< లేవీయకాండము 27 >
1 ౧ యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
Awurade ka kyerɛɛ Mose se,
2 ౨ “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఎవరన్నా విశేషమైన మ్రొక్కుబడి చేస్తే నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లించాలి.
“Ka kyerɛ Israelfo no se, ‘Sɛ onipa bi hyɛ bɔ sɛ ɔde obi bɛma Awurade a, na sɛ ɔpɛ sɛ otua sika mmom a,
3 ౩ నీవు నిర్ణయించవలసిన వెల ఇది. ఇరవై ఏళ్ళు మొదలు అరవై ఏళ్ల వయస్సు వరకూ పురుషుడికి పరిశుద్ధ స్థలం తులం లెక్క ప్రకారం ఏభై తులాల వెండి నిర్ణయించాలి.
obetua dwetɛ gram ahannum ne aduoson ama ɔbarima a wadi mfe aduonu kosi mfe aduosia,
4 ౪ స్త్రీకి ముప్ఫై తులాలు నిర్ణయించాలి.
sɛ ɔyɛ ɔbea a wadi mfe aduonu kosi aduosia a, wobetua dwetɛ gram ahaasa ne aduanan,
5 ౫ ఐదేళ్ళు మొదలు ఇరవై ఏళ్ల లోపలి వయస్సు గల పురుషుడికి ఇరవై తులాల వెలను, స్త్రీకి పది తులాల వెలను నిర్ణయించాలి.
abarimaa a wadi mfe anum kosi aduonu no nso wobetua dwetɛ gram ahannu ne aduasa. Sɛ ɔyɛ ɔbea a, wobetua dwetɛ gram ɔha ne dunum.
6 ౬ ఒక నెల మొదలు ఐదేళ్ళ లోపు వయస్సుగల పురుషుడికి ఐదు తులాల వెండి వెలను స్త్రీకి మూడు తులాల వెండి వెలను నిర్ణయించాలి.
Abarimaa a wadi ɔsram kosi mfe anum no wobetua dwetɛ gram 60; na ɔbabea nso wɔatua dwetɛ gram 35.
7 ౭ అరవై ఏళ్ల వయసు దాటిన పురుషుడికి పదిహేను తులాల వెలను స్త్రీకి పది తులాల వెలను నిర్ణయించాలి.
Ɔbarima a wadi boro mfe aduosia no wobetua dwetɛ gram ɔha aduoson; na ɔbea nso wɔatua dwetɛ gram ɔha ne dunum.
8 ౮ ఎవరైనా నీవు నిర్ణయించిన వెల చెల్లించలేనంత పేద వాడైతే అతడు యాజకుని ఎదుటికి రావాలి. అప్పుడు యాజకుడు అతని వెల నిర్ణయిస్తాడు. మొక్కుకున్న వాడి తాహతు చొప్పున వాడికి వెలను నిర్ణయించాలి.
Na sɛ obi yɛ ohiani a ɔrentumi ntua saa sika yi a, ɔde saa onipa no bɛba ɔsɔfo anim, na ɔsɔfo no akyerɛ no sika a obetumi atua.
9 ౯ యెహోవాకు అర్పణంగా అర్పించే పశువుల్లో ప్రతిదాన్నీ యెహోవాకు ప్రతిష్ఠితంగా ఎంచాలి.
“‘Sɛ ɔde aboa hyɛ bɔ sɛ afɔrebɔde a ɛfata ma Awurade a, saa aboa no a ɔde ama Awurade no bɛyɛ kronkron.
10 ౧౦ దాన్ని మార్చకూడదు. చెడ్డదానికి బదులు మంచిదాన్ని గానీ మంచిదానికి బదులు చెడ్డదాన్ని గానీ ఒక దానికి బదులు మరొక దాన్నిగానీ ఇయ్యకూడదు. మొక్కుకున్న జంతువుకు బదులు వేరొక జంతువును మారిస్తే అదీ దానికి బదులుగా ఇచ్చినదీ కూడా ప్రతిష్ఠితం అయిపోతుంది.
