< లేవీయకాండము 13 >

1 యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పాడు.
וַיְדַבֵּר יְהוָה אֶל־מֹשֶׁה וְאֶֽל־אַהֲרֹן לֵאמֹֽר׃
2 “ఒక వ్యక్తి చర్మం పైన వాపు గానీ, ఎండిన పొక్కు గానీ, నిగనిగలాడే మచ్చ గానీ ఉండి అది చర్మ వ్యాధిగా మారితే అతణ్ణి ప్రధాన యాజకుడైన అహరోను దగ్గరికి గానీ, యాజకులైన అతని కొడుకుల దగ్గరికి గానీ తీసుకు రావాలి.
אָדָם כִּֽי־יִהְיֶה בְעוֹר־בְּשָׂרוֹ שְׂאֵת אֽוֹ־סַפַּחַת אוֹ בַהֶרֶת וְהָיָה בְעוֹר־בְּשָׂרוֹ לְנֶגַע צָרָעַת וְהוּבָא אֶל־אַהֲרֹן הַכֹּהֵן אוֹ אֶל־אַחַד מִבָּנָיו הַכֹּהֲנִֽים׃
3 అప్పుడు ఆ యాజకుడు అతని చర్మంపై ఉన్న వ్యాధిని పరీక్ష చేస్తాడు. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంపైన వెంట్రుకలు తెల్లగా మారి, ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పిస్తే అది అంటువ్యాధి. యాజకుడు అతణ్ణి పరీక్ష చేసిన తరువాత అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి.
וְרָאָה הַכֹּהֵן אֶת־הַנֶּגַע בְּעֽוֹר־הַבָּשָׂר וְשֵׂעָר בַּנֶּגַע הָפַךְ ׀ לָבָן וּמַרְאֵה הַנֶּגֶע עָמֹק מֵעוֹר בְּשָׂרוֹ נֶגַע צָרַעַת הוּא וְרָאָהוּ הַכֹּהֵן וְטִמֵּא אֹתֽוֹ׃
4 ఒకవేళ నిగనిగలాడే మచ్చ చర్మం పైన తెల్లగా కన్పించి, అది లోతుగా లేకుండా, అక్కడి చర్మం పై వెంట్రుకలు తెల్లగా మారకుండా ఉంటే యాజకుడు ఆ వ్యక్తిని ఏడు రోజులు వేరుగా, ఒంటరిగా ఉంచాలి.
וְאִם־בַּהֶרֶת לְבָנָה הִוא בְּעוֹר בְּשָׂרוֹ וְעָמֹק אֵין־מַרְאֶהָ מִן־הָעוֹר וּשְׂעָרָה לֹא־הָפַךְ לָבָן וְהִסְגִּיר הַכֹּהֵן אֶת־הַנֶּגַע שִׁבְעַת יָמִֽים׃
5 ఏడో రోజు యాజకుడు అతణ్ణి తిరిగి పరీక్షించాలి. తన దృష్టిలో వ్యాధి ముదరకుండా, ఆ మచ్చ వ్యాపించకుండా ఉందేమో చూడాలి. ఆ మచ్చ చర్మంపై వ్యాపించకుండా ఉంటే యాజకుడు మరో ఏడు రోజులు అతణ్ణి వేరుగా ఉంచాలి.
וְרָאָהוּ הַכֹּהֵן בַּיּוֹם הַשְּׁבִיעִי וְהִנֵּה הַנֶּגַע עָמַד בְּעֵינָיו לֹֽא־פָשָׂה הַנֶּגַע בָּעוֹר וְהִסְגִּירוֹ הַכֹּהֵן שִׁבְעַת יָמִים שֵׁנִֽית׃
6 ఏడో రోజు యాజకుడు అతణ్ణి రెండోసారి పరీక్షించాలి. వ్యాధి తగ్గి ఆ మచ్చ చర్మం పైన వ్యాపించకుండా ఉంటే అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. అది పొక్కు మాత్రమే. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. అప్పుడు శుద్ధుడుగా ఉంటాడు.
