< న్యాయాధిపతులు 16 >
1 ౧ తరువాత సంసోను గాజాకు వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూసి ఆమెతో ఉండిపోయాడు.
Sam-sôn đi đến Ga-xa, thấy một kỵ nữ ở đó, bèn đi vào nhà nàng.
2 ౨ సంసోను అక్కడికి వచ్చాడని గాజా వారికి తెలిసింది. దాంతో వారు రహస్యంగా ఆ స్థలాన్ని చుట్టుముట్టారు. తెల్లవారిన తరువాత సంసోనును చంపాలని కాచుకుని ఉన్నారు.
Người ta thuật lại cho dân Ga-xa rằng: Sam-sôn đã đến đây. Chúng bèn vây người và rình giữ trọn đêm tại cửa thành. Cả đêm ấy, chúng giữ yên lặng, mà rằng: Rựng sáng, chúng ta sẽ giết hắn.
3 ౩ సంసోను అర్థ రాత్రి వరకూ పండుకున్నాడు. అర్థ రాత్రి వేళ ఆ పట్టణం ద్వారం తలుపులను వాటి రెండు దర్వాజాలనూ అడ్డకర్రలతో సహా ఊడబెరికి వాటిని మోసుకుంటూ హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండశిఖరానికి వాటిని తీసుకు వెళ్ళాడు.
Sam-sôn ở ngủ cho đến khuya. Lối khuya, người thức dậy, nắm hai cánh cửa thành và hai cây trụ, nhổ nó lên luôn với cây then, vác trên vai, và đem lên chót núi đối ngang Hếp-rôn.
4 ౪ ఆ తరువాత సంసోను శోరేకు లోయలో నివాసముండే ఒక స్త్రీని ప్రేమించాడు. ఆమె పేరు దెలీలా.
Sau đó, người yêu mến một người nữ trong trũng Sô-réc, tên là Đa-li-la.
5 ౫ ఫిలిష్తీయుల అధికారులు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో “నువ్వు అతణ్ణి ఏమార్చి అతడి గొప్ప బలం దేంట్లో ఉందో, మేము అతణ్ణి బంధించడానికి ఎలా అతణ్ణి గెలవవచ్చో తెలుసుకో. మేము అతణ్ణి బంధించి అతని గర్వం అణచివేస్తాం. నువ్వు దీన్ని చేస్తే మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి నాణేలిస్తాం” అన్నారు.
Các quan trưởng Phi-li-tin đến nhà nàng, mà rằng: Hãy rán dụ dỗ hắn, hầu cho biết bởi đâu hắn có sức mạnh lớn lao kia, và chúng ta phải làm thế nào cho được thắng hơn, trói và bắt hắn phục. Chúng ta ai nấy sẽ thưởng cho nàng mười một trăm miếng bạc.
6 ౬ కాబట్టి దెలీలా “నువ్వు ఇంత బలంగా ఉండటానికి కారణమేంటో, నిన్ను ఓడించాలంటే దేంతో నిన్ను బంధించాలో దయచేసి నాకు చెప్పు” అని సంసోనును అడిగింది.
Đa-li-la nói cùng Sam-sôn rằng: Tôi xin chàng hãy nói cho tôi biết bởi đâu chàng có sức mạnh lớn lao, và phải dùng chi trói chàng đặng bắt phục chàng?
7 ౭ దానికి సంసోను “ఏడు పచ్చి వింటినారలతో నన్ను కట్టిపడేస్తే నాలో బలం పోయి అందరిలానే ఉంటాను” అన్నాడు.
Sam-sôn đáp: Nếu người ta trói tôi bằng bảy sợi dây cung tươi và còn ướt, thì tôi sẽ trở nên yếu đuối như một người khác.
8 ౮ ఫిలిష్తీయుల అధికారులు ఏడు పచ్చి వింటినారలను తెచ్చి ఆమెకు ఇచ్చారు. ఆమె వాటితో అతణ్ణి బంధించింది.
Các quan trưởng Phi-li-tin đem cho Đa-li-la bảy sợi dây tươi và còn ướt, nàng lấy trói người.
9 ౯ ఆమె ఇంట్లోని లోపలి గదిలో కొంతమంది దాగి ఉన్నారు. ఆమె “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అంది. అతడు తనను బంధించిన వింటినారలను కాలిపోయిన నారపోగుల్లా తెంపేశాడు. కాబట్టి అతని బలం వెనుక రహస్యం వెల్లడి కాలేదు.
