< విలాపవాక్యములు 1 >
1 ౧ ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన పట్టణం, ఇప్పుడు వెలవెలబోయింది. ఒకప్పుడు శక్తివంతమైన దేశం, ఇప్పుడు వితంతువులా అయ్యింది. ఒకప్పుడు అన్య జాతుల్లో రాకుమారిలా ఉండేది, ఇప్పుడు బానిస అయింది.
Hvor sidder hun ene, den By, saa folkerig før — mægtig blandt Folkene før, men nu som en Enke! Fyrstinden blandt Lande er nu sat til at trælle.
2 ౨ రాత్రివేళ ఎంతో శోకిస్తూ ఉంది. కన్నీటితో దాని చెంపలు తడిసిపోయాయి. దాని ప్రేమికులెవ్వరూ దాన్ని ఆదరించలేదు. దాని స్నేహితులందరూ దానికి ద్రోహం చేశారు. వాళ్ళు దాని శత్రువులయ్యారు.
Hun græder og græder om Natten med Taarer paa Kind; ingen af alle hendes Elskere bringer hende Trøst, alle Vennerne sveg og blev hendes Fjender.
3 ౩ యూదా పేదరికం, బాధ అనుభవించి, దాస్యంలోకీ, చెరలోకీ వెళ్ళింది. అన్యజనుల్లో నివాసం ఉంది. దానికి విశ్రాంతి లేదు. దాన్ని తరిమే వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. తప్పించుకునే దారే లేదు.
Af Trang og tyngende Trældom udvandred Juda; blandt Folkene sidder hun nu og finder ej Ro, alle Forfølgerne naaede hende midt i Trængslerne.
4 ౪ నియమించిన పండగలకు ఎవరూ రాలేదు గనక సీయోను దారులు సంతాపంతో ఉన్నాయి. పట్టణపు గుమ్మాలు ఒంటరివయ్యాయి. యాజకులు మూలుగుతున్నారు. దాని కన్యలు దుఃఖంతో ఉన్నారు. అది అమితమైన బాధతో ఉంది.
Vejene til Zion sørger, uden Højtidsgæster, alle hendes Porte er øde, Præsterne sukker, hendes Jomfruer knuges af Kvide, hun selv er i Vaande.
5 ౫ దాని విరోధులు అధికారులయ్యారు. దాని శత్రువులు వర్ధిల్లుతున్నారు. దాని పాపం అధికమైన కారణంగా యెహోవా దాన్ని బాధకు గురి చేశాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని వెళ్ళారు.
Hendes Avindsmænd er Herrer, hendes Fjender trygge, thi Kvide fik hun af HERREN for Mængden af Synder, hendes Børn drog bort som Fanger for Fjendens Aasyn.
6 ౬ సీయోను కుమారి అందమంతా పోయింది. దాని అధిపతులు పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు. వాళ్ళు శక్తి లేనివాళ్ళుగా తరిమే వాళ్ళ ముందు నిలబడ లేక పారిపోయారు.
Og bort fra Zions Datter drog al hendes Pragt; som Hjorte, der ej finder Græsning, blev hendes Fyrster, de vandrede kraftløse bort for Forfølgernes Aasyn.
7 ౭ దానికి బాధ కలిగిన కాలంలోనూ, ఆశ్రయం లేని కాలం లోనూ, పూర్వం తనకు కలిగిన శ్రేయస్సు అంతా యెరూషలేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. దాని ప్రజలు విరోధుల చేతుల్లో పడిన కాలంలో దానికి ఎవ్వరూ సాయం చెయ్యలేదు. దాని విరోధులు దానికి కలిగిన నాశనం చూసి పరిహసించారు.
Jerusalem mindes den Tid, hun blev arm og husvild, (alle sine kostelige Ting fra fordums Dage), i Fjendehaand faldt hendes Folk, og ingen hjalp, Fjender saa til og lo, fordi hun gik under.
8 ౮ యెరూషలేము ఘోరమైన పాపం చేసింది. ఆ కారణంగా అది ఒక రుతుస్రావం రక్తం గుడ్డలాగా అయ్యింది. దాన్ని ఘనపరచిన వాళ్ళందరూ దాని నగ్నత్వం చూసి దాన్ని తృణీకరించారు. అది మూలుగుతూ వెనుదిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది.
