< న్యాయాధిపతులు 14 >
1 ౧ సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు.
Dabi a na Samson wɔ Timna no, ɔhunuu Filistini ababaawa bi.
2 ౨ అతడు ఇంటికి తిరిగి వచ్చి “తిమ్నాతులో ఒక ఫిలిష్తీ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయండి” అని తన తల్లిదండ్రులను అడిగాడు.
Ɔsane kɔɔ efie no, ɔka kyerɛɛ nʼagya ne ne maame sɛ, “Mahunu Filistini ababaawa bi wɔ Timna a mepɛ sɛ meware no.”
3 ౩ వారు “నీ బంధువుల్లో గానీ మన సొంత జాతిలో గానీ అమ్మాయిలు లేరనా సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని భార్యగా తెచ్చుకోడానికి వెళ్తున్నావు?” అని అతణ్ణి అడిగారు. అందుకు సంసోను “ఆమె నాకు నచ్చింది. నా కోసం ఆమెను తెప్పించు” అని తన తండ్రితో అన్నాడు.
Nʼagya ne ne maame ampene so kaa no anibereɛ so sɛ, “Enti, yɛn abusua yi mu anaa Israelfoɔ yi mu, ɔbaa baako mpo nni mu a wotumi ware no? Adɛn na ɛsɛ sɛ wokɔ Filistifoɔ abosonsomfoɔ mu kɔpɛ ɔyere?” Nanso, Samson ka kyerɛɛ nʼagya sɛ, “Kɔyɛ ne ho adeɛ ma me. Ɔno ara na mepɛ.”
4 ౪ అయితే ఫిలిష్తీయులకు కీడు చేయడానికి యెహోవాయే అతణ్ణి పురిగొల్పుతున్నాడని అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు.
Nʼagya ne ne maame anhunu sɛ Awurade na ɔreyɛ nʼadwuma, repɛ akwannya bi a ɔbɛfa so atia Filistifoɔ a saa ɛberɛ no na wɔdi Israelfoɔ so.
5 ౫ తరువాత సంసోను తన తల్లిదండ్రులతో కలసి తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహం భీకరంగా గర్జిస్తూ అతని మీదికి వచ్చింది.
Samson ne nʼawofoɔ rekɔ Timna no, gyata ba bi to hyɛɛ Samson so wɔ beaeɛ bi a ɛbɛn Timna bobe nturo.
6 ౬ యెహోవా ఆత్మ అకస్మాత్తుగా అతణ్ణి ఆవరించాడు. దాంతో చేతిలో ఏమీ లేక పోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి వేశాడు. కాని తాను చేసినదాన్ని తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.
Amonom hɔ ara, Awurade Honhom baa ne so wɔ ahoɔden mu, na ɔde ne nsa hunu waee gyata no apantan. Ɔwaee te sɛ deɛ ɔrewae abirekyie ba bi apantan. Nanso, wanka deɛ ɔyɛeɛ yi ankyerɛ nʼawofoɔ.
7 ౭ అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనికి నచ్చింది.
Samson duruu Timna no, ɔne ɔbaa no kasaeɛ na nʼani gyee ne ho.
8 ౮ కొంతకాలం గడచిన తరువాత ఆమెను తీసుకుని రావడానికి తిరిగి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ సింహం కళేబరం చూడడానికి పక్కకు తిరిగాడు. ఆ సింహపు అస్థిపంజరంలో అతనికి ఒక తేనెటీగల గుంపూ తేనే కనిపించాయి.
Akyire no a ɔresane akɔ Timna akɔhyia ayeforɔ no, ɔmane kɔhwɛɛ gyata no funu no. Ɔhunuu sɛ nwowa kuo akɔyɛ ɛwoɔ wɔ mu.
9 ౯ అతడు ఆ తేనె తీసి చేతిలో పట్టుకుని తింటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారికీ కొంత తేనె ఇచ్చాడు. వారూ దాన్ని తిన్నారు. అయితే తాను ఆ తేనెను సింహం కళేబరం నుండి తీశానని వారికి చెప్పలేదు.
