< లేవీయకాండము 19 >
1 ౧ యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల సమాజమంతటితో ఇలా చెప్పు.
and to speak: speak LORD to(wards) Moses to/for to say
2 ౨ “మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా అనే నేను పరిశుద్ధుడిని.
to speak: speak to(wards) all congregation son: descendant/people Israel and to say to(wards) them holy to be for holy I LORD God your
3 ౩ మీలో ప్రతివాడూ తన తల్లిని తన తండ్రిని గౌరవించాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
man: anyone mother his and father his to fear: revere and [obj] Sabbath my to keep: obey I LORD God your
4 ౪ మీరు పనికిమాలిన దేవుళ్ళ వైపు తిరగకూడదు. మీరు పోత విగ్రహాలను చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
not to turn to(wards) [the] idol and God liquid not to make to/for you I LORD God your
5 ౫ మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించేటప్పుడు అది అంగీకారయోగ్యమయ్యేలా అర్పించాలి.
and for to sacrifice sacrifice peace offering to/for LORD to/for acceptance your to sacrifice him
6 ౬ మీరు బలిమాంసాన్ని బలి అర్పించిన రోజైనా, మరునాడైనా దాన్ని తినాలి. మూడో రోజు దాకా మిగిలి ఉన్న దాన్ని పూర్తిగా కాల్చివేయాలి.
in/on/with day sacrifice your to eat and from morrow and [the] to remain till day [the] third in/on/with fire to burn
7 ౭ మూడో రోజున దానిలో కొంచెం తిన్నా సరే, అది అసహ్యం. అది ఆమోదం కాదు.
and if to eat to eat in/on/with day [the] third refuse he/she/it not to accept
8 ౮ మూడో రోజున దాన్ని తినేవాడు తన దోషశిక్షను భరిస్తాడు. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దాన్ని అపవిత్ర పరిచాడు కదా. వాడిని ప్రజల్లో లేకుండా చెయ్యాలి.
and to eat him iniquity: crime his to lift: guilt for [obj] holiness LORD to profane/begin: profane and to cut: eliminate [the] soul: person [the] he/she/it from kinsman her
9 ౯ మీరు మీ పొలం పంట కోసేటప్పుడు నీ పొలం మూలల్లొ పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఏరుకోకూడదు. నీ పండ్ల చెట్ల పరిగెను సమకూర్చుకోకూడదు.
and in/on/with to reap you [obj] harvest land: country/planet your not to end: expend side land: country your to/for to reap and gleaning harvest your not to gather
10 ౧౦ నీ ద్రాక్ష తోటలో పండ్లన్నిటినీ సేకరించుకో కూడదు. ద్రాక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి.
and vineyard your not to glean and broken vineyard your not to gather to/for afflicted and to/for sojourner to leave: forsake [obj] them I LORD God your
11 ౧౧ నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగతనం చేయకూడదు. అబద్ధం ఆడకూడదు. ఒకడినొకడు దగా చెయ్యకూడదు.
not to steal and not to deceive and not to deal man: anyone in/on/with neighbor his
12 ౧౨ నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు. నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.
and not to swear in/on/with name my to/for deception and to profane/begin: profane [obj] name God your I LORD
13 ౧౩ నీ పొరుగు వాణ్ణి పీడించకూడదు. అతణ్ణి దోచుకోకూడదు. కూలివాడి కూలీ డబ్బు మరునాటి వరకూ నీ దగ్గర ఉంచుకోకూడదు.
not to oppress [obj] neighbor your and not to plunder not to lodge wages hired with you till morning
14 ౧౪ చెవిటివాణ్ణి తిట్ట కూడదు. గుడ్డివాడి దారిలో అడ్డంకులు వేయకూడదు. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
not to lighten deaf and to/for face: before blind not to give: put stumbling and to fear: revere from God your I LORD
15 ౧౫ అన్యాయ తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చూపకూడదు. గొప్పవాడని అభిమానం చూపకూడదు. నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి.
not to make: do injustice in/on/with justice: judgement not to lift: kindness face: kindness poor and not to honor face great: large in/on/with righteousness to judge neighbor your
16 ౧౬ నీ ప్రజల మధ్య కొండేలు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు. ఎవరికైనా ప్రాణ హాని కలిగించేది ఏదీ చెయ్యవద్దు. నేను యెహోవాను.
not to go: went slander in/on/with people your not to stand: stand upon blood neighbor your I LORD
17 ౧౭ నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహ్యించుకోకూడదు. నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి.
not to hate [obj] brother: compatriot your in/on/with heart your to rebuke to rebuke [obj] neighbor your and not to lift: guilt upon him sin
18 ౧౮ పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.
not to avenge and not to keep [obj] son: child people your and to love: lover to/for neighbor your like you I LORD
19 ౧౯ మీరు నా శాసనాలను పాటించాలి. నీ జంతువులకు ఇతర జాతి జంతువులతో సంపర్కం చేయకూడదు. నీ పొలంలో వేరు వేరు జాతుల విత్తనాలు చల్లకూడదు. రెండు రకాల దారాలతో నేసిన బట్టలు ధరించకూడదు.
