< లేవీయకాండము 10 >
1 ౧ నాదాబు అబీహులు అహరోను కొడుకులు. వీళ్ళు తమ ధూపం వేసే పాత్రల్లో నిప్పులు ఉంచి వాటిపై ధూప ద్రవ్యాన్ని వేశారు. యెహోవా ఆదేశించని వేరే అగ్నిని ఆయన సమక్షంలోకి తీసుకు వచ్చారు.
Και λαβόντες οι υιοί του Ααρών, Ναδάβ και Αβιούδ, έκαστος το θυμιατήριον αυτού, έβαλον πυρ εις αυτό, και επ' αυτό έβαλον θυμίαμα και προσέφεραν ενώπιον του Κυρίου πυρ ξένον, το οποίον δεν προσέταξεν εις αυτούς.
2 ౨ దాంతో యెహోవా సమక్షంలో నుండి మంటలు వచ్చి వాళ్ళని కాల్చి వేశాయి. యెహోవా సమక్షంలోనే వాళ్ళు చనిపోయారు.
Και εξήλθε πυρ παρά του Κυρίου και κατέφαγεν αυτούς· και απέθανον έμπροσθεν του Κυρίου.
3 ౩ అప్పుడు మోషే అహరోనుతో “నాకు సమీపంగా ఉన్నవారికి నా పవిత్రతని చూపిస్తాను. ప్రజలందరి ముందూ నేను మహిమ పొందుతాను అని యెహోవా చెప్పిన మాటకి అర్థం ఇదే” అన్నాడు. అహరోను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు.
Τότε είπεν ο Μωϋσής προς τον Ααρών, Τούτο είναι το οποίον είπεν ο Κύριος, λέγων, Εγώ θέλω αγιασθή εις τους πλησιάζοντας εις εμέ, και έμπροσθεν παντός του λαού θέλω δοξασθή. Και ο Ααρών εσιώπησε.
4 ౪ అప్పుడు మోషే అహరోను బాబాయి ఉజ్జీయేలు కొడుకులు మీషాయేలునూ, ఎల్సాఫానునూ పిలిపించి వాళ్ళకిలా చెప్పాడు. “మీరు ఇక్కడికి రండి. ప్రత్యక్ష గుడారం ఎదుట నుండి మీ సోదరులను శిబిరం బయటకు తీసుకుపొండి.”
Και εκάλεσεν ο Μωϋσής τον Μισαήλ και τον Ελισαφάν, υιούς του Οζιήλ, θείου του Ααρών, και είπε προς αυτούς, Πλησιάσατε, σηκώσατε τους αδελφούς σας απ' έμπροσθεν του αγιαστηρίου έξω του στρατοπέδου.
5 ౫ వాళ్ళింకా యాజకుల అంగీలు వేసుకునే ఉన్నారు. అలాగే మోషే ఆదేశించినట్టు వాళ్ళు వచ్చి శిబిరం బయటకు వీళ్ళని మోసుకు వెళ్ళారు.
Και επλησίασαν και εσήκωσαν αυτούς με τους χιτώνας αυτών έξω του στρατοπέδου, καθώς είπεν ο Μωϋσής.
6 ౬ అప్పుడు మోషే అహరోనుతో అతని కొడుకులైన ఎలియాజరు, ఈతామారులతో “మీరు చావకుండా ఉండాలన్నా, యెహోవా ఈ సమాజం పైన కోపగించుకోకుండా ఉండాలన్నా మీరు మీ తలల పైని జుట్టు విరబోసుకోకూడదు. మీ బట్టలు చింపుకోకూడదు. అయితే యెహోవా వారిని కాల్చివేసినందుకు వారి కోసం మీ సోదరులు, ఇశ్రాయేలు సమాజమంతా ఏడవవచ్చు.
Και είπεν ο Μωϋσής προς τον Ααρών και προς τον Ελεάζαρ και προς τον Ιθάμαρ, τους υιούς αυτού, Τας κεφαλάς σας μη αποκαλύψητε, και τα ιμάτιά σας μη διασχίσητε, διά να μη αποθάνητε και έλθη οργή εφ' όλην την συναγωγήν· αλλ' οι αδελφοί σας, πας ο οίκος του Ισραήλ, ας κλαύσωσι το καύσιμον το οποίον έκαμεν ο Κύριος·
7 ౭ యెహోవా అభిషేకపు నూనె మీపైన ఉంది. కాబట్టి మీరు మాత్రం ప్రత్యక్ష గుడారం నుండి బయటకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మీరు చనిపోతారు” అని చెప్పాడు. వాళ్ళు మోషే మాట ప్రకారం చేశారు.