וְרָאָה הַכֹּהֵן אֹתוֹ בַּיּוֹם הַשְּׁבִיעִי שֵׁנִית וְהִנֵּה כֵּהָה הַנֶּגַע וְלֹא־פָשָׂה הַנֶּגַע בָּעוֹר וְטִהֲרוֹ הַכֹּהֵן מִסְפַּחַת הִיא וְכִבֶּס בְּגָדָיו וְטָהֵֽר׃
7 అయితే అతడు తన శుద్ధి కోసం యాజకుడికి కన్పించిన తరువాత ఆ మచ్చ చర్మంపైన వ్యాపిస్తే యాజకుడికి మరో సారి కనిపించాలి.
וְאִם־פָּשֹׂה תִפְשֶׂה הַמִּסְפַּחַת בָּעוֹר אַחֲרֵי הֵרָאֹתוֹ אֶל־הַכֹּהֵן לְטָהֳרָתוֹ וְנִרְאָה שֵׁנִית אֶל־הַכֹּהֵֽן׃
8 అప్పుడు ఆ మచ్చ చర్మం పైన ఇంకా వ్యాపించి ఉంటే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి.
וְרָאָה הַכֹּהֵן וְהִנֵּה פָּשְׂתָה הַמִּסְפַּחַת בָּעוֹר וְטִמְּאוֹ הַכֹּהֵן צָרַעַת הִֽוא׃
9 ఎవరికైనా చర్మంపైన పొడలా కన్పిస్తే అతణ్ణి యాజకుడి దగ్గరకి తీసుకురావాలి.
נֶגַע צָרַעַת כִּי תִהְיֶה בְּאָדָם וְהוּבָא אֶל־הַכֹּהֵֽן׃
10 ౧౦ యాజకుడు ఏదన్నా వాపు చర్మంపైన తెల్లగా కన్పిస్తుందేమో చూడాలి. అక్కడి వెంట్రుకలు తెల్లగా మారి, ఆ వాపు రేగి పుండులా కన్పిస్తుందేమో చూడాలి.
וְרָאָה הַכֹּהֵן וְהִנֵּה שְׂאֵת־לְבָנָה בָּעוֹר וְהִיא הָפְכָה שֵׂעָר לָבָן וּמִֽחְיַת בָּשָׂר חַי בַּשְׂאֵֽת׃
11 ౧౧ ఈ సూచనలు కన్పిస్తే అది తీవ్రమైన చర్మవ్యాధి. యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అతడు అప్పటికే అశుద్ధుడు కాబట్టి అతణ్ణి వేరుగా ఉంచకూడదు.
צָרַעַת נוֹשֶׁנֶת הִוא בְּעוֹר בְּשָׂרוֹ וְטִמְּאוֹ הַכֹּהֵן לֹא יַסְגִּרֶנּוּ כִּי טָמֵא הֽוּא׃
12 ౧౨ ఆ చర్మ వ్యాధి మరింత తీవ్రమై ఆ వ్యక్తి తలనుండి కాలి వరకూ వ్యాపిస్తే, అలా యాజకుడికి కూడా అనిపిస్తే, అప్పుడు యాజకుడు వ్యాధి ఆ వ్యక్తి శరీరమంతా వ్యాపించిందేమో పరీక్ష చేయాలి.
וְאִם־פָּרוֹחַ תִּפְרַח הַצָּרַעַת בָּעוֹר וְכִסְּתָה הַצָּרַעַת אֵת כָּל־עוֹר הַנֶּגַע מֵרֹאשׁוֹ וְעַד־רַגְלָיו לְכָל־מַרְאֵה עֵינֵי הַכֹּהֵֽן׃
13 ౧౩ ఆ చర్మ వ్యాధి అతని శరీరమంతా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. ఒళ్ళంతా తెల్లబారితే అతడు శుద్ధుడు.
וְרָאָה הַכֹּהֵן וְהִנֵּה כִסְּתָה הַצָּרַעַת אֶת־כָּל־בְּשָׂרוֹ וְטִהַר אֶת־הַנָּגַע כֻּלּוֹ הָפַךְ לָבָן טָהוֹר הֽוּא׃
14 ౧౪ ఒకవేళ అతని ఒంటిపై చర్మం రేగి పుండు అయితే అతడు అశుద్ధుడు.
וּבְיוֹם הֵרָאוֹת בּוֹ בָּשָׂר חַי יִטְמָֽא׃
15 ౧౫ యాజకుడు చర్మంపై పచ్చి పుండు చూసి అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. ఎందుకంటే రేగిన చర్మం, పచ్చి పుండు అశుద్ధమే. అది అంటువ్యాధి.
