< న్యాయాధిపతులు 18 >

1 ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఇశ్రాయేలీయుల గోత్రాల్లో దాను గోత్రం వారు తాము నివసించడానికి ఒక స్థలం కోసం వెదుకుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకూ దాను గోత్రం వారు వారసత్వంగా భూమిని పొందలేదు.
ἐν ταῖς ἡμέραις ἐκείναις οὐκ ἦν βασιλεὺς ἐν Ισραηλ καὶ ἐν ταῖς ἡμέραις ἐκείναις ἡ φυλὴ Δαν ἐζήτει αὑτῇ κληρονομίαν κατοικῆσαι ὅτι οὐκ ἐνέπεσεν αὐτῇ ἕως τῆς ἡμέρας ἐκείνης ἐν μέσῳ φυλῶν Ισραηλ κληρονομία
2 దాను వంశీకులు తమలో ఐదుగురు శూరులను ఎన్నుకుని, ఆ దేశమంతా తిరిగి దాన్ని పరిశోధించడానికి జొర్యా నుండీ ఎష్తాయోలు నుండీ “మీరు వెళ్లి దేశమంతా చూసి రండి” అని చెప్పి పంపారు.
καὶ ἀπέστειλαν οἱ υἱοὶ Δαν ἀπὸ δήμων αὐτῶν πέντε ἄνδρας υἱοὺς δυνάμεως ἀπὸ Σαραα καὶ ἀπὸ Εσθαολ τοῦ κατασκέψασθαι τὴν γῆν καὶ ἐξιχνιάσαι αὐτὴν καὶ εἶπαν πρὸς αὐτούς πορεύεσθε καὶ ἐξιχνιάσατε τὴν γῆν καὶ ἦλθον ἕως ὄρους Εφραιμ ἕως οἴκου Μιχαια καὶ ηὐλίσθησαν ἐκεῖ
3 వాళ్ళు ప్రయాణిస్తూ ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతానికి వచ్చారు. అక్కడ మీకా ఇంట్లో ఆ రాత్రి ఆతిథ్యం పొందారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ లేవీ యువకుని మాట గుర్తు పట్టారు. అతణ్ణి చూసి “నిన్ను ఇక్కడికి ఎవరు రప్పించారు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకున్నావు?” అంటూ అడిగారు.
αὐτοὶ ἐν οἴκῳ Μιχαια καὶ αὐτοὶ ἐπέγνωσαν τὴν φωνὴν τοῦ νεανίσκου τοῦ Λευίτου καὶ ἐξέκλιναν ἐκεῖ καὶ εἶπαν αὐτῷ τίς ἤνεγκέν σε ὧδε καὶ τί σὺ ποιεῖς ἐν τῷ τόπῳ τούτῳ καὶ τί σοι ὧδε
4 అతడు మీకా తనకు చేసిందంతా చెప్పాడు. “నేను మీకాకు పూజారిగా ఉన్నాను. అతడు నాకు జీతం ఇస్తున్నాడు” అని చెప్పాడు.
καὶ εἶπεν πρὸς αὐτούς οὕτως καὶ οὕτως ἐποίησέν μοι Μιχαιας καὶ ἐμισθώσατό με καὶ ἐγενόμην αὐτῷ εἰς ἱερέα
5 అప్పుడు వాళ్ళు “మేము చేయబోయే పని సఫలమౌతుందో లేదో దేవుణ్ణి అడిగి మాకు చెప్పు” అన్నారు.
καὶ εἶπαν αὐτῷ ἐρώτησον δὴ ἐν τῷ θεῷ καὶ γνωσόμεθα εἰ εὐοδωθήσεται ἡ ὁδὸς ἡμῶν ἐν ᾗ ἡμεῖς πορευόμεθα ἐν αὐτῇ
6 దానికా యాజకుడు “క్షేమంగా వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన మార్గంలో యెహోవాయే మిమ్మల్ని నడిపిస్తాడు.” అన్నాడు.
