< విలాపవాక్యములు 2 >

1 ప్రభువు తన కోపంతో సీయోను కుమారిని నల్లటి మేఘంతో పూర్తిగా కప్పేశాడు. ఆయన ఇశ్రాయేలు అందాన్ని ఆకాశం నుంచి భూమి మీదికి పడేశాడు. తాను కోపగించిన దినాన ఆయన తన పాదపీఠాన్ని గుర్తు చేసుకోలేదు.
Xudavənd Sion qızına qəzəblənərkən Onu hər tərəfdən qara bulud aldı. İsrailin əzəmətini göydən yerə tulladı, Qəzəbləndiyi gün kətilini xatirindən çıxardı.
2 యాకోబు పట్టణాల్లో ఒక్క దాని మీద కూడా కనికరం లేకుండా ప్రభువు అన్నిటినీ మింగివేశాడు. తన ఆగ్రహంతో ఆయన యూదా కుమార్తె కోటలను కూలగొట్టాడు. ఆయన వాటిని నేల కూల్చి సిగ్గు పరిచాడు. దాని రాజ్యాన్నీ, దాని అధిపతులను ఆయన అవమానపరిచాడు.
Xudavənd aman vermədən Yaqub nəslinin bütün məskənlərini dağıtdı, Qəzəbi ilə Yəhuda qızının qalalarını yıxdı, Padşahlığı, başçıları yerlə yeksan etdi.
3 తీవ్రమైన కోపంతో ఆయన ఇశ్రాయేలు ప్రజల బలాన్ని అణచివేశాడు. శత్రువుల ముందు ఆయన తన కుడి చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. చుట్టూ ఉన్న వాటన్నిటినీ కాల్చే రగులుతున్న అగ్నిజ్వాలలు కాల్చినట్టు ఆయన యాకోబును కాల్చేశాడు.
Qızğın qəzəbi ilə İsrailin qüvvəsini kökündən kəsdi, Düşmən önündə onun üstündən sağ əlini götürdü. Sanki Yaqub nəslini hər tərəfdən oda saldı Göndərdiyi atəşlə yandırıb-yaxdı.
4 ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న ప్రత్యర్ధి బాణం విసరడానికి తన చెయ్యి చాపినట్టు. ఆయన నిలబడి ఉన్నాడు. చూపుకు శ్రేష్ఠమైన ప్రజలందరినీ ఆయన హతం చేశాడు. సీయోను కుమార్తె గుడారంలో తన ఆగ్రహాన్ని అగ్ని వర్షంలా కుమ్మరించాడు.
Düşmən kimi kamanının yayını dartdı, Yağı kimi sağ əlini qaldırdı, Gözə xoş görünənləri tamamilə öldürdü. Qəzəbini Sion qızının çadırına alov kimi tökdü.
5 ప్రభువు శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగివేశాడు. దాని రాజమందిరాలన్నీ మింగివేశాడు. దానికి పట్టున్న ప్రాంతాలన్నీ నాశనం చేశాడు. యూదా కుమారిలో దుఃఖం, సంతాపం అధికం చేశాడు.
Xudavənd İsraili uddu, Onunla düşmən kimi rəftar etdi. Bütün saraylarını yerlə yeksan etdi, Qalalarını viran qoydu, Yəhudanın fəryadını, fəğanını daha da artırdı.
6 ఒక తోట మీద దాడి చేసినట్టు ఆయన తన గుడారం మీద దాడి చేశాడు. సమాజ పవిత్ర ప్రాంగణాన్ని నాశనం చేశాడు. ఆరాధన సమావేశం, విశ్రాంతి దినం సీయోనులో మరుపుకు వచ్చేలా యెహోవా చేశాడు. కోపావేశంలో ఆయన రాజూ యాజకుడూ ఇద్దరినీ తోసిపుచ్చాడు.
Çardağını viranə bağlar tək qırıb tökdü, Görüş yerlərini xarabalığa çevirdi, Rəbb Siona bayram və Şənbə günlərini unutdurdu, Qəzəbi ilə padşahını, kahinini atdı.
7 ప్రభువు తన బలిపీఠం తోసిపుచ్చాడు. తన పవిత్ర ప్రాంగణం నిరాకరించాడు. దాని కోట గోడలను శత్రువుల చేతికి అప్పగించాడు. ఏర్పరచిన రోజు సమాజ ప్రాంగణంలో వినిపించే ధ్వనిలా వాళ్ళు యెహోవా మందిరంలో ఉత్సాహ ధ్వని చేశారు.
Xudavənd qurbangahını rədd etdi, Müqəddəs məkanını tərk etdi. Saraylarının sədlərini düşmən əlinə keçirtdi, Onlar bayram günlərində olduğu kimi Rəbbin məbədində haray qopardı.