וְרָאָה הַכֹּהֵן אֶת־הַבָּשָׂר הַחַי וְטִמְּאוֹ הַבָּשָׂר הַחַי טָמֵא הוּא צָרַעַת הֽוּא׃
16 ౧౬ అయితే ఒకవేళ ఆ పుండు ఎండిపోయి చర్మం తిరిగి తెల్లగా కన్పిస్తే ఆ వ్యక్తి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి.
אוֹ כִי יָשׁוּב הַבָּשָׂר הַחַי וְנֶהְפַּךְ לְלָבָן וּבָא אֶל־הַכֹּהֵֽן׃
17 ౧౭ యాజకుడు అతని చర్మం తెల్లగా మారిందేమో చూస్తాడు. అది తెల్లబారితే ఆ వ్యక్తి శుద్ధుడని ప్రకటిస్తాడు.
וְרָאָהוּ הַכֹּהֵן וְהִנֵּה נֶהְפַּךְ הַנֶּגַע לְלָבָן וְטִהַר הַכֹּהֵן אֶת־הַנֶּגַע טָהוֹר הֽוּא׃
18 ౧౮ ఒక వ్యక్తి చర్మం పైన పుండు వచ్చి అది మానిపోతే
וּבָשָׂר כִּֽי־יִהְיֶה בֽוֹ־בְעֹרוֹ שְׁחִין וְנִרְפָּֽא׃
19 ౧౯ ఆ పుండు ఉన్న ప్రాంతంలో తెల్లని వాపుగానీ, నిగనిగలాడే మచ్చ గానీ, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చ గానీ కన్పిస్తే దాన్ని యాజకుడికి చూపించాలి.
וְהָיָה בִּמְקוֹם הַשְּׁחִין שְׂאֵת לְבָנָה אוֹ בַהֶרֶת לְבָנָה אֲדַמְדָּמֶת וְנִרְאָה אֶל־הַכֹּהֵֽן׃
20 ౨౦ ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కన్పిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. ఒకవేళ అలా ఉంటే అతణ్ణి అశుద్ధుడని ప్రకటించాలి. పుండు ఉన్నచోటే అది కన్పిస్తే అది అంటురోగం.
וְרָאָה הַכֹּהֵן וְהִנֵּה מַרְאֶהָ שָׁפָל מִן־הָעוֹר וּשְׂעָרָהּ הָפַךְ לָבָן וְטִמְּאוֹ הַכֹּהֵן נֶֽגַע־צָרַעַת הִוא בַּשְּׁחִין פָּרָֽחָה׃
21 ౨౧ యాజకుడు పరీక్షించినప్పుడు ఆ మచ్చపైన వెంట్రుకలు తెల్లగా మారకుండా, అది చర్మం పైన లోతుగా కాకుండా మానిపోతున్నట్టు కన్పిస్తే అతణ్ణి ఏడు రోజులపాటు వేరుగా, ఒంటరిగా ఉంచాలి.
וְאִם ׀ יִרְאֶנָּה הַכֹּהֵן וְהִנֵּה אֵֽין־בָּהּ שֵׂעָר לָבָן וּשְׁפָלָה אֵינֶנָּה מִן־הָעוֹר וְהִיא כֵהָה וְהִסְגִּירוֹ הַכֹּהֵן שִׁבְעַת יָמִֽים׃
22 ౨౨ తరువాత అది చర్మం అంతటా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అది ఒక అంటు వ్యాధి.
וְאִם־פָּשֹׂה תִפְשֶׂה בָּעוֹר וְטִמֵּא הַכֹּהֵן אֹתוֹ נֶגַע הִֽוא׃
23 ౨౩ నిగనిగలాడే మచ్చ అలాగే ఉండిపోయి వ్యాపించకుండా ఉంటే అది పుండు మానిన మచ్చ. యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి.
וְאִם־תַּחְתֶּיהָ תַּעֲמֹד הַבַּהֶרֶת לֹא פָשָׂתָה צָרֶבֶת הַשְּׁחִין הִוא וְטִהֲרוֹ הַכֹּהֵֽן׃
24 ౨౪ చర్మంపైన కాలిన గాయమై ఆ కాలిన చోట నిగనిగలాడే తెల్లని మచ్చ కానీ, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చగానీ ఉంటే యాజకుడు దాన్ని పరీక్షించాలి.
