< విలాపవాక్యములు 5 >

1 యెహోవా, మాకు కలిగిన యాతన గుర్తు చేసుకో. మా మీదికి వచ్చిన అవమానం ఎలా ఉందో చూడు.
זְכֹר יְהוָה מֶֽה־הָיָה לָנוּ הביט הַבִּיטָה וּרְאֵה אֶת־חֶרְפָּתֵֽנוּ׃
2 మా స్వాస్థ్యం పరదేశుల వశం అయ్యింది. మా ఇళ్ళు అన్యుల స్వాధీనం అయ్యాయి.
נַחֲלָתֵנוּ נֶֽהֶפְכָה לְזָרִים בָּתֵּינוּ לְנָכְרִֽים׃
3 మేము అనాథలం అయ్యాం. తండ్రులు ఇంక లేరు. మా తల్లులు వితంతువుల్లా ఉన్నారు.
יְתוֹמִים הָיִינוּ אין וְאֵין אָב אִמֹּתֵינוּ כְּאַלְמָנֽוֹת׃
4 మా నీళ్లు మేము డబ్బుతో కొనుక్కుని తాగాం. మా కట్టెలు మాకే అమ్మారు.
מֵימֵינוּ בְּכֶסֶף שָׁתִינוּ עֵצֵינוּ בִּמְחִיר יָבֹֽאוּ׃
5 వాళ్ళు మమ్మల్ని తరిమారు. మేము అలసిపోయాం. మాకు విశ్రాంతి లేదు.
עַל צַוָּארֵנוּ נִרְדָּפְנוּ יָגַעְנוּ לא וְלֹא הֽוּנַח לָֽנוּ׃
6 అన్నం కోసం ఐగుప్తీయులకూ అష్షూరీయులకూ చెయ్యి చాపాం.
מִצְרַיִם נָתַנּוּ יָד אַשּׁוּר לִשְׂבֹּעַֽ לָֽחֶם׃
7 మా పితరులు పాపం చేసి చనిపోయారు. మేము వాళ్ళ పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం.
אֲבֹתֵינוּ חָֽטְאוּ אינם וְאֵינָם אנחנו וַאֲנַחְנוּ עֲוֺנֹתֵיהֶם סָבָֽלְנוּ׃
8 దాసులు మమ్మల్ని ఏలుతున్నారు. వాళ్ళ వశం నుంచి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరూ లేరు.
עֲבָדִים מָשְׁלוּ בָנוּ פֹּרֵק אֵין מִיָּדָֽם׃
9 ఎడారి ప్రజల కత్తి భయంతో ప్రాణానికి తెగించి మా ఆహారం తెచ్చుకుంటున్నాం.
בְּנַפְשֵׁנוּ נָבִיא לַחְמֵנוּ מִפְּנֵי חֶרֶב הַמִּדְבָּֽר׃
10 ౧౦ కరువు తాపం వల్ల మా చర్మం పొయ్యిలా కాలిపోతోంది.
עוֹרֵנוּ כְּתַנּוּר נִכְמָרוּ מִפְּנֵי זַלְעֲפוֹת רָעָֽב׃
11 ౧౧ శత్రువులు సీయోనులో స్త్రీలను, యూదా పట్టణాల్లో కన్యకలను మానభంగం చేశారు.
נָשִׁים בְּצִיּוֹן עִנּוּ בְּתֻלֹת בְּעָרֵי יְהוּדָֽה׃
12 ౧౨ అధిపతులను వాళ్ళు ఉరి తీశారు. పెద్దలను ఘనపరచలేదు.
שָׂרִים בְּיָדָם נִתְלוּ פְּנֵי זְקֵנִים לֹא נֶהְדָּֽרוּ׃
13 ౧౩ బలమైన యువకులను గానుగల దగ్గరికి తీసుకొచ్చారు. యువకులు కొయ్య దుంగలు మొయ్యలేక తూలిపడ్డారు.
בַּחוּרִים טְחוֹן נָשָׂאוּ וּנְעָרִים בָּעֵץ כָּשָֽׁלוּ׃
14 ౧౪ పెద్దలను గుమ్మాల దగ్గర కూర్చోకుండా తొలగించారు. యువకులను సంగీతం నుంచి దూరం చేశారు.
זְקֵנִים מִשַּׁעַר שָׁבָתוּ בַּחוּרִים מִנְּגִינָתָֽם׃
15 ౧౫ మా గుండెల్లో ఆనందం అడుగంటింది. మా నాట్యం దుఃఖంగా మారిపోయింది.
שָׁבַת מְשׂוֹשׂ לִבֵּנוּ נֶהְפַּךְ לְאֵבֶל מְחֹלֵֽנוּ׃
16 ౧౬ మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ!
נָֽפְלָה עֲטֶרֶת רֹאשֵׁנוּ אֽוֹי־נָא לָנוּ כִּי חָטָֽאנוּ׃
17 ౧౭ మా గుండెలకు జబ్బు చేసింది. మా కళ్ళు మసకబారాయి.
עַל־זֶה הָיָה דָוֶה לִבֵּנוּ עַל־אֵלֶּה חָשְׁכוּ עֵינֵֽינוּ׃
18 ౧౮ సీయోను పర్వతం నిర్జీవంగా ఉంది. దాని మీద నక్కలు తిరుగులాడుతున్నాయి.
עַל הַר־צִיּוֹן שֶׁשָּׁמֵם שׁוּעָלִים הִלְּכוּ־בֽוֹ׃
19 ౧౯ యెహోవా, నువ్వు నిత్యం పరిపాలిస్తావు. నీ సింహాసనం తరతరాలు ఉంటుంది.
אַתָּה יְהוָה לְעוֹלָם תֵּשֵׁב כִּסְאֲךָ לְדֹר וָדֽוֹר׃
20 ౨౦ నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు మర్చిపోతావు? మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టేస్తావా?
לָמָּה לָנֶצַח תִּשְׁכָּחֵנוּ תַּֽעַזְבֵנוּ לְאֹרֶךְ יָמִֽים׃
21 ౨౧ యెహోవా, నువ్వు మమ్మల్ని నీ వైపుకు మళ్ళీ తిప్పు. మేము తిరుగుతాం.
הֲשִׁיבֵנוּ יְהוָה ׀ אֵלֶיךָ ונשוב וְֽנָשׁוּבָה חַדֵּשׁ יָמֵינוּ כְּקֶֽדֶם׃
22 ౨౨ నువ్వు మమ్మల్ని పూర్తిగా విడిచి పెట్టకపోతే, మా మీద నీకు విపరీతమైన కోపం లేకపోతే మా పూర్వస్థితి మళ్ళీ మాకు కలిగించు.
כִּי אִם־מָאֹס מְאַסְתָּנוּ קָצַפְתָּ עָלֵינוּ עַד־מְאֹֽד׃ 154 5 4 4

< విలాపవాక్యములు 5 >