καὶ εἶπεν αὐτοῖς ὁ ἱερεύς πορεύεσθε ἐν εἰρήνῃ ἐνώπιον κυρίου ἡ ὁδὸς ὑμῶν ἐν ᾗ πορεύεσθε ἐν αὐτῇ
7 అప్పుడు ఆ ఐదుగురు మనుష్యులు వెళ్లి లాయిషుకు వచ్చారు. అక్కడ జనం, సీదోనీయుల్లా భద్రంగా, నిర్భయంగా నివసించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని అధికారం చెలాయించేవాళ్ళు గానీ, బాధలు పెట్టేవాళ్ళు గానీ లేకపోవడం చూసారు. వాళ్ళు సీదోనీయులకు దూరంగా నివసించడమూ, వాళ్ళకు ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేకపోవడమూ చూశారు.
καὶ ἐπορεύθησαν οἱ πέντε ἄνδρες καὶ ἦλθον εἰς Λαισα καὶ εἶδαν τὸν λαὸν τὸν ἐν μέσῳ αὐτῆς καθήμενον ἐπ’ ἐλπίδι ὡς κρίσις Σιδωνίων ἡσυχάζουσα καὶ οὐκ ἔστιν διατρέπων ἢ καταισχύνων λόγον ἐν τῇ γῇ κληρονόμος ἐκπιέζων θησαυροῦ καὶ μακράν εἰσιν Σιδωνίων καὶ λόγον οὐκ ἔχουσιν πρὸς ἄνθρωπον
8 వాళ్ళు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న తమ వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళు “మీరిచ్చే నివేదిక ఏమిటి?” అని అడిగారు.
καὶ ἦλθον οἱ πέντε ἄνδρες πρὸς τοὺς ἀδελφοὺς αὐτῶν εἰς Σαραα καὶ Εσθαολ καὶ εἶπον τοῖς ἀδελφοῖς αὐτῶν τί ὑμεῖς κάθησθε
9 దానికి వాళ్ళు “రండి! మనం వాళ్ళపై దాడి చేద్దాం. ఆ దేశాన్ని మేము చూశాం. అది ఎంతో బాగుంది. చేతులు ముడుచుకుని కూర్చోకండి. వాళ్ళపై దాడి చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడంలో ఇక ఆలస్యం చేయవద్దు.
καὶ εἶπαν ἀνάστητε καὶ ἀναβῶμεν ἐπ’ αὐτούς ὅτι εἴδομεν τὴν γῆν καὶ ἰδοὺ ἀγαθὴ σφόδρα καὶ ὑμεῖς ἡσυχάζετε μὴ ὀκνήσητε τοῦ πορευθῆναι καὶ εἰσελθεῖν τοῦ κληρονομῆσαι τὴν γῆν
10 ౧౦ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ‘మేము భద్రంగా ఉన్నాం’ అని భావిస్తున్న వారిని మీరు చూస్తారు. ఆ దేశం విశాలమైనది. భూమి మీద ఎలాంటి కొరతా అక్కడ లేదు. దేవుడు దాన్ని మీకిచ్చాడు,” అన్నారు.
καὶ ἡνίκα ἂν ἔλθητε εἰσελεύσεσθε πρὸς λαὸν ἐπ’ ἐλπίδι καὶ ἡ γῆ πλατεῖα ὅτι ἔδωκεν αὐτὴν ὁ θεὸς ἐν χειρὶ ὑμῶν τόπος ὅπου οὐκ ἔστιν ἐκεῖ ὑστέρημα παντὸς ῥήματος τῶν ἐν τῇ γῇ
11 ౧౧ అప్పుడు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న దాను గోత్రం వాళ్ళలో ఆరు వందలమంది ఆయుధాలు ధరించి బయలుదేరి యూదా దేశం లోని కిర్యత్యారీములో ఆగారు.
καὶ ἀπῆραν ἐκεῖθεν ἀπὸ δήμων τοῦ Δαν ἀπὸ Σαραα καὶ ἀπὸ Εσθαολ ἑξακόσιοι ἄνδρες ἐζωσμένοι σκεύη παρατάξεως
12 ౧౨ అందుకే ఆ స్థలానికి ఇప్పటికీ మహానేదాన్ అని పేరు. దాను గోత్రం వాళ్ళ సైన్యం అని దాని అర్థం. అది కిర్యత్యారీముకు పడమరగా ఉంది.
καὶ ἀνέβησαν καὶ παρενέβαλον ἐν Καριαθιαριμ ἐν Ιουδα διὰ τοῦτο ἐκλήθη ἐν ἐκείνῳ τῷ τόπῳ παρεμβολὴ Δαν ἕως τῆς ἡμέρας ταύτης ἰδοὺ ὀπίσω Καριαθιαριμ
13 ౧౩ అక్కడనుండి వాళ్ళు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతానికి వచ్చి అక్కడే ఉన్న మీకా ఇంటికి వచ్చారు.
