< లేవీయకాండము 6 >
1 ౧ యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
Na Awurade ka kyerɛɛ Mose se,
2 ౨ “ఒక వ్యక్తి తన పొరుగున ఉన్నవాడు తనకు అప్పగించిన దాని విషయంలో అతణ్ణి మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక తన పొరుగున ఉన్నవాణ్ణి పీడించినా
“Sɛ obi yɛ bɔne tia me, sɛ ebia, ɔbɛdaadaa ne yɔnko wɔ biribi a wɔde ahyɛ ne nsa anaa ade a wɔawia na wɔde abegyaw no no ho, anaasɛ osisi ne yɔnko,
3 ౩ అతడు పోగొట్టుకున్న వస్తువు తనకు దొరికినా దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపం అవుతుంది.
anaa otu ahu na ɔka ntam san wɔ ho se dekode no nni ne nkyɛn a,
4 ౪ ఇలా పాపం చేసినవాడు అపరాధి. కాబట్టి అలాంటివాడు తను ఇతరుల దగ్గర దోచుకున్నదీ, పీడించి సంపాదించిందీ, లేక తనకు అప్పగించినదీ, తనకు దొరికినదీ తిరిగి ఇచ్చివేయాలి.
sɛ obi yɛ bɔne na odi ho fɔ a, ɔbɛsan de ne akorɔnne no anaa ne tintimgye ade anaa nea wɔde maa no siei anaa agyapade a wɔde ahyɛ ne nsa, anaa ade a ayera no aba,
5 ౫ తాను దేని గురించైతే అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇంకా అది ఎవరికి చెందుతుందో వారికి దానిలో ఐదో వంతు తప్పక చెల్లించాలి. దాన్ని అపరాధ బలి అర్పించే రోజున చెల్లించాలి.
biribiara a waka ho ntamhunu no nso, ɔbɛsan de ne nyinaa aba na ɔde ho mfɛntom ɔha mu nkyɛmu aduonu aka ho abrɛ onipa ko a ɛyɛ ne de no wɔ da a ɔrebɔ afɔdi ho afɔre no.
6 ౬ తరువాత అతడు తన అపరాధబలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకుని రావాలి. అపరాధబలిగా మందలోని లోపం లేని పోట్టేలును యాజకుడి దగ్గరికి తీసుకుని రావాలి. దాని విలువను ప్రస్తుత వెల ప్రకారం నిర్థారించాలి.
Nʼafɔdi ho afɔrebɔde no sɛ ɔde odwennini a onni dɛm na ɔsom bo kɔma ɔsɔfo.
7 ౭ యాజకుడు యెహోవా సమక్షంలో అతని పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతడు ఏ ఏ విషయాల్లో అపరాధి అయ్యాడో ఆ విషయాల్లో క్షమాపణ పొందుతాడు.”
Na ɔsɔfo no de no bɛyɛ mpata ama no wɔ Awurade anim na wɔde ne bɔne akyɛ no.”
8 ౮ ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
Afei, Awurade ka kyerɛɛ Mose se,
9 ౯ “నువ్వు అహరోనుకీ, అతని కొడుకులకీ ఇలా ఆదేశించు, ఇది దహనబలికి సంబంధించిన చట్టం. దహనబలి అర్పణ బలిపీఠం పైన నిప్పులపై రాత్రంతా, తెల్లవారే వరకూ ఉండాలి. బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి.
“Fa saa mmara a ɛfa ɔhyew afɔre ho yi ma Aaron ne ne mmabarima. ‘Wobegyaw ɔhyew afɔrebɔde no wɔ ogya no so anadwo mu no nyinaa, na ɛsɛ sɛ afɔremuka gya no kɔ so dɛw.
10 ౧౦ యాజకుడు నారతో చేసిన బట్టలు వేసుకోవాలి. అతని లోదుస్తులు కూడా నారతో చేసినవే అయి ఉండాలి. అతడు దహనబలి అర్పణ పూర్తిగా కాలిపోయిన తరువాత బూడిద తీసి బలిపీఠం పక్కనే ఉంచాలి.
Ade kye a, ɔsɔfo no bɛhyɛ nʼasɔfotade hyerɛnhyerɛn wɔ ase na wahyɛ atadetam koro no ara bi nguguso na wakɔpra ɔhyew afɔre nsõ no de agu afɔremuka no nkyɛn.
11 ౧౧ తరువాత అతడు తన బట్టలు మార్చుకుని శిబిరం బయట ఉన్న పవిత్ర స్థలానికి ఆ బూడిద తీసుకు వెళ్ళాలి.
Afei, ɔbɛsesa ne ntade no na wasoa nsõ no afi beae hɔ de akogu beae foforo a wɔatew hɔ no.