Vả, tại trong phòng ở nhà nàng có binh phục. Nàng nói: ù Sam-sôn, người Phi-li-tin xông hãm ngươi! Song người bứt những sợi dây như sợi chỉ gai đứt khi đụng đến lửa. Như vậy, căn nguyên sức mạnh người chẳng tìm ra được.
10 ౧౦ అప్పుడు దెలీలా “చూడు, నువ్వు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. దయచేసి నిన్ను ఎలా లొంగదీసుకోవచ్చో నాకు చెప్పు” అని సంసోనుతో అంది.
Đa-li-la nói cùng Sam-sôn rằng: Nầy chàng đã gạt tôi, nói dối cùng tôi. Xin bây giờ tỏ cho tôi phải lấy chi trói chàng?
11 ౧౧ సంసోను “కొత్తగా పేనిన, ఇంత వరకూ వాడని తాళ్ళతో నన్ను బంధించాలి. అప్పుడు నేను అందరిలాగా బలహీనుడి నౌతాను” అన్నాడు.
Người đáp: Nếu người ta cột ta bằng dây lớn mới, chưa hề có ai dùng, thì ta sẽ trở nên yếu như một người khác.
12 ౧౨ అప్పుడు దెలీలా కొత్తగా పేనిన తాళ్లతో అతణ్ణి బంధించింది. “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అని సంసోనుతో అంది. అప్పటికే ఆమె గదిలో కొందరు వేచి చూస్తున్నారు. సంసోను లేచి ఆ తాళ్ళను నూలు పోగుల్లా తెంపేశాడు.
Vậy, Đa-li-la lấy dây lớn mới, trói Sam-sôn rồi nói rằng: ù Sam-sôn, người Phi-li-tin xông hãm ngươi! Vả, có binh đang phục trong một phòng. Nhưng người bức những sợi dây lớn trói cánh tay, y như một sợi chỉ vậy.
13 ౧౩ అప్పుడు దెలీలా “ఇప్పటివరకూ నువ్వు నన్ను మోసం చేస్తూ అబద్ధమే చెప్పావు. దేనితో నిన్ను బంధించవచ్చో నాకు చెప్పు” అంది. అప్పుడు సంసోను “నా తలపై ఉన్న ఏడు జడలను మగ్గంలో నేతలాగ అల్లితే సరి” అన్నాడు.
Đa-li-la nói cùng Sam-sôn rằng: Chàng gạt tôi và nói dối tôi đến bây giờ. Vậy. xin hãy nói cho tôi biết phải trói chàng bằng chi. Người đáp: Nàng cứ dệt bảy lọn tóc thắt của đầu ta vào trong canh chỉ của nàng.
14 ౧౪ అప్పుడు అతడు నిద్రిస్తున్నప్పుడు ఆమె అతని తలపై ఏడు జడలు మగ్గంపై అల్లి మేకుతో మగ్గానికి దిగగొట్టింది. తరువాత “సంసోనూ, ఫిలిష్తీయులు వచ్చేశారు!” అంటూ అతణ్ణి నిద్ర లేపింది. సంసోను నిద్ర నుండి లేచి మగ్గపు మేకునూ నేతనూ ఊడబెరికాడు.
Đa-li-la lấy con sẻ cột chặt lại, rồi la rằng: ù, Sam-sôn, người Phi-li-tin xông hãm ngươi! Nhưng người thức dậy, nhổ con sẻ của khung cửi ra luôn với canh chỉ.
15 ౧౫ అప్పుడు ఆమె “నీ రహస్యాలేవీ నాకు చెప్పకుండా నన్ను ప్రేమిస్తున్నానని ఎలా అనగలుగుతున్నావు? ఇప్పటికి మూడు సార్లు నన్ను మోసం చేశావు. నీ మహాబలం దేనిలో ఉందో ఇంతవరకూ నాకు చెప్పలేదు” అంది.
Bấy giờ, nàng mới nói rằng: Làm sao chàng nói được rằng: Tôi yêu nàng! bởi vì lòng chàng chẳng thành cùng tôi? Chàng đã gạt tôi ba lần, và chẳng nói cho tôi biết bởi đâu có sức lực lớn của chàng.
16 ౧౬ ఇక ఆమె ప్రతిరోజూ తన మాటలతో అతణ్ణి విసికించడం ప్రారంభించింది. దాంతో అతనికి విసుగు పుట్టి “చావే నయం” అనిపించింది.
Mỗi ngày nàng lấy câu hỏi ghẹo lòng rối trí người, đến đỗi người bị tức mình hòng chết.
