< లేవీయకాండము 18 >
1 ౧ యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
Un Tas Kungs runāja uz Mozu un sacīja:
2 ౨ “నేను మీ దేవుడైన యెహోవాను అని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు.
Runā uz Israēla bērniem un saki tiem: Es esmu Tas Kungs, jūsu Dievs.
3 ౩ మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పిస్తున్న కనాను దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. వారి మతాచారాలను అనుసరించ కూడదు.
Pēc Ēģiptes zemes darbiem, kur jūs esat mājojuši jums nebūs darīt un pēc Kanaāna zemes darbiem, kurp Es jūs vedu, jums nebūs darīt, nedz staigāt viņu likumos.
4 ౪ మీరు నా విధులను పాటించాలి. నా చట్టాల ప్రకారం నడుచుకుంటూ వాటిని ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
Jums būs darīt Manu tiesu un Manu iestādījumu un iekš tiem staigāt; - Es esmu Tas Kungs, jūsu Dievs.
5 ౫ మీరు నా చట్టాలను నా విధులను ఆచరించాలి. వాటిని పాటించే వాడు వాటి వలన జీవిస్తాడు. నేను యెహోవాను.
Manus likumus jums būs turēt un Manu tiesu jums būs darīt; kurš cilvēks tos darīs, tas caur tiem dzīvos; - Es esmu Tas Kungs.
6 ౬ మీలో ఎవరూ తమ రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను.
Nevienam nebūs pieiet pie sava asinsrada, kaunumu atsegt; - Es esmu Tas Kungs.
7 ౭ నీ తండ్రికి గౌరవదాయకం గా ఉన్న నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు ఆమె నీ తల్లి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
Sava tēva kaunumu un savas mātes kaunumu tev nebūs atsegt; tā ir tava māte, viņas kaunumu tev nebūs atsegt.
8 ౮ నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలా చేసి నీ తండ్రిని అగౌరవ పరచకూడదు.
Sava tēva sievas kaunumu tev nebūs atsegt; - tas ir tava tēva kaunums.
9 ౯ నీ సోదరితో అంటే ఇంట్లో పుట్టినా బయట పుట్టినా నీ తండ్రి కుమార్తెతోనైనా నీ తల్లి కుమార్తెతోనైనా లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
Savas māsas, sava tēva meitas vai savas mātes meitas kaunumu, vai tā mājā vai ārā dzimusi, tev nebūs atsegt.
10 ౧౦ నీ కుమారుడి కుమార్తెతో గానీ కుమార్తె కుమార్తెతోగానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది నీ గౌరవమే.
Sava dēla meitas vai savas meitas meitas kaunumu tev nebūs atsegt; - jo tas ir tavs kaunums.
11 ౧౧ నీ తండ్రికి పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సోదరి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
Sava tēva sievas meitas kaunumu, kas tavam tēvam dzimusi, (tā ir tava māsa) tev nebūs atsegt.
12 ౧౨ నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
Sava tēva māsas kaunumu tev nebūs atsegt, tā ir: tava tēva asins radiniece.
13 ౧౩ నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధి.
Savas mātes māsas kaunumu tev nebūs atsegt, jo tā ir tavas mātes asins radiniece.
14 ౧౪ నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా అతనిని అగౌరవ పరచ కూడదు. అంటే అతని భార్యను ఆ ఉద్దేశంతో సమీపించ కూడదు. ఆమె నీ పినతల్లి.
Sava tēva-brāļa kaunumu tev nebūs atsegt, viņas sievu tev nebūs aizskart, - tā ir tava tēva brāļa sieva.
15 ౧౫ నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ కుమారుడి భార్య. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
Savas vedeklas kaunumu tev nebūs atsegt, tā ir tava dēla sieva, - tev nebūs atsegt viņas kaunumu.
16 ౧౬ నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకో కూడదు. అది నీ సోదరుని గౌరవం.
Sava brāļa sievas kaunumu tev nebūs atsegt, - tas ir tava brāļa kaunums,
17 ౧౭ ఒక స్త్రీతోనూ ఆమె కూతురితోనూ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీకు లైంగిక సంబంధం ఉన్న స్త్రీ కుమారుడి కూతురుతోగానీ ఆమె కూతురు కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకునేందుకు వారిని చేర దీయకూడదు. వారు ఆమె రక్తసంబంధులు. అది దుర్మార్గం.