Jerusalem syndede svart, blev derfor til Afsky; hun foragtes af alle sine Beundrere, de saa hendes Blusel, derfor sukker hun dybt og vender sig bort.
9 ౯ దాని చెంగులకు మురికి అంటింది. దాని ఎదుట ఉన్న శిక్ష అది గుర్తు చేసుకోలేదు. అది ఎంతో వింతగా పతనం అయ్యింది. దాన్ని ఆదరించేవాడు ఒక్కడూ లేడు. యెహోవా, నాకు కలిగిన బాధ చూడు. శత్రువులు ఎంత బలంగా ఉన్నారో చూడు!
Hendes Urenhed pletter hendes Slæb, hun betænkte ej Enden; hun sank forfærdende dybt, og ingen trøster. Se min Elendighed, HERRE, thi Fjenden hoverer.
10 ౧౦ దాని శ్రేష్ఠమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి చిక్కాయి. దాని సమాజ ప్రాంగణంలో ప్రవేశించకూడదని ఎవరి గురించి ఆజ్ఞాపించావో ఆ ప్రజలు దాని పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించడం అది చూస్తూ ఉంది.
Avindsmænd bredte deres Haand over alle hendes Skatte, ja, ind i sin Helligdom saa hun Hedninger komme, hvem du havde nægtet Adgang til din Forsamling.
11 ౧౧ దాని కాపురస్థులందరూ మూలుగుతూ ఆహారం కోసం వెదుకుతున్నారు. తమ ప్రాణం నిలుపుకోవడం కోసం తమ శ్రేష్ఠమైన వస్తువులు ఇచ్చి ఆహారం కొన్నారు. యెహోవా, నన్ను చూడు. నేను విలువ లేని దానిగా అయ్యాను.
Alt hendes Folk maatte sukke, søgende Brød; de gav deres Skatte for Mad for at friste Livet. HERRE, se til og giv Agt paa, hvorledes jeg haanes!
12 ౧౨ దారిలో నడిచిపోతున్న ప్రజలారా, ఇలా జరిగినందుకు మీకు ఏమీ అనిపించడం లేదా? యెహోవాకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున నాకు కలిగించిన బాధవంటి బాధ ఇంకా ఎవరికైనా కలిగిందేమో మీరు ఆలోచించి చూడండి.
Alle, som vandrer forbi, giv Agt og se, om det gives en Smerte som den, der er tilføjet mig, hvem HERREN voldte Harm paa sin glødende Vredes Dag.
13 ౧౩ పై నుంచి ఆయన నా ఎముకల్లోకి అగ్ని పంపించాడు. అది నా ఎముకలను కాల్చేసింది. ఆయన నా కాళ్ళకు వల పన్ని నన్ను వెనక్కి తిప్పాడు. ఆయన నిరంతరం నాకు ఆశ్రయం లేకుండా చేసి నన్ను బలహీనపరిచాడు.
Fra det høje sendte han Ild, der for ned i mine Ben; han spændte et Net for min Fod, han drev mig tilbage, han gjorde mig øde, syg baade Dag og Nat.
14 ౧౪ నా అతిక్రమం అనే కాడి నాకు ఆయనే కట్టాడు. అవి మూటగా నా మెడ మీద ఉన్నాయి. నా బలం ఆయన విఫలం చేశాడు. శత్రువుల చేతికి ప్రభువు నన్ను అప్పగించాడు. నేను నిలబడ లేకపోతున్నాను.
Der vogtedes paa mine Synder, i hans Haand blev de flettet, de kom som et Aag om min Hals, han brød min Kraft; Herren gav mig dem i Vold, som er mig for stærke.
15 ౧౫ నాకు అండగా నిలిచిన శూరులను ఆయన విసిరి పారేశాడు. నా శక్తిమంతులను అణగదొక్కడానికి ఆయన నాకు వ్యతిరేకంగా ఒక సమాజాన్ని లేపాడు. ద్రాక్షగానుగలో వేసి ద్రాక్షలు తొక్కినట్టు ప్రభువు, కన్యక అయిన యూదా కుమారిని తొక్కాడు.