και δεν θέλετε εξέλθει εκ της θύρας της σκηνής του μαρτυρίου, διά να μη αποθάνητε· διότι το έλαιον του χρίσματος του Κυρίου είναι εφ' υμάς. Και έκαμον κατά τον λόγον του Μωϋσέως.
8 ౮ తరువాత యెహోవా అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పాడు.
Και ελάλησε Κύριος προς τον Ααρών, λέγων,
9 ౯ “నువ్వూ నీతో ఉండే నీ కొడుకులూ ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించే సమయంలో ద్రాక్ష మద్యాన్ని గానీ, ఇంకే మత్తు పానీయాలు గానీ తాగవద్దు. అలా చేస్తే మీరు చనిపోతారు.
Οίνον και σίκερα δεν θέλετε πίει, συ, και οι υιοί σου μετά σου, όταν εισέρχησθε εις την σκηνήν του μαρτυρίου, διά να μη αποθάνητε· τούτο θέλει είσθαι νόμιμον αιώνιον εις τας γενεάς σας·
10 ౧౦ మీ రాబోయే తరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం. ప్రతిష్ట చేసిన దాన్ని లౌకికమైన దాని నుండీ, పవిత్రమైన దాన్ని అపవిత్రమైన దాని నుండీ వేరు చెయ్యాలి.
και διά να διακρίνητε μεταξύ αγίου και βεβήλου και μεταξύ ακαθάρτου και καθαρού·
11 ౧౧ యెహోవా మోషే ద్వారా ఆదేశించిన శాసనాలను ఇశ్రాయేలు ప్రజలందరికీ మీరు బోధించాలి.”
και διά να διδάσκητε τους υιούς Ισραήλ πάντα τα διατάγματα, όσα ελάλησε Κύριος προς αυτούς διά χειρός του Μωϋσέως.
12 ౧౨ అప్పుడు మోషే అహరోనుతోనూ, మిగిలి ఉన్న అతని కొడుకులు ఎలియాజరు ఈతామారులతోనూ మాట్లాడాడు. “యెహోవాకు అర్పించిన దహనబలి నుండి మిగిలిన నైవేద్యాన్ని తీసుకుని పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినండి. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైంది.
Και είπεν ο Μωϋσής προς τον Ααρών και προς τον Ελεάζαρ και προς τον Ιθάμαρ, τους υιούς αυτού τους εναπολειφθέντας, Λάβετε την εξ αλφίτων προσφοράν την εναπολειφθείσαν από των διά πυρός γινομένων θυσιών του Κυρίου και φάγετε αυτήν άζυμον πλησίον του θυσιαστηρίου· διότι είναι αγιώτατον·
13 ౧౩ దాన్ని మీరు ఒక పరిశుద్ధ స్థలం లో తినాలి. ఎందుకంటే యెహోవాకు చేసిన దహనబలి అర్పణల్లో అది నీకూ, నీ కొడుకులకూ రావాల్సిన భాగం. మీకు ఈ సంగతి చెప్పాలనే ఆజ్ఞ నేను పొందాను.
και θέλετε φάγει αυτήν εν τόπω αγίω· επειδή είναι το δίκαιόν σου και το δίκαιον των υιών σου εκ των διά πυρός γινομένων θυσιών του Κυρίου· διότι ούτω προσετάχθην·
14 ౧౪ తరువాత కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్నీ, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడ భాగాన్నీ దేవుడు అంగీకరించిన ఒక పవిత్రమైన స్థలంలో మీరు తినాలి. వీటినీ నువ్వూ, నీ కొడుకులూ, నీ కూతుళ్ళూ తినాలి. ఎందుకంటే అవి ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతిబలుల్లో నీకూ, నీ కొడుకులకూ రావాల్సిన భాగం.
