< న్యాయాధిపతులు 10 >
1 ౧ అబీమెలెకు తరువాత ఇశ్శాఖారు గోత్రంవాడు, దోదో మనువడు, పువ్వా కొడుకు అయిన తోలా న్యాయాధిపతిగా నియామకం అయ్యాడు. అతడు ఎఫ్రాయిమీయుల మన్యంలో షామీరులో నివాసం ఉండేవాడు.
Después de Abimelec, Tola, hijo de Fúa, hijo de Dodo, de la tribu de Isacar, se convirtió en el salvador de Israel; vivía en Samir, en la región montañosa de Efraín.
2 ౨ అతడు ఇరవైమూడు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు చనిపోయినప్పుడు అతణ్ణి షామీరులో పాతిపెట్టారు.
Fue juez sobre Israel por veintitrés años; y en su muerte su cuerpo fue enterrado en la tierra en Samir.
3 ౩ అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు వచ్చాడు. అతడు ఇరవై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
Y después de él, vino Jair el galaadita, que había sido juez de Israel durante veintidós años.
4 ౪ అతనికి ముప్ఫైమంది కొడుకులున్నారు. వాళ్ళు ముప్ఫై గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవాళ్ళు. వాళ్ళకు ముప్ఫై ఊళ్లు ఉండేవి. ఈ రోజు వరకూ వాటికి యాయీరు గ్రామాలని పేరు.
Y tuvo treinta hijos, que montaban treinta asnos; y tenían treinta ciudades en la tierra de Galaad, que hasta hoy se llaman ciudades de Jair.
5 ౫ అవి గిలాదు దేశంలో ఉన్నాయి. యాయీరు చనిపోయినప్పుడు అతణ్ణి కామోనులో పాతిపెట్టారు.
Y a la muerte de Jair su cuerpo fue enterrado en Camon.
6 ౬ ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో మళ్ళీ చెడుగా ప్రవర్తించి యెహోవాను విడిచిపెట్టి ఆయన సేవ మాని, బయలులు, అష్తారోతులు అనే అరామీయుల దేవతలను, సీదోనీయుల దేవుళ్ళను, మోయాబీయుల దేవుళ్ళను, అమ్మోనీయుల దేవుళ్ళను, ఫిలిష్తీయుల దేవుళ్ళను, పూజించడం మొదలుపెట్టారు.
Y nuevamente los hijos de Israel hicieron lo malo ante los ojos del Señor, adorando a los baales y Astarte, de Siria, de Sidón, de Moab, de Amón, de los filisteos; renunciaron al Señor y ya no le sirvieron más.
7 ౭ యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు, ఆయన ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వాళ్ళను అప్పగించాడు గనుక,
Y se encendió la ira del Señor contra Israel, y los entregó en manos de los filisteos y en manos de los amonitas.
8 ౮ వాళ్ళు ఆ సంవత్సరం మొదలు, ఇశ్రాయేలీయులను, అంటే, యొర్దాను నది అవతల ఉన్న, గిలాదులోని అమోరీయుల దేశంలో కాపురం ఉన్న ఇశ్రాయేలీయులను పద్దెనిమిది సంవత్సరాలు చితకగొట్టి అణచివేశారు.
Y ese año los hijos de Israel fueron oprimidos bajo su yugo; durante dieciocho años, todos los hijos de Israel al otro lado del Jordán, en la tierra de los amorreos que se encuentra en Galaad, fueron oprimidos cruelmente.
9 ౯ ఇంక అమ్మోనీయులు యూదాదేశస్థులతో బెన్యామీనీయులతో ఎఫ్రాయిమీయులతో యుద్ధం చెయ్యడానికి యొర్దాను దాటినందువల్ల ఇశ్రాయేలీయులకు గడ్డు పరిస్థితులు దాపురించాయి.
Y los hijos de Amón cruzaron por el Jordán, para hacer guerra contra Judá y Benjamín y la casa de Efraín; e Israel estaba en un gran problema.
10 ౧౦ అప్పుడు ఇశ్రాయేలీయులు “మేము నీ దృష్టిలో పాపం చేశాం. మా దేవుణ్ణి విడిచి బయలులను పూజించాం” అని యెహోవాకు మొర్రపెట్టారు.
Entonces los hijos de Israel, clamando al Señor, dijeron: Grande es nuestro pecado contra ti, porque hemos abandonado a nuestro Dios y hemos sido siervos de los baales.
11 ౧౧ యెహోవా “ఐగుప్తీయుల వశంలో నుంచి, అమోరీయుల వశంలో నుంచి, అమ్మోనీయుల వశంలో నుంచి, ఫిలిష్తీయుల వశంలో నుంచి మాత్రమే కాకుండా
Y él Señor dijo a los hijos de Israel: ¿No eran los egipcios y los amorreos y los hijos de Amón y los filisteos?
12 ౧౨ సీదోనీయులు, అమాలేకీయులు, మాయోనీయులు మిమ్మల్ని బాధ పరచినప్పుడు వాళ్ళ వశంలో నుంచి కూడా నేను మిమ్మల్ని రక్షించాను కదా,
Y los sidonios y Amalec y Madián que los oprimieron, y en respuesta a su clamor, ¿no fui yo quien los salvó de sus manos?
13 ౧౩ అయితే మీరు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను పూజించారు గనుక నేను ఇక మిమ్మల్ని రక్షించను.
Pero, por todo esto, me han abandonado y han adorado otros dioses: así que, ya no seré su salvador.
14 ౧౪ మీరు వెళ్లి, మీరు కోరుకొన్న దేవుళ్ళకు మొర్ర పెట్టుకోండి. మీ బాధకాలంలో అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో” అని ఇశ్రాయేలీయులతో అన్నాడు.
Ve, envía tu clamor de ayuda a los dioses de tu elección; Que sean tus salvadores en el tiempo de tu problema.
15 ౧౫ అప్పుడు ఇశ్రాయేలీయులు “మేము పాపం చేశాము, నీ దృష్టికి ఏది ఇష్టమో దాని ప్రకారం మాకు చెయ్యి. దయచేసి ఈ రోజు మమ్మల్ని రక్షించు” అని చెప్పి,
Y los hijos de Israel dijeron al Señor: Somos pecadores; Haznos lo que te parezca bien: danos la salvación este día.
16 ౧౬ యెహోవాను సేవించడానికి వాళ్ళ మధ్య ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించివేసారు. ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూసి సహించలేక పోయింది.
Entonces apartaron a los dioses extranjeros de entre ellos, para volver a adorar al Señor; y su alma ya no pudo soportar el sufrimiento de Israel.
17 ౧౭ అప్పుడు అమ్మోనీయులు గిలాదులో శిబిరం వేసుకుని ఉన్నారు. ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడి ఉన్నారు.
Entonces los hijos de Amón se reunieron y pusieron su ejército en posición en Galaad. Y los hijos de Israel se reunieron y pusieron su ejército en posición en Mizpa.
18 ౧౮ కాబట్టి ప్రజలు, అంటే గిలాదు పెద్దలు “అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి పూనుకొన్నవాడు ఎవడో, అతడు గిలాదు నివాసులకందరికీ ప్రధాని అవుతాడు” అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.
Y el pueblo de Israel se dijeron unos a otros: Quién sea el primero en atacar a los hijos de Amón, Le haremos jefe de los habitantes de Galaad.