Ɔkɔtii ɛwoɔ no bi dii wɔ ɛkwan so. Ɔmaa nʼawofoɔ no bi ma wɔdiiɛ. Nanso, wanka ankyerɛ wɔn sɛ ɔnyaa ɛwoɔ no wɔ gyata funu no mu.
10 ౧౦ సంసోను తండ్రి ఆ స్త్రీని చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సంసోను అక్కడి సంప్రదాయం ప్రకారం ఒక విందు ఏర్పాటు చేశాడు.
Afei, ɛberɛ a nʼagya reyɛ ahoboa ama awaregyeɛ no, Samson too ɛpono wɔ Timna, sɛdeɛ amanneɛ kyerɛ saa ɛberɛ no.
11 ౧౧ ఆమె బంధువులు అతణ్ణి చూడగానే అతనితో ఉండటానికి ముప్ఫై మంది స్నేహితులను తీసుకుని వచ్చారు.
Wɔtoo nsa frɛɛ mmeranteɛ aduasa a wɔfiri kuro no mu sɛ wɔmmɛka ne ho.
12 ౧౨ అప్పుడు సంసోను వారితో “మీకిష్టమైతే మీకో పొడుపు కథ చెప్తాను. ఈ విందు జరిగే ఏడు రోజుల్లోగా మీలో ఎవరైనా ఈ పొడుపు కథ విప్పి నాకు చెప్పగలిగితే నేను ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీకు ఇస్తాను.
Samson ka kyerɛɛ wɔn sɛ, “Momma menka aborɔme bi nkyerɛ mo. Sɛ nnanson apontoɔ yi mu, motumi yi ano a, mɛma mo serekyetam ntadeɛ aduasa ne ntadeɛ ahodoɔ bi nso aduasa.
13 ౧౩ ఒకవేళ మీరు ఆ పొడుపు కథ విప్పలేకపోతే ఆ ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీరు నాకు ఇవ్వాలి” అన్నాడు. దానికి వారు “ఆ పొడుపు కథ ఏమిటో చెప్పు. వింటాం.” అన్నారు.
Sɛ moantumi anyi ano nso a, mo nso mobɛma me serekyetam ntadeɛ aduasa ne ntadeɛ ahodoɔ bi nso aduasa.” Wɔka kyerɛɛ no sɛ, “Ka aborɔme no ma yɛntie.”
14 ౧౪ అప్పుడు వారితో సంసోను ఇలా చెప్పాడు, “తినే దాంట్లోనుండి తిండి వచ్చింది. బలమైన దాంట్లోనుండి తీపి వచ్చింది.” అన్నాడు. అతని అతిథులు మూడు రోజులైనా ఆ పొడుపు కథ విప్పలేక పోయారు.
Ɔkaa no sɛ, “Deɛ ɔdie mu na wɔnya biribi a wɔdie; ɔhoɔdenfoɔ mu na ɔdɛ firi ba.” Nnansa akyi no, na wɔntumi nyii ano.
15 ౧౫ ఏడవ రోజున వాళ్ళు సంసోను భార్యతో “మమ్మల్ని నిరుపేదలుగా చేయడానికే ఆహ్వానించారా? ఎలాగైనా నీ భర్త దగ్గర ఈ పొడుపు కథ భావాన్ని రాబట్టి మాకు చెప్పు. లేకపోతే నిన్నూ నీ తండ్రి ఇంటి వాళ్ళనూ తగలబెట్టేస్తాం” అన్నారు.
Ne nna ɛnan soɔ no, wɔkɔka kyerɛɛ Samson yere sɛ, “Gye aborɔme no mmuaeɛ firi wo kunu hɔ ma yɛn, anyɛ saa a, yɛbɛhye wo ne wʼagya fie ama wɔawu. Motoo nsa frɛɛ yɛn wɔ ha sɛ morebɛsisi yɛn anaa?”