Kādas sievas un viņas meitas kaunumu tev nebūs atsegt, nedz viņas dēla meitu nedz viņas meitas meitu tev nebūs ņemt, viņas kaunumu atsegt: tās ir asins radinieces, tā ir negantība,
18 ౧౮ నీ భార్య బతికి ఉండగానే ఆమెను బాధించాలని ఆమె సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెను పెళ్లాడకూడదు.
Tev arī nebūs ņemt sievu pie viņas māsas, kas tev jau ir, viņas kaunumu atsegt šai par riebšanu, kamēr šī dzīvo.
19 ౧౯ ఋతుస్రావం వలన స్త్రీ బయట ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
Tev arī nebūs sievu aizskart, kamēr viņas sārņu laiks ir, viņas kaunumu atsegt.
20 ౨౦ నీ పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆమె మూలంగా అపవిత్రం కాకూడదు.
Tev arī nebūs piegulēt sava tuvākā sievu, ar viņu apgānīdamies.
21 ౨౧ నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.
Un no sava dzimuma tev nebūs dot, ka tas Molokam top sadedzināts, ka tu sava Dieva vārdu nepulgo; - Es esmu Tas Kungs.
22 ౨౨ స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు. అది అసహ్యం.
Pie vīrieša tev nebūs gulēt, tā kā pie sievas, - tā ir negantība.
23 ౨౩ ఏ జంతువుతోనూ లైంగిక సంబంధం పెట్టుకుని దాని వలన అపవిత్రం కాకూడదు. ఏ స్త్రీ కూడా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది భ్రష్టత్వం.
Tev arī nebūs jaukties ar nekādu lopu, ar viņu apgānīdamies; ir nekādai sievai ar nekādu lopu nebūs apieties, ar to sagānīdamās; tā ir neganta sajaukšanās.
24 ౨౪ వీటిలో దేనివలనా మీరు అపవిత్రులు కాకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ల గొట్టబోతున్న జాతులు ఇలాంటి పనులు చేసి భ్రష్టులయ్యారు.
Un jums nebūs apgānīties ar šādiem (grēkiem), jo ar šiem visiem tie pagāni ir apgānījušies, ko Es jūsu priekšā izdzīšu.
25 ౨౫ ఆ దేశం అపవిత్రమై పోయింది. గనక నేను దానిపై దాని దోష శిక్షను విధిస్తున్నాను. ఆ దేశం తనలో నివసిస్తున్న వారిని బయటికి కక్కివేస్తున్నది.
Un tā zeme ir apgānīta, un Es par to viņas noziegumu piemeklēšu, tā ka tā zeme savus iedzīvotājus izspļauj.
26 ౨౬ కాబట్టి ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం కక్కివేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని కక్కి వేయకుండేలా
Bet jums būs turēt Manus likumus un Manu tiesu un nekā nedarīt no visām šīm negantībām, ne iedzīvotājam, ne svešiniekam, kas mīt jūsu starpā;
27 ౨౭ మీరు గానీ మీలో నివసించే పరదేశి గాని యీ అసహ్యమైన క్రియల్లో దేన్నీ చేయకూడదు.
Jo šīs zemes ļaudis, kas priekš jums bija, visas šās negantības darījuši, un tā zeme ir apgānīta.
28 ౨౮ నా చట్టాలను, నా విధులను ఆచరించాలి.
Lai tā zeme jūs arīdzan neizspļauj, kad jūs to apgānīsiet, itin kā tā izspļāvusi tos pagānus, kas priekš jums bija.
29 ౨౯ అలాటి అసహ్యమైన పనుల్లో దేనినైనా చేసేవారు ప్రజల్లో లేకుండా పోతారు.
Jo ikviens, kas no šīm negantībām ko darīs: tām dvēselēm, kas to dara, būs tikt izdeldētām no saviem ļaudīm.
30 ౩౦ కాబట్టి మీకంటే ముందుగా అక్కడ నివసించిన వాళ్ళు పాటించిన అసహ్యమైన ఆచారాల్లో దేనినైనా పాటించి అపవిత్రులై పోకుండా నేను మీకు విధించిన నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుణ్ణి. యెహోవాను.”
Tāpēc jums būs turēt Manu likumu, ka jūs nedarāt pēc nevienas no tām negantām ierašām, ko tie priekš jums darījuši, nedz ar tām apgānāties: - Es esmu Tas Kungs, jūsu Dievs.