< లేవీయకాండము 5 >

1 “ఒక వ్యక్తి తాను చూసిన దాన్ని గానీ, విన్న దాన్ని గానీ సాక్ష్యం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పకుండా పాపం చేస్తే దానికి ఆ వ్యక్తే బాధ్యత వహించాలి.
بشنود، و او شاهد باشد خواه دیده و خواه دانسته، اگر اطلاع ندهد گناه او را متحمل خواهدبود.۱
2 ఇంకా ఒక వ్యక్తి దేవుడు అపవిత్రమని నిర్దేశించిన ఏ అశుద్ధ జంతువు కళేబరాన్ని గానీ, పశువు కళేబరాన్ని గానీ, పాకే జంతు కళేబరాన్ని గానీ తెలియక తాకితే ఆ వ్యక్తి అపవిత్రుడూ, అపరాధీ అవుతాడు.
یا کسی‌که هر چیز نجس را لمس کند، خواه لاش وحش نجس، خواه لاش بهیمه نجس، خواه لاش حشرات نجس، و از او مخفی باشد، پس نجس و مجرم می‌باشد.۲
3 ఒక వ్యక్తిని అపవిత్రం చేసిన వాటిని అది ఏదైనా సరే, తాకిన వ్యక్తి ఆ అపవిత్రతను తాకానని తెలుసుకున్న తరువాత అపరాధి అవుతాడు.
یا اگر نجاست آدمی را لمس کند، از هر نجاست او که به آن نجس می‌شود، و از وی مخفی باشد، چون معلوم شد آنگاه مجرم خواهد بود.۳
4 అలాగే ఎవరైనా తెలియకుండా తొందరపడి మంచైనా, చెడైనా చేస్తానని ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా, తెలియకుండా తొందరపడి ఏదైనా చేస్తానని ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా ఆ తరువాత తెలుసుకుని చేయకుండా ఉంటే ఆ విషయంలో అతడు అపరాధి అవుతాడు.
و اگر کسی غفلت به لبهای خود قسم خورد برای کردن کار بد یا کارنیک، یعنی در هر چیزی که آدمی غفلت قسم خورد، و از او مخفی باشد، چون بر او معلوم شودآنگاه در هر کدام که باشد مجرم خواهد بود.۴
5 వీటిలో ఏ విషయంలోనైనా అతడు అపరాధి అయితే తాను ఎలాంటి పాపం చేశాడో దాన్ని ఒప్పుకోవాలి.
وچون در هر کدام از اینها مجرم شد، آنگاه به آن چیزی که در آن گناه کرده است اعتراف بنماید.۵
6 తాను చేసిన అపరాధం కోసం బలి అర్పణను యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. దానికోసం తన మందలోనుండి ఆడమేకనైనా, ఆడగొర్రెనైనా పాపం కోసం బలిగా అర్పించాలి. అతని పాపం కోసం యాజకుడు పరిహారం చేస్తాడు.
و قربانی جرم خود را برای گناهی که کرده است نزد خداوند بیاورد، یعنی ماده‌ای از گله بره‌ای یابزی بجهت قربانی گناه، و کاهن برای وی گناهش را کفاره خواهد کرد.۶
7 ఒకవేళ అతనికి గొర్రెని తెచ్చే స్తోమత లేకపోతే తన పాపం కోసం అపరాధ బలి అర్పణగా రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను గానీ తీసుకు రావచ్చు. వాటిలో ఒకటి పాపం కోసం చేసే అర్పణ, మరొకటి దహనబలి కోసం.
و اگر دست او به قیمت بره نرسد، پس قربانی جرم خود را برای گناهی که کرده است دو فاخته یا دو جوجه کبوتر نزدخداوند بیاورد، یکی برای قربانی گناه و دیگری برای قربانی سوختنی.۷
8 అతడు వాటిని యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు మొదట ఒకదాన్ని పాపం కోసం బలిగా అర్పిస్తాడు. అతడు దాని తలను తుంచి వేస్తాడు కానీ పూర్తిగా వేరు చేయడు.
و آنها را نزد کاهن بیاورد، و او آن را که برای قربانی گناه است اول بگذراند وسرش را از گردنش بکند و آن را دو پاره نکند،۸
9 అతడు కొంత రక్తాన్ని బలిపీఠం పక్కన చిలకరించాలి. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున కుమ్మరించాలి. ఇది పాపం కోసం చేసే బలి.
وقدری از خون قربانی گناه را بر پهلوی مذبح بپاشد، و باقی خون بر بنیان مذبح افشرده شود. این قربانی گناه است.۹
10 ౧౦ తరువాత ఆదేశాల్లో చెప్పినట్టు రెండో పక్షిని దహనబలిగా అర్పించాలి. అతడు చేసిన పాపం కోసం యాజకుడు పరిహారం చేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది.
