< విలాపవాక్యములు 5 >
1 ౧ యెహోవా, మాకు కలిగిన యాతన గుర్తు చేసుకో. మా మీదికి వచ్చిన అవమానం ఎలా ఉందో చూడు.
Spomeni se, Jahve, što nas je snašlo, pogledaj, vidi sramotu našu!
2 ౨ మా స్వాస్థ్యం పరదేశుల వశం అయ్యింది. మా ఇళ్ళు అన్యుల స్వాధీనం అయ్యాయి.
Baština naša pade u ruke strancima, domovi naši pripadoše tuđincima.
3 ౩ మేము అనాథలం అయ్యాం. తండ్రులు ఇంక లేరు. మా తల్లులు వితంతువుల్లా ఉన్నారు.
Siročad smo: oca nemamo, majke su nam kao udovice.
4 ౪ మా నీళ్లు మేము డబ్బుతో కొనుక్కుని తాగాం. మా కట్టెలు మాకే అమ్మారు.
Vodu što pijemo plaćamo novcem, i za drvo valja nam platiti.
5 ౫ వాళ్ళు మమ్మల్ని తరిమారు. మేము అలసిపోయాం. మాకు విశ్రాంతి లేదు.
Jaram nam je o vratu, gone nas, iscrpljeni smo, ne daju nam predahnuti.
6 ౬ అన్నం కోసం ఐగుప్తీయులకూ అష్షూరీయులకూ చెయ్యి చాపాం.
Pružamo ruke k Egiptu i Asiriji da se kruha nasitimo.
7 ౭ మా పితరులు పాపం చేసి చనిపోయారు. మేము వాళ్ళ పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం.
Oci naši zgriješiše i više ih nema, a mi nosimo krivice njihove.
8 ౮ దాసులు మమ్మల్ని ఏలుతున్నారు. వాళ్ళ వశం నుంచి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరూ లేరు.
Robovi nama zapovijedaju, a nitko da nas izbavi iz ruku njihovih.
9 ౯ ఎడారి ప్రజల కత్తి భయంతో ప్రాణానికి తెగించి మా ఆహారం తెచ్చుకుంటున్నాం.
Kruh svoj donosimo izlažući život maču u pustinji.
10 ౧౦ కరువు తాపం వల్ల మా చర్మం పొయ్యిలా కాలిపోతోంది.
Koža nam gori kao peć užarena, ognjicom od plamena gladi.
11 ౧౧ శత్రువులు సీయోనులో స్త్రీలను, యూదా పట్టణాల్లో కన్యకలను మానభంగం చేశారు.
Oskvrnuli su žene na Sionu i djevice u gradovima judejskim.
12 ౧౨ అధిపతులను వాళ్ళు ఉరి తీశారు. పెద్దలను ఘనపరచలేదు.
Svojim su rukama vješali knezove, ni lica staračka nisu poštivali.
13 ౧౩ బలమైన యువకులను గానుగల దగ్గరికి తీసుకొచ్చారు. యువకులు కొయ్య దుంగలు మొయ్యలేక తూలిపడ్డారు.
Mladići su nosili žrvnjeve, djeca padala pod bremenom drva.
14 ౧౪ పెద్దలను గుమ్మాల దగ్గర కూర్చోకుండా తొలగించారు. యువకులను సంగీతం నుంచి దూరం చేశారు.
Starci su ostavili vrata, mladići više ne sviraju na lirama.
15 ౧౫ మా గుండెల్లో ఆనందం అడుగంటింది. మా నాట్యం దుఃఖంగా మారిపోయింది.
Radosti nesta iz naših srdaca, naš ples se pretvori u tugovanje.
16 ౧౬ మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ!
Pao je vijenac s naše glave, jao nama što zgriješismo!
17 ౧౭ మా గుండెలకు జబ్బు చేసింది. మా కళ్ళు మసకబారాయి.
Evo zašto nam srce boluje, evo zašto nam oči se zastiru:
18 ౧౮ సీయోను పర్వతం నిర్జీవంగా ఉంది. దాని మీద నక్కలు తిరుగులాడుతున్నాయి.
zato što Gora sionska opustje i po njoj se šuljaju šakali.
19 ౧౯ యెహోవా, నువ్వు నిత్యం పరిపాలిస్తావు. నీ సింహాసనం తరతరాలు ఉంటుంది.
Ali ti, Jahve, ostaješ zauvijek, tvoj je prijesto od koljena do koljena.
20 ౨౦ నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు మర్చిపోతావు? మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టేస్తావా?
Zašto da nas zaboraviš zauvijek, da nas ostaviš za mnoge dane?
21 ౨౧ యెహోవా, నువ్వు మమ్మల్ని నీ వైపుకు మళ్ళీ తిప్పు. మేము తిరుగుతాం.
Vrati nas k sebi, Jahve, obratit ćemo se, obnovi dane naše kao što nekoć bijahu.
22 ౨౨ నువ్వు మమ్మల్ని పూర్తిగా విడిచి పెట్టకపోతే, మా మీద నీకు విపరీతమైన కోపం లేకపోతే మా పూర్వస్థితి మళ్ళీ మాకు కలిగించు.
Il' nas hoćeš sasvim zabaciti i na nas se beskrajno srditi?