< న్యాయాధిపతులు 8 >
1 ౧ అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో “నువ్వు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని అతనితో తీవ్రంగా వాదించారు.
Anante Efraemi naga'mo'za Gidionina amanage hu'za antahige'naze, Nagafare amanahu kavukavara hurantane? Nahigenka esera hurantanketa Midieni vahe'enena hara ome osu'none? hu'za Gidioni'enena tusi fravazi'naze.
2 ౨ అందుకు అతడు “మీరు చేసినదేమిటీ, నేను చేసినదేమిటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులు ఓరేబు, జెయేబు మీద మీకు జయం ఇచ్చాడు. మీరు చేసినట్టు నేను చెయ్యగలనా?” అన్నాడు
Hianagi Gidioni'a amanage huno kenona huzmante'ne, Tamagrama hu'naza zama negeta, nagrama hu'noa zama kesazana, nagra naza hu'nofi keho? Efraemi naga'mo'zama krepi ragama otre'zama tagi vagarezamo knarera hu'nefi? Abiesa naga'mo'zama ontagi hozafinti ana maka krepi ragama tagi vagare'zamo knarera hu'neo?
3 ౩ అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వాళ్లకు కోపం తగ్గింది.
Anumzamo'a Midieni sondia kva netrena Orebine Zebanena tamazampi zanavrentegeta zanahe'naze. Nagra tamagrama hazazana osu'noe. Anagema hige'za frama vazinentazaretira kea tagane'naze.
4 ౪ గిద్యోను, అతనితో ఉన్న మూడువందల మందీ అలసట చెందినప్పటికీ మిద్యానీయుల శత్రువులను తరుముతూ, యొర్దాను దగ్గరికి వచ్చి, దాన్ని దాటారు.
Hagi Gidioni'ene 300'a vahe'mo'zanena Jodani tina takahe'za zamasafera nehianagi, ha' vahezmia zamarotago hu'naze.
5 ౫ అతడు సుక్కోతు వాళ్ళతో “నా వెంట ఉన్న ప్రజలు అలసి ఉన్నారు, మేము మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాము. దయచేసి నాతో వస్తున్నవారికి రొట్టెలు ఇవ్వండి” అని అడిగాడు.
Hagi Sukoti kumate'ma ne-eno'a Gidioni'a amanage huno ana kumate kva vahetmina zamantahige'ne. Muse huramantoanki, Nagri'enema aza vahetamina bretia zaminke'za neho. Na'ankure zamagra tusi zamasafeku nehu'za, nagranena neazage'na nagra Midieni kini netre Zebane Zalmunakizni zanaratago hu'na neoe.
6 ౬ సుక్కోతు అధిపతులు “జెబహు, సల్మున్నా అనే వాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి?” అన్నారు.
Hianagi Sukoti kumate kva vahe'mo'za amanage hu'za kenona asmi'naze, Zebane Zalmunanema zanazeritesanketa sondia vaheka'a ne'zana zamigahune.
7 ౭ అందుకు గిద్యోను “జెబహు సల్మున్నా మీద యెహోవా నాకు జయం ఇచ్చిన తరువాత, ముళ్ళపొదలతోను, ఎడారి కంపలతోను మీ శరీరాలను చీరేస్తాను” అని చెప్పాడు.
Ana kema hazageno'a Gidioni'a anage hu'ne, Ra Anumzamo'ma Zebane Zalmunanema nazampi'ma znavrentenama zanahesu'na, ka'ma kopima nemanea ave'ave nofinu, sefura eme tami'na tamavufa eri hazrohazru hugahue.
8 ౮ అక్కడనుంచి అతడు పెనూయేలుకు వెళ్ళి అలాగే వాళ్ళనూ అడిగినప్పుడు, సుక్కోతు వాళ్ళు జవాబిచ్చినట్టు పెనూయేలువాళ్ళు కూడా అతనికి జవాబిచ్చారు గనుక అతడు,
Hagi anantetira Penieli kumate marerino vuno ana hukna kege ana kumapi vahete ome hu'ne. Hianagi Sukoti kumate vahe'mo'zama hu'nazankna ke hu'naze.
9 ౯ “నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొడతాను” అని పెనూయేలు వాళ్ళతో చెప్పాడు.
Hagi anagema hazageno'a Gidioni'a Penieli kumate vahera amanage huno zamasami'ne, nagrama ha'ma ome huzamagaterete'na esu'na, ama za'za nona eme tapage hutregahue.