17 ౧౭ అప్పుడు సంసోను సమస్తం ఆమెకు తెలియచేశాడు. “నేను పుట్టిన దగ్గర్నుంచి మంగలి కత్తి నా తలపైకి రాలేదు. ఎందుకంటే నేను నా తల్లి గర్భంలోనే దేవునికి నాజీరుగా ఉన్నాను. నా తలపై జుట్టును క్షౌరం చేస్తే నేను అందరిలాగానే సామాన్యుడిగా మారతాను” అని ఆమెకు చెప్పాడు.
Người bèn tỏ hết sự lòng mình mà rằng: Dao cạo chẳng hề đưa qua đầu ta, vì từ trong lòng mẹ, ta đã làm người Na-xi-rê cho Đức Chúa Trời. Nếu ta bị cạo, sức lực ta sẽ lìa khỏi ta, ta tất trở thành yếu như người khác.
18 ౧౮ అతడు తన రహస్యాన్ని చెప్పేశాడని దెలీలాకు అర్థమైంది. ఆమె ఫిలిష్తీయుల అధికారులకు కబురు పంపింది. “మరోసారి రండి. ఇతను నాకు తన రహస్యాన్ని చెప్పాడు” అంది. ఫిలిష్తీయుల అధికారులు డబ్బు తీసుకుని ఆమె దగ్గరికి వచ్చారు.
Đa-li-la thấy người đã tỏ hết sự lòng cho mình, sai mời các quan trưởng Phi-li-tin, mà rằng: Lần nầy hãy lên, vì hắn tỏ hết sự lòng cho tôi. Vậy, các quan trưởng Phi-li-tin đi lên nhà nàng, đem bạc trong tay.
19 ౧౯ ఆమె తన తొడ మీద అతణ్ణి నిద్ర పోయేలా చేసి ఒక మనిషిని పిలిపించి అతని ద్వారా సంసోను తల పై ఉన్న ఏడు జడలనూ క్షౌరం చేయించింది. అతణ్ణి లొంగదీసుకోసాగింది. ఎందుకంటే అప్పటికి అతనిలోని బలం తొలగిపోయింది.
Nàng khiến Sam-sôn nằm ngủ trên đầu gối mình, gọi một người, biểu cạo bảy mé tóc trên đầu chàng. Như vậy, nàng khởi làm khốn khổ người, sức lực bèn lìa khỏi người.
20 ౨౦ ఆమె “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అంది. సంసోను నిద్ర లేచి “ఎప్పటి లానే లేచి విసిరికొట్టి విడిపించుకుంటాను” అనుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచి పెట్టాడని అతనికి తెలియలేదు.
Bấy giờ nàng nói: ù Sam-sôn, người Phi-li-tin xông hãm ngươi! Người thức dậy mà rằng: Ta sẽ ra như các lần trước, và gỡ mình cho thoát khỏi tay chúng nó! Nhưng người chẳng biết rằng Đức Giê-hô-va đã lìa khỏi mình.
21 ౨౧ అప్పుడు ఫిలిష్తీయులు అతణ్ణి బంధించి అతని కళ్ళు ఊడబెరికారు. గాజాకు అతణ్ణి తీసుకు వచ్చి ఇత్తడి సంకెళ్ళతో బంధించారు.
Người Phi-li-tin bắt người, khoét con mắt, đem xuống Ga-xa, rồi trói người bằng dây đồng đậu đôi, và bắt người phải xay cối trong ngục.
22 ౨౨ అతణ్ణి చెరసాల్లో తిరగలి విసరడానికి పెట్టారు. కాని క్షౌరం చేశాక అతని తలపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి.
Song tóc người đã bị cạo khởi mọc lại.
23 ౨౩ ఫిలిష్తీయుల అధికారులు “మన దేవుడు మన శత్రువైన సంసోనును జయించి మన చేతికి అప్పగించాడు” అని చెప్పుకుని, వారి దేవుడైన దాగోనుకు గొప్ప బలి అర్పించడానికీ, పండగ చేసుకోడానికీ ఒక చోట చేరారు.
Vả, các quan trưởng Phi-li-tin nhóm lại đặng dâng của tế lễ lớn cho Đa-gôn, thần của họ, và đặng vui mừng nhau. Chúng nói rằng: Thần chúng ta đã phó Sam-sôn vào tay chúng ta, là kẻ thù nghịch chúng ta.
