< న్యాయాధిపతులు 19 >

1 ఇశ్రాయేలీయులకు ఒక రాజు అంటూ లేని ఆ రోజుల్లో ఎఫ్రామీయుల కొండ ప్రాంతాల్లోని ఉత్తర భాగంలో ఒక లేవీయుడు పరదేశిగా నివసించేవాడు. అతడు యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉంపుడుగత్తెగా తెచ్చుకున్నాడు.
Saa ɛberɛ no na Israel nni ɔhene. Na ɔbarima bi a ɔfiri Lewi abusuakuo mu te Efraim bepɔ asase no so akyirikyiri baabi. Ɛda bi, ɔde ɔbaa bi firi Betlehem a ɛwɔ Yuda baa fie sɛ ne mpena.
2 అయితే ఆమె అతణ్ణి విడిచి పెట్టి మరొకరితో వ్యభిచారం చేసింది. ఆమె యూదా ప్రాంతం బెత్లేహెం లోని తన తండ్రి ఇంటికి వెళ్లి అక్కడే నాలుగు నెలలు ఉండిపోయింది.
Nanso, ɔbaa no anni no nokorɛ enti ɔsane kɔɔ nʼagya fie wɔ Betlehem. Abosome ɛnan akyi,
3 ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెని తిరిగి తెచ్చుకోడానికి ఆమె భర్త తన సేవకుణ్ణి, రెండు గాడిదలనూ తీసుకుని బయల్దేరాడు. ఆమె అతణ్ణి తన తండ్రి ఇంట్లోకి తీసుకు వెళ్ళింది. ఆ యువతి తండ్రి అతణ్ణి చూసి అతణ్ణి కలుసుకున్నందుకు సంతోషపడ్డాడు.
ne kunu no faa ɔsomfoɔ ne afunumu foforɔ kaa ne ho kɔɔ Betlehem sɛ ɔde rekɔkorɔkorɔ no na wasane nʼakyi aba. Ɔduruu ɔbaa no agya fie no, ɔde no kɔɔ efie no mu maa nʼagya no gyee no fɛ so.
4 ఆ అమ్మాయి తండ్రి, అంటే అతని మామ తనతో మూడు రోజులుండమని అతణ్ణి బలవంతం చేశాడు. కాబట్టి అతడు మూడు రోజులూ, రాత్రులూ తింటూ తాగుతూ అక్కడే గడిపాడు.
Ɔbaa no agya ka kyerɛɛ no sɛ ɔntena nkyɛ kakra. Enti, ɔdii nnansa, didiiɛ, nomeeɛ, daa hɔ.
5 నాలుగవ రోజు వెళ్ళడానికి వాళ్ళు ఉదయాన్నే మేలుకున్నారు. ప్రయాణానికి సిద్ధపడ్డారు. కాని ఆ అమ్మాయి తండ్రి తన అల్లుడితో “కొంచెం రొట్టె తిని బలం తెచ్చుకో. ఆ తరువాత వెళ్ళవచ్చు” అన్నాడు.
Ne nna ɛnan so no, ɔbarima no sɔree anɔpa, pɛɛ sɛ ɔkɔ. Nanso, ɔbaa no agya ka kyerɛɛ no sɛ, “Didi ansa na woakɔ.”
6 దాంతో మళ్ళీ వారిద్దరూ కూర్చుని భోజనం చేశారు. భోజనమయ్యాక ఆ అమ్మాయి తండ్రి “దయచేసి ఈ రాత్రంతా మాతో గడుపు. సరదాగా, సంతోషంగా ఉండు” అన్నాడు.
Enti, wɔn baanu no tenaa ase didiiɛ, nomeeɛ. Afei, ɔbaa no agya ka kyerɛɛ no sɛ, “Mesrɛ wo, da anadwo yi na gye wʼani.”
7 అతడు త్వరగా ముగించి బయల్దేరడానికి లేచాడు. కాని అతని మామ మళ్ళీ ఆ రాత్రి ఉండిపొమ్మని బలవంతం చేశాడు. కాబట్టి ఆ రాత్రి కూడా అతడు అక్కడే ఉండిపోయాడు.
Ɔbarima no sɔree sɛ anka ɔrekɔ, nanso, nʼase no hyɛɛ no sɛ ɔntena. Enti, ɔpenee so daa hɔ anadwo no.
8 అయిదో రోజు అతడు ఉదయాన్నే ప్రయాణానికి లేచినప్పుడు ఆ అమ్మాయి తండ్రి “మధ్యాహ్నం వరకూ ఉండి భోజనం చేసి కొంచెం బలపడు” అంటూ నిలిపివేశాడు. సాయంత్రం అయ్యేవరకూ తాత్సారం చేస్తూ వారు భోజనం చేసారు.