καὶ παρῆλθον ἐκεῖθεν ὄρος Εφραιμ καὶ ἦλθον ἕως οἴκου Μιχαια
14 ౧౪ అప్పుడు లాయిషు దేశాన్ని చూడటానికి వెళ్ళిన ఆ ఐదుగురు శూరులు తమ వారిని చూసి “ఈ ఇంట్లో ఎఫోదూ, గృహ దేవుళ్ళూ, చెక్కిన ప్రతిమా, పోత విగ్రహమూ ఉన్నాయని మీకు తెలుసా? మీరేం చేయాలో ఆలోచించుకోండి” అన్నారు.
καὶ ἀπεκρίθησαν οἱ πέντε ἄνδρες οἱ πεπορευμένοι κατασκέψασθαι τὴν γῆν Λαισα καὶ εἶπαν πρὸς τοὺς ἀδελφοὺς αὐτῶν ἔγνωτε ὅτι ἔστιν ἐν τῷ οἴκῳ τούτῳ εφωδ καὶ θεραφιν καὶ γλυπτὸν καὶ χωνευτόν καὶ νῦν γνῶτε ὅ τι ποιήσετε
15 ౧౫ వారు ఆ వైపుకు తిరిగి ఆ లేవీ యువకుడు ఉన్న మీకా ఇంటికి వచ్చి అతణ్ణి కుశల ప్రశ్నలడిగారు.
καὶ ἐξέκλιναν ἐκεῖ καὶ εἰσῆλθον εἰς τὸν οἶκον τοῦ νεανίσκου τοῦ Λευίτου οἶκον Μιχαια καὶ ἠρώτησαν αὐτὸν εἰς εἰρήνην
16 ౧౬ దాను గోత్రానికి చెందిన ఆరు వందలమంది యుధ్ధానికై ఆయుధాలు ధరించి సింహద్వారం దగ్గర నిల్చున్నారు.
καὶ οἱ ἑξακόσιοι ἄνδρες οἱ ἀνεζωσμένοι τὰ σκεύη τῆς παρατάξεως αὐτῶν ἑστῶτες παρὰ θύρας τῆς πύλης οἱ ἐκ τῶν υἱῶν Δαν
17 ౧౭ అప్పుడు ఆ యాజకుడు ఆయుధాలు ధరించిన ఆరు వందలమందితో కలసి సింహద్వారం దగ్గర నిలిచి ఉండగా దేశాన్ని పరిశోధించడానికి వెళ్ళిన ఆ ఐదుగురు శూరులు లోపలికి వెళ్ళి ఆ ప్రతిమనూ, ఎఫోదునూ, గృహ దేవుళ్ళ విగ్రహాలనూ, పోత విగ్రహాన్నీ తీసుకున్నారు.
καὶ ἀνέβησαν οἱ πέντε ἄνδρες οἱ πορευθέντες κατασκέψασθαι τὴν γῆν
18 ౧౮ వీరు మీకా యింటిలోకి వెళ్ళి ఆ ప్రతిమనూ, ఎఫోదునూ, గృహ దేవుళ్ళ విగ్రహాలనూ, పోత విగ్రహాన్నీ పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు “మీరేం చేస్తున్నారు?” అని అడిగాడు.
καὶ εἰσῆλθον ἐκεῖ εἰς οἶκον Μιχαια καὶ ὁ ἱερεὺς ἑστώς καὶ ἔλαβον τὸ γλυπτὸν καὶ τὸ εφωδ καὶ τὸ θεραφιν καὶ τὸ χωνευτόν καὶ εἶπεν πρὸς αὐτοὺς ὁ ἱερεύς τί ὑμεῖς ποιεῖτε
19 ౧౯ వాళ్ళు “నువ్వు నోరు మూసుకో. నీ చెయ్యి నోటి మీద ఉంచుకుని మాతో కలసి వచ్చి మాకు తండ్రిగా యాజకుడుగా ఉండు. ఒక ఇంటికి యాజకుడుగా ఉండటం గొప్ప సంగతా లేక ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రానికి యాజకుడుగా ఉండటం గొప్ప సంగతా” అని అడిగారు.