8 సీయోను కుమారి ప్రాకారాలు పాడు చెయ్యాలని యెహోవా ఉద్దేశపూర్వకంగా నిర్ణయించాడు. చెయ్యి చాపి కొలత గీత గీశాడు. గోడ నాశనం చెయ్యడానికి తన చెయ్యి వెనక్కు తీయలేదు. ఆయన ప్రహరీలు విలపించేలా చేశాడు. ప్రాకారాలు బలహీనం అయ్యేలా చేశాడు.
Rəbb niyyət etdi ki, Sion qızının divarlarını dağıtsın. Ölçü ipini dartıb, dağıtmaq üçün ondan əl çəkməyəcək. Qala divarını, səddini, matəmə bürüyüb, Hamısı qüvvələrini itirib.
9 యెరూషలేము పట్టణపు గుమ్మాలు భూమిలోకి కుంగిపోయాయి. దాని అడ్డ గడియలు ఆయన విరిచేశాడు. దాని రాజూ, అధిపతులూ అన్యప్రజల మధ్య ఉన్నారు. అక్కడ మోషే ధర్మశాస్త్రం లేదు. దాని ప్రవక్తలకు యెహోవా దర్శనం దొరకలేదు.
Onun darvazalarını yerə batırdı, Cəftələrini qırıb atdı, Padşahlarını, başçılarını Yad millətlərin arasına saldı, Qanuna əməl edilmir, Artıq peyğəmbərlərinə Rəbdən görüntü gəlmir.
10 ౧౦ సీయోను కుమారి పెద్దలు మౌనంగా నేల మీద కూర్చుని ఏడుస్తున్నారు. వాళ్ళ తలల మీద దుమ్ము పోసుకున్నారు. వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము కన్యలు తల నేలకు దించుకుని ఉన్నారు.
Sion qızının ağsaqqalları susub-dinmir, Onlar toz-torpaq içində əyləşib, Başlarına toz töküb, çul geyib, Yerusəlimin bakirə qızları başlarını yerə dikib.
11 ౧౧ నా కన్నీళ్లు ఎండిపోయాయి. నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నా అంతరంగం కలవరంతో ఉంది. నా ప్రజల కుమారి అణిచివేత కారణంగా నా పేగులు నేల మీద ఒలికి పోయాయి. పిల్లలు, పాలు తాగే చంటిబిడ్డలు నిస్సహాయంగా గ్రామ వీధుల్లో నీరసంగా పడి ఉన్నారు.
Ağlamaqdan gözlərimin nuru gedir, Canım əzabdan yanır. Əziz xalqım qırıldığına görə ürəyimdən qan axır. Çünki şəhər meydanlarındakı Körpələrin, uşaqların huşu başından çıxır.
12 ౧౨ పట్టణ వీధుల్లో గాయాలతో పడి ఉన్న వారిలాగా మూర్చపోతూ. “ధాన్యం, ద్రాక్షరసం ఏవి?” అంటూ తమ తల్లుల ఒడిలో ప్రాణాలు విడుస్తున్నారు.
Şəhər meydanlarında yaralılar kimi huşunu itirirlər, Ana qucağında can verirlər. Analarından soruşurlar: «Hanı çörək, hanı şərab?»
13 ౧౩ యెరూషలేము కుమారీ, నీ గురించి నేనేమనాలి? నిన్ను దేనితో పోల్చి ఆదరించాలి? సీయోను కుమారీ, కన్యకా, నీ పతనం సముద్రమంత విస్తారమైనది. నిన్ను స్వస్థపరచగల వాడెవడు?
Ey Yerusəlim qızı, sənə nə deyim? Səni kimlə müqayisə edim? Ey bakirə Sion qızı, səni kimə bənzədim? Bununla mən sənə təsəlli verə bilim? Çünki yaran dəniz qədər dərindir, Sənə kim şəfa verə bilər?
14 ౧౪ నీ కోసం నీ ప్రవక్తలు మోసపూరితమైన బుద్ధిహీనపు దర్శనాలు చూశారు. నువ్వు చెర లోకి వెళ్ళకుండా తప్పించడానికి వాళ్ళు నీ పాపాన్ని నీకు వెల్లడి చెయ్యలేదు. వాళ్ళు నీ కోసం మోసపూరితంగా దర్శనాలు గ్రహించారు.
Sənin üçün görülən görüntülər yalan oldu, Peyğəmbərlərin səni aldatdı. Firavanlığını sənə qaytarmaq üçün Təqsirlərini üzə çıxartmadılar, Amma bu peyğəmbərlər səni azdırdı, Sənin üçün yalandan görüntülər gördü.