אוֹ בָשָׂר כִּֽי־יִהְיֶה בְעֹרוֹ מִכְוַת־אֵשׁ וְֽהָיְתָה מִֽחְיַת הַמִּכְוָה בַּהֶרֶת לְבָנָה אֲדַמְדֶּמֶת אוֹ לְבָנָֽה׃
25 ౨౫ ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కన్పిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. అలా ఉంటే అది అంటువ్యాధి. అది కాలిన గాయంలోనుండి బయటకు వచ్చింది. అప్పుడు యాజకుడు ఆ వ్యక్తిని అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి.
וְרָאָה אֹתָהּ הַכֹּהֵן וְהִנֵּה נֶהְפַּךְ שֵׂעָר לָבָן בַּבַּהֶרֶת וּמַרְאֶהָ עָמֹק מִן־הָעוֹר צָרַעַת הִוא בַּמִּכְוָה פָּרָחָה וְטִמֵּא אֹתוֹ הַכֹּהֵן נֶגַע צָרַעַת הִֽוא׃
26 ౨౬ అయితే యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు నిగనిగలాడే మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకపోయినా, మచ్చ లోతుగా లేకుండా గాయం మానినట్టు కన్పిస్తున్నా అతణ్ణి ఏడు రోజులు ఒంటరిగా, వేరుగా ఉంచాలి.
וְאִם ׀ יִרְאֶנָּה הַכֹּהֵן וְהִנֵּה אֵֽין־בַּבֶּהֶרֶת שֵׂעָר לָבָן וּשְׁפָלָה אֵינֶנָּה מִן־הָעוֹר וְהִוא כֵהָה וְהִסְגִּירוֹ הַכֹּהֵן שִׁבְעַת יָמִֽים׃
27 ౨౭ ఏడో రోజు యాజకుడు అతణ్ణి పరీక్షించినప్పుడు ఆ వ్యాధి చర్మం అంతా వ్యాపిస్తే అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి.
וְרָאָהוּ הַכֹּהֵן בַּיּוֹם הַשְּׁבִיעִי אִם־פָּשֹׂה תִפְשֶׂה בָּעוֹר וְטִמֵּא הַכֹּהֵן אֹתוֹ נֶגַע צָרַעַת הִֽוא׃
28 ౨౮ అయితే నిగనిగలాడే మచ్చ చర్మం అంతా వ్యాపించకుండా అలాగే ఉండి మానినట్టు కన్పిస్తే అది కాలిన గాయం వల్ల కలిగిన వాపు. యాజకుడు అతణ్ణి శుద్ధుడుగా నిర్థారించాలి. అది కేవలం కాలడం మూలాన కలిగిన మచ్చ మాత్రమే.
וְאִם־תַּחְתֶּיהָ תַעֲמֹד הַבַּהֶרֶת לֹא־פָשְׂתָה בָעוֹר וְהִוא כֵהָה שְׂאֵת הַמִּכְוָה הִוא וְטִֽהֲרוֹ הַכֹּהֵן כִּֽי־צָרֶבֶת הַמִּכְוָה הִֽוא׃
29 ౨౯ మగవాళ్ళకైనా, ఆడవాళ్లకైనా తలలో గానీ, గడ్డంలో గానీ ఏదన్నా అంటువ్యాధి వస్తే యాజకుడు దాన్ని పరీక్షించాలి.
וְאִישׁ אוֹ אִשָּׁה כִּֽי־יִהְיֶה בוֹ נָגַע בְּרֹאשׁ אוֹ בְזָקָֽן׃
30 ౩౦ అది చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పించినా, లేదా దానిపై వెంట్రుకలు పసుపు పచ్చగా మారినా ఆ వ్యక్తిని యాజకుడు అశుద్ధుడనీ, అశుద్ధురాలనీ నిర్థారించాలి. తలలో లేదా గడ్డంలో అది దురద పుట్టించే ఒక అంటువ్యాది.
וְרָאָה הַכֹּהֵן אֶת־הַנֶּגַע וְהִנֵּה מַרְאֵהוּ עָמֹק מִן־הָעוֹר וּבוֹ שֵׂעָר צָהֹב דָּק וְטִמֵּא אֹתוֹ הַכֹּהֵן נֶתֶק הוּא צָרַעַת הָרֹאשׁ אוֹ הַזָּקָן הֽוּא׃
31 ౩౧ ఏదైనా మచ్చ దురద పుట్టేదిగా ఉన్నప్పుడు యాజకుడు ఆ మచ్చని పరీక్షించాలి. ఆ మచ్చ చర్మంలో లోతుగా లేకపోయినా, దానిపై నల్ల వెంట్రుకలు లేకపోయినా యాజకుడు ఆ దురద మచ్చ వ్యాధి ఉన్న వ్యక్తిని ఏడు రోజుల పాటు ఒంటరిగా, వేరుగా ఉంచాలి.