Nnanum so anɔpa no, ɔsɔree bio a ɔpɛɛ sɛ ɔkɔ. Nanso, bio, ɔbaa no agya kaa sɛ, “Didi ansa, na awiam kakra no wobɛtumi akɔ.” Enti, wɔsane didii bio.
9 ఆ లేవీయుడూ, అతని ఉంపుడుకత్తే, అతని సేవకుడూ ప్రయాణానికి లేచారు. అతని మామ అతనితో “చూడు, సాయంత్రం అయింది. చీకటి పడబోతోంది. నువ్వు మరో రాత్రి ఇక్కడే ఉండి సరదాగా గడుపు. రేపు ఉదయాన్నే లేచి నీ ఇంటికి వెళ్ళవచ్చు.” అని బలవంతం చేశాడు.
Awia no, ɔbarima no ne ne mpena no ne ne ɔsomfoɔ boaboaa wɔn ho pɛɛ sɛ wɔkɔ. Nanso, nʼase no ka kyerɛɛ no sɛ, “Montie! Adeɛ reyɛ asa. Montena na monnye mo ani anadwo yi. Ɔkyena mobɛtumi asim anɔpahema.”
10 ౧౦ కానీ అతడు ఆ రాత్రి అక్కడ గడపడానికి ఇష్టపడలేదు. అతడు లేచి ప్రయాణమయ్యాడు. ప్రయాణం సాగించి యెబూసు (అంటే యెరూషలేము) దగ్గరికి వచ్చాడు. అతని ఉంపుడుగత్తెతో పాటు అతనితో కూడా జీను కట్టిన రెండు గాడిదలూ ఉన్నాయి.
Nanso, afei deɛ ɔbarima no pɛɛ sɛ ɔbɛkɔ. Enti ɔfaa ne mfunumu mmienu a wɔahyehyɛ wɔn no ne mpena no, na wɔde wɔn ani kyerɛɛ Yebus (a ɛyɛ Yerusalem).
11 ౧౧ వారు యెబూసును సమీపించినప్పుడు పూర్తిగా సాయంత్రం అయింది. అతని సేవకుడు అతనితో “మనం ఈ యెబూసీయుల ఊర్లోకి వెళ్దాం. దీనిలో ఈ రాత్రి గడుపుదాం” అన్నాడు.
Ɛberɛ a wɔduruu Yebus no na adeɛ reyɛ asa, na ɔsomfoɔ no ka kyerɛɛ ne wura no sɛ, “Adeɛ reyɛ asa, enti momma yɛnna Yebusifoɔ kuropɔn yi mu anadwo yi.”
12 ౧౨ కానీ అతని యజమానుడు “ఇశ్రాయేలీయుల పట్టణాల్లోనే మనం బస చేద్దాం. ఇతరుల పట్టణాల్లో మనం ప్రవేశించం. మనం గిబియా వరకూ వెళ్దాం” అన్నాడు.
Ne wura no buaa sɛ, “Dabi, yɛrentumi ntena ananafoɔ kuropɔn a Israelfoɔ nni mu yi mu. Yɛbɛtoa so akɔ Gibea.
13 ౧౩ తరువాత ఆ లేవీయుడు తన సేవకుడితో “నువ్వు రా, మనం రామాకు గానీ గిబియాకి గానీ వెళ్లి రాత్రికి అక్కడే గడుపుదాం.” అన్నాడు.
Yɛbɛnya daberɛ anadwo yi wɔ Gibea anaa Rama.”
14 ౧౪ అలా వాళ్ళు ముందుకు ప్రయాణమయ్యారు. చివరకూ బెన్యామీను గోత్రానికి చెందిన గిబియాకు వచ్చారు. అప్పటికి చీకటి పడింది.
Enti, wɔtoaa so. Wɔrebɛduru kuro Gibea a ɛwɔ Benyamin asase so no, na owia rekɔtɔ,
15 ౧౫ కాబట్టి గిబియాలో ఆ రాత్రి గడపడానికి ఆ ఊరిలో ప్రవేశించారు. వారిని ఎవరూ తమ ఇంటికి ఆహ్వానించలేదు. కాబట్టి వారు ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక స్థలం లో కూర్చున్నారు.
Enti wɔdaa hɔ anadwo no. Wɔdaa kuro no abɔntene kɛseɛ so, na obiara amfa wɔn ankɔ fie ankɔsom wɔn hɔhoɔ.
