< లేవీయకాండము 22 >
1 ౧ యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
Un Tas Kungs runāja uz Mozu un sacīja:
2 ౨ “అహరోనుతో అతని కొడుకులతో ఇది చెప్పు. వారు ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే వాటిని ప్రత్యేకమైనవిగా భావించాలి. వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.
Runā uz Āronu un viņa dēliem, ka tiem būs sargāties no Israēla bērnu svētām dāvanām, (ko tie Man svētī), ka tie nesagāna Manu svēto vārdu; - Es esmu Tas Kungs.
3 ౩ నీవు వారితో ఇలా చెప్పు. మీ తరతరాలకు మీ సంతతి వారందరిలో ఒకడు అపవిత్రంగా ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే వాటిని సమీపిస్తే అలాంటి వాణ్ణి నా సన్నిధిలో ఉండకుండాా దూరంగా కొట్టివేస్తాను. నేను యెహోవాను.
Saki tiem: kas starp jūsu pēcnākamiem no visa jūsu dzimuma pieies pie tām svētām dāvanām, ko Israēla bērni Tam Kungam svētī, kad tam kāds nešķīstums, tas taps izdeldēts no Mana vaiga; - Es esmu Tas Kungs.
4 ౪ అహరోను సంతానంలో ఎవరికైనా కుష్టువ్యాధి గానీ, శరీరం నుండి రసి లాంటిది కారడం గానీ ఉంటే అలాటి వాడు పవిత్రుడయ్యే వరకూ ప్రతిష్ఠితమైన వాటిలో దేనినీ తినకూడదు. శవాన్ని తాకడం వల్లా, అపవిత్రమైన దేనినైనా ముట్టుకోవడం వల్లా, వీర్యస్కలనం చేసిన వాణ్ణి తాకడం వల్లా,
Nevienam no Ārona dzimuma, kad tas ir spitālīgs, vai kam miesa pil, nebūs ēst no tām svētām dāvanām, tiekams tas top šķīsts. Kas ko aizskar, kas caur mironi palicis nešķīsts, vai kam guļot sēkla izpil,
5 ౫ అపవిత్రమైన పురుగును, లేక ఏదో ఒక అపవిత్రత మూలంగా అపవిత్రుడైపోయిన మనిషిని ముట్టుకోవడం వల్లా, అలాటి అపవిత్రత తగిలినవాడు సాయంత్రం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు.
Vai ja kas kādu līdēju tārpu aizskar, caur ko tas palicis nešķīsts, vai kādu cilvēku, caur ko tas palicis nešķīsts ar kaut kādu nešķīstību, kas viņam ir,
6 ౬ అతడు నీళ్లతో తన ఒళ్ళు కడుక్కునే వరకూ ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు.
Tas, kas to aizskāris, būs nešķīsts līdz vakaram un lai neēd no tām svētām dāvanām, bet lai per savu miesu ūdenī.
7 ౭ సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడౌతాడు. ఆ తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చు. అవి అతనికి ఆహారమే గదా.
Un kad saule nogājusi, tad tas ir šķīsts, un pēc tam tas var ēst no tām svētām dāvanām, jo tā ir viņa barība.
8 ౮ అతడు చచ్చిన జంతువును గానీ, మృగాలు చీల్చిన వాటిని గాని తిని దాని వలన తనను అపవిత్ర పరచుకోకూడదు. నేను యెహోవాను.
Maitu un saplosītu tam nebūs ēst, lai ar to nesagānās; - Es esmu Tas Kungs.
9 ౯ కాబట్టి నేను విధించిన నియమాన్ని మీరి, దాని పాపదోషం తనపై వేసుకుని దాని వలన చావకుండేలా చూసుకోవాలి. నేను వారిని పరిశుద్ధ పరిచే యెహోవాను.
Tā tiem būs turēt Manu pavēli, ka tiem tādēļ grēks nav jānes un caur to nav jāmirst, ka tie to sagānījuši; - Es esmu Tas Kungs, kas tos svētī.
10 ౧౦ ప్రతిష్ఠితమైన దాన్ని యూదులు కాని వారు తినకూడదు. యాజకుని ఇంట్లో నివసించే అన్యుడు గాని, సేవకుడు గాని ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు.
Nevienam svešiniekam nebūs ēst no tā svētītā; nedz piedzīvotājam pie priestera nedz algādzim no tā svētīta nebūs ēst.
11 ౧౧ అయితే యాజకుడు తన డబ్బుతో కొనుక్కున్న వాడు, అతని ఇంట్లో పుట్టినవాడు అతడు తినే ఆహారం తినవచ్చు.