16 ౧౬ సంసోను భార్య అతని ఎదుట ఏడవడం మొదలు పెట్టింది “నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు గానీ ప్రేమించడం లేదు. నువ్వు మా వాళ్లకు ఒక పొడుపు కథ చెప్పావు. కానీ దానినెలా విప్పాలో నాకు చెప్పలేదు” అంది. దానికతడు “నేను మా అమ్మానాన్నలకే చెప్పలేదు నీకెలా చెప్తాను” అన్నాడు. ఆమె విందు జరిగిన ఏడు రోజులూ అతని దగ్గర ఏడుస్తూనే ఉంది.
Enti, Samson yere de su baa ne nkyɛn bɛkaa sɛ, “Wonnɔ me. Wotan me! Woaka aborɔme bi akyerɛ me nkurɔfoɔ, nanso, wonkyerɛɛ me aseɛ.” Samson buaa ne yere no sɛ, “Saa ara na mʼagya ne me maame nso menkyerɛɛ wɔn aseɛ. Na adɛn enti na ɛsɛ sɛ meka kyerɛ wo?”
17 ౧౭ ఏడో రోజు ఆమె అతణ్ణి బాగా ఒత్తిడి చేయడం వల్ల ఆ పొడుపు కథ ఎలా విప్పాలో ఆమెకు చెప్పేశాడు. ఆమె తన వాళ్లకు పొడుపు కథ అర్థం తెలియచేసింది.
Enti, ɔsu guu ne so biribiara ɔne no wɔ hɔ. Ɔkɔɔ so saa ara nna a aka na apontoɔ no aba nʼawieeɛ nyinaa. Nnanson so no, ɛsiane ha a ɔhaa no enti, ɔkyerɛɛ no aseɛ. Ɔno nso kaa aborɔme asekyerɛ no kyerɛɛ mmeranteɛ no.
18 ౧౮ ఏడో రోజున సూర్యాస్తమయం ముందే ఆ ఊరి వాళ్ళు సంసోనుతో “తేనె కన్నా తీపి అయినదేది? సింహం కన్నా బలమైనదేది?” అన్నారు. సంసోను వారితో ఇలా అన్నాడు “మీరు నా దూడతో దున్నకపోయి ఉంటే నా పొడుపుకథను విప్పగలిగేవారు కాదు” అన్నాడు.
Na nnanson so, ansa na owia rebɛtɔ no, kuro no mu mmarima baa Samson nkyɛn bɛkyerɛɛ no aseɛ sɛ, “Ɛdeɛn na ɛyɛ dɛ sene woɔ? Ɛdeɛn na ɛwɔ ahoɔden sene gyata?” Samson buaa wɔn sɛ, “Sɛ mo ne ɔfatwafoɔ no antu agyina, anka morennya aborɔme no asekyerɛ.”
19 ౧౯ యెహోవా ఆత్మ అతని మీదికి మళ్ళీ బలంగా వచ్చాడు. అప్పుడు అతడు అష్కెలోనుకు వెళ్లి అక్కడివారిలో ముప్ఫై మందిని చంపి వారిని దోచుకున్నాడు. ఆ సొమ్ముతో తన పొడుపు కథను విప్పిన వారికి దుస్తులు ఇచ్చాడు. కోపంతో మండిపడుతూ తన తండ్రి ఇంటికి వెళ్లి పోయాడు.
Afei, Awurade Honhom de ahoɔden kɛseɛ bi baa ne so. Ɔkɔɔ Askelon kuro mu. Ɔkunkumm mmarima aduasa faa wɔn agyapadeɛ nyinaa. Ɔde wɔn ntadeɛ maa mmarima a wɔyii aborɔme no ano no. Na Samson bo annwo deɛ ɛbaeɛ no ho yie enti ɔkɔɔ ne fie na ɔne nʼawofoɔ kɔtenaeɛ.
20 ౨౦ సంసోను భార్యను అతని స్నేహితుడికి ఇచ్చి వేశారు.
Enti, wɔde ne yere no maa ɔbarima a na ɔdi Samson nan ase wɔ wɔn ayeforɔhyia mu no awadeɛ.