16 ౧౬ అక్కడి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంత్రం ఒక వృద్ధుడు పొలంలో తన పని ముగించుకుని వచ్చాడు. అతడు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం నుండి వచ్చి గిబియాలో నివసిస్తున్నాడు.
Anwummerɛ no, akɔkoraa bi firii nʼafuom baa fie. Na ɔfiri Efraim bepɔ asase so, nanso na ɔte Gibea wɔ Benyamin asase so.
17 ౧౭ ఆ వృద్ధుడు తల ఎత్తి ఆ ఊరి మధ్యలో ప్రయాణమవుతూ కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూశాడు. “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడినుండి వస్తున్నావు?” అని అడిగాడు.
Ɛberɛ a ɔhunuu akwantufoɔ yi sɛ wɔtete kuro no abɔntene kɛseɛ so no, ɔbisaa wɔn baabi a wɔfiri ne baabi a wɔrekorɔ.
18 ౧౮ అందుకతడు “మేము యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం అవతల ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం. మా సొంత ఊరు అదే. యూదా ప్రాంతం లోని బేత్లెహేముకు వెళ్ళి వస్తున్నాము. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్తున్నాను. అయితే ఇక్కడ మాకెవరూ ఆతిథ్యం ఇవ్వలేదు
Ɔbarima no buaa no sɛ, “Yɛfiri Betlehem a ɛwɔ Yudea na yɛrekɔ Efraim bepɔ asase no so kuro bi a ɛwɔ akyirikyiri, na yɛrekɔ Awurade Asɔrefie. Nanso obiara amfa yɛn ankɔ ne fie ankɔpɛ yɛn daberɛ,
19 ౧౯ మా గాడిదలకు గడ్డీ, దాణా ఉన్నాయి. నాకూ, మీ సేవకురాలైన ఈమెకూ, మీ సేవకులతో సమానుడైన ఈ యువకుడికీ ఆహారం, ద్రాక్షారసం ఉన్నాయి. ఆ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు.” అన్నాడు.
ɛwom sɛ yɛwɔ deɛ ɛhia yɛn biara. Yɛwɔ ɛserɛ ne aduane a yɛde bɛma yɛn mfunumu; yɛwɔ burodo ne nsã.”
20 ౨౦ ఆ వృద్ధుడు “మీకు అంతా క్షేమం కలుగుతుంది. మీకు ఏదైనా తక్కువ అయితే వాటి సంగతి నేను చూసుకుంటాను
Akɔkoraa no kaa sɛ, “Mommra mmɛsoɛ me. Mɛma mo biribiara a ɛbɛhia mo. Na mmom, anadwo yi deɛ, ɛnsɛ sɛ moda abɔntene kɛseɛ so hɔ.”
21 ౨౧ అయితే రాత్రి ఇలా వీధిలో గడపకూడదు” అన్నాడు. అలా చెప్పి అతణ్ణి తన ఇంటికి ఆహ్వానించి తీసుకు వెళ్ళాడు. అతని గాడిదల కోసం మేత సిద్ధం చేశాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కుని భోజనం చేశారు.
Enti, ɔfaa wɔn de wɔn kɔɔ ne fie, na ɔmaa wɔn mfunumu no aduane. Wɔhohoroo wɔn nan ase wieeɛ no, wɔbɔɔ mu didiiɛ.
22 ౨౨ వాళ్ళు ఆ విధంగా ఆనందిస్తూ ఉండగా ఆ ఊరిలో ఉన్న కొందరు దుర్మార్గులు ఆ ఇంటిని చుట్టుముట్టి తలుపు కొట్టారు. ఆ ఇంటి యజమాని అయిన ఆ వృద్దునితో మాట్లాడారు. “నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకు రా. అతణ్ణి మేము తెల్సుకోవాలి” అన్నారు.
Ɛberɛ a wɔregye wɔn ani no, kuro no mu nnipa bɔnefoɔ bi bɛtwaa fie no ho hyiaeɛ. Wɔhyɛɛ aseɛ pempem ɛpono no teateaam guu akɔkoraa no so sɛ, “Fa ɔbarima a wabɛsoɛ wo no ma yɛn sɛdeɛ yɛbɛtumi ne no ada.”
23 ౨౩ ఆ వృద్ధుడు బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు “సోదరులారా, వద్దు. దయచేసి అలాంటి దుర్మార్గపు పని చేయకండి. ఈ వ్యక్తి నా ఇంట్లో అతిథిగా ఉన్నాడు. ఈ నీచమైన పని చేయకండి.