[obj] statute my to keep: obey animal your not to mate mixture land: country your not to sow mixture and garment mixture mixed stuff not to ascend: rise upon you
20 ౨౦ ఒక బానిస పిల్లలు ఒకడితో నిశ్చితార్థం జరిగాక ఆమెను వెల ఇచ్చి విడిపించకుండా, లేదా ఆమెకు విముక్తి కలగక ముందు ఎవరైనా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అలాటి వాణ్ణి శిక్షించాలి. ఆమెకు విడుదల కలగలేదు గనక వారికి మరణశిక్ష విధించ కూడదు.
and man for to lie down: have sex [obj] woman semen seed: semen and he/she/it maidservant to acquire to/for man and to ransom not to ransom or freedom not to give: give to/for her scourging to be not to die for not be free
21 ౨౧ అతడు అపరాధ పరిహార బలిని, అంటే అపరాధ పరిహార బలిగా ఒక పొట్టేలును ప్రత్యక్ష గుడార ద్వారానికి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి.
and to come (in): bring [obj] guilt (offering) his to/for LORD to(wards) entrance tent meeting ram guilt (offering)
22 ౨౨ అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపాన్నిబట్టి పాప పరిహార బలిగా ఆ పొట్టేలు మూలంగా యెహోవా సన్నిధిలో అతని కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగుతుంది.
and to atone upon him [the] priest in/on/with ram [the] guilt (offering) to/for face: before LORD upon sin his which to sin and to forgive to/for him from sin his which to sin
23 ౨౩ మీరు ఆ దేశానికి వచ్చి తినడానికి రకరకాల చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను నిషేధంగా ఎంచాలి. మూడు సంవత్సరాల పాటు అవి మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు.
and for to come (in): come to(wards) [the] land: country/planet and to plant all tree food and be uncircumcised foreskin his [obj] fruit his three year to be to/for you uncircumcised not to eat
24 ౨౪ నాలుగో సంవత్సరంలో వాటి పండ్లన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి అర్పణలుగా ఉంటాయి. ఐదో సంవత్సరంలో వాటి పండ్లను తినొచ్చు.
and in/on/with year [the] fourth to be all fruit his holiness praise to/for LORD
25 ౨౫ నేను మీ దేవుడైన యెహోవాను.
and in/on/with year [the] fifth to eat [obj] fruit his to/for to add to/for you produce his I LORD God your
26 ౨౬ రక్తం కలిసి ఉన్న మాంసం తినకూడదు. శకునాలు చూడకూడదు. మంత్ర ప్రయోగం ద్వారా ఇతరులను వశపరచుకోడానికి చూడకూడదు.
not to eat upon [the] blood not to divine and not to divine
27 ౨౭ విగ్రహ పూజలు చేసే ఇతర జనాల్లాగా మీ తల పక్క భాగాలు గానీ నీ గడ్డం అంచులు గానీ గుండ్రంగా గొరిగించుకోకూడదు.
not to surround side head your and not to ruin [obj] side beard your
28 ౨౮ చచ్చిన వారి కోసం మీ దేహాన్ని గాయపరచుకోకూడదు. ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
and incision to/for soul: dead not to give: make in/on/with flesh your and imprint incision not to give: do in/on/with you I LORD
29 ౨౯ నీ కూతురిని వేశ్యగా చేసి ఆమెను హీనపరచకూడదు. అలా చేస్తే మీ దేశం వ్యభిచారంలో పడిపోతుంది. మీ ప్రాంతం కాముకత్వంతో నిండిపోతుంది.
not to profane/begin: profane [obj] daughter your to/for to fornicate her and not to fornicate [the] land: country/planet and to fill [the] land: country/planet wickedness
30 ౩౦ నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని గౌరవించాలి. నేను యెహోవాను.
[obj] Sabbath my to keep: obey and sanctuary my to fear: revere I LORD
31 ౩౧ చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను.
not to turn to(wards) [the] medium and to(wards) [the] spiritist not to seek to/for to defile in/on/with them I LORD God your
32 ౩౨ తల నెరసిన ముసలివాడి ఎదుట లేచి నిలబడి అతని ముఖాన్ని గౌరవించాలి. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
from face: before greyheaded to arise: rise and to honor face old and to fear: revere from God your I LORD
33 ౩౩ మీ దేశంలో పరదేశి ఎవరైనా మీ మధ్య నివసించేటప్పుడు అతణ్ణి బాధ పెట్టకూడదు,
and for to sojourn with you sojourner in/on/with land: country/planet your not to oppress [obj] him
34 ౩౪ మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.
like/as born from you to be to/for you [the] sojourner [the] to sojourn with you and to love: lover to/for him like you for sojourner to be in/on/with land: country/planet Egypt I LORD God your
35 ౩౫ కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు.
not to make: do injustice in/on/with justice: judgement in/on/with measure in/on/with weight and in/on/with capacity
36 ౩౬ న్యాయమైన త్రాసులు న్యాయమైన బరువులు, న్యాయమైన కొల పాత్రలు న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను.
balance righteousness stone: weight righteousness ephah righteousness and hin righteousness to be to/for you I LORD God your which to come out: send [obj] you from land: country/planet Egypt
37 ౩౭ మీరు నా శాసనాలన్నిటిని నా విధులన్నిటిని పాటించాలి. నేను యెహోవాను.”
and to keep: obey [obj] all statute my and [obj] all justice: judgement my and to make: do [obj] them I LORD