< లేవీయకాండము 24 >
1 ౧ యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
És szólt az Örökkévaló Mózeshez, mondván:
2 ౨ “దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా ప్రమిదల కోసం దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.
Parancsold meg Izrael fiainak, hogy hozzanak neked tiszta, törött faolajat a világításra, hogy felgyújtsatok örökmécset.
3 ౩ ప్రత్యక్ష గుడారంలో శాసనాల అడ్డతెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం దాకా అది వెలుగుతూ ఉండేలా యెహోవా సన్నిధిలో దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం.
A bizonyságon levő kárpiton kívül, a gyülekezés sátorában rendezze el azt Áron estétől reggelig az Örökkévaló színe előtt, állandóan; örök törvény ez nemzedékeiteken át.
4 ౪ అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రమిదలను యెహోవా సన్నిధిలో నిత్యం చూసుకోవాలి.
A tiszta lámpán rendezze el a mécseket, az Örökkévaló színe előtt állandóan.
5 ౫ నీవు గోదుమ పిండి తీసుకుని దానితో పన్నెండు రొట్టెలు చెయ్యాలి. ఒక్కొక్క రొట్టెకు రెండు కిలోల పిండి వాడాలి.
És végy lánglisztet, süss abból tizenkét kalácsot; két tized legyen egy kalács.
6 ౬ యెహోవా సన్నిధిలో నిర్మలమైన బల్లమీద ఆరేసి రొట్టెలున్న రెండు దొంతులుగా వాటిని ఉంచాలి.
És rakd azokat két rendbe, hatot egy rendbe, a tiszta asztalra, az Örökkévaló színe előtt.
7 ౭ ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది యెహోవా కోసం పరిమళ హోమం.
Azután tégy a rendre tiszta tömjént és az legyen a kenyérnek illatrészül, tűzáldozat az Örökkévalónak.
8 ౮ యాజకుడు ప్రతి విశ్రాంతి దినాన నిత్య నిబంధన ప్రకారం ఇశ్రాయేలీయుల పక్షంగా ఆ రొట్టెలు బల్లపై పెడుతూ ఉండాలి.
Minden szombat napján rendezze azt az Örökkévaló színe előtt, állandóan, Izrael fiai részéről örök szövetség ez.
9 ౯ ఈ అర్పణ అహరోనుకు అతని సంతానానికి. వారు పరిశుద్ధస్థలం లో దాన్ని తినాలి. నిత్య శాసనం చొప్పున యెహోవాకు చేసే హోమాల్లో అది అతి పవిత్రం.”
Legyen pedig Ároné és fiaié, hogy egyék azt szent helyen, mert szentek szentje az Örökkévaló tűzáldozataiból, örök törvényes részül.
10 ౧౦ ఒక ఇశ్రాయేలు జాతి స్త్రీకి ఐగుప్తు పురుషుడికి పుట్టిన ఒకడు ఇశ్రాయేలీయులతో కలిసి వచ్చాడు.
Ekkor kiment egy izraelita nő fia, de ő egyiptomi férfiúnak fia volt Izrael fiai között, és civakodtak a táborban az izraelita nő fia és egy izraelita férfi.
11 ౧౧ ఆ ఇశ్రాయేలీయురాలి కొడుక్కి ఒక ఇశ్రాయేలీయుడికి శిబిరంలో గొడవ జరిగింది. ఆ ఇశ్రాయేలీయురాలి కొడుకు యెహోవా నామాన్ని దూషించి శపించాడు. ప్రజలు మోషే దగ్గరికి వాణ్ణి తీసుకొచ్చారు. వాడి తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడు దిబ్రీ కూతురు.
És kiejtette az izraelita nő a Nevet és káromolta; és elvitték őt -Mózeshez; – anyjának neve pedig Selómisz, Divri leánya, Dán törzséből –
12 ౧౨ యెహోవా ఏమి చెబుతాడో తెలిసేదాకా వాణ్ణి కావలిలో ఉంచారు.
és őrizet alá helyezték, hogy döntsön számukra az Örökkévaló igéje szerint.
13 ౧౩ అప్పుడు యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.
És szólt az Örökkévaló Mózeshez, mondván:
14 ౧౪ “శపించిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకురా. వాడు పలికిన శాపనార్థాలు విన్న వారంతా వాని తల మీద చేతులుంచిన తరవాత ప్రజలంతా రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి.
Vezesd ki a káromlót a táboron kívülre és tegyék rá mindazok, akik hallották, kezüket a fejére, és kövezze meg őt az egész község.
15 ౧౫ నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. తన దేవుణ్ణి శపించేవాడు తన పాపశిక్షను భరించాలి.
Izrael fiaihoz pedig szólj, mondván: Bárki, aki káromolja Istenét, az viselje az ő vétkét;
16 ౧౬ యెహోవా నామాన్ని దూషించేవాడికి మరణశిక్ష విధించాలి. ప్రజలంతా రాళ్లతో అలాటి వాణ్ణి చావ గొట్టాలి. పరదేశిగాని స్వదేశిగాని యెహోవా నామాన్ని దూషిస్తే వాడికి మరణశిక్ష విధించాలి.
aki pedig kiejti az Örökkévaló nevét, ölessék meg, kövezze meg őt az egész község; úgy az idegen, mint a bennszülött, ha kiejti a Nevet, ölessék meg.
17 ౧౭ ఎవడైనా హత్య చేసినట్టయితే వాడికి మరణశిక్ష విధించాలి.
És ha valaki agyonüt bármely emberi lényt, ölessék meg.
18 ౧౮ జంతువు ప్రాణం తీసినవాడు ప్రాణానికి ప్రాణమిచ్చి దాని నష్టపరిహారం చెల్లించాలి.
És aki agyonüt állati lényt, fizesse azt meg, lelket lélekért.
19 ౧౯ ఒకడు తన సాటి మనిషిని గాయపరిస్తే వాడు చేసినట్టే వాడికీ చెయ్యాలి.
És ha valaki sérülést ejt embertársán, amint ő tett, úgy tegyenek vele.
20 ౨౦ ఎముక విరగ్గొడితే వాడి ఎముక విరగ్గొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకడు వేరొకడికి గాయం చేస్తే వాడికి అదే చెయ్యాలి.
Törést törésért, szemet szemért, fogat fogért; amint sérülést ejt az emberen, úgy ejtessék rajta.
21 ౨౧ జంతువును చావగొట్టినవాడు దాని నష్టపరిహారం ఇచ్చుకోవాలి. హత్య చేసినవాడికి మరణశిక్ష విధించాలి.
Aki agyonüt barmot, fizesse meg; és aki agyonüt embert, ölessék meg.
22 ౨౨ మీరు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. మీలో నివసించే పరదేశికి మీరు చేసినట్టే మీ స్వజాతివారికీ చెయ్యాలి. నేను మీ దేవుడినైన యెహోవానని వారితో చెప్పు” అన్నాడు.
Egy törvény legyen számotokra, az idegen olyan legyen, mint a bennszülött, mert én vagyok az Örökkévaló, a ti Istenetek.
23 ౨౩ కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో “దేవుణ్ణి శాపనార్థాలు పెట్టిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకుపోయి రాళ్లతో చావగొట్టండి” అని చెప్పాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేశారు.
És szólt Mózes Izrael fiaihoz és kivezették a káromlót a táboron kívülre és megkövezték őt kővel; Izrael fiai pedig cselekedtek, amint parancsolta az Örökkévaló Mózesnek.