12 ౧౨ బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని పైన కట్టెలు వేస్తూ ఉండాలి. దాని పైన దహనబలి అర్పణని ఉంచాలి. శాంతిబలి పశువు కొవ్వును దాని పైన దహించాలి.
Saa bere yi nyinaa ɛsɛ sɛ ogya a ɛwɔ afɔremuka no so no dɛw. Ɛnsɛ sɛ edum. Anɔpa biara ɔsɔfo no de ogya foforo bɛhyɛ mu na ɔde da biara ɔhyew afɔre agu so, na wahyew srade a wɔde bɔ da biara asomdwoe afɔre no.
13 ౧౩ బలిపీఠం పైన అగ్ని ఎప్పటికీ మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు.
Ɛsɛ sɛ bere biara ogya no kɔ so dɛw wɔ afɔremuka no so; ɛnsɛ sɛ edum.
14 ౧౪ ఇక నైవేద్య అర్పణ గూర్చిన చట్టం ఇది. దీన్ని అహరోను కొడుకులు యెహోవా సమక్షంలో బలిపీఠం ఎదుట అర్పించాలి.
“‘Atoko afɔre ho mmara nso ni: Aaron mmabarima begyina afɔremuka no anim na wɔde atoko afɔrebɔ no ama Awurade.
15 ౧౫ యాజకుడు నైవేద్య అర్పణ నుండి గుప్పెడు పిండినీ, కొంత నూనెనూ, దాని పైనున్న సాంబ్రాణినూ తీసి వాటిని యెహోవా మంచితనాన్ని స్మరించుకోడానికి బలిపీఠం పైన దహించాలి. అది ఆయనకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది.
Ɔsɔfo no bɛsaw asikresiam a wɔayam no muhumuhu no ne nsa ma na ɔde ngo ne aduhuam afra ahyew no wɔ afɔremuka no so sɛ ehua a ɛsɔ Awurade ani.
16 ౧౬ అర్పించగా మిగిలిన దాన్ని అహరోనూ, అతని కుమారులూ భుజించాలి. పరిశుద్ధ స్థలం లో దాన్ని తినాలి. పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినాలి. ప్రత్యక్ష గుడారం ఆవరణలో దాన్ని తినాలి.
Ɔsaw ne nsa ma wie a, nea ɛbɛka no yɛ Aaron ne ne mmabarima de a wobedi. Wobedi wɔ Ahyiae Ntamadan no adiwo hɔ a wɔremfa mmɔkaw mfra.
17 ౧౭ దాని తయారీలో పొంగజేసే పదార్ధం కలపకూడదు. నాకు అర్పించే దహనబలుల్లో వాళ్ళ భాగంగా దాన్ని నేను ఇచ్చాను. పాపం కోసం చేసే బలి అర్పణగానూ, అపరాధం కోసం చేసే బలి అర్పణ గానూ ఇచ్చాను. అది అతి పరిశుద్ధం.
Si so dua sɛ, sɛ wɔto a, wɔmmfa mmɔkaw mmfra mu. Mede saa ɔhyew afɔre a wɔbɔ maa me no bi ama asɔfo no. Esiane sɛ ne nyinaa yɛ bɔne ne afɔdi ho afɔrebɔ, nti ɛyɛ kronkron.
18 ౧౮ మీ రాబోయే అన్ని తరాల్లోనూ అహరోను వారసుడైన ప్రతివాడూ యెహోవాకు దహనబలిగా అర్పించిన దానిలోనుండి దాన్ని తన భాగంగా భావించి తిన వచ్చు. వాటికి తగిలిన ప్రతిదీ పవిత్రం అవుతుంది.”
Aaron asefo mmarima ne asɔfo na wonni mfi awo ntoatoaso so nkosi awo ntoatoaso so. Nanso asɔfo no nko ara na wonni afɔrebɔde a wɔabɔ no ogya so ama Awurade no. Biribiara a ɛbɛka wɔn no bɛyɛ kronkron.’”
19 ౧౯ ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
Awurade ka kyerɛɛ Mose se,
20 ౨౦ “అహరోనుకూ, అతని కొడుకులకూ ఒక్కొక్కరికీ అభిషేకం జరిగిన రోజున వాళ్ళు చెల్లించాల్సిన అర్పణ ఇది. మామూలు నైవేద్య అర్పణలాగే వాళ్ళు సుమారు ఒక కిలో సన్నని గోదుమ పిండిని ఉదయం సగం, సాయంత్రం సగం అర్పించాలి.
“Da a wɔbɛsra Aaron ne ne mmabarima ngo no, ɛsɛ sɛ wɔde asikresiam lita abien ne fa brɛ Awurade. Wɔde fa bɛba anɔpa na wɔde fa aba anwummere.