καὶ εἶπαν αὐτῷ κώφευσον ἐπίθες τὴν χεῖρά σου ἐπὶ τὸ στόμα σου καὶ δεῦρο μεθ’ ἡμῶν καὶ γενοῦ ἡμῖν εἰς πατέρα καὶ εἰς ἱερέα μὴ ἀγαθὸν εἶναί σε ἱερέα οἴκου ἀνδρὸς ἑνὸς ἢ γενέσθαι σε ἱερέα φυλῆς καὶ οἴκου εἰς δῆμον Ισραηλ
20 ౨౦ ఆ మాటలకు అ యాజకుడు హృదయంలో సంతోషించాడు. ఆ ఎఫోదునూ, గృహ దేవుళ్ళనూ చెక్కిన ప్రతిమనూ తీసుకుని వాళ్ళతో కలసి పోయాడు.
καὶ ἠγαθύνθη ἡ καρδία τοῦ ἱερέως καὶ ἔλαβεν τὸ εφωδ καὶ τὸ θεραφιν καὶ τὸ γλυπτὸν καὶ τὸ χωνευτὸν καὶ ἦλθεν ἐν μέσῳ τοῦ λαοῦ
21 ౨౧ అక్కడి నుంచి వాళ్ళు వెనక్కు తిరిగారు. చిన్నపిల్లలనూ, పశువులనూ, సామగ్రినీ తమకు ముందుగా తరలించుకు పోయారు.
καὶ ἐπέστρεψαν καὶ ἀπῆλθαν καὶ ἔθηκαν τὰ τέκνα καὶ τὴν κτῆσιν καὶ τὸ βάρος ἔμπροσθεν αὐτῶν
22 ౨౨ వాళ్ళు మీకా ఇంటి నుంచి కొంత దూరం వెళ్ళాక మీకా అతని పొరుగు వారూ సమకూడి దాను గోత్రం వారిని వెంటాడి వాళ్ళను కలుసుకుని కేకలు వేసి పిలిచారు.
αὐτοὶ ἐμάκρυναν ἀπὸ οἴκου Μιχαια καὶ ἰδοὺ Μιχαιας καὶ οἱ ἄνδρες οἱ ἐν ταῖς οἰκίαις ταῖς μετὰ οἴκου Μιχαια ἐβόησαν καὶ κατελάβοντο τοὺς υἱοὺς Δαν
23 ౨౩ దానీయులు తిరిగి చూసి “నీకేం కావాలి? ఇలా గుంపుగా వస్తున్నరేమిటి?” అని మీకాను అడిగారు.
καὶ ἐπέστρεψαν τὸ πρόσωπον αὐτῶν υἱοὶ Δαν καὶ εἶπαν τῷ Μιχαια τί ἐστίν σοι ὅτι ἐβόησας
24 ౨౪ దానికి అతడు “నేను చేయించిన నా దేవుళ్ళనూ, నా కుల పూజారినీ మీరు పట్టుకుపోతున్నారు. ఇక నాకేం మిగిలింది? ‘నీకేం కావాలి?’ అని నన్ను ఎలా అడుగుతున్నారు?” అన్నాడు.
καὶ εἶπεν Μιχαιας ὅτι τὸ γλυπτόν μου ὃ ἐποίησα ἐλάβετε καὶ τὸν ἱερέα καὶ ἐπορεύθητε καὶ τί ἐμοὶ ἔτι καὶ τί τοῦτο λέγετε πρός με τί κράζεις
25 ౨౫ దాను గోత్రం వారు అతనితో “జాగ్రత్త! నీ స్వరం మా వాళ్లకు ఎవరికీ వినపడనీయకు. వాళ్ళకు నీమీద కోపం వచ్చిందంటే నీమీద దాడి చేసి నిన్నూ నీ కుటుంబాన్నీ చంపేస్తారు” అన్నారు.
