< లేవీయకాండము 15 >

1 యెహోవా మోషే అహరోనులతో మాట్లాడి ఇలా చెప్పాడు.
Đức Giê-hô-va lại phán cùng Môi-se và A-rôn rằng:
2 “మీరు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి శరీరంలో ఎక్కడన్నా ఏదన్నా స్రావం జరుగుతుంటే ఆ స్రావం కారణంగా అతడు అశుద్ధుడు అవుతాడు.
Hãy truyền cho dân Y-sơ-ra-ên rằng: Phàm người nam nào thân mình bị bịnh bạch trược, thì vì cớ đó bị ô uế;
3 అతని అశుద్ధతకు కారణం రోగ కారకమైన స్రావమే. అతని శరీరంలో ఆ స్రావాలు కారినా, నిలిచి పోయినా అది అశుద్ధమే.
sự ô uế người bởi nơi bạch trược: hoặc thân mình chảy bạch trược ra hay là ứ lại, thì người bị ô uế.
4 అతడు పడుకునే పడకా, కూర్చునే ప్రతిదీ అశుద్ధమే అవుతుంది.
Hễ giường nào người bịnh bạch trược nằm, đều sẽ bị ô uế: và các vật nào người ngồi trên cũng sẽ bị ô uế.
5 అతని పడకని తాకే ఎవడైనా తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడు గానే ఉంటాడు.
Ai đụng đến giường người, phải giặt quần áo mình, tắm trong nước, và bị ô uế đến chiều tối.
6 శరీరంలో స్రావం అవుతున్న వాడు కూర్చున్న దానిపై ఎవరైనా కూర్చుంటే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. వాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
Ai ngồi trên vật chi mà người bịnh bạch trược đã ngồi, phải giặt quần áo mình, tắm trong nước, và bị ô uế đến chiều tối.
7 రోగ కారకమైన స్రావం అవుతున్న వాణ్ణి తాకిన వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
Ai đụng đến mình người bịnh bạch trược, phải giặt quần áo mình, tắm trong nước, và bị ô uế đến chiều tối.
8 అలాంటి స్రావం జరిగే వాడు ఎవరైనా శుద్ధుడి పైన ఉమ్మి వేస్తే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
Nếu người bịnh bạch trược nhổ nhằm người nào tinh sạch, thì người đó phải giặt quần áo mình, tắm trong nước, và bị ô uế đến chiều tối.
9 స్రావం జరిగేవాడు జీను పై కూర్చుంటే అదీ అశుద్ధం అవుతుంది.
Hễ xe nào người bịnh bạch trược ngồi lên đều sẽ bị ô uế.
10 ౧౦ అతడు కూర్చున్న ఏ వస్తువునైనా తాకితే, ఆ తాకినవాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఆ వస్తువులను మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
Hễ ai đụng đến bất k” vật chi dưới mình người bịnh bạch trược, đều sẽ bị ô uế đến chiều tối. Còn ai mang các vật đó, phải giặt quần áo mình, tắm trong nước, và bị ô uế đến chiều tối.
11 ౧౧ స్రావం జరిగే వాడు నీళ్ళతో చేతులు కడుక్కోకుండా ఎవరినైనా తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
Ai bị người bịnh bạch trược rờ đến mà nếu người bịnh đó không rửa tay mình trong nước, thì ai đó phải giặt quần áo mình, tắm trong nước, và bị ô uế đến chiều tối.
12 ౧౨ స్రావం జరిగే వాడు తాకిన మట్టిపాత్రను పగలగొట్టాలి. అది చెక్క పాత్ర అయితే దాన్ని నీళ్ళతో కడగాలి.
Đồ sành bị người bịnh bạch trược đụng đến, phải đập bể đi, còn đồ gỗ, thì rửa trong nước.
13 ౧౩ స్రావం జరిగే వాడు స్రావం మానిన తరువాత శుద్ధుడు కావడానికి ఏడు రోజులు లెక్క పెట్టుకోవాలి. ఆ తరువాత తన బట్టలు ఉతుక్కోవాలి. పారే నీటిలో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడు అవుతాడు.