Ɛnsɛ sɛ ɔsesa saa aboa no. Ɛnsɛ sɛ ɔde nea eye sesa nea enye anaa sɛ ɔde nea enye sesa nea eye. Sɛ ɛba sɛ wɔyɛ saa nsesae yi a, wɔbɛfa no sɛ mmoa abien no nyinaa ho tew.
11 ౧౧ ప్రజలు యెహోవాకు అర్పించకూడని అపవిత్ర జంతువుల్లో ఒకదాన్ని తెస్తే ఆ జంతువును యాజకుని ఎదుట నిలబెట్టాలి.
Sɛ aboa a ɔde rema Awurade no ho ntew na ɛmfata sɛ wɔde yɛ afɔrebɔde ma Awurade a, ɛsɛ sɛ ne wura no de brɛ ɔsɔfo,
12 ౧౨ అది మంచిదైనా చెడ్డదైనా యాజకుడు దాని వెలను నిర్ణయించాలి. యాజకుడివైన నీవు నిర్ణయించిన వెల ఖాయం.
na wahwɛ sɛ aboa no di mu anaa sɛ onni mu, na wakyerɛ sika dodow a ɛsɛ sɛ otua de si aboa no anan.
13 ౧౩ అయితే ఎవరైనా అలాటి జంతువును విడిపించుకోవాలనుకుంటే నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతు దానితో కలపాలి.
Sɛ aboa no yɛ nea ɛsɛ sɛ wɔde no bɔ afɔre nanso onipa a ɔde no reba no pɛ sɛ ɔsan gye nʼade a, obetua sika ɔha mu nkyɛmu aduonu aka bo a ɔsɔfo no betwa ama no sɛ ontua no ho.
14 ౧౪ ఎవరైనా తన ఇల్లు యెహోవాకు సమర్పించడానికి దాన్ని ప్రతిష్ఠించినట్టయితే అది మంచిదైనా చెడ్డదైనా యాజకుడు దాని వెల నిర్ణయించాలి. యాజకుడు నిర్ణయించిన వెల ఖాయం అవుతుంది.
“‘Sɛ obi de ne fi ma Awurade na sɛ ɔpɛ sɛ ɔsan gye a, ɔsɔfo no bɛsese ahu sɛ eye anaasɛ enye. Bo biara a ɔsɔfo no bɛkyerɛ no na ɛsɛ sɛ wotua.
15 ౧౫ తన ఇల్లు దేవునికి అర్పించిన వాడు దాన్ని విడిపించుకోవాలనుకుంటే అతడు నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతు దానితో కలపాలి. అప్పుడు ఆ ఇల్లు అతనిదవుతుంది.
Sɛ nea ɔde ofi no mae no pɛ sɛ ɔsan gye a ɛsɛ sɛ otua ne bo no nkyɛmu ɔha mu aduonu ka ho na ama ofi no asan abɛyɛ ne de.
16 ౧౬ ఒకడు తన పిత్రార్జితమైన పొలంలో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే దానిలో చల్లే విత్తనాల కొలత చొప్పున దాని వెల నిర్ణయించాలి. పది తూముల బార్లీ విత్తనాలకు ఏభై తులాల వెండి నిర్ణయించాలి.
“‘Sɛ ɔbarima bi pɛ sɛ ɔde nʼabusua asase fa bi bɔ afɔre ma Awurade a, wobegyina aba kɛntɛnma dodow a ebehia sɛ wobedua wɔ so no so atwa asase no bo; aba kɛntɛnma biara bo yɛ dwetɛ gram ahannum ne aduoson.
17 ౧౭ అతడు సునాద సంవత్సరం మొదలు తన పొలాన్ని ప్రతిష్ఠించినట్టయితే నీవు నిర్ణయించే వెల ఖాయం.
Mfirihyia Aduonum Afahyɛ mu no, sɛ obi de nʼafuw kyɛ a, ne bo no rensesa.
