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడిగి ఆ మొత్తం పొట్టేలును బలిపీఠంపై దహించాడు. అది దహనబలి. కమ్మటి సువాసనను అది కలగజేసింది. అది యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు అగ్నితో యెహోవాకు చేసిన బలి.
but the inwards and the legs, were bathed in water, —and Moses made a perfume with the whole ram at the altar, an ascending-sacrifice, it was—for a satisfying odour an altar-flame, it was unto Yahweh, As Yahweh commanded Moses.
22 ౨౨ ఆ తరువాత మోషే రెండో పొట్టేలుని తీసుకు వచ్చాడు. ఇది అహరోనుని సేవకై ప్రతిష్టించడం కోసం. ప్రతిష్ట కోసమైన ఈ పొట్టేలు తల పైన అహరోనూ, అతని కొడుకులూ తమ చేతులుంచారు.
Then was brought near the second ram, the ram of installation, and Aaron and his sons leaned their hands upon the head of the ram;
23 ౨౩ మోషే దాన్ని వధించి దాని రక్తంలో కొంత తీసి, అహరోను కుడి చెవి తమ్మె పైనా, కుడిచేతి బొటన వేలి పైనా, కుడికాలి బొటన వేలి పైనా పూశాడు.
and it was slain, and Moses took of the blood thereof, and put upon the tip of Aaron’s right ear, —and upon the thumb of his right hand, and upon the great toe of his right foot.
24 ౨౪ మోషే అహరోను కొడుకులను కూడా తీసుకు వచ్చి కొంత రక్తాన్ని వారి కుడి చెవి తమ్మెల పైనా, కుడి చేతుల బొటనవేళ్ళ పైనా, కుడి కాళ్ళ బొటన వేళ్ళ పైనా పూసాడు. తరువాత మిగిలిన రక్తాన్ని బలిపీఠంకి అన్ని వైపులా చిమ్మాడు.
Then were brought near the sons of Aaron, and Moses put of the blood upon the tip of their right ear, and upon the thumb of their right hand, and upon the great toe of their right foot, —and Moses dashed the blood against the altar round about.
25 ౨౫ తరువాత మోషే దాని కొవ్వునూ, కొవ్వు పట్టిన దాని తోకనూ, దాని అంతర్భాగాల పైని కొవ్వునూ, కాలేయం పైని కొవ్వునూ, రెండు మూత్ర పిండాలనూ, వాటి పైని కొవ్వునూ, కుడి తొడ భాగాన్నీ వేరు చేశాడు.
And he took the fat and the fat-tail, and all the fat that was on the inwards, and the caul of the liver, and the two kidneys and their fat, —and the right shoulder;
26 ౨౬ యెహోవా సమక్షంలో పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెలతో ఉన్న బుట్టలో నుండి ఒక రొట్టెనూ, నూనె రాసి చేసిన ఒక రొట్టెనూ, ఒక అప్పడాన్నీ తీసి వాటిని కొవ్వు పైనా, కుడి తొడ భాగం పైనా పెట్టాడు.
and out of the basket of unleavened-cakes that was before Yahweh, took he one round unleavened-cake and one round oil-cake, and one wafer, and put them upon the fat portions, and upon the right shoulder;
27 ౨౭ వాటిని అహరోను చేతుల్లోనూ, అతని కొడుకుల చేతుల్లోనూ ఉంచి వాటిని యెహోవా సన్నిధిలో అర్పణగా పైకి ఎత్తి అటూఇటూ కదిలించి చూపాడు.
and placed the whole upon the opened palms of Aaron, and upon the opened palms of his sons, —and waved them as a wave-offering, before Yahweh.
28 ౨౮ తరువాత మోషే వాటిని వాళ్ళ చేతుల నుంచి తీసుకుని దహనబలిగా బలిపీఠం పైన దహించాడు. అవి ప్రతిష్టార్పణలు. అవి కమ్మటి సువాసన కలుగజేసాయి. అది యెహోవాకు అర్పించిన దహనబలి.
And Moses took them from off their opened palms, and made a perfume at the altar upon the ascending-sacrifice, —an installation, they were for a satisfying odour, an altar-flame, it was unto Yahweh.
29 ౨౯ తరువాత మోషే దాని రొమ్ము భాగాన్ని తీసుకుని దాన్ని కదలిక అర్పణగా యెహోవా సమక్షంలో పైకెత్తి కదిలించాడు. యాజకుణ్ణి ప్రతిష్టించే పనిలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పొట్టేలులో అది మోషే వంతు.
And Moses took the breast, and waved it as a wave-offering, before Yahweh, —of the ram of installation, unto Moses it belonged, as a portion, As Yahweh commanded Moses.
30 ౩౦ తరువాత మోషే అభిషేకానికి ఉపయోగించే నూనెలో కొంత, బలిపీఠం పైని రక్తంలో కొంత తీసుకుని వాటిని అహరోను పైనా అతని బట్టల పైనా, అతని కొడుకుల పైనా, వాళ్ళ బట్టల పైనా చిలకరించాడు. ఆ విధంగా మోషే అహరోనునూ, అతని బట్టలనూ, అతని కొడుకులనూ, వాళ్ళ బట్టలనూ అభిషేకించాడు.
And Moses took of the anointing oil and of the blood that was upon the altar, and sprinkled upon Aaron, upon his garments, and upon his sons and upon the garments of his sons with him, —and hallowed Aaron, his garments, and his sons and the garments of his sons with him.
31 ౩౧ ఆ తరువాత మోషే అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ ఇలా చెప్పాడు. “ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గర ఆ మాంసాన్ని వండండి. దాన్నీ, బుట్టలో సేవా ప్రతిష్ట కోసం ఉంచిన రొట్టెనూ మీరు తినాలి. అహరోనూ, అతని కొడుకులూ దాన్ని తినాలి అని నేను ఆజ్ఞాపించినట్టు మీరు వాటిని తినాలి.
And Moses said unto Aaron and unto his sons Boil ye the flesh, at the entrance of the tent of meeting, and there, shall ye eat it, and the bread which is in the basket of installation, —as I have been commanded, saying, Aaron and his sons, shall eat it.
32 ౩౨ మీరు తినగా మిగిలిన మాంసాన్నీ, రొట్టెనూ కాల్చివేయాలి.
But, that which is left of the flesh, and of the bread, with fire, shall ye consume.
33 ౩౩ మీ ప్రతిష్ఠ రోజులు ముగిసే వరకూ అంటే ఏడు రోజులు మీరు ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. ఆ ఏడు రోజులూ యెహోవా మిమ్మల్ని ప్రతిష్ట చేస్తాడు.
And from the entrance of the tent of meeting, shall ye not go forth for seven days, until the day that filleth up the days of your installation, —because for seven days, will he install you:
34 ౩౪ ఈ రోజు ఎలా జరిగిందో మీ కోసం పరిహారం చేయడానికి అలాగే జరగాలని యెహోవా ఆజ్ఞాపించాడు.
as hath been done this day, [so] hath Yahweh commanded to be done, to put a propitiatory-covering over you.
35 ౩౫ మీరు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఏడు రోజులు రాత్రింబగళ్ళు నిలిచి యెహోవా ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే యెహోవా నాకు అలా ఆజ్ఞ ఇచ్చాడు.”
Even at the entrance of the tent of meeting, shall ye abide day and night for seven days, and shall keep the watch of Yahweh and shall not die, —for, so, am I commanded.
36 ౩౬ కాబట్టి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనూ, అతని కొడుకులూ చేశారు.
And Aaron and his sons did all the things which Yahweh had commanded through the mediation of Moses.