Vả, khi người nam bị bịnh bạch trược đã lành rồi, thì phải tính từ ngày lành đến bảy ngày, kế giặt quần áo mình và tắm trong nước chảy; đoạn, người sẽ được tinh sạch.
14 ౧౪ ఎనిమిదో రోజు అతడు రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి.
Qua ngày thứ tám, người bắt cho mình hai chim cu, hay là hai con bò câu con, đến trước mặt Đức Giê-hô-va, tại cửa hội mạc, và đưa cho thầy tế lễ.
15 ౧౫ యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. స్రావం జరిగే వాడి విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి.
Thầy tế lễ sẽ dâng con nầy làm của lễ chuộc tội, con kia làm của lễ thiêu; vậy, thầy tế lễ vì cớ bịnh bạch trược, sẽ làm lễ chuộc tội cho người trước mặt Đức Giê-hô-va.
16 ౧౬ ఒక వ్యక్తికి అప్రయత్నంగా వీర్యస్కలనం జరిగితే అతడు నీళ్ళలో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
Hễ người nam di tinh, phải tắm trọn mình trong nước, và bị ô uế đến chiều tối.
17 ౧౭ అతని వీర్యం ఏదన్నా బట్టలపైనో, తోలు వస్తువు పైనో పడితే ఆ బట్టనీ, తోలునూ నీళ్ళతో ఉతకాలి. అవి సాయంత్రం వరకూ అశుద్ధమై ఉంటాయి.
Phàm quần áo và da bị dính, phải giặt rửa trong nước, và bị ô uế đến chiều tối.
18 ౧౮ స్త్రీ పురుష సంపర్కంలో వీర్యస్కలనమైతే వాళ్ళిద్దరూ స్నానం చేయాలి. వాళ్ళు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు.
Khi nào người nam và người nữ giao cấu nhau, thì phải tắm trong nước, và bị ô uế cho đến chiều tối.
19 ౧౯ ఒక స్త్రీ శరీరంలో బహిష్టు సమయంలో రక్తస్రావం జరిగితే ఆమె అశుద్ధత ఏడు రోజులుంటుంది. ఆ సమయంలో ఆమెని తాకిన వాళ్ళు ఆ రోజు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు.
Khi nào một người nữ có kinh nguyệt, phải chịu ô uế trong bảy ngày; hễ ai đụng đến người, sẽ bị ô uế đến chiều tối.
20 ౨౦ ఆ సమయంలో ఆమె పండుకున్న ప్రతిదీ అశుద్ధంగా ఉంటుంది. ఆమె దేనిపైన కూర్చుంటుందో అది అశుద్ధంగా ఉంటుంది.
Phàm vật gì người nằm hay ngồi trên trong lúc mình không sạch, sẽ bị ô uế.
21 ౨౧ ఆమె మంచాన్ని తాకిన ప్రతి వాడూ తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
Ai đụng đến giường người, phải giặt quần áo mình, tắm trong nước, và bị ô uế đến chiều tối.
22 ౨౨ ఆమె దేనిపైన కూర్చుంటుందో దాన్ని తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
Ai đụng đến vật gì người đã ngồi trên, phải giặt quần áo mình, tắm trong nước, và bị ô uế đến chiều tối.
23 ౨౩ ఆమె మంచాన్నీ లేదా ఆమె కూర్చున్నదాన్నీ తాకితే ఆ వ్యక్తి సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
Nếu có vật chi nơi giường, hoặc trên đồ người ngồi, hễ ai đụng đến, sẽ bị ô uế đến chiều tối.
24 ౨౪ ఒక వ్యక్తి స్త్రీతో సంభోగించినప్పుడు ఆమె అశుచి అతనికి తగిలితే అతడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు. అతడు పండుకునే ప్రతి పడకా అశుద్ధమవుతుంది.
Ví bằng một người nam giao cấu cùng người nữ đó, và sự ô uế kinh nguyệt dính người nam, thì người nam sẽ bị ô uế trong bảy ngày; phàm giường nào người nằm đều cũng sẽ bị ô uế.