18 ౧౮ సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలాన్ని ప్రతిష్ఠించినట్టయితే యాజకుడు మిగిలిన సంవత్సరాల లెక్క చొప్పున, అంటే మరుసటి సునాద సంవత్సరం వరకూ ఉన్న సంవత్సరాలను బట్టి వెలను నిర్ణయించాలి. నీవు నిర్ణయించిన వెలలో దాని అంచనాను తగ్గించాలి.
Na sɛ ɔde asase no ma wɔ Mfirihyia Aduonum Afahyɛ no akyi a, ɔsɔfo no begyina mfe a aka ansa na Mfirihyia Aduonum Afahyɛ a edi so no so asese ne bo no, na wobetumi atew so.
19 ౧౯ పొలాన్ని ప్రతిష్ఠించినవాడు దాన్ని విడిపించుకోవాలనుకుంటే నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతును అతడు దానితో కలపాలి. అప్పుడు అది అతనిదవుతుంది.
Na sɛ ɔbarima no pɛ sɛ ogye nʼasase a, ɔsɔfo no bo a ɔbɛbɔ no, obetua ɔha mu nkyɛmu aduonu aka ho ansa na asase no abɛyɛ ne dea bio.
20 ౨౦ అతడు ఆ పొలాన్ని విడిపించకపోతే లేదా దాన్ని వేరొకడికి అమ్మితే ఇక ఎన్నటికీ దాన్ని విడిపించడం వీలు కాదు.
Na sɛ nso ɔyɛ nʼadwene sɛ ɔmpɛ sɛ ogye asase no bio, anaasɛ sɛ watɔn asase no ama obi foforo a, ɛno de, wɔrentumi nnye bio.
21 ౨౧ ఆ పొలం సునాద సంవత్సరంలో విడుదల అయితే అది ప్రతిష్ఠించిన పొలం లాగానే యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది. ఆ ఆస్తి యాజకునిది అవుతుంది.
Sɛ wɔdan asase no ma wɔ Mfirihyia Aduonum Afahyɛ no mu a, ɛbɛyɛ asase kronkron. Wɔde bɛto hɔ ama Awurade. Ɛbɛyɛ asɔfo no agyapade.
22 ౨౨ ఒకడు తాను కొన్న పొలాన్ని, అంటే తన ఆస్తిలో చేరని దాన్ని యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే
“‘Sɛ obi de asase a watɔ ma Awurade, na sɛ asase no nyɛ nʼabusua asase a,
23 ౨౩ యాజకుడు సునాద సంవత్సరం వరకూ నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమించాలి. ఆ రోజునే నీవు నిర్ణయించిన వెల చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితంగా దాని చెల్లించాలి.
ɔsɔfo no begyina mfe a aka ama wɔadi Mfirihyia Aduonum Afahyɛ no so asese ne bo. Ɛsɛ sɛ onipa ko no tua ka no da no ara, na ɛyɛ afɔrebɔde kronkron ma Awurade.
24 ౨౪ సునాద సంవత్సరంలో ఆ భూమి ఎవరి పిత్రార్జితమో వాడికి, అంటే ఆ పొలాన్ని అమ్మిన వాడికి అది తిరిగి రావాలి.
Mfirihyia Aduonum Afahyɛ no du so a, asase no bɛsan akɔ nea ɔtɔnee no anaasɛ nea na ɔyɛ asase no wura no nkyɛn.
25 ౨౫ నీ వెలలన్నీ పరిశుద్ధ స్థలం వెల చొప్పున నిర్ణయించాలి. ఒక తులం ఇరవై చిన్నాలు.
Wɔbɛsese ho ka no nyinaa wɔ nnwetɛbona a wogye wɔ hyiadan mu no ho, a ɛyɛ gram dubaako.