21 ౨౧ దాన్ని నూనెతో పెనం పైన కాల్చాలి. అది చక్కగా కాలిన తరువాత తీసుకురావాలి. దాన్ని ముక్కలు చేసి యెహోవాకు కమ్మని సువాసనగా నైవేద్య అర్పణ చేయాలి.
Wɔde ngo bɛfra ato wɔ dade apampaa so. Ɛsɛ sɛ wɔto no yiye na wɔde ba sɛ ehua a ɛsɔ Awurade nʼani.
22 ౨౨ యాజకుని కొడుకుల్లో, అభిషేకం పొంది అతడి స్థానంలో కొత్తగా యాజకుడైన వ్యక్తి అలాగే అర్పించాలి. ఆజ్ఞ ప్రకారం దాన్ని యెహోవా కోసం పూర్తిగా దహించాలి.
Ɔsɔfo a ofi Aaron mmabarima mu a wɔrehyɛ no sɔfo ma wasi nʼagya anan no de bɛma Awurade sɛnea wɔahyɛ ho mmara afebɔɔ sɛ wɔnhyew ne nyinaa no.
23 ౨౩ యాజకుడు అర్పించే ప్రతి నైవేద్యాన్నూ పూర్తిగా దహించాలి. దాన్ని తినకూడదు.”
Ɛsɛ sɛ wɔhyew ɔsɔfo biara atoko afɔre a ɔbɛbɔ no nyinaa; ɛnsɛ sɛ wodi.”
24 ౨౪ ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
Afei Awurade ka kyerɛɛ Mose se,
25 ౨౫ “నువ్వు అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ మాట్లాడి ఇలా చెప్పు, పాపం కోసం చేసే అర్పణ చట్టం ఇది. దహనబలి అర్పణ పశువుని వధించిన చోటే పాపం కోసం చేసే బలి అర్పణ పశువునూ యెహోవా సమక్షంలో వధించాలి. అది అతి పరిశుద్ధం.
“Ka kyerɛ Aaron ne ne mmabarima sɛ bɔne afɔrebɔ ho mmara ni: ‘Saa afɔrebɔde yi ho yɛ kronkron yiye enti ɛsɛ sɛ wokum no Awurade anim wɔ beae a wokum ɔhyew afɔrebɔde no.
26 ౨౬ ప్రత్యక్ష గుడారం ఆవరణలోని పరిశుద్ధ స్థలం లో దాన్ని తినాలి.
Ɛsɛ sɛ ɔsɔfo a ɔyɛ afɔrebɔ no ho adwuma no we afɔrebɔde no wɔ Ahyiae Ntamadan no adiwo hɔ.
27 ౨౭ దాని మాంసానికి తగిలిన ప్రతిదీ పరిశుద్ధం అవుతుంది. దాని రక్తం బట్టల పైన చిందితే రక్తం చిమ్మిన ప్రాంతాన్ని పరిశుద్ధ స్థలం లో శుభ్రం చేయాలి.
Wɔn a wɔatew wɔn ho a wɔyɛ asɔfo nko ara na wɔwɔ ho kwan sɛ wɔde wɔn nsa ka nam no bi; na sɛ ɛba sɛ aboa no mogya bi pete wɔn ntade mu a, ɛsɛ sɛ wɔhoro ntade no wɔ beae a wɔatew ho hɔ.
28 ౨౮ దాన్ని మట్టి కుండలో ఉడకబెడితే, ఆ కుండని పగలగొట్టాలి. ఒకవేళ ఇత్తడి పాత్రలో ఉడకబెడితే దాన్ని తోమి నీళ్ళతో శుభ్రం చేయాలి.
Ɛsɛ sɛ wɔbɔ kuku a wɔnoaa nam no wɔ mu no; na sɛ ɛyɛ kɔbere nso a, ɛsɛ sɛ wotwiw mu, na wɔde nsu hohoro mu nyinaa yiye.
29 ౨౯ అది అతి పరిశుద్ధమైనది కాబట్టి యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడూ దాన్ని కొంచెం తినవచ్చు.
Ɔbarima biara a ɔfra asɔfo no mu no bedi afɔrebɔde no bi—wɔn nko ara—efisɛ ɛyɛ kronkron yiye.
30 ౩౦ కానీ పాపం కోసమైన బలి అర్పణ చేసిన పశువు రక్తం పరిహారం కోసం ప్రత్యక్ష గుడారం లోకి తీసుకు రావడం జరిగితే, ఆ పశువు మాంసం తినకూడదు. దాన్ని పూర్తిగా కాల్చి వేయాలి.”
Sɛ wɔde bɔne ho afɔrebɔde no mogya no bi kɔ Ahyiae Ntamadan mu hɔ de kɔyɛ mpata wɔ kronkronbea hɔ a, ɔsɔfo biara renwe bi. Ɛsɛ sɛ wɔde ogya hyew aboa no nyinaa wɔ Awurade anim.