< విలాపవాక్యములు 3 >
1 ౧ నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి.
I am the man who hath seen affliction by the rod of his wrath.
2 ౨ ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు.
Me hath he driven out, and led into darkness, but not into light.
3 ౩ నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు.
Surely against me doth he turn again and again his hand all the day.
4 ౪ ఆయన నా మాంసం, నా చర్మం చీకిపోయేలా చేస్తున్నాడు, నా ఎముకలను విరగ్గొట్టాడు.
He hath caused my flesh and my skin to wear out, he hath broken my bones.
5 ౫ నాకు విరుద్ధంగా ముట్టడి కంచె నిర్మించాడు. క్రూరత్వం, కష్టం నా చుట్టూ ఉంచాడు.
He hath built around me, and encompassed me with poison and hardship.
6 ౬ ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉండే చీకటి తావుల్లో నేను ఉండేలా చేశాడు.
In dark places hath he set me to dwell, like the dead of olden times.
7 ౭ ఆయన నా చుట్టూ గోడ కట్టాడు. నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు.
He hath placed a fence round about me, that I cannot get out; he hath made heavy my chain.
8 ౮ నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు.
Also when I cry aloud and make entreaty, he shutteth out my prayer.
9 ౯ ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు. నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు.
He hath fenced up my ways with hewn stone, my paths hath he made crooked.
10 ౧౦ నా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలా ఉన్నాడు. దాగి ఉన్న సింహంలా ఉన్నాడు.
A bear lying in wait is he to me, a lion in secret places.
11 ౧౧ నాకు దారి లేకుండా చేసి నన్ను చీల్చి చెండాడి నాకు దిక్కు లేకుండా చేశాడు.
On my ways hath he placed thorns, and torn me in pieces: he hath made me desolate.
12 ౧౨ విల్లు ఎక్కుపెట్టి బాణానికి గురిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు.
He hath bent his bow, and placed me as a mark for the arrow.
13 ౧౩ తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు.
He hath caused to enter into my reins the children of his quiver.
14 ౧౪ నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను. ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు.
I am become a laughing-stock to all my people, their [jeering] song all the day.
15 ౧౫ చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు. విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు.
He hath sated me with bitter things, he hath made me drunken with wormwood.
16 ౧౬ రాళ్లతో నా పళ్ళు విరగ్గొట్టాడు. బూడిదలోకి నన్ను అణగ దొక్కాడు.
He hath also broken my teeth with gravel-stones, he hath covered me with ashes.
17 ౧౭ నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు.
And my soul hath given up all thoughts of peace: I forget happiness.
18 ౧౮ కాబట్టి నేను “నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు” అనుకున్నాను.
And I said, Lost is my strength, my expectation also from the Lord.
19 ౧౯ నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను.
Remembering my affliction and [the cause of] my complaint, wormwood and poison.
20 ౨౦ కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను.
Remembering [this] continually my soul is bowed down deeply within me.
21 ౨౧ కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.
[Yet] this answer will I give to my heart: therefore will I wait [in confidence].
22 ౨౨ యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.
It is through the Lord's kindness that we are not consumed, because his mercies have no end;
23 ౨౩ ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!
They are new every morning: great is thy faithfulness.
24 ౨౪ “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.
The Lord is my portion, saith my soul, therefore will I wait for him.
25 ౨౫ తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.
The Lord is good unto those that hope in him, to the soul that seeketh him.
26 ౨౬ యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది.
It is good that one should wait and this in silence for the salvation of the Lord.
27 ౨౭ తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది.
It is good for a man that he bear the yoke in his youth;
28 ౨౮ అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగానూ, మౌనంగానూ కూర్చుని ఉండాలి.
That he sit in solitude and be silent; because He hath laid it upon him;
29 ౨౯ ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి.
That he put his mouth in the dust; perhaps there still is hope;
30 ౩౦ అతడు తనను కొట్టేవాడివైపు తన చెంపను తిప్పాలి. అతడు పూర్తిగా అవమానంతో నిండి ఉండాలి.
That he offer his cheek to him that smiteth him; that he be satisfied with reproach.
31 ౩౧ ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు.
For the Lord will not cast off for ever;
32 ౩౨ ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు.
But though he have caused grief, yet will he have mercy according to the abundance of his kindnesses.
33 ౩౩ హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు.
For he doth not afflict of his own will, and aggrieve the children of men.