26 ౨౬ జంతువుల్లో తొలిపిల్ల యెహోవాది గనక ఎవరూ దాన్ని ప్రతిష్ఠించకూడదు. అది ఎద్దు అయినా గొర్రెమేకల మందలోనిదైనా యెహోవాదే.
“‘Ɛnsɛ sɛ obiara de aboa bi abakan ma Awurade, efisɛ abakan biara, sɛ ɔyɛ nantwi anaa oguan no, yɛ Awurade de dedaw.
27 ౨౭ అది అపవిత్ర జంతువైతే వాడు నీవు నిర్ణయించే వెలలో ఐదో వంతు దానితో కలిపి దాని విడిపించవచ్చు. దాని విడిపించకపోతే నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మాలి.
Sɛ ɔyɛ mmoa a wɔn ho ntew no bi a, onipa no betumi atua ne bo no, na ɔde ɛbo no ɔha mu nkyɛmu aduonu aka ho. Sɛ onipa no antɔ bio de a, wɔbɛtɔn aboa no sɛnea ne bo te.
28 ౨౮ అయితే మనుషుల్లోగాని జంతువుల్లోగాని సొంత పొలంలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్టించినట్టయితే ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపించ కూడదు. ప్రతిష్ఠించిన ప్రతిదీ యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉంటుంది.
“‘Ade biara a wɔde ama Awurade no, sɛ ɛyɛ nnipa, mmoa anaa abusuasase no, ɛnsɛ sɛ wɔtɔn anaa wɔsan gye, efisɛ biribiara a ɛte saa no yɛ kronkron ma Awurade.
29 ౨౯ మనుషులు ప్రతిష్ఠించే వాటిలో దేనినైనా విడిపించకుండా చంపి వేయాలి.
“‘Onipa biara a Awurade ayi no ama ɔsɛe no, wɔmmfa biribi ntua ne ti ka. Ɛsɛ sɛ wokum no.
30 ౩౦ ధాన్యంలో, చెట్ల కాయల్లో, భూమి ఫలమంతటిలో పదవ వంతు యెహోవా స్వంతం. అది యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది.
“‘Asase no so nnɔbae nkyɛmu du mu baako, sɛ ɛyɛ aburow anaa aduaba no yɛ Awurade dea. Ɛyɛ kronkron.
31 ౩౧ ఒకడు తాను చెల్లించవలసిన దశమభాగాల్లో దేనినైనా విడిపించుకోవాలి అనుకుంటే దానిలో ఐదో వంతును దానితో కలపాలి.
Sɛ obi pɛ sɛ ɔsan tɔ saa aduaba anaa aburow no a, ɛsɛ sɛ ɔde ne bo nkyɛmu anum mu baako ka ho.
32 ౩౨ ఆవుల్లోగాని, గొర్రె మేకల్లోగాని, కాపరి కర్రతో తోలే వాటన్నిటిలో దశమభాగం ప్రతిష్ఠితం అవుతుంది.
Anantwi ne nguan no ntotoso du du nyinaa, aboa biara a ɔto so du a ɔfa oguanhwɛfo nsam no yɛ kronkron ma Awurade.
33 ౩౩ అది మంచిదో చెడ్డదో పరీక్ష చెయ్యకూడదు, దాన్ని మార్చకూడదు. దాని మారిస్తే అదీ దానికి బదులుగా ఇచ్చినది కూడా ప్రతిష్ఠితాలు అవుతాయి. అలాటి దాన్ని విడిపించ కూడదు అని చెప్పు.”
Aboa a ɔto so du a wɔde bɛma Awurade no, wɔnnhwɛ sɛ oye anaa onye, na wɔmmfa biribiara nsi nʼanan mu, efisɛ sɛ wɔde biribiara si anan mu a, ne nyinaa bɛyɛ kronkron, a obiara rentumi nnye bio.’”
34 ౩౪ ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కోసం మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.
Eyinom ne ahyɛde a Awurade de maa Mose wɔ Sinai Bepɔw so sɛ ɔnka nkyerɛ Israelfo no.