< న్యాయాధిపతులు 17 >

1 ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో మీకా అనే ఒక వ్యక్తి నివసించేవాడు.
ইফ্রয়িমের পার্বত্য প্রদেশে বসবাসকারী মীখা নামক একজন লোক
2 అతడు తన తల్లితో “నీ దగ్గర నుండి నేను తీసుకున్న పదకొండు వందల వెండి ఇదిగో. వాటిని తీసుకున్న వాణ్ణి నువ్వు శపించడం నేను విన్నాను. చూడు, అవి నా దగ్గరే ఉన్నాయి. నేనే వాటిని దొంగిలించాను” అన్నాడు. అతని తల్లి అతణ్ణి చూసి “కొడుకా, యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక!” అంది.
তার মাকে বলল, “তোমার যে 1,100 শেকল রুপো চুরি হয়েছিল এবং যার জন্য আমি তোমাকে অভিশাপ দিতে শুনেছিলাম—সেই রুপো আমার কাছেই আছে; আমিই তা নিয়েছিলাম।” তখন তার মা বললেন, “বাছা, সদাপ্রভু তোমায় আশীর্বাদ করুন!”
3 అతడు ఆ పదకొండు వందల వెండిని తిరిగి తన తల్లికి ఇచ్చేశాడు. ఆమె “ఈ సొమ్మును నేను యెహోవాకు ఇచ్చేస్తున్నాను. దీనితో నా కొడుకు కోసం ఒక చెక్క విగ్రహమూ, మరొక పోత విగ్రహమూ తయారు చేయిస్తాను. అందుకని ఇవి నీకే తిరిగి ఇచ్చేస్తాను” అంది.
সে যখন তার মাকে সেই 1,100 শেকল রুপো ফিরিয়ে দিল, তখন তার মা বললেন, “আমার এই রুপো আমি শপথ নিয়ে সদাপ্রভুর উদ্দেশে উৎসর্গ করছি, যেন আমার ছেলে রুপো দিয়ে মোড়া একটি মূর্তি তৈরি করে। এই রুপো আমি তোমাকেই ফিরিয়ে দেব।”
4 అతడు ఆ నాణేలను తన తల్లికి ఇచ్చాడు. ఆమె వాటిలో రెండు వందలు తీసి ఒక కంసాలికి ఇచ్చింది. వాడు వాటితో ఒక విగ్రహాన్ని చెక్కాడు. లోహంతో మరో విగ్రహాన్ని పోత పోశాడు. ఆ విగ్రహాన్ని మీకా ఇంట్లోనే ఉంచారు.
অতএব মীখা সেই রুপো তার মাকে ফিরিয়ে দেওয়ার পর, তিনি তা থেকে 200 শেকল রুপো নিয়ে সেগুলি এমন একজন রৌপ্যকারকে দিলেন, যে প্রতিমা নির্মাণ করার জন্য সেগুলি ব্যবহার করল। আর সেটি মীখার বাড়িতেই রাখা হল।
5 మీకా ఇంట్లో విగ్రహాలున్న పూజ గది ఒకటుంది. అతడు ఒక ఎఫోదునూ కొన్ని విగ్రహాలనూ చేయించి అందులో ఉంచాడు. తన కొడుకుల్లో ఒకణ్ణి పూజారిగా ప్రతిష్టించాడు. అతని కొడుకే అతనికి యాజకుడు అయ్యాడు.
সেই মীখার একটি মন্দির ছিল, এবং সে একটি এফোদ ও কয়েকটি গৃহদেবতা তৈরি করল ও তার এক ছেলেকে নিজের যাজকরূপে অভিষিক্ত করল।
6 ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారం జీవిస్తున్నారు.
সেই সময় ইস্রায়েলে কোনও রাজা ছিলেন না; প্রত্যেকে, তাদের যা ভালো বলে মনে হত, তাই করত।
7 అక్కడ యూదా గోత్రంలో చేరిన ఒక లేవీ యువకుడు ఉండేవాడు. ఇతడు యూదా ప్రాంతానికి చెందిన బేత్లెహేము నుండి వచ్చాడు.
যিহূদার বেথলেহেমে এক তরুণ লেবীয় ছিল, যে যিহূদা গোষ্ঠীভুক্ত লোকজনের সঙ্গে বসবাস করত।
8 ఆ వ్యక్తి తనకో నివాస స్థలం కోసం యూదా బేత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఉన్న మీకా యింటికి వచ్చాడు.
সে সেই নগর ছেড়ে বসবাসের উপযোগী অন্য কোনো স্থানের খোঁজে বেরিয়ে পড়ল। পথে যেতে যেতে সে ইফ্রয়িমের পার্বত্য প্রদেশে মীখার বাড়িতে এসে পৌঁছাল।
9 అతణ్ణి మీకా “నీవు ఎక్కడ నుంచి వచ్చావు?” అని అడిగాడు. దానికతడు “నేను యూదా బేత్లెహేమునుంచి వచ్చిన లేవీయుణ్ణి. నాకో నివాస స్థలం కోసం వెదుకుతున్నాను.” అన్నాడు.
মীখা তাকে জিজ্ঞাসা করল, “তুমি কোথাকার লোক?” “আমি যিহূদার বেথলেহেম নিবাসী এক লেবীয়,” সে বলল, “আর আমি থাকার জন্য একটি স্থান খুঁজছি।”
10 ౧౦ అప్పుడు మీకా “నువ్వు నా దగ్గరే ఉండు. నాకు తండ్రిగా, యాజకుడుగా ఉండు. నీకు సంవత్సరానికి పది వెండి నాణేలూ, బట్టలూ, ఆహారమూ ఇస్తాను.” అన్నాడు. దానికి ఆ లేవీయుడు అంగీకరించాడు.
পরে মীখা সেই লেবীয়কে বলল, “আমার সঙ্গে থাকো এবং আমার পিতৃস্থানীয় এক যাজক হয়ে যাও, এবং আমি তোমাকে বছরে দশ শেকল করে রুপো, তোমার জামাকাপড় ও তোমার খাদ্যদ্রব্য দেব।”
11 ౧౧ ఆ వ్యక్తి దగ్గర ఉండిపోడానికి ఒప్పుకున్నాడు. ఆ యువకుడు అతని కొడుకుల్లో ఒకడిగా ఉన్నాడు.
অতএব সেই লেবীয় তরুণ তার সঙ্গে থাকতে রাজি হয়ে গেল, এবং সে মীখার কাছে তার পুত্রস্থানীয় হয়ে গেল।
12 ౧౨ మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్టించాడు. అతడు మీకాకు యాజకుడుగా ఉన్నాడు.
পরে মীখা সেই লেবীয়কে অভিষিক্ত করল, এবং সেই তরুণ তার যাজক হয়ে গেল ও তার বাড়িতেই বসবাস করতে লাগল।
13 ౧౩ అప్పుడు మీకా “ఈ లేవీయుడు నాకు యాజకుడుగా ఉన్నాడు కాబట్టి యెహోవా నాకు తప్పక మేలు చేస్తాడని నాకు తెలుసు” అన్నాడు.
আর মীখা বলল, “এখন আমি বুঝতে পারছি যে সদাপ্রভু আমার প্রতি মঙ্গলময় হবেন, যেহেতু এই লেবীয় আমার যাজক হয়েছে।”

< న్యాయాధిపతులు 17 >