< లేవీయకాండము 4 >
1 ౧ యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు.
Yahweh spoke to Moses, saying,
2 ౨ “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాల్లో దేనినైనా పొరపాటున ఎవరైనా చేస్తే, మీరిలా చేయండి.
“Speak to the children of Israel, saying, ‘If anyone sins unintentionally, in any of the things which Yahweh has commanded not to be done, and does any one of them,
3 ౩ నేరం ప్రజల పైకి వచ్చేలా ఒకవేళ అభిషేకం పొందిన యాజకుడే అలాంటి పాపం చేస్తే, అతడు తన పాపం కోసం బలిగా లోపం లేని కోడెదూడని యెహోవాకు అర్పించాలి.
if the anointed priest sins so as to bring guilt on the people, then let him offer for his sin which he has sinned a young bull without defect to Yahweh for a sin offering.
4 ౪ అతడు ఆ కోడెని ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. ఆ కోడె తలపైన తన చెయ్యి ఉంచి, తరువాత యెహోవా ఎదుట దాన్ని వధించాలి.
He shall bring the bull to the door of the Tent of Meeting before Yahweh; and he shall lay his hand on the head of the bull, and kill the bull before Yahweh.
5 ౫ అభిషేకం పొందిన యాజకుడు ఆ కోడె రక్తం కొంచెం ప్రత్యక్ష గుడారానికి తీసుకు రావాలి.
The anointed priest shall take some of the blood of the bull, and bring it to the Tent of Meeting.
6 ౬ తరువాత ఆ యాజకుడు తన వేలు ఆ రక్తంలో ముంచి అతి పరిశుద్ధ స్థలం తెరల ఎదుట యెహోవా సమక్షంలో ఏడుసార్లు ఆ రక్తాన్ని చిలకరించాలి.
The priest shall dip his finger in the blood, and sprinkle some of the blood seven times before Yahweh, before the veil of the sanctuary.
7 ౭ తరువాత యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సమక్షంలో ఉన్న సుగంధ ధూపవేదిక పైని కొమ్ములకు ఆ రక్తాన్ని కొంచెం పూయాలి. మిగిలిన ఆ కోడె రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.
The priest shall put some of the blood on the horns of the altar of sweet incense before Yahweh, which is in the Tent of Meeting; and he shall pour out the rest of the blood of the bull at the base of the altar of burnt offering, which is at the door of the Tent of Meeting.
8 ౮ తరువాత అతడు పాపం కోసం బలి అర్పణ చేసిన ఆ కోడెదూడ కొవ్వు అంతా కోసి వేరు చేయాలి. దాని అంతర్భాగాలను కప్పి ఉన్న కొవ్వునూ, దాని అంతర్భాగాలను అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి.
He shall take all the fat of the bull of the sin offering from it: the fat that covers the innards, and all the fat that is on the innards,
9 ౯ అలాగే దాని రెండు మూత్ర పిండాలనూ, వాటిపై పేరుకుని ఉన్న కొవ్వునూ, దాని మూత్రపిండాలకు దగ్గర కాలేయం పైన ఉన్న కొవ్వునూ కోసి వేరు చేయాలి.
and the two kidneys, and the fat that is on them, which is by the loins, and the cover on the liver, with the kidneys, he shall remove,
10 ౧౦ శాంతిబలి కోసం వధించే ఎద్దు నుండి తీసినట్టే యాజకుడు దీని నుండి కూడా తీయాలి. తరువాత యాజకుడు వీటిని దహన బలిపీఠం పైన దహించాలి.
as it is removed from the bull of the sacrifice of peace offerings. The priest shall burn them on the altar of burnt offering.
11 ౧౧ అతడు ఆ కోడె దూడలో ఇంకా మిగిలి ఉన్న భాగాలైన దాని చర్మం, మాంసం, తల, కాళ్ళు, దాని అంతర్భాగాలూ, పేడ, మిగిలిన భాగాలన్నిటినీ శిబిరం బయటకు తీసుకుపోవాలి.