25 ౨౫ ఒక స్త్రీకి తన బహిష్టు సమయంలో కాకుండా అనేకరోజులు రక్త స్రావం జరుగుతూ ఉన్నా, లేదా బహిష్టు సమయం దాటిన తరువాత కూడా స్రావం జరుగుతూనే ఉన్నా స్రావం జరిగినన్ని రోజులూ ఆమెకు బహిష్టు సమయం లానే ఉంటుంది. ఆమె అశుద్ధురాలుగానే ఉంటుంది.
Khi một người nữ ngoài k” kinh nguyệt mình lại có lưu huyết nhiều ngày, hoặc là bị mất quá k”, sẽ bị ô uế trọn trong lúc lưu huyết như trong lúc kinh nguyệt mình vậy.
26 ౨౬ ఆమెకు స్రావం జరుగుతున్న రోజులన్నీ ఆమె పండుకునే మంచం ఆమె బహిష్టు సమయంలో పండుకునే మంచం లాగే ఉంటుంది. ఆమె దేని పైన కూర్చుంటుందో ఆమె బహిష్టు సమయంలో జరిగినట్టే అది అశుద్ధం అవుతుంది.
Trong trọn lúc lưu huyết, bất k” giường nào người nằm trên sẽ như cái giường của k” kinh nguyệt, và mọi vật nào người ngồi trên, đều sẽ bị ô uế như trong k” kinh nguyệt vậy.
27 ౨౭ వీటిని ముట్టుకునే వాడు అశుద్ధుడు. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
Ai đụng đến các vật đó sẽ bị ô uế; phải giặt quần áo mình, tắm trong nước, và bị ô uế đến chiều tối.
28 ౨౮ ఆమె స్రావం నిలిచిపోయి ఆమె శుద్ధురాలైతే దానికి ఏడు రోజులు పడుతుంది. ఆమె ఆ ఏడు రోజులను లెక్క పెట్టుకోవాలి. అవి గడచిన తరువాత ఆమె శుద్ధురాలు అవుతుంది.
Khi nào huyết người nữ cầm lại rồi, phải tính từ ngày lành đến bảy ngày, đoạn sẽ được tinh sạch.
29 ౨౯ ఎనిమిదో రోజు ఆమె రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారంలో యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి.
Qua ngày thứ tám, người bắt hai con chim cu, hoặc hai con bò câu con, đem đến thầy tế lễ tại cửa hội mạc.
30 ౩౦ యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. ఆమెకు జరిగిన మలినకరమైన రక్త స్రావం విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి.
Thầy tế lễ phải dâng con nầy làm của lễ chuộc tội, và con kia làm của lễ thiêu; vậy, thầy tế lễ vì cớ sự lưu huyết ô uế người sẽ làm lễ chuộc tội cho người trước mặt Đức Giê-hô-va.
31 ౩౧ నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నాను. తమ అశుద్ధతతో వాళ్ళు నా నివాస స్థలాన్ని పాడు చేయకూడదు. వాళ్ళు తమ అశుద్ధతతో నా నివాస స్థలాన్ని పాడు చేసి చనిపోకుండా మీరు వారి అశుద్ధతని వాళ్ళకి దూరం చేయాలి.
Thế thì, các ngươi sẽ phân cách dân Y-sơ-ra-ên ra xa sự ô uế của họ, kẻo họ làm ô uế hội mạc ta vẫn ở giữa họ, mà phải chết trong sự ô uế mình chăng.
32 ౩౨ శరీరంలో స్రావం జరిగే వాణ్ణి గూర్చీ, వీర్యస్కలనమై అశుద్ధుడయ్యే వాణ్ణి గూర్చీ,
Đó là luật lệ về người nào bị bịnh bạch trược hay là vì cớ di tinh bị ô uế,
33 ౩౩ బహిష్టుగా ఉన్న స్త్రీ గూర్చీ, స్రావం జరిగే స్త్రీ పురుషులను గూర్చీ, అశుద్ధంగా ఉన్న స్త్రీతో సంభోగించే వాణ్ని గూర్చీ విధించిన నిబంధనలు ఇవి.”
về người nữ có k” kinh nguyệt, về mọi người, hoặc nam hay nữ, bị bạch trược, và về người nam giao cấu cùng người nữ trong khi kinh nguyệt.

< లేవీయకాండము 15 >