10 ౧౦ అప్పుడు జెబహు, సల్మున్నా వాళ్ళతో కూడా వాళ్ళ సైన్యాలు, అంటే తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలినవాళ్ళు ఇంచుమించు పదిహేను వేలమంది మాత్రమే, కర్కోరులో ఉన్నారు. లక్షా ఇరవైవేలమంది అప్పటికే చనిపోయారు.
Hagi Seba'ene Zalmunakea 15 tauseni'a sondia vahe'ene Karkori kumapi ufre'naze. Hagi eri mago'ma hu'naza sondia vahe'ma zamahe hanama hige'zama mani'nazama'e. Na'ankure 120 tauseni'a kazinteti'ma ha'ma nehaza vahera ko zamahe 'naze.
11 ౧౧ అప్పుడు గిద్యోను నోబహుకు, యొగేబ్బెహకు తూర్పున, దేశ సంచారుల మార్గాన శత్రు శిబిరానికి వెళ్ళి, శత్రుసైన్యం నిర్భయంగా ఉన్న కారణంగా ఆ సైన్యాన్ని ఓడించాడు.
Hagi Gidioni'a marerino Nobane Jokbeha kumatrema me'nea kantega rugagino Midieni sondia vahe'mo'za ha' vahera omegahaze hu'za ontahi'za mani'nazageno, antri hazaza huno hara ome huzamante'ne.
12 ౧౨ జెబహు, సల్మున్నా పారిపోయినప్పుడు అతడు వాళ్ళను తరిమి ఇద్దరు మిద్యాను రాజులు జెబహును, సల్మున్నాను పట్టుకుని ఆ సేనంతటిని చెదరగొట్టాడు.
Hagi anama higeno'a, Midieni kini netre Zeba'ene Zalmunakea freke vakeno, Gidioni'a zanarotago huno ome zanazerigeno, ana kini netremofo sondia vahe'mo'za tusi zamagogogu hu'naze.
13 ౧౩ యుద్ధం ముగిసిన తరువాత యోవాషు కొడుకు గిద్యోను
Hagi Joasi nemofo Gidionima ha'ma huvagareteno'a ana kumara atreno, Heresi agonama me'neregama e'nea kamofo avaririno e'ne.
14 ౧౪ హెరెసు ఎగువనుంచి తిరిగి వచ్చి, సుక్కోతు వాళ్ళలో ఒక యువకుణ్ణి పట్టుకుని విచారణ చేయగా అతడు సుక్కోతు అధిపతులు, పెద్దల్లో డెబ్భై ఏడుగురి పేర్లు వివరంగా చెప్పాడు.
E'inama huno ne-eno'a mago Sukoti kumate nehaza ne' eme azerino antahigegeno, Sukoti kumate mani'naza kva vahetmina 77ni'a kva vahe'mofo zamagia Gidionina kremi'ne.
15 ౧౫ అప్పుడతడు సుక్కోతు వాళ్ళ దగ్గరికి వచ్చి “‘జెబహు, సల్మున్నా అనేవాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి?’ అని మీరు ఎవరి విషయంలో నన్ను దూషించారో, ఆ జెబహును, సల్మున్నాలను, చూడండి” అని చెప్పి
Ana'ma higeno'a Gidioni'a Sukoti kumate eno amanage huno kva vahetmina eme zamasami'ne, Keho, Zebane Zalmunanena ama zanazeri'na oe, amare'ma enevu'na sondia vahe'ni'a breti zaminke'za neho hu'nama nehugeta, nazanavanke huta Zebane Zalbunane kazampima zanazerite'nanketa henka sondia vaheka'a bretia zamigahune hu'naze.
16 ౧౬ ఆ ఊరిపెద్దలను పట్టుకుని, ముళ్ళకంపను, బొమ్మజెముడును తీసుకు వాటితో సుక్కోతు వాళ్ళకు బుద్ధి చెప్పాడు.
Hagi Gidioni'ma anagema nehuno'a, ka'ma kopima me'nea ave'ave nofitami erino ana kumate kva vahetamina anagema hu'naza zantera sefu zami'ne.
17 ౧౭ అతడు పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివాళ్ళను చంపాడు.
Ana nehuno Peniel kumate mani'ne'zama kuma'ma kegava nehaza za'za nozmia taganavazinetreno ana rankumapi vahera zamahe fri vagare'ne.
18 ౧౮ గిద్యోను, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎలాంటి వారని జెబహును సల్మున్నాను అడిగినప్పుడు వాళ్ళు “నీలాంటివాళ్ళే. వాళ్ళందరూ రాకుమారుల్లా ఉన్నారు” అన్నారు.