He shall carry the bull’s skin, all its meat, with its head, and with its legs, its innards, and its dung
12 ౧౨ బూడిదను పారేసే శుద్ధమైన చోటికి తీసుకుపోయి అక్కడ బూడిద పారబోసే చోట కట్టెల పైన వాటిని దహించాలి.
—all the rest of the bull—outside of the camp to a clean place where the ashes are poured out, and burn it on wood with fire. It shall be burned where the ashes are poured out.
13 ౧౩ ఇశ్రాయేలు సమాజమంతా పొరపాటుగా తెలియకుండా పాపం చేస్తే, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని అవగాహన లేకుండా చేసి దోషులైతే
“‘If the whole congregation of Israel sins, and the thing is hidden from the eyes of the assembly, and they have done any of the things which Yahweh has commanded not to be done, and are guilty;
14 ౧౪ తరువాత వారు చేసిన పాపం వారికి తెలిసినప్పుడు, సమాజం ఒక కోడెదూడని పాపం కోసం బలిగా అర్పించాలి. దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి తీసుకురావాలి.
when the sin in which they have sinned is known, then the assembly shall offer a young bull for a sin offering, and bring it before the Tent of Meeting.
15 ౧౫ సమాజానికి పెద్దలుగా ఉన్నవాళ్ళు యెహోవా సమక్షంలో దాని తలపై తమ చేతులుంచాలి. ఆ తరువాత యెహోవా సన్నిధిలో దాన్ని వధించాలి.
The elders of the congregation shall lay their hands on the head of the bull before Yahweh; and the bull shall be killed before Yahweh.
16 ౧౬ అప్పుడు అభిషేకం పొందిన యాజకుడు ఆ కోడె రక్తంలో కొంత ప్రత్యక్ష గుడారానికి తీసుకుని రావాలి.
The anointed priest shall bring some of the blood of the bull to the Tent of Meeting.
17 ౧౭ తరువాత యాజకుడు ఆ రక్తంలో తన వేలును ముంచి తెరల ఎదుట యెహోవా సమక్షంలో ఏడు సార్లు చిలకరించాలి.
The priest shall dip his finger in the blood and sprinkle it seven times before Yahweh, before the veil.
18 ౧౮ తరువాత యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సమక్షంలో ఉన్న సుగంధ ధూపవేదిక పైని కొమ్ములకు ఆ రక్తాన్ని కొంచెం పూయాలి. మిగిలిన ఆ కోడె రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న దహన బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాలి.
He shall put some of the blood on the horns of the altar which is before Yahweh, that is in the Tent of Meeting; and the rest of the blood he shall pour out at the base of the altar of burnt offering, which is at the door of the Tent of Meeting.
19 ౧౯ తరువాత దాని కొవ్వు అంతటినీ తీసి దహన బలిపీఠం పైన దహించాలి.
All its fat he shall take from it, and burn it on the altar.
20 ౨౦ ఈ విధంగా అతడు ఆ కోడెకి చేయాలి. పాపం కోసం బలి ఇచ్చే పశువుకు చేసినట్టుగానే దీనికీ చేయాలి. ఇలా యాజకుడు ప్రజల కోసం పరిహారం చేసినప్పుడు వారికి క్షమాపణ కలుగుతుంది.
He shall do this with the bull; as he did with the bull of the sin offering, so he shall do with this; and the priest shall make atonement for them, and they shall be forgiven.
21 ౨౧ ఆ కోడెను శిబిరం బయటకు తీసుకుని వెళ్ళి మొదటి కోడెను దహించినట్టుగానే దీన్నీ దహించాలి. ఇది సమాజ పాపం కోసం చేసే బలి అర్పణ.
He shall carry the bull outside the camp, and burn it as he burned the first bull. It is the sin offering for the assembly.
22 ౨౨ ఒక అధికారి పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు.
“‘When a ruler sins, and unwittingly does any one of all the things which Yahweh his God has commanded not to be done, and is guilty,
23 ౨౩ తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక మగ మేకని తన అర్పణగా తీసుకురావాలి. అది లోపం లేనిదిగా ఉండాలి.
if his sin in which he has sinned is made known to him, he shall bring as his offering a goat, a male without defect.