και το κινητόν στήθος και τον υψούμενον ώμον θέλετε φάγει εν καθαρώ τόπω, συ και οι υιοί σου και αι θυγατέρες σου μετά σού· διότι είναι το δίκαιόν σου και το δίκαιον των υιών σου, δοθέντα εκ των θυσιών της ειρηνικής προσφοράς των υιών του Ισραήλ·
15 ౧౫ కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్నీ, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడ భాగాన్నీ దహనబలిగా అర్పించిన కొవ్వుతో పాటు వాళ్ళు తీసుకురావాలి. వాటిని యెహోవా ఎదుట పైకెత్తి కదిలించే అర్పణగా తీసుకు రావాలి. యెహోవా ఆజ్ఞాపించినట్టు అవి శాశ్వతంగా నీకూ నీ కొడుకులకూ చెందిన భాగం. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం.”
τον υψούμενον ώμον και το κινητόν στήθος θέλουσι φέρει μετά των διά πυρός γινομένων προσφορών του στέατος, διά να κινήσωσιν αυτά εις κινητήν προσφοράν ενώπιον του Κυρίου· και θέλει είσθαι εις σε και εις τους υιούς σου μετά σου εις νόμιμον αιώνιον, καθώς προσέταξεν ο Κύριος.
16 ౧౬ అప్పుడు మోషే పాపం కోసం బలి కావాల్సిన మేకను గూర్చి అడిగాడు. కానీ అది అప్పటికే దహనమైపోయిందని తెలుసుకున్నాడు. కాబట్టి అతడు తక్కిన అహరోను కొడుకులు ఎలియాజరు, ఈతామారులపై కోప్పడ్డాడు.
Και εζήτησεν επιμελώς ο Μωϋσής τον τράγον της περί αμαρτίας προσφοράς· και ιδού, ήτο κατακεκαυμένος· και εθυμώθη κατά του Ελεάζαρ και κατά του Ιθάμαρ, των υιών του Ααρών των εναπολειφθέντων, λέγων,
17 ౧౭ “మీరు పాపం కోసం బలి అయిన పశువు మాంసాన్ని పవిత్ర స్థలం లో ఎందుకు తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. సమాజం పాపాలను తీసివేయడానికీ, ఆయన ఎదుట పరిహారం చేయడానికీ యెహోవా దాన్ని మీకు ఇచ్చాడు కదా.
Διά τι δεν εφάγετε την περί αμαρτίας προσφοράν εν τόπω αγίω; διότι είναι αγιώτατον· και έδωκεν αυτό εις εσάς Κύριος διά να σηκόνητε την ανομίαν της συναγωγής, ώστε να κάμνητε εξιλέωσιν υπέρ αυτών ενώπιον του Κυρίου·
18 ౧౮ చూడండి, దాని రక్తాన్ని పరిశుద్ధ స్థలం లోకి తీసుకు రాలేదు. నేను ఆజ్ఞాపించినట్టే మీరు దాని మాంసాన్ని పరిశుద్ధ స్థలం లో కచ్చితంగా తినాల్సిందే” అని మందలించాడు.
ιδού, το αίμα αυτού δεν εφέρθη εις το αγιαστήριον· πρέπει εξάπαντος να φάγητε αυτό εν τω αγιαστηρίω, καθώς προσέταξα.
19 ౧౯ అప్పుడు అహరోను మోషేతో “చూడు, ఈ రోజు వీళ్ళు పాపం కోసం తమ బలులూ, దహన బలులూ యెహోవా ఎదుట అర్పించారు. అయినా ఈ రోజే నాకు ఈ విపత్తు జరిగింది. పాపం కోసం చేసిన బలిమాంసం నేను తింటే యెహోవా దృష్టికి అది సరైనదవుతుందా?” అన్నాడు.
Και είπεν ο Ααρών προς τον Μωϋσήν, Ιδού, αυτοί προσέφεραν σήμερον την περί αμαρτίας προσφοράν αυτών και το ολοκαύτωμα αυτών ενώπιον του Κυρίου και συνέβησαν εις εμέ τοιαύτα· εάν λοιπόν ήθελον φάγει την περί αμαρτίας προσφοράν σήμερον, τούτο ήθελεν είσθαι αρεστόν εις τους οφθαλμούς του Κυρίου;
20 ౨౦ మోషే ఆ మాట విని ఒప్పుకున్నాడు.
Και ήκουσεν ο Μωϋσής και ήρεσεν εις αυτόν.