Herren forkasted de vældige udi min Midte, han indbød til Fest paa mig for at knuse mine unge, traadte Persen til Dom over Jomfruen, Judas Datter.
16 ౧౬ వీటిని బట్టి నేను ఏడుస్తున్నాను. నా కంట నీరు కారుతోంది. నా ప్రాణం తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వాళ్ళు నాకు దూరమైపోయారు. శత్రువులు విజయం సాధించారు గనుక నా పిల్లలు దిక్కుమాలిన వాళ్ళయ్యారు.
Derover græder mit Øje, det strømmer med Taarer, thi langt har jeg til en Trøster, som kvæger min Sjæl; mine Børn er fortabt, thi Fjenden er blevet for stærk.
17 ౧౭ ఆదరించేవాడు లేక సీయోను చేతులు చాపింది. యాకోబుకు చుట్టూ ఉన్న వాళ్ళను యెహోవా అతనికి విరోధులుగా నియమించాడు. వాళ్ళకు యెరూషలేము ఒక రుతుస్రావ రక్తం గుడ్డలాగా కనిపిస్తోంది.
Zion udrækker Hænderne, ingen trøster; mod Jakob opbød HERREN hans Fjender omkring ham; imellem dem er Jerusalem blevet til Afsky.
18 ౧౮ యెహోవా న్యాయవంతుడు. నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను. ప్రజలారా, వినండి, నా యాతన చూడండి. నా కన్యలూ, బలవంతులైన నా శూరులూ బందీలుగా వెళ్ళిపోయారు.
HERREN, han er retfærdig, jeg modstod hans Mund. Hør dog, alle I Folkeslag, se min Smerte! Mine Jomfruer og unge Mænd drog bort som Fanger.
19 ౧౯ నా ప్రేమికులను నేను పిలిపించినప్పుడు వాళ్ళు నన్ను మోసం చేశారు. నా యాజకులూ, నా పెద్దలూ తమ ప్రాణాలు నిలుపుకోడానికి ఆహారం వెదుకుతూ వెళ్లి పట్టణంలో ప్రాణం పోగొట్టుకున్నారు.
Mine Elskere kaldte jeg ad — de svigtede mig; mine Præster og Ældste opgav Aanden i Byen, thi Føde søgte de efter, men intet fandt de.
20 ౨౦ యెహోవా, నన్ను తేరి చూడు. నాకు అమితమైన బాధ కలిగింది. నా కడుపు తిప్పుతోంది. నేను చేసిన దారుణమైన తిరుగుబాటు కారణంగా నా గుండె నాలో తలక్రిందులై పోతూ ఉంది. వీధుల్లో మా పిల్లలు కత్తివాత పడుతున్నారు. ఇంట్లో చావు ఉంది.
Se, HERRE, hvor jeg er i Vaande, mit Indre i Glød, mit Hjerte er knust i mit Bryst, thi jeg var genstridig; ude mejede Sværdet og inde Døden.
21 ౨౧ నా మూలుగు విను. నన్ను ఆదరించేవాడు ఒక్కడూ లేదు. నువ్వు నాకు కష్టం కలిగించావన్న వార్త నా శత్రువులు విని సంతోషంగా ఉన్నారు. నువ్వు ప్రకటించిన ఆ రోజు రప్పించు, అప్పుడు వాళ్ళకు కూడా నాకు జరిగినట్టే జరుగుతుంది.
Hør, hvor jeg sukker, ingen bringer mig Trøst. De hørte min Ulykke, glæded sig, da du greb ind. Lad komme den Dag, du loved, dem gaa det som mig!
22 ౨౨ వాళ్ళు చేసిన చెడుతనం అంతా నీ ఎదుటికి వస్తుంది గాక. నా అతిక్రమాల కారణంగా నువ్వు నాకు కలిగించిన హింస వాళ్ళకు కూడా కలిగించు. నేను తీవ్రంగా మూలుగుతున్నాను. నా గుండె చెరువై పోయింది.
Læg al deres Ondskab for dig og gør med dem, som du gjorde med mig til Straf for al min Synd! Thi mange er mine Suk, mit Hjerte er sygt.