וְכִֽי־יִרְאֶה הַכֹּהֵן אֶת־נֶגַע הַנֶּתֶק וְהִנֵּה אֵין־מַרְאֵהוּ עָמֹק מִן־הָעוֹר וְשֵׂעָר שָׁחֹר אֵין בּוֹ וְהִסְגִּיר הַכֹּהֵן אֶת־נֶגַע הַנֶּתֶק שִׁבְעַת יָמִֽים׃
32 ౩౨ ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంలో పసుపు పచ్చ వెంట్రుకలు లేకపోయినా, ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కన్పిస్తున్నా అతనికి జుట్టు కత్తిరించాలి.
וְרָאָה הַכֹּהֵן אֶת־הַנֶּגַע בַּיּוֹם הַשְּׁבִיעִי וְהִנֵּה לֹא־פָשָׂה הַנֶּתֶק וְלֹא־הָיָה בוֹ שֵׂעָר צָהֹב וּמַרְאֵה הַנֶּתֶק אֵין עָמֹק מִן־הָעֽוֹר׃
33 ౩౩ వ్యాధి మచ్చ ఉన్నచోట మాత్రం జుట్టు కత్తిరించకూడదు. యాజకుడు ఆ మచ్చ ఉన్న వ్యక్తిని మరో ఏడు రోజులు ఒంటరిగా, వేరుగా ఉంచాలి.
וְהִתְגַּלָּח וְאֶת־הַנֶּתֶק לֹא יְגַלֵּחַ וְהִסְגִּיר הַכֹּהֵן אֶת־הַנֶּתֶק שִׁבְעַת יָמִים שֵׁנִֽית׃
34 ౩౪ ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కనిపిస్తూ ఉంటే యాజకుడు అతణ్ణి శుద్ధుడిగా నిర్థారించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు.
וְרָאָה הַכֹּהֵן אֶת־הַנֶּתֶק בַּיּוֹם הַשְּׁבִיעִי וְהִנֵּה לֹא־פָשָׂה הַנֶּתֶק בָּעוֹר וּמַרְאֵהוּ אֵינֶנּוּ עָמֹק מִן־הָעוֹר וְטִהַר אֹתוֹ הַכֹּהֵן וְכִבֶּס בְּגָדָיו וְטָהֵֽר׃
35 ౩౫ ఒకవేళ అతడు శుద్ధుడని నిర్ధారించిన తరువాత ఆ వ్యాధి మచ్చ ఎక్కువగా వ్యాపిస్తే యాజకుడు తిరిగి అతణ్ణి పరీక్షించాలి.
וְאִם־פָּשֹׂה יִפְשֶׂה הַנֶּתֶק בָּעוֹר אַחֲרֵי טָהֳרָתֽוֹ׃
36 ౩౬ ఒకవేళ ఆ వ్యాధి చర్మంపైన వ్యాపిస్తే యాజకుడు పసుపుపచ్చ వెంట్రుకల కోసం వెదకాల్సిన పని లేదు. అతడు అశుద్ధుడే.
וְרָאָהוּ הַכֹּהֵן וְהִנֵּה פָּשָׂה הַנֶּתֶק בָּעוֹר לֹֽא־יְבַקֵּר הַכֹּהֵן לַשֵּׂעָר הַצָּהֹב טָמֵא הֽוּא׃
37 ౩౭ అయితే ఆ దురద వ్యాధి వ్యాప్తి నిలిచిపోయిందనీ, ఆ వ్యాధి మచ్చలో నల్ల వెంట్రుకలు మొలుస్తున్నాయనీ యాజకుడికి అన్పిస్తే ఆ వ్యాధి నయం అయినట్టే. అతడు శుద్ధుడే. యాజకుడు అతడు శుద్ధుడని నిర్థారించాలి.
