< యూదా 1 >

1 తండ్రి అయిన దేవుని పిలుపును, ప్రేమను పొంది, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన యూదా రాస్తున్నది.
Юда, слуга Исус Христов, и брат Яковов, до призваните, възлюбени от Бога Отца и пазени в Исуса Христа:
2 దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక.
Милост, мир и любов да ви се умножат.
3 ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయవలసి వచ్చింది.
Възлюбени, като показвах всяко усърдие да ви пиша за нашето общо спасение, счетох за нужно да ви пиша и да ви овещая да се подвизаете за вярата, която еднаж за винаги бе предадена на светиите.
4 ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను లైంగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని, ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు. వీళ్ళు భక్తిహీనులు, శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది.
Защото са се вмъкнали някои човеци, които отдавна са били посочени, че подлежат на това осъждане, нечестивци, които обръщат благодатта на нашия Бог в похотливост и се отричат от единствения Владетел и Господ наш Исус Христос.
5 ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కానీ నమ్మనివారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు.
А искам да ви напомня, (тъй като сте узнали вече всичко това), че Господ, като избави веднаж Своя народ от египетската земя, после погуби ония, които не повярваха,
6 తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు. (aïdios g126)
и че ангели, които не упазиха своето достойнство, но напуснаха собственото си жилище, - Той ги държи под мрак във вечни връзки за съда на великия ден; (aïdios g126)
7 అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు. (aiōnios g166)
както и Содом, Гомор и околните им градове, които, подобно на тях, се предадоха на блудство и изпаднаха в противоестествени пороци (Гръцки: И следваха след чужда плът. Бит. 19:5), са поставени за пример, като носят наказанието на вечния огън. (aiōnios g166)
8 అదే విధంగా, కలలు కనే వీరు ఒక వైపు తమ శరీరాలను అపవిత్రం చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ దేవుని మహిమ రూపులను గురించి చెడుగా చెబుతున్నారు.
При все това, по същия начин и тия с бълнуванията си оскверняват плътта, презират властта и хулят славните същества.
9 అయితే, ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో వ్యతిరేకించి మోషే శరీరాన్ని గూర్చి వాదిస్తూ ఉన్