καὶ εἶπον πρὸς αὐτὸν οἱ υἱοὶ Δαν μὴ ἀκουσθήτω δὴ φωνή σου μεθ’ ἡμῶν μήποτε συναντήσωσιν ἐν ἡμῖν ἄνδρες πικροὶ ψυχῇ καὶ προσθήσουσιν ψυχὴν καὶ τὴν ψυχὴν τοῦ οἴκου σου
26 ౨౬ ఈ విధంగా దాను గోత్రం వారు తమ మార్గాన వెళ్ళిపోయారు. వాళ్ళు తన కంటే బలవంతులని అర్థం చేసుకున్న మీకా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
καὶ ἐπορεύθησαν οἱ υἱοὶ Δαν εἰς ὁδὸν αὐτῶν καὶ εἶδεν Μιχαιας ὅτι δυνατώτεροί εἰσιν ὑπὲρ αὐτόν καὶ ἐπόστρεψεν εἰς τὸν οἶκον αὐτοῦ
27 ౨౭ దాను గోత్రం వాళ్ళు మీకా తయారు చేసుకున్న వాటినీ, అతని యాజకుడినీ పట్టుకున్న తరువాత లాయిషుకు వచ్చారు. అక్కడ నిర్భయంగా క్షేమంగా నివసిస్తున్న వారిని కత్తితో చంపేశారు. ఆ పట్టణాన్ని తగులబెట్టారు.
καὶ οἱ υἱοὶ Δαν ἔλαβον ὃ ἐποίησεν Μιχαιας καὶ τὸν ἱερέα ὃς ἦν αὐτῷ καὶ ἦλθον ἐπὶ Λαισα ἐπὶ λαὸν ἡσυχάζοντα καὶ πεποιθότα ἐπ’ ἐλπίδι καὶ ἐπάταξαν αὐτοὺς ἐν στόματι ῥομφαίας καὶ τὴν πόλιν ἐνέπρησαν ἐν πυρί
28 ౨౮ ఆ పట్టణం సీదోనుకు దూరంగా ఉండటం వల్లా, వాళ్లకు ఎవరితోనూ సంబంధం లేకపోవడం వల్లా వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. ఆ పట్టణం బెత్రేహోబు లోయకు దగ్గరగా ఉంది. దాను గోత్రం వాళ్ళు ఆ పట్టణాన్ని పునర్నిర్మాణం చేశారు.
καὶ οὐκ ἦν ὁ ῥυόμενος ὅτι μακράν ἐστιν ἀπὸ Σιδωνίων καὶ λόγος οὐκ ἔστιν αὐτοῖς μετὰ ἀνθρώπου καὶ αὐτὴ ἐν τῇ κοιλάδι τοῦ οἴκου Ρααβ καὶ ᾠκοδόμησαν τὴν πόλιν καὶ κατεσκήνωσαν ἐν αὐτῇ
29 ౨౯ తమ పూర్వీకుడైన దాను పేరును బట్టి ఆ పట్టణానికి దాను అని పేరు పెట్టారు. అంతకు ముందు ఆ పట్టణం పేరు లాయిషు.
καὶ ἐκάλεσαν τὸ ὄνομα τῆς πόλεως Δαν ἐν ὀνόματι Δαν πατρὸς αὐτῶν ὃς ἐτέχθη τῷ Ισραηλ καὶ Ουλαμαις τὸ ὄνομα τῆς πόλεως τὸ πρότερον
30 ౩౦ దాను గోత్రం వాళ్ళు చెక్కిన ప్రతిమను పెట్టుకున్నారు. మోషే మనుమడూ, గెర్షోము కొడుకు అయిన యోనాతాను అనే వాడూ, అతని కుమారులూ ఆ దేశ ప్రజలు బందీలుగా వెళ్ళే వరకూ వారికి యాజకులుగా ఉన్నారు.
καὶ ἔστησαν ἑαυτοῖς οἱ υἱοὶ Δαν τὸ γλυπτόν καὶ Ιωναθαμ υἱὸς Γηρσομ υἱὸς Μανασση αὐτὸς καὶ οἱ υἱοὶ αὐτοῦ ἦσαν ἱερεῖς τῇ φυλῇ Δαν ἕως ἡμέρας ἀποικίας τῆς γῆς
31 ౩౧ దేవుని మందిరం షిలోహులో ఉన్నంత కాలం వాళ్ళు మీకా చేయించిన చెక్కిన విగ్రహాన్ని పూజించారు.
καὶ ἔθηκαν αὐτοῖς τὸ γλυπτόν ὃ ἐποίησεν Μιχαιας πάσας τὰς ἡμέρας ἃς ἦν ὁ οἶκος τοῦ θεοῦ ἐν Σηλωμ

< న్యాయాధిపతులు 18 >