וְאִם־בְּעֵינָיו עָמַד הַנֶּתֶק וְשֵׂעָר שָׁחֹר צָֽמַח־בּוֹ נִרְפָּא הַנֶּתֶק טָהוֹר הוּא וְטִהֲרוֹ הַכֹּהֵֽן׃
38 ౩౮ మగవాళ్ళకైనా, ఆడవాళ్లకైనా చర్మం పైన నిగనిగలాడే తెల్లని మచ్చలు ఏర్పడితే యాజకుడు వాళ్ళని పరీక్షించాలి.
וְאִישׁ אֽוֹ־אִשָּׁה כִּֽי־יִהְיֶה בְעוֹר־בְּשָׂרָם בֶּהָרֹת בֶּהָרֹת לְבָנֹֽת׃
39 ౩౯ ఆ నిగనిగలాడే మచ్చలు అస్పష్టంగా ఉంటే చర్మం లోనుండి వచ్చిన పొక్కు మాత్రమే. వాళ్ళు శుద్ధులే అవుతారు.
וְרָאָה הַכֹּהֵן וְהִנֵּה בְעוֹר־בְּשָׂרָם בֶּהָרֹת כֵּהוֹת לְבָנֹת בֹּהַק הוּא פָּרַח בָּעוֹר טָהוֹר הֽוּא׃
40 ౪౦ మగవాడి తల వెంట్రుకలు రాలిపోతే అతనిది బట్టతల. అయినా అతడు శుద్ధుడే.
וְאִישׁ כִּי יִמָּרֵט רֹאשׁוֹ קֵרֵחַ הוּא טָהוֹר הֽוּא׃
41 ౪౧ ముఖం వైపు ఉన్న జుట్టు రాలిపోతే అతడిది బోడి నొసలు. అతడు శుద్ధుడే.
וְאִם מִפְּאַת פָּנָיו יִמָּרֵט רֹאשׁוֹ גִּבֵּחַ הוּא טָהוֹר הֽוּא׃
42 ౪౨ అయితే ఒక వ్యక్తి బట్టతలపై గానీ, నొసటిపైన గానీ ఎరుపు చాయలో తెల్లని మచ్చ ఏర్పడితే అది అంటువ్యాధి.
וְכִֽי־יִהְיֶה בַקָּרַחַת אוֹ בַגַּבַּחַת נֶגַע לָבָן אֲדַמְדָּם צָרַעַת פֹּרַחַת הִוא בְּקָרַחְתּוֹ אוֹ בְגַבַּחְתּֽוֹ׃
43 ౪౩ అతని బట్టతలపై గానీ నొసటిపై గానీ వ్యాధి వచ్చిన ప్రాంతంలో ఏర్పడిన వాపు చర్మంలో అంటువ్యాధిని సూచిస్తుందేమో యాజకుడు పరీక్షించాలి.
וְרָאָה אֹתוֹ הַכֹּהֵן וְהִנֵּה שְׂאֵת־הַנֶּגַע לְבָנָה אֲדַמְדֶּמֶת בְּקָרַחְתּוֹ אוֹ בְגַבַּחְתּוֹ כְּמַרְאֵה צָרַעַת עוֹר בָּשָֽׂר׃
44 ౪౪ ఆ వాపు అలా సూచిస్తుంటే అతనికి వచ్చింది అంటువ్యాధి. అతడు అశుద్ధుడు. అతని తలపై ఉన్న వ్యాధి కారణంగా యాజకుడు అతణ్ణి అశుద్ధుడుగా ప్రకటించాలి.
אִישׁ־צָרוּעַ הוּא טָמֵא הוּא טַמֵּא יְטַמְּאֶנּוּ הַכֹּהֵן בְּרֹאשׁוֹ נִגְעֽוֹ׃
45 ౪౫ ఆ అంటువ్యాధి ఉన్న వ్యక్తి బట్టలను చించివేయాలి. అతడు తన తలని విరబోసుకోవాలి. అతడు తన కింది పెదవిని కప్పుకుని ‘అశుద్ధుణ్ణి! అశుద్ధుణ్ణి!’ అని కేకలు పెట్టాలి.
וְהַצָּרוּעַ אֲשֶׁר־בּוֹ הַנֶּגַע בְּגָדָיו יִהְיוּ פְרֻמִים וְרֹאשׁוֹ יִהְיֶה פָרוּעַ וְעַל־שָׂפָם יַעְטֶה וְטָמֵא ׀ טָמֵא יִקְרָֽא׃
46 ౪౬ ఆ అంటువ్యాధి ఉన్నన్ని రోజులూ అతడు అశుద్ధుడుగానే ఉంటాడు. అతనికి అంటురోగం వచ్చి అశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఒంటరిగానే ఉండాలి. శిబిరం బయట అతడు నివసించాలి.