Bet ja priesteris kādu cilvēku pircis par savu naudu, tam būs no tā ēst, un kas viņa namā ir dzimis, tiem būs ēst no viņa maizes.
12 ౧౨ యాజకుని కుమార్తెను అన్యునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె ప్రతిష్ఠితమైన అర్పణల్లో దేనినీ తినకూడదు.
Bet ja priestera meita ies pie kāda sveša vīra, tad viņai nebūs ēst no tā svētā cilājamā upura.
13 ౧౩ యాజకుని కుమార్తెల్లో వితంతువుగానీ, విడాకులు తీసుకున్నది గానీ పిల్లలు పుట్టక పోవడం వల్ల ఆమె తన బాల్యప్రాయంలో వలె తన తండ్రి యింటికి తిరిగి చేరితే తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు. అన్యుడు మాత్రం దాన్ని తినకూడదు.
Bet ja priestera meita būs atraitne vai atstādināta un viņai dzimuma nav, un tā nākusi atpakaļ sava tēva namā, kā kad vēl bija meita, tad viņai būs ēst sava tēva maizi; bet nevienam svešiniekam to nebūs ēst.
14 ౧౪ ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దాన్ని తింటే వాడు ఆ ప్రతిష్ఠితమైన దాని విలువలో ఐదో వంతు కలిపి యాజకునికి తిరిగి ఇవ్వాలి.
Un ja kas nezinādams no tā svētītā ēdīs, tad viņam pie tā būs pielikt piekto daļu, un atdot priesterim līdz ar to svētīto.
15 ౧౫ ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినడం వలన అపరాధాన్ని భరించకుండా ఉండాలంటే తాము యెహోవాకు ప్రతిష్ఠించే పరిశుద్ధ వస్తువులను అపవిత్ర పరచకూడదు.
Un tiem nebūs sagānīt Israēla bērnu svētās dāvanas, ko tie Tam Kungam devuši par cilājamu upuri,
16 ౧౬ నేను అర్పణలను పరిశుద్ధ పరచే యెహోవానని చెప్పు.”
Ka tie sev neuzkrauj noziegumu un apgrēcību, kad tie ēd savas svētās dāvanas; jo Es esmu Tas Kungs, kas tos svētī.
17 ౧౭ యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
Un Tas Kungs runāja uz Mozu un sacīja:
18 ౧౮ “నీవు అహరోనుతో, అతని కొడుకులతో, ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పు. ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో గానీ ఇశ్రాయేలీయుల్లో నివసించే పరదేశుల్లోగాని యెహోవాకు దహన బలి అర్పించదలిస్తే అది స్వేచ్ఛార్పణగానివ్వండి, మొక్కుబడి గానివ్వండి
Runā uz Āronu un uz viņa dēliem un uz visiem Israēla bērniem un saki tiem: ja kas no Israēla nama un no svešiniekiem iekš Israēla grib savu upuri pienest, lai būtu kāds solījums, vai kāds labprātības upuris, ko tie Tam Kungam grib upurēt par dedzināmo upuri, lai tas no jums Viņam būtu patīkams,
19 ౧౯ ఆ అర్పణ దేవుడు అంగీకరించేలా ఆవుల్లో నుండి గానీ, గొర్రె మేకల్లో నుండి గానీ దోషంలేని మగదాన్ని అర్పించాలి.
Tad nesiet vienu tēviņu no vēršiem, jēriem un kazlēniem, kas bez vainas.
20 ౨౦ కళంకం ఉన్న దాన్ని అర్పించ కూడదు. అది అంగీకారం కాదు.
Kam kāda vaina, to jums nebūs upurēt, jo tas nebūs patīkams no jums.
21 ౨౧ ఒకడు మొక్కుబడిగా స్వేచ్ఛార్పణంగా అర్పించడానికి శాంతి బలిగా ఆవునైనా గొర్రెనైనా మేకనైనా యెహోవాకు తెస్తే ఆయన దాన్ని అంగీకరించేలా అది దోషం లేనిదై ఉండాలి. దానిలో కళంకమేదీ ఉండకూడదు.
Un ja kas Tam Kungam pienes pateicības upuri, vai īpašu solījumu, vai no laba prāta, no lieliem vai no sīkiem lopiem, tam būs būt bez vainas, ka tas ir patīkams, pie tā lai nav nekādas vainas.
