< లేవీయకాండము 3 >
1 ౧ “ఎవరైనా ఒక మంద లోని పశువుల్లో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా అర్పించాలనుకుంటే, అతడు లోపం లేని దాన్ని యెహోవా సన్నిధిలో అర్పించాలి.
А якщо його жертва — ми́рна, якщо з великої худоби він приносить чи самця́, чи сами́цю, — він принесе її безва́дну перед Господнє лице,
2 ౨ అతడు తాను అర్పించబోయే పశువు తలపై తన చేతిని ఉంచాలి. తరువాత ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర దాన్ని వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.
і покладе свою руку на голову жертви своєї, та й заріже її при вході до скинії заповіту. А Ааронові сини, священики, покроплять тією кров'ю на жертівника навколо.
3 ౩ అతడు ఆ పశువు లోపలి భాగాలకు అంటి ఉన్న కొవ్వునూ, మూత్రపిండాలనూ, వాటిపైన కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి.
І принесе він із мирної жертви огняну́ жертву для Господа, — лій, що закриває ну́трощі, та ввесь лій, що на ну́трощах,
4 ౪ వాటిని యెహోవాకు శాంతి బలి అర్పణగా దహించాలి.
і оби́дві ни́рки, і лій, що на них, що на сте́гнах, а сальника́ на печінці — зді́йме його з ни́рками.
5 ౫ అహరోను కొడుకులు వాటిని బలిపీఠం మీద నిప్పులపై పేర్చిన కట్టెల పైన ఉన్న దహనబలి తో పాటు దహిస్తారు. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. అది అగ్నితో చేసిన అర్పణగా ఉంటుంది.
І спалять те сини Ааронові на жертівнику на цілопа́лення, що на дро́вах, яке на огні, — це огняна́ жертва, пахощі любі для Господа.
6 ౬ ఎవరైనా ఒక గొర్రెల లేక మేకల మందలో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా యెహోవాకు అర్పించదలిస్తే, అతడు లోపం లేని దాన్ని అర్పించాలి.
А якщо з дрібної худоби його жертва на мирну жертву для Господа, саме́ць чи сами́ця, то безва́дну принесе її́.
7 ౭ తన అర్పణ కోసం గొర్రె పిల్లని అర్పించాలనుకుంటే దాన్ని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలి.
Якщо приносить він на жертву вівцю́, то принесе її перед Господнє лице,
8 ౮ తాను అర్పించబోయే దాని తల మీద అతడు తన చేతినుంచాలి. తరువాత దాన్ని ప్రత్యక్ష గుడారం ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.
і покладе свою руку на голову жертви своєї, та й заріже її перед скинією заповіту. А Ааронові сини покро́плять кров'ю її на жертівника навколо.
9 ౯ ఆ వ్యక్తి శాంతిబలి అర్పణను దహనబలి అర్పణగా యెహోవాకు అర్పిస్తాడు. ఆ బలి పశువు కొవ్వునూ, వెన్నెముక చివర వరకూ ఉండే కొవ్వు పట్టిన తోకనంతా, దాని అంతర్భాగాలకి పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి.
І він принесе з мирної жертви огняну́ жертву для Господа, — ці́лого курдюка́, якого здійме при хребті, і лій, що закриває ну́трощі, і ввесь лій, що на ну́трощах,
10 ౧౦ అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ కూడా వేరు చేయాలి.
і обидві нирки та лій, що на них, що на сте́гнах, а сальника на печінці — зді́йме його з нирками.
11 ౧౧ వీటన్నిటినీ యాజకుడు బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. ఇది యెహోవాకి అర్పించే దహనబలి.
І священик спалить те на жертівнику, — хліб огняно́ї жертви для Господа.
12 ౧౨ అతడు అర్పించేది మేక అయితే దాన్ని యెహోవా ఎదుట అర్పించాలి.
А якщо жертва його коза, то піднесе її перед лице Господнє,
13 ౧౩ ఆ వ్యక్తి దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దాన్ని వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.
і покладе свою руку на голову її, та й заріже її перед скинією заповіту. А Ааронові сини́ покро́плять кров'ю її на жертівника навколо.
14 ౧౪ తన అర్పణను దహనబలిగా యెహోవాకు అర్పిస్తాడు. అతడు దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి.
І він принесе з неї жертву свою, жертву для Господа, — лій, що закриває ну́трощі, та ввесь лій, що на ну́трощах,
15 ౧౫ అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వును, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వును కూడా వేరు చేయాలి.
і оби́дві нирки, і лій, що на них, що на стегнах, а сальника на печінці — здійме його з нирками.
16 ౧౬ వీటన్నిటినీ యాజకుడు కమ్మని సువాసన వచ్చేలా బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. కొవ్వు అంతా యెహోవాకే చెందుతుంది.
І священик спалить їх на жертівнику, — це пожива, огняна́ жертва на любі пахощі; увесь лій — для Господа.
17 ౧౭ మీరు రక్తాన్ని గానీ కొవ్వుని గానీ తినకూడదు. మీరు నివాసముండే ప్రతిచోటా, మీ తరతరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం.”
Оце постанова вічна для ваших родів у всіх оса́дах ваших: жодного лою й жодної крови не будете їсти“.