15 ౧౫ దారిలో వెళ్ళేవాళ్ళందరూ నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు యెరూషలేము కుమారిని చూసి ఎగతాళి చేస్తూ ఈల వేస్తూ, తల ఊపుతూ. “పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అనీ, సమస్త భూనివాసులకు ఆనందకరమైన నగరం అనీ ప్రజలు ఈ పట్టణం గురించేనా చెప్పారు?” అంటున్నారు.
Yoldan keçən bütün insanlar Qarşında əl çalırlar, Başlarını yelləyib səni fitə basırlar. Yerusəlim qızına belə deyirlər: «Bütün dünyanın gözəllik və sevinc rəmzi olan şəhər budurmu?»
16 ౧౬ నీ శత్రువులందరూ నిన్ను చూసి పెద్దగా నోరు తెరిచారు. వాళ్ళు ఎగతాళి చేసి పళ్ళు కొరుకుతూ “దాన్ని మింగివేశాం! కచ్చితంగా ఈ రోజు కోసమేగా మనం కనిపెట్టింది! అది జరిగింది. దాన్ని మనం చూశాం” అంటున్నారు.
Bütün düşmənlərin səni ələ salır, Fitə basır, diş qıcıdır, «Onu udduq, Bu günün həsrətini çəkdik, axır ki bunu gördük» deyirlər.
17 ౧౭ తాను అనుకున్న పని యెహోవా ముగించాడు. తాను పూర్వం ప్రకటించిన మాట ఆయన నెరవేర్చాడు. నీ పట్ల కనికరం లేకుండా ఆయన నాశనం చేశాడు. నిన్ను బట్టి నీ శత్రువులు సంతోషించేలా చేశాడు. నీ విరోధుల బలం హెచ్చించాడు.
Rəbb Öz iradəsini yerinə yetirdi, Qədim zamanlarda əmr etdiyi sözü həyata keçirtdi. Səni viran qoydu, aman vermədi, Düşmənlərini sənin halına sevindirdi, Yağılarını gücləndirdi.
18 ౧౮ ప్రజల హృదయం యెహోవాకు కేకలు పెడుతూ. “సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహంలా పగలూ రాత్రి నీ కన్నీరు కారనివ్వు. జాప్యం జరగనివ్వకు. నీ కంటి నుంచి వెలువడే కన్నీటిధార ఆగనివ్వకు.
Xalq Xudavəndə ürəkdən fəryad etdi, Ey Sion qızının divarı! Qoy gecə-gündüz sənin gözlərindən sel kimi yaş axsın, Dincəlmə, aç gözlərini, yumulmasın.
19 ౧౯ రాత్రి పూట నువ్వు లేచి మొర్ర పెట్టు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించు. ప్రతి వీధి మొదట్లో ఆకలితో సతమతమౌతున్న నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయన వైపు ఎత్తు.”
Qalx, gecə fəryad etməyə, Gecə növbələri başlayarkən Xudavəndin hüzurunda qəlbini sular kimi açıb tök. Əllərini Ona aç, övladlarının sağ qalmasını dilə, Onlar hər tin başında acından huşunu itirir.
20 ౨౦ యెహోవా, చూడు. నువ్వు ఎవరి పట్ల ఈ విధంగా చేశావో గమనించు. తమ గర్భఫలాన్ని, తాము ఎత్తుకుని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు తినడం తగునా? యాజకుడూ ప్రవక్తా ప్రభువు పవిత్ర ప్రాంగణంలో హతం కాదగునా?
Ya Rəbb, indi bax, xalqının halını gör! Kiminlə belə rəftar etmisən? Analar uşaqlarını, əziz balalarınımı yesin? Kahinlər, peyğəmbərlər Xudavəndin Müqəddəs məkanındamı qətlə yetirilsin?
21 ౨౧ యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.
Gənclər, qocalar toz-torpaqda, küçələrdə yatır. Bakirə qızlarım, igidlərim qılıncdan keçirilir. Qəzəbləndiyin gün onları qətlə çatdırmısan, Aman vermədən qırmısan.
22 ౨౨ ఆరాధన దినాన ప్రజలు వచ్చినట్టు నాలుగు వైపుల నుంచి నువ్వు నా మీదికి భయం రప్పించావు. యెహోవా ఉగ్రత దినాన ఎవరూ తప్పించుకోలేదు. ఎవరూ బతకలేదు. నేను పెంచి పోషించిన వాళ్ళను నా శత్రువులు అంతం చేశారు.
Qorxduqlarımı hər yandan çağırmısan, Elə bil bayrama dəvət etmisən. Rəbbin qəzəb günündə qaçıb-qurtulan olmadı, Onların arasından sağ qalan olmadı, Sevə-sevə övlad böyütmüşdüm, Onları düşmənim həlak etdi.

< విలాపవాక్యములు 2 >