و دیگری را برای قربانی سوختنی موافق قانون بگذراند، و کاهن برای وی گناهش را که کرده است کفاره خواهد کرد وآمرزیده خواهدشد.۱۰
11 ౧౧ ఒకవేళ అతనికి రెండు గువ్వలను, రెండు పావురం పిల్లలను కొని తెచ్చే స్తోమతు లేకపోతే, అతడు తన పాపం కోసం అర్పణగా ఒక కిలో సన్నని గోదుమ పిండిని తీసుకురావాలి. అది పాపం కోసం చేసే అర్పణ కాబట్టి దాని మీద నూనె పోయకూడదు, ఎలాంటి సాంబ్రాణి వేయకూడదు.
و اگر دستش به دو فاخته یا دو جوجه کبوتر نرسد، آنگاه قربانی خود رابرای گناهی که کرده است ده‌یک ایفه آرد نرم بجهت قربانی گناه بیاورد، و روغن برآن ننهد وکندر برآن نگذارد زیرا قربانی گناه است.۱۱
12 ౧౨ అతడు యాజకుని దగ్గరికి దాన్ని తీసుకురావాలి. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపకం చేసుకోడానికి దానిలో నుండి ఒక గుప్పెడు స్మృతి చిహ్నంగా తీసి యెహోవాకి దహనబలి అర్పించే చోట దహించాలి. అది పాపం కోసం చేసే బలి అర్పణ.
و آن را نزد کاهن بیاورد و کاهن یک مشت از آن را برای یادگاری گرفته، بر هدایای آتشین خداوند برمذبح بسوزاند. این قربانی گناه است.۱۲
13 ౧౩ పైన చెప్పిన వాటిలో అతడు చేసిన పాపాన్ని యాజకుడు కప్పివేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. నైవేద్యం అర్పణలో మిగిలినది యాజకునికి చెందినట్టుగా ఇక్కడ కూడా అర్పణ చేయగా మిగిలినది యాజకునికి చెందుతుంది.”
و کاهن برای وی گناهش را که در هرکدام از اینها کرده است کفاره خواهد کرد، و آمرزیده خواهد شد، ومثل هدیه آردی از آن کاهن خواهد بود.»۱۳
14 ౧౪ తరువాత యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు.
و خداوند موسی را خطاب کرده، گفت:۱۴
15 ౧౫ “ఒక వ్యక్తి యెహోవాకు అర్పితమైన వాటిని ముందు పొరపాటుగా ఆయనకు చెల్లించకుండా తెలియక ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే, అప్పుడు అతడు తన అపరాధ బలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకు రావాలి. అతడు తన అపరాధ బలిగా మందలో నుండి లోపం లేని పొట్టేలును తీసుకురావాలి. ఆ పొట్టేలు విలువను ప్రత్యక్ష గుడారంలో చెలామణీ అయ్యే వెండితో నిర్ణయించాలి.
«اگر کسی خیانت ورزد، و درباره چیزهای مقدس خداوند سهو گناه کند، آنگاه قربانی جرم خود را قوچی بی‌عیب از گله نزد خداوند موافق برآورد، وبه مثقالهای نقره مطابق مثقال قدس بیاورد، واین قربانی جرم است.۱۵
16 ౧౬ పరిశుద్ధమైన వస్తువు విషయంలో తాను చేసిన తప్పుకు నష్ట పరిహారం చెల్లించాలి. దానికి ఐదో వంతు చేర్చి దాన్ని యాజకుడికి ఇవ్వాలి. అప్పుడు యాజకుడు అపరాధ బలి అర్పణ అయిన పొట్టేలుతో అతని కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.
وبه عوض نقصانی که در چیز مقدس رسانیده است عوض بدهد، و پنج یک بر آن اضافه کرده، و آن را به کاهن بدهد و کاهن برای وی به قوچ قربانی جرم کفاره خواهد کرد، و آمرزیده خواهد شد.۱۶
17 ౧౭ ఎవరైనా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన దాన్ని చేసి పాపం చేస్తే, అది పొరపాటుగా చేసినా అపరాధి అవుతాడు. దానికి శిక్ష పొందుతాడు.
واگر کسی گناه کند و کاری از جمیع نواهی خداوند که نباید کرد بکند، و آن را نداند، پس مجرم است و متحمل گناه خود خواهد بود.۱۷
18 ౧౮ అతడు తన అపరాధ బలి అర్పణగా మందలో నుండి లోపం లేని పొట్టేలును తీసుకు రావాలి. దాని ప్రస్తుత వెల నిర్ణయం జరగాలి. దాన్ని అపరాధ బలి అర్పణగా యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు యాజకుడు పొరపాటుగా ఆ వ్యక్తి చేసిన పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది.
وقوچی بی‌عیب از گله موافق برآورد و نزد کاهن بیاورد، و کاهن برای وی غفلت او را که کرده است کفاره خواهد کرد، و آمرزیده خواهد شد.۱۸
19 ౧౯ అది అపరాధబలి. అతడు నిజంగానే యెహోవా ఎదుట దోషి అయ్యాడు.”
این قربانی جرم است البته نزد خداوند مجرم می‌باشد.»۱۹

< లేవీయకాండము 5 >