24 ౨౪ అక్కడ చేరిన ప్రజలంతా దాగోనును చూసి “మన దేశాన్ని నాశనం చేసి మనలో అనేకులను చంపిన మన శత్రువును మన దేవుడు జయించాడు” అంటూ తమ దేవుణ్ణి కీర్తించారు.
Dân sự vừa thấy người, cũng cất tiếng khen ngợi thần mình, mà rằng: Thần chúng ta đã phó kẻ thù nghịch vào tay chúng ta, là kẻ đã phá hại xứ chúng ta, và đã giết biết bao nhiêu người!
25 ౨౫ వాళ్ళంతా సంబరం చేసుకుంటూ ఉన్నారు “సంసోనును తీసుకు రండి. అతణ్ణి చూసి ఎగతాళి చేసి నవ్వుదాం” అన్నారు. వాళ్ళు అతణ్ణి తీసుకు వచ్చి రెండు స్తంభాల మధ్య అతణ్ణి నిలబెట్టారు.
Đang khi lòng rất hớn hở, chúng la lên rằng: Hãy gọi Sam-sôn, để hắn làm trò vui cho chúng ta. Vậy, chúng dẫn Sam-sôn ở ngục đến, rồi người làm trò trước mặt chúng. Người ta đã để người đứng giữa các cột;
26 ౨౬ సంసోను తన చెయ్యి పట్టుకుని ఉన్న కుర్రాడితో “ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను ఆనుకుని నిల్చుంటాను” అన్నాడు.
Sam-sôn bèn nói cùng đứa trẻ nắm tay mình rằng: Hãy buông ta, và để cho ta rờ đến các cột đỡ chịu cái đền, hầu cho ta dựa vào đó.
27 ౨౭ ఆ ఆలయం అంతా స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయుల అధికారులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సంసోనును ఎగతాళి చేస్తున్నారు. ఆలయం కప్పు పైన సుమారు మరో మూడు వేలమంది స్త్రీలూ పురుషులూ చూస్తూ ఉన్నారు.
Vả, đền đầy những người nam người nữ, và hết thảy các quan trưởng Phi-li-tin đều ở đó; tại trên sân mái đền cũng có độ gần ba ngàn người nam và nữ xem Sam-sôn làm trò.
28 ౨౮ అప్పుడు సంసోను “ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారికి నాకు బలం దయచెయ్యి. నా కళ్ళు ఊడబెరికిన వారిపై నన్ను పగ తీర్చుకోనీయి” అని యెహోవాకు మొర్ర పెట్టాడు.
Bấy giờ, Sam-sôn kêu cầu Đức Giê-hô-va, mà rằng: Chúa Giê-hô-va ôi! xin Ngài nhớ lại tôi. Hỡi Đức Chúa Trời! xin ban sức lực cho tôi chỉ lần nầy mà thôi, hầu cho tôi báo thù dân Phi-li-tin về sự mất hai con mắt tôi.
29 ౨౯ ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో ఒక దాన్ని కుడిచేతితో మరోదాన్ని ఎడమచేతితో పట్టుకుని నిలబడ్డాడు.
Sam-sôn vớ lấy hai cây cột chính giữa đỡ chịu cái đền, một cây ở bên hữu và một cây ở bên tả, nhận vào, mà rằng: Nguyện tôi chết chung với dân Phi-li-tin! Đoạn, người rán hết sức, sô hai cây cột, đền đổ xuống trên các quan trưởng và cả dân sự ở đó.
30 ౩౦ “నేనూ, నాతో కూడా ఫిలిష్తీయులూ చనిపోతాం” అంటూ బలంగా ముందుకి వంగినప్పుడు ఆ ఆలయం కూలిపోయింది. దానిలో ఉన్న అధికారుల మీదా, ప్రజలందరి మీదా అదికూలింది. సంసోను తన జీవిత కాలంలో చంపిన వారి కంటే చనిపోయే సమయంలో హతమార్చిన సంఖ్యే ఎక్కువ.
Aáy vậy, trong lúc chết, Sam-sôn giết nhiều người hơn là giết trong khi còn sống.
31 ౩౧ అప్పుడు అతని సహోదరులూ, అతని తండ్రి ఇంటివారూ వచ్చి అతణ్ణి తీసుకు వెళ్ళారు. అతణ్ణి జోర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న అతని తండ్రియైన మానోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు.
Kế đó, anh em người và cả nhà cha người đi xuống, đem thây người về, chôn tại giữa Xô-rê-a và Ê-ta-ôn, trong mộ của Ma-nô-a, cha người. Sam-sôn làm quan xét trong Y-sơ-ra-ên hai mươi năm.