22 ౨౨ గుడ్డిదాన్ని గానీ కుంటిదాన్ని గానీ, పాడైపోయిన దాన్ని గానీ, గడ్డలు, గజ్జి, కురుపులు ఉన్న దాన్ని గానీ యెహోవాకు అర్పించకూడదు. అలాంటివి దేన్నీ బలివేదికపై యెహోవాకు హోమం చేయకూడదు.
Ja tas ir akls, vai ar lūzumu, vai ievainots, vai kraupains, vai kašķains ar ēdi, tādus jums nebūs Tam Kungam upurēt, un no tiem jums nebūs Tam Kungam uz altāri likt uguns upuri.
23 ౨౩ అంగవైకల్యం గల కోడెదూడనైనా గొర్రెల మేకల మందలోని దాన్నైనా స్వేచ్ఛార్పణంగా అర్పించవచ్చు గానీ మొక్కుబడిగా మాత్రం అది అంగీకారం కాదు.
Bet vērsi vai avi, kam visai gari, vai visai īsi locekļi, to jūs varat sataisīt par labprātības upuri, bet par solījuma upuri tas nebūs patīkams.
24 ౨౪ గాయపడిన, నలిగిన, మృగాలు చీల్చిన, వృషణాలు చితక గొట్టిన జంతువును యెహోవాకు అర్పించకూడదు. మీ దేశంలో అలాంటివి అర్పించకూడదు.
To saspaidīto, to sadauzīto, vai saplosīto, vai izrāmīto jums nebūs upurēt Tam Kungam, to jums nebūs darīt savā zemē.
25 ౨౫ విదేశీయుల దగ్గర నుండి అలాటి వాటిని తీసుకుని మీ దేవుడికి నైవేద్యంగా అర్పించకూడదు. అవి లోపం గలవి, వాటికి కళంకం ఉంది. మీ పక్షంగా దేవుడు వాటిని అంగీకరించడు, అని చెప్పు.”
Arī no svešinieka rokas jums nekā no tādiem nebūs upurēt savam Dievam par barību; jo tiem ir trūkums, tiem ir vaina, tie no jums nebūs patīkami.
26 ౨౬ యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు.
Un Tas Kungs runāja uz Mozu un sacīja:
27 ౨౭ “దూడగాని, గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని పుట్టినప్పుడు అది ఏడు రోజులు దాని తల్లితో ఉండాలి. ఎనిమిదవ రోజు మొదలు అది యెహోవాకు హోమంగా అంగీకారమే.
Kad vērsis, vai jērs, vai kazlēns piedzims, tad tam būs palikt septiņas dienas pie savas mātes, bet astotā dienā un pēc tas būs patīkams Tam Kungam par uguns upuri.
28 ౨౮ అయితే అది ఆవైనా గొర్రె మేకలైనా మీరు దాన్ని, దాని పిల్లను ఒక్క నాడే వధించకూడదు.
Liellopu vai avi, pašu līdz ar viņa augli, jums nebūs nokaut vienā dienā.
29 ౨౯ మీరు కృతజ్ఞత బలిగా ఒక పశువును వధించినప్పుడు అది మీ కోసం అంగీకారం అయ్యేలా దాన్ని అర్పించాలి.
Un kad jūs Tam Kungam upurēsiet slavas upuri, tad jums to būs upurēt, kā tas no jums lai būtu patīkams.
30 ౩౦ ఆనాడే దాని తినెయ్యాలి. మరుసటి రోజు దాకా దానిలో కొంచెమైనా మిగల్చకూడదు. నేను యెహోవాను.
Tai pašā dienā to būs ēst, jums no tā neko nebūs atlicināt līdz rītam; - Es esmu Tas Kungs.
31 ౩౧ మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తూ వాటి ప్రకారం నడుచుకోవాలి. నేను యెహోవాను.
Tad nu jums Manus baušļus būs turēt un tos darīt; - Es esmu Tas Kungs.
32 ౩౨ నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయుల్లో నన్ను పరిశుద్ధునిగా చేసుకుంటాను. నేను మిమ్మల్ని పరిశుద్ధ పరిచే యెహోవాను.
Un jums nebūs pulgot Manu svēto vārdu, ka Es Israēla bērnu starpā topu svētīts; - Es esmu Tas Kungs, kas jūs svētī,
33 ౩౩ నేను మీకు దేవుడనై ఉండేలా ఐగుప్తు దేశంలోనుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను అని చెప్పు.”
Kas jūs izvedis no Ēģiptes zemes, lai Es jums būtu par Dievu, Es, Tas Kungs.