כָּל־יְמֵי אֲשֶׁר הַנֶּגַע בּוֹ יִטְמָא טָמֵא הוּא בָּדָד יֵשֵׁב מִחוּץ לַֽמַּחֲנֶה מוֹשָׁבֽוֹ׃
47 ౪౭ ఏదైనా బట్టలకు బూజు పడితే అది ఉన్ని అయినా నార బట్టలైనా,
וְהַבֶּגֶד כִּֽי־יִהְיֶה בוֹ נֶגַע צָרָעַת בְּבֶגֶד צֶמֶר אוֹ בְּבֶגֶד פִּשְׁתִּֽים׃
48 ౪౮ లేదా నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా
אוֹ בִֽשְׁתִי אוֹ בְעֵרֶב לַפִּשְׁתִּים וְלַצָּמֶר אוֹ בְעוֹר אוֹ בְּכָל־מְלֶאכֶת עֽוֹר׃
49 ౪౯ వాటిపైన పచ్చని లేదా ఎర్రని మాలిన్యం ఏర్పడి, వ్యాపిస్తే అది బూజు, తెగులు. దాన్ని యాజకుడికి చూపించాలి.
וְהָיָה הַנֶּגַע יְרַקְרַק ׀ אוֹ אֲדַמְדָּם בַּבֶּגֶד אוֹ בָעוֹר אֽוֹ־בַשְּׁתִי אוֹ־בָעֵרֶב אוֹ בְכָל־כְּלִי־עוֹר נֶגַע צָרַעַת הוּא וְהָרְאָה אֶת־הַכֹּהֵֽן׃
50 ౫౦ యాజకుడు ఆ తెగులు కోసం ఆ వస్తువుని పరీక్షించాలి. ఆ తెగులు పట్టిన దాన్ని ఏడురోజుల పాటు వేరుగా ఉంచాలి.
וְרָאָה הַכֹּהֵן אֶת־הַנָּגַע וְהִסְגִּיר אֶת־הַנֶּגַע שִׁבְעַת יָמִֽים׃
51 ౫౧ ఏడో రోజు తిరిగి ఆ తెగులు కోసం పరీక్షించాలి. నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించినట్టు కన్పిస్తే అది హానికరమైన తెగులు. అది అశుద్ధం.
וְרָאָה אֶת־הַנֶּגַע בַּיּוֹם הַשְּׁבִיעִי כִּֽי־פָשָׂה הַנֶּגַע בַּבֶּגֶד אֽוֹ־בַשְּׁתִי אֽוֹ־בָעֵרֶב אוֹ בָעוֹר לְכֹל אֲשֶׁר־יֵעָשֶׂה הָעוֹר לִמְלָאכָה צָרַעַת מַמְאֶרֶת הַנֶּגַע טָמֵא הֽוּא׃
52 ౫౨ కాబట్టి అతడు నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా హానికరమైన తెగులు కన్పించిన దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. ఎందుకంటే అది వ్యాధికి దారితీస్తుంది. దాన్ని సంపూర్ణంగా తగలబెట్టాలి.
וְשָׂרַף אֶת־הַבֶּגֶד אוֹ אֶֽת־הַשְּׁתִי ׀ אוֹ אֶת־הָעֵרֶב בַּצֶּמֶר אוֹ בַפִּשְׁתִּים אוֹ אֶת־כָּל־כְּלִי הָעוֹר אֲשֶׁר־יִהְיֶה בוֹ הַנָּגַע כִּֽי־צָרַעַת מַמְאֶרֶת הִוא בָּאֵשׁ תִּשָּׂרֵֽף׃
53 ౫౩ అయితే యాజకుడు పరీక్షించినప్పుడు నారతో వెంట్రుకలతో, తోలుతో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించకపొతే
וְאִם יִרְאֶה הַכֹּהֵן וְהִנֵּה לֹא־פָשָׂה הַנֶּגַע בַּבֶּגֶד אוֹ בַשְּׁתִי אוֹ בָעֵרֶב אוֹ בְּכָל־כְּלִי־עֽוֹר׃
54 ౫౪ యాజకుడు ఆ తెగులు పట్టిన దాన్ని ఉతకమని ఆజ్ఞాపించాలి. దాన్ని మరో ఏడు రోజులు విడిగా ఉంచాలి.
