< న్యాయాధిపతులు 4 >

1 ఏహూదు చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు గనక
Továbbá is tették Izraél fiai azt, ami rossz az Örökkévaló szemeiben; Éhúd pedig meghalt.
2 హాసోరులో ఏలే కనాను రాజైన యాబీను చేతికి ఆయన వాళ్ళను అప్పగించాడు. అతని సేనాధిపతి పేరు సీసెరా. అతడు యూదేతరుల ప్రాంతం హరోషెతులో ఉంటున్నాడు.
És eladta őket az Örökkévaló Jábínnak, Kanaán királyának kezébe, aki Cháczórban uralkodott; hadvezére pedig Szíszera volt, s ez lakott Charóset-Haggójímban.
3 అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను కఠినంగా హింసలపాలు చేసినప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు.
Ekkor kiáltottak Izraél fiai az Örökkévalóhoz, mert kilenczszáz vasszekere volt neki, s ő elnyomta Izraélt fiait erővel húsz esztendőn át.
4 ఆ రోజుల్లో లప్పీదోతు భార్య దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది.
Debóra prófétaasszony pedig, Lappídót felesége bírája volt Izraélnek azon időben;
5 ఆమె ఎఫ్రాయిమీయుల ఎడారిలో రమాకు బేతేలుకు మధ్య ఉన్న దెబోరా ఖర్జూర చెట్టు కింద తీర్పులు తీర్చడానికి కూర్చుని ఉండేది. తమ వివాదాలు పరిష్కరించుకోడానికి ఇశ్రాయేలీయులు ఆమె దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు.
ő ugyanis ült a Debóra-pálma alatt, Ráma és Bét-Él között, Efraim hegységében; és fölmentek hozzá Izraél fiai törvényre.
6 ఆమె నఫ్తాలిలోని కెదెషులో నుంచి అబీనోయము కొడుకు బారాకును పిలిపించి అతనితో ఇలా అంది “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, ‘నువ్వు వెళ్లి నఫ్తాలీయుల్లో, జెబూలూనీయుల్లో పదివేల మందిని తాబోరు కొండ దగ్గరికి రప్పించు.
Küldött és hivatta Bárákot, Abínóam fiát a Naftálibeli Kédesből; és szólt hozzá: Nemde ezt parancsolta az Örökkévaló, Izraél Istene: menj, húzódjál a Tábor hegyére és végy magaddal tízezer embert Naftáli fiaiból és Zebúlún fiaiból;
7 యాబీను సేనాధిపతి సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని, కీషోను నది దగ్గర చేర్చి, అక్కడ అతని మీద నీకు జయం అనుగ్రహిస్తాను.’”
én meg feléd húzom a Kisón patakjához Szíszerát, Jábín hadvezérét, szekérhadát és népsokaságát s majd kezedbe adom őt.
8 అప్పుడు బారాకు “నువ్వు నాతోబాటు వస్తేనే వెళ్తాను గాని నువ్వు నాతో రాకపోతే నేను వెళ్లను” అని ఆమెతో చెప్పాడు.
Szólt hozzá Bárák: Ha velem jössz, megyek; de ha nem jössz velem, nem megyek.
9 అప్పుడు ఆమె “నీతో నేను తప్పకుండా వస్తాను. అయితే, నువ్వు చేసే ఈ ప్రయాణంవల్ల నీకు ఘనత దొరకదు. ఒక స్త్రీ చాకచక్యం వలన యెహోవా సీసెరాను అప్పగిస్తాడు” అని చెప్పి, లేచి బారాకుతోబాటు కెదెషుకు వెళ్ళింది.
És mondta: Menni fogok veled, csakhogy nem lesz dicsőséged az úton, amelyre menni készülsz, mert asszony kezébe adja majd az Örökkévaló Szíszerát. Erre fölkelt Debóra és elment Bárákkal Kédesbe.
10 ౧౦ బారాకు జెబూలూనీయులను, నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుషులు అతనితో వెళ్ళారు.
S összehívta Bárák Zebúlúnt és Naftálit Kédesbe, és fölment nyomában tízezer ember; és fölment vele Debóra.
11 ౧౧ దెబోరా కూడా అతనితో వెళ్ళింది. ఈలోపు కయీనీయుడైన హెబెరు మోషే మామ హోబాబు సంతానం వారైన కయీనీయుల నుంచి వేరుపడి కెదెషు దగ్గర ఉన్న జయనన్నీములో ఉన్న మస్తకి చెట్టు దగ్గర తన గుడారం వేసుకుని ఉన్నాడు.
A kénita Chéber pedig elvált volt Kájintól, Chóbáb, Mózes sógorának fiaitól: és felütötte sátorát a Czáanannímbeli terebinthusnál, mely Kédes mellett van.
12 ౧౨ అబీనోయము కొడుకైన బారాకు తాబోరు కొండపైకి వెళ్ళాడని సీసెరాకు తెలిసినప్పుడు సీసెరా తన రథాలన్నిటినీ, తన తొమ్మిదివందల ఇనుప రథాలను
Midőn jelentették Szíszerának, hogy fölment Bárák, Abínóam fia, a Tábór hegyére,
13 ౧౩ యూదేతరుల ప్రాంతమైన హరోషెతు నుంచి కీషోను నది వరకూ తన పక్షంగా ఉన్న ప్రజలందరినీ పిలిపించినప్పుడు
akkor összehívta Szíszera az egész szekérhadát, kilenczszáz vasszekeret, meg mind a népet, mely vele volt, Charóset-Haggójimból a Kísón patakjához.