24 ౨౪ అతడు ఆ మేక తలపై చెయ్యి ఉంచి దాన్ని యెహోవా సమక్షంలో దహనబలి అర్పించే చోట వధించాలి. ఇది పాపం కోసం చేసే బలి.
He shall lay his hand on the head of the goat, and kill it in the place where they kill the burnt offering before Yahweh. It is a sin offering.
25 ౨౫ పాపం కోసం వధించిన దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.
The priest shall take some of the blood of the sin offering with his finger, and put it on the horns of the altar of burnt offering. He shall pour out the rest of its blood at the base of the altar of burnt offering.
26 ౨౬ దాని కొవ్వునంతా వేదిక పైన దహించాలి. శాంతిబలికి అర్పించిన పశువు కొవ్వును చేసినట్టుగానే చేయాలి. ఇలా యాజకుడు ఆ అధికారి పాపం విషయంలో పరిహారం చేయాలి. అప్పుడు ఆ అధికారికి క్షమాపణ కలుగుతుంది.
All its fat he shall burn on the altar, like the fat of the sacrifice of peace offerings; and the priest shall make atonement for him concerning his sin, and he will be forgiven.
27 ౨౭ సామాన్య ప్రజల్లో ఎవరైనా ఒకరు పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు.
“‘If anyone of the common people sins unwittingly, in doing any of the things which Yahweh has commanded not to be done, and is guilty,
28 ౨౮ తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక ఆడ మేకను బలి అర్పణగా తీసుకుని రావాలి. ఆ మేక లోపం లేనిదై ఉండాలి.
if his sin which he has sinned is made known to him, then he shall bring for his offering a goat, a female without defect, for his sin which he has sinned.
29 ౨౯ పాపం కోసం బలి కాబోయే పశువు తలపైన అతడు తన చేతులుంచాలి. తరువాత దాన్ని దహనబలి అర్పించే చోట వధించాలి.
He shall lay his hand on the head of the sin offering, and kill the sin offering in the place of burnt offering.
30 ౩౦ దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.
The priest shall take some of its blood with his finger, and put it on the horns of the altar of burnt offering; and the rest of its blood he shall pour out at the base of the altar.
31 ౩౧ తరువాత శాంతిబలి పశువు కొవ్వును వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు ఆ కొవ్వును యెహోవాకు కమ్మని సువాసనగా బలిపీఠం పైన దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.
All its fat he shall take away, like the fat is taken away from the sacrifice of peace offerings; and the priest shall burn it on the altar for a pleasant aroma to Yahweh; and the priest shall make atonement for him, and he will be forgiven.
32 ౩౨ ఎవరైనా ఒక వ్యక్తి పాపం కోసం బలి అర్పణగా లోపం లేని ఒక ఆడగొర్రెను తీసుకు రావాలి.
“‘If he brings a lamb as his offering for a sin offering, he shall bring a female without defect.
33 ౩౩ అతడు పాపం కోసం బలి అర్పణ కాబోయే దాని తలపై తన చెయ్యి ఉంచాలి. తరువాత దాన్ని దహనబలి అర్పించే చోట వధించాలి.
He shall lay his hand on the head of the sin offering, and kill it for a sin offering in the place where they kill the burnt offering.
34 ౩౪ అప్పుడు దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.
The priest shall take some of the blood of the sin offering with his finger, and put it on the horns of the altar of burnt offering; and all the rest of its blood he shall pour out at the base of the altar.
35 ౩౫ తరువాత శాంతిబలి పశువు క్రొవ్వుని వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు యెహోవాకు దహనబలి అర్పించే చోట బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.”
He shall remove all its fat, like the fat of the lamb is removed from the sacrifice of peace offerings. The priest shall burn them on the altar, on the offerings of Yahweh made by fire. The priest shall make atonement for him concerning his sin that he has sinned, and he will be forgiven.