Ana huteno Gidioni'a Zebane Zalbunakiznia zanantahigeno, Tabor kumate'ma zamahe'na'a vahetmina, inankna vahe zamahe'na'e? Huno zanantahigegeke amanage hu'na'e, Kagri kavugosagna vahe zamahe'no'e. Ana maka'mo'za kini ne'mofo nemofo avugosagna hu'naze.
19 ౧౯ గిద్యోను “వాళ్ళు నా తల్లి కుమారులు. నా సహోదరులు. మీరు వాళ్ళను బ్రతకనిచ్చి ఉంటే
Anagema hakeno'a anante Gidioni'a amanage hu'ne, E'i nagri nenarera mofavrerami zamahe'na'e. Tamage mani'nea Ra Anumzamofo avufima tanasamisuana, tanagrama ana nafuhe'ima ozamahena'asina menina tanagrira ontanahosine.
20 ౨౦ యెహోవా జీవం తోడు, మిమ్మల్ని చంపేవాణ్ణి కాదు” అని చెప్పి, తన పెద్ద కొడుకు యెతెరును చూసి “నువ్వు లేచి వాళ్ళని చంపు” అన్నాడు. అతడు పసి వాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.
Anage nehuno zage mofavre'a Jetarinkura huno, otinka zanahegeke fri'o! Hianagi ana nehazamo'a otinora ozanahe'ne. Na'ankure agra osi mofavregino, koro hu'ne.
21 ౨౧ అప్పుడు జెబహు సల్మున్నాలు “వయస్సునుబట్టి మనిషికి శక్తి ఉంటుంది గనుక, నువ్వే లేచి, మమ్మల్ని చంపు” అన్నారు. గిద్యోను లేచి జెబహును, సల్మున్నాను చంపి, వాళ్ళ ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు.
Anage higeno Zeba'ene Zalmunakea amanage huke Gidionina asmi'na'e, Vema mani'nesunka kagraka'a otinka tahe frio. Anagema hakeno'a, Gidioni'a otino ana netrena zanahe nefrino, kemolizinimofo zananankente'ma hu'znante'na'a avasase'zana eri'ne.
22 ౨౨ అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో “నువ్వు మిద్యానీయుల చేతిలోనుంచి మమ్మల్ని రక్షించావు గనుక నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, మమ్మల్ని పరిపాలించండి” అని చెప్పారు.
Anama higeno'a Israeli vahe'mo'za amanage hu'za Gidioninkura hu'naze, Kagrane, negamofo'ene negageho'enena kvati mani'neta kegava huranteho. Na'ankure kagra Midieni vahe zamazampinti tagu'vazi'ne.
23 ౨౩ అందుకు గిద్యోను “నేను మిమ్మల్ని పాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పాలించకూడదు. యెహోవా మిమ్మల్ని పరిపాలిస్తాదు” అని చెప్పాడు.
Hianagi Gidioni'a amanage huno kenona huzmante'ne, Nagra kvatimia mani'nena kegava huoramantegosue. Ana hukna hu'za mofavrenimo'za kvatimia mani'ne'za kegava huoramantegahaze. Hagi Ra Anumzamoke kvatimia mani'neno kegava huramantegahie.
24 ౨౪ గిద్యోను “మీలో ప్రతివాడూ తన దోపుడు సొమ్ములో ఉన్న చెవి పోగులను నాకు ఇవ్వండి అని మనవి చేస్తున్నాను” అన్నాడు. (మిద్యానీయులు ఇష్మాయేలీయులు గనుక వాళ్ళ చెవులకు పోగులు ఉన్నాయి.)
Hianagi magoke zanku tamantahigegahue. Ha' vahe'mo'zama zamagesafima renentaza golire rinima zamaheta eri'nazana mago magomota namitere hiho. Na'ankure zamagra Ismaeli nagaki'za zamagesafi golire rini rente vahe mani'nazageno hu'ne.
25 ౨౫ అందుకు ఇశ్రాయేలీయులు “సంతోషంగా మేము వాటిని నీకు ఇస్తాము” అని చెప్పి ఒక బట్ట పరచి, ప్రతివాడూ తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను దాని మీద వేశాడు.
Anagema higeno'a, amanage hu'za kenona hunte'naze. Amane tagra kamigahune, hu'za nehu'za nakre ku eri'za tafera nehu'za, korire riniramina ana makamo'za eme atre'naze.
26 ౨౬ మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు, కర్ణభూషణాలు, ధూమ్రవర్ణపు దుస్తులు, ఒంటెల మెడల మీద ఉన్న గొలుసుల తూకం కాకుండా అతడు కోరిన బంగారు పోగుల బరువు పదిహేడు వందల తులాల బంగారం అయ్యింది. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించి తన సొంత ఊరు ఒఫ్రాలో దాన్ని ఉంచాడు.