וְצִוָּה הַכֹּהֵן וְכִבְּסוּ אֵת אֲשֶׁר־בּוֹ הַנָּגַע וְהִסְגִּירוֹ שִׁבְעַת־יָמִים שֵׁנִֽית׃
55 ౫౫ ఆ తరువాత తెగులు పట్టిన ఆ వస్తువుని యాజకుడు పరీక్షించాలి. ఆ తెగులు రంగు మారకపోయినా, వ్యాపించక పోయినా అలాగే ఉంటే అది అశుద్ధం. దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. ఆ తెగులు ఎక్కడ పట్టినా, ఆ వస్తువుని సంపూర్ణంగా కాల్చేయాలి.
וְרָאָה הַכֹּהֵן אַחֲרֵי ׀ הֻכַּבֵּס אֶת־הַנֶּגַע וְהִנֵּה לֹֽא־הָפַךְ הַנֶּגַע אֶת־עֵינוֹ וְהַנֶּגַע לֹֽא־פָשָׂה טָמֵא הוּא בָּאֵשׁ תִּשְׂרְפֶנּוּ פְּחֶתֶת הִוא בְּקָרַחְתּוֹ אוֹ בְגַבַּחְתּֽוֹ׃
56 ౫౬ ఒకవేళ ఆ బట్టని ఉతికిన తరువాత యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు ఆ తెగులు అస్పష్టంగా కన్పిస్తే అది బట్టలైనా, పడుగైనా, పేక అయినా, తోలు అయినా దాన్ని యాజకుడు చించివేయాలి.
וְאִם רָאָה הַכֹּהֵן וְהִנֵּה כֵּהָה הַנֶּגַע אַחֲרֵי הֻכַּבֵּס אֹתוֹ וְקָרַע אֹתוֹ מִן־הַבֶּגֶד אוֹ מִן־הָעוֹר אוֹ מִן־הַשְּׁתִי אוֹ מִן־הָעֵֽרֶב׃
57 ౫౭ ఆ తరువాత ఆ తెగులు నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగులోనో, పేకలోనో, వస్తువుపైనో, బట్టలపైనో ఇంకా కన్పిస్తే అది వ్యాపిస్తుందని అర్థం. అప్పుడు ఆ తెగులును పూర్తిగా కాల్చేయాలి.
וְאִם־תֵּרָאֶה עוֹד בַּבֶּגֶד אֽוֹ־בַשְּׁתִי אֽוֹ־בָעֵרֶב אוֹ בְכָל־כְּלִי־עוֹר פֹּרַחַת הִוא בָּאֵשׁ תִּשְׂרְפֶנּוּ אֵת אֲשֶׁר־בּוֹ הַנָּֽגַע׃
58 ౫౮ నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా, బట్టలైనా ఉతికిన తరువాత తెగులు కన్పించకుంటే ఆ వస్తువునో, బట్టనో రెండోసారి ఉతికించాలి. అప్పుడు అది శుద్ధం అవుతుంది.
וְהַבֶּגֶד אֽוֹ־הַשְּׁתִי אוֹ־הָעֵרֶב אֽוֹ־כָל־כְּלִי הָעוֹר אֲשֶׁר תְּכַבֵּס וְסָר מֵהֶם הַנָּגַע וְכֻבַּס שֵׁנִית וְטָהֵֽר׃
59 ౫౯ ఉన్ని బట్టల పైనో, నార బట్టలపైనో, పడుగుపైనో, పేకపైనో తోలు వస్తువులపైనో బూజూ, తెగులూ కన్పించినప్పుడు వాటిని అశుద్ధం అనో శుద్ధం అనో ప్రకటించడానికి ఉద్దేశించిన చట్టం ఇది.”
זֹאת תּוֹרַת נֶֽגַע־צָרַעַת בֶּגֶד הַצֶּמֶר ׀ אוֹ הַפִּשְׁתִּים אוֹ הַשְּׁתִי אוֹ הָעֵרֶב אוֹ כָּל־כְּלִי־עוֹר לְטַהֲרוֹ אוֹ לְטַמְּאֽוֹ׃

< లేవీయకాండము 13 >