Akɔkoraa no firi baeɛ, bɛkasa kyerɛɛ wɔn sɛ, “Dabi, anuanom, monnyɛ bɔne a ɛte saa. Saa ɔbarima yi yɛ me hɔhoɔ na sɛ moyɛ saa a, ɛbɛyɛ animguaseɛ.
24 ౨౪ చూడండి, నా కూతురు కన్య. ఆమే, ఆ వ్యక్తి ఉంపుడుగత్తే ఉన్నారు. వాళ్ళను నేను బయటకు తీసుకుని వస్తాను. వాళ్ళను మీ ఇష్టం వచ్చినట్లు చెరుపుకోండి. కాని ఈ వ్యక్తి విషయంలో అలాంటి దుర్మార్గపు పని చేయకండి” అన్నాడు.
Me babaa ɔbaabunu ne ɔbarima yi mpena nie. Mede wɔn bɛma mo. Na deɛ mopɛ biara no monyɛ wɔn. Na mo ne saa ɔbarima yi nyɛ saa animguasedeɛ yi.”
25 ౨౫ కాని వాళ్ళు అతని మాట వినలేదు. దాంతో ఆ వ్యక్తి తన ఉంపుడుగత్తెను బయట ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాళ్ళు ఆమెను పట్టుకుని రాత్రంతా మానభంగం చేస్తూ, లైంగికంగా హింసిస్తూ ఉన్నారు. తెల్లవారుతుండగా ఆమెను విడిచి వెళ్ళారు.
Nanso, wɔantie no. Enti, Lewini no faa ne mpena no piaa no firii adi. Na kuro no mu mmarima no faa no nnidisoɔ nnidisoɔ kɔsii adekyeeɛ. Ahemadakye no na wɔgyaa no ma ɔkɔeɛ.
26 ౨౬ ఉదయాన్నే ఆమె తన భర్త ఉన్న ఆ వృద్దుడి ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె పూర్తిగా వెలుతురు వచ్చేవరకూ అలానే ఉంది.
Ɔbaa no kɔduruu fie a ne kunu no te mu no ɛpono ano ara pɛ na ɔtɔɔ mum. Ɔdaa hɔ ara kɔsii sɛ anim teteeɛ.
27 ౨౭ ఉదయం ఆమె భర్త ప్రయాణమై వెళ్ళడానికి తలుపులు తీశాడు. అతని ఉంపుడుగత్తె ఆ ఇంటి గుమ్మం దగ్గర గడప మీద చేతులు చాపి పడి ఉంది.
Ɛberɛ a ne kunu buee ɛpono sɛ ɔrepue pɛ na ɔhunuu sɛ ɔda hɔ. Na nʼanim butu hɔ a ne nsa gu aponnwa no so.
28 ౨౮ ఆ లేవీయుడు “లే వెళ్దాం” అన్నాడు. కానీ ఆమె జవాబివ్వలేదు. ఆమెను గాడిదపై వేసుకుని ఆ వ్యక్తి తన ఇంటికి ప్రయాణం సాగించాడు.
Ɔhunuu no no, ɔkaa sɛ, “Sɔre! Ma yɛnkɔ!” Nanso, wammua. Enti, ɔde no too nʼafunumu no so de no kɔɔ efie.
29 ౨౯ అతడు తన యింటికి వచ్చాక ఒక కత్తి తీసుకుని తన ఉంపుడుగత్తె శరీరంలో ఏ భాగానికి ఆ భాగం మొత్తం పన్నెండు ముక్కలుగా కోశాడు. ఆ పన్నెండు ముక్కలను ఇశ్రాయేలీయులు నివసించే ప్రాంతాలన్నిటికీ పంపాడు.
Ɔduruu fie no, ɔtwee sekan de twitwaa ne mpena no mu asinasini dumienu. Na ɔde esini baako biara kɔɔ Israel mmusuakuo dumienu no mu.
30 ౩౦ దాన్ని చూసిన వారంతా “ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకూ ఇలాంటిది జరగడం మనం చూడలేదు, వినలేదు. దీని గురించి ఆలోచించండి! ఏం చేయాలో చెప్పండి” అంటూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
Na obiara a ɔhunuu saa aninyanneɛ yi kaa sɛ, “Ɛfiri ɛberɛ a Israel firii Misraim no, obi nnii saa amumuyɛsɛm yi bi da. Adɛn enti na ɛnsɛ sɛ yɛkasa na yɛyɛ ho biribi?”

< న్యాయాధిపతులు 19 >