14 ౧౪ దెబోరా “వెళ్ళు. యెహోవా సీసెరా మీద నీకు జయం ఇచ్చిన రోజు ఇదే. యెహోవా నిన్ను నడిపిస్తున్నాడు కదా” అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీదినుంచి దిగి వచ్చాడు.
És szólt Debóra Bárákhoz: Kelj föl, mert ez az a nap, melyen kezedbe adta az Örökkévaló Szíszerát, nemde az Örökkévaló vonult ki előtted! És leszállt Bárák a Tábór hegyéről, és tízezer ember utána.
15 ౧౫ బారాకు వాళ్ళను చంపడానికి వీలుగా యెహోవా సీసెరాను, అతని రథాలన్నిటినీ, అతని సైనికులను కలవరపరచినప్పుడు, సీసెరా తన రథం దిగి కాలినడకన పారిపోయాడు.
És megzavarta az Örökkévaló Szíszerát és az egész szekérhadat meg az egész tábort a kard élével Bárák előtt; s leszállt Szíszera a szekérről és megfutamodott gyalogosan.
16 ౧౬ బారాకు, ఆ రథాలను, సైన్యాన్ని యూదేతరుల ప్రాంతం హరోషెతు వరకూ తరిమినప్పుడు సీసెరా సైన్యమంతా కత్తివాత చేత కూలిపోయింది. ఒక్కడు కూడా బ్రతకలేదు.
Bárák pedig üldözte a szekérhadat és a tábort Charóset-Haggójimig; és elesett Szíszera egész tábora a kard éle által, nem maradt meg egy sem.
17 ౧౭ హాసోరు రాజు యాబీనుకూ కయీనీయుడైన హెబెరు వంశస్థులకూ సంధి ఒప్పందం ఉంది గనుక సీసెరా కాలినడకన కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారానికి పారిపోయాడు.
Szíszera pedig megfutamodott gyalogosan Jáél, a kénita Chéber feleségének sátorába – mert béke volt Jábín, Cháczór királya és a kénita Chéber háza között –
18 ౧౮ అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొని అతణ్ణి చూసి “ప్రభూ, ఇటు నా వైపుకి రండి, భయపడవద్దు” అని చెప్పింది. అప్పుడు అతడు ఆమె గుడారంలోకి వెళ్ళాడు.
és kiment Jáél Szíszera elébe és szólt hozzá: Térj be uram, térj be hozzám, ne félj. Betért hozzá a sátorba, és befödte őt a takaróval.
19 ౧౯ అప్పుడు ఆమె అతనిపై దుప్పటి కప్పింది. అతడు “దాహంగా ఉంది, దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు” అని అడిగాడు. ఆమె తోలుతో చేసిన తిత్తి విప్పి అతనికి దాహానికి ఇచ్చి, అతనికి మళ్ళీ దుప్పటి కప్పే సమయంలో
És szólt hozzá: Adj, kérlek, innom egy kis vizet, mert megszomjúhoztam; ekkor kinyitotta a tejes tömlőt, inni adott neki és befödte.
20 ౨౦ అతడు “గుడారం ద్వారం దగ్గర నుండి ఎవరైనా లోపలికి వచ్చి, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఎవరూ లేరని నువ్వు చెప్పాలి” అన్నాడు.
És szólt hozzá: Állj a sátor bejáratához, és lészen, ha valaki jön s kérdezi tőled és mondja: van-e itt valaki, akkor mondjad: nincsen.
21 ౨౧ ఆ తరువాత హెబెరు భార్య యాయేలు గుడారానికి కొట్టే మేకు తీసుకుని ఒక సుత్తె చేత్తో పట్టుకుని మెల్లగా అతని దగ్గరికి వచ్చి, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని కణతలో ఆ మేకు దిగగొట్టగా అది అతని తలలో గుండా నేలలోకి దిగింది.
Erre vette Jáél, Chéber felesége, a sátor szögét, kezébe fogta a kalapácsot, bement hozzá csendben és beverte a szöget halántékába, úgy hogy befúródott a földbe – amaz pedig mélyen aludt, mert fáradt volt – és meghalt.
22 ౨౨ అతడు చచ్చాడు. బారాకు సీసెరాను తరుముకుంటూ రాగా యాయేలు అతన్ని ఎదుర్కొని “నువ్వు వెతుకుతున్న మనిషిని నీకు చూపిస్తాను” అంది. అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడి ఉన్నాడు. ఆ మేకు అతని కణతలో ఉంది.
S íme Bárák jön, üldözve Szíszerát, és kiment elébe Jáél és mondta neki: Jer, megmutatom neked azon férfiút, a kit keresel. Bement hozzá, s íme Szíszera holtan fekszik, szöggel halántékában.
23 ౨౩ ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల కోసం కనాను రాజు యాబీనును ఓడించాడు
Így alázta meg Isten ama napon Jábínt, Kanaán királyát, Izraél fiai előtt.
24 ౨౪ తరువాత ఇశ్రాయేలీయుల కనాను రాజు యాబీనును చంపేవరకూ వారి బలం అంతకంతకూ పెరుగుతూ ఉంది.
És egyre nehezebbé lett Izraél fiainak keze Jábínon, Kanaán királyán, míg ki nem irtották Jábínt, Kanaán királyát.

< న్యాయాధిపతులు 4 >