Hagi ana golire rinima eritruma hazageno'a kna'amo'a 25'a kilo hu'ne. Hagi e'i ana zankera eritru osu'nazanki, pasesuma, agesafi avasesezama, Midieni kini vahe'mo'ma nevasia fitunke za'za kukenama, kemorimofo zmanankempima hunentaza avasase zanena anampinke emeritru hu'naze.
27 ౨౭ కాబట్టి ఇశ్రాయేలీయులంతా ద్రోహులై అక్కడికి వెళ్ళి దానికి మొక్కి వ్యభిచారులయ్యారు. అది గిద్యోనుకు, అతని ఇంటివాళ్ళకు ఒక ఉచ్చుగా అయ్యింది.
Hagi Gidioni'a ana koria erino rankuma'are Ofra viazamo pristi vahe'mo'zama zamimizare'ma nentaniza avasese'za ome tro huntenegeno, monko a'nemo'za hazaza hu'za Israeli vahe'mo'za Ra Anumzamofona zamage'na hunemi'za, ana zante agafa hu'za monora hunte'naze. Gidionine naga'amofontera anazamo'a mago krifugna huno zamazeri'ne.
28 ౨౮ ఇశ్రాయేలీయులు మిద్యానీయులను అణచి వేసిన తరువాత, ఇంక వాళ్ళు తలెత్త లేకపోయారు. గిద్యోను కాలంలో దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
Hagi Israeli vahe'mo'za Midieni vahera zamahe'za zamazeri havizanfta hazageno, mago'anena hara eme huozmante'naze. E'ina hazageno Gidioni'ma kvama mani'nea knafina Israeli vahe'mo'za 40'a kafua hara osu amne fru hu'za mani'naze.
29 ౨౯ తరువాత యోవాషు కొడుకు యెరుబ్బయలు, తన సొంత ఇంట్లో నివాసం ఉండడానికి వెళ్ళిపోయాడు.
Hagi Joasi nemofo Gidioni'a ete kuma'arega vu'ne.
30 ౩౦ గిద్యోనుకు చాలామంది భార్యలు ఉన్న కారణంగా అతని కడుపున పుట్టినవాళ్ళు డెబ్భై మంది కొడుకులు ఉన్నారు.
Hagi Gidioni'a rama'a a'nane zmante'negu 70'a ne'mofavrerami zamante'ne.
31 ౩౧ షెకెములో ఉన్న అతని ఉపపత్ని కూడా అతనికి ఒక కొడుకును కన్నప్పుడు గిద్యోను అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు.
Hagi Sekemu kumate nemania a'amo'a ne'mofavre antegeno, agi'a Abimeleki'e huno ante'ne.
32 ౩౨ యోవాషు కొడుకు గిద్యోను ముసలివాడై చనిపోయాడు. అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్న అతని తండ్రి యోవాషు సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు.
Hagi Joasi nemofo Gidioni'a ozafa omereno frigeno, nefa Joasima asente'naza matipi Abiesa naga nofimofo mopafi Ofra kumate asente'naze.
33 ౩౩ గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు తమ శత్రువుల చేతిలోనుంచి తమను విడిపించిన యెహోవా దేవుణ్ణి ఘనపరచక, ఆయన్ని జ్ఞాపకం చేసుకోక,
Hagi Gidioni'ma fritege'za, Israeli vahe'mo'za ete mago'ane Ra Anumzamofona zamefi hunemiza Bal-Beriti havi anumza tro hunente'za, Bali havi anumzante monora hunte'naze.
34 ౩౪ మళ్ళీ బయలుదేవుళ్ళను అనుసరించి, వ్యభిచారులై, బయల్బెరీతును తమకు దేవుడుగా చేసుకున్నారు.
Ana nehu'za Israeli vahe'mo'za Ra Anumzana zamagri Anumzamo'ma ha' vahezimimo'za mika kampinti e'za ha'ma eme hunezmantegeno zamagu'ma vazi'nea Ra Anumzana zamage akaninte'naze.
35 ౩౫ వాళ్ళు యెరుబ్బయలు (అంటే గిద్యోను) ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతా మరచిపోయి, అతని యింటివాళ్ళకు ఇచ్చిన మాట ప్రకారం, ఉపకారం చెయ్యలేదు.
Hanki Gidioni'ma knare'zama huzamante'nea zankura Israeli vahe'mo'za agri naga'mofona humusenkea hu'za susu huozamante'naze.