34 ౩౪ దేశంలో బందీలుగా ఉన్నవాళ్ళందరినీ కాళ్ల కింద తొక్కడం,
To crush under his feet all the prisoners of the earth,
35 ౩౫ మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం,
To pervert the justice [due to man] before the face of the Most High.
36 ౩౬ ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా?
To subvert a man in his contest—should the Lord not see this?
37 ౩౭ ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు?
Who is he that saith aught, and it cometh to pass, when the Lord hath not ordained it?
38 ౩౮ మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా?
Do not out of the mouth of the Most High come both the evil things and the good?
39 ౩౯ బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు?
Wherefore should a living man complain? let every man complain because of his sins.
40 ౪౦ మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం.
Let us search through and investigate our ways, and let us return to the Lord.
41 ౪౧ ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం.
Let us lift up our heart with our hands unto God in the heavens.
42 ౪౨ మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు.
We have indeed transgressed and rebelled: thou hast truly not pardoned.
43 ౪౩ నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు.
Thou hast covered [us] with thy anger, and made pursuit after us: thou hast slain, thou hast not pitied.
44 ౪౪ మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు.
Thou hast covered thyself with a cloud, that no prayer should pass through.
45 ౪౫ జాతుల మధ్య మమ్మల్ని విడనాడి, పనికిరాని చెత్తగా చేశావు.
As something loathsome and rejected hast thou rendered us in the midst of the people.
46 ౪౬ మా శత్రువులందరూ మమ్మల్ని చూసి నోరు తెరిచి ఎగతాళి చేశారు.
Wide have all our enemies opened against us their mouth.
47 ౪౭ గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి.
Terror and a snare are come upon us, [with] desolation and breaches.
48 ౪౮ నా ప్రజల కుమారికి కలిగిన నాశనం నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతోంది.
With streams of water runneth my eye down, because of the breach of the daughter of my people.
49 ౪౯ యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ,
My eye trickleth down, and resteth not, without any intermission,
50 ౫౦ నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది.
Till the Lord look down, and behold from heaven.
51 ౫౧ నా పట్టణపు ఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది.
My eye affecteth my soul because of all the daughters of my city.
52 ౫౨ ఒకడు పక్షిని తరిమినట్టు నా శత్రువులు అకారణంగా నన్ను కనికరం లేకుండా తరిమారు.
Those who are my enemies, without a cause, have chased me about like a bird.
53 ౫౩ వారు నన్ను బావిలో పడేసి నా మీద రాయిని పెట్టారు.
They have shut up in the dungeon my life, and have cast stones upon me.
54 ౫౪ నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను.
Waters streamed over my head: I said, I am cut off.
55 ౫౫ యెహోవా, అగాధమైన గుంటలోనుంచి నేను నీ నామాన్ని పిలిచాను.
I called on thy name, O Lord, out of the dungeon of the lowest depth.
56 ౫౬ సాయం కోసం నేను మొర్ర పెట్టినప్పుడు నీ చెవులు మూసుకోవద్దు అని నేనన్నప్పుడు, నువ్వు నా స్వరం ఆలకించావు.
Thou didst hear my voice: hide not thy ear to give me enlargement at my cry.
57 ౫౭ నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో “భయపడవద్దు” అని చెప్పావు.
Thou wast ever near on the day that I called on thee: thou saidst, Fear not.
58 ౫౮ ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు.
Thou didst plead, O Lord, the causes of my soul: thou didst [before this] redeem my life.
59 ౫౯ యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు.
Thou hast [now] seen, O Lord, the wrong I suffer: judge thou my cause.
60 ౬౦ నా మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు చేసే ఆలోచనలన్నీ నీకు తెలుసు.
Thou hast seen all their vengeance, all their plans against me.
61 ౬౧ యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు.
Thou hast heard their reviling, O Lord, all their plans against me,
62 ౬౨ నా మీదికి లేచిన వాళ్ళు పలికే మాటలు, రోజంతా వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు నీకు తెలుసు.
The speeches of these that rise up against me, and their device against me all the day.
63 ౬౩ యెహోవా, వాళ్ళు కూర్చున్నా లేచినా, వాళ్ళు ఎగతాళిగా పాడే పాటలకు నేనే గురి.
Oh look upon their sitting down, and their rising up: I am their [jeering] song.
64 ౬౪ యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు.
Render unto them a recompense, O Lord, according to the work of their hands.
65 ౬౫ వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తావు. వాళ్ళను శపిస్తావు.
Give them confusion of heart, thy curse he upon them.
66 ౬౬ యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు.
Pursue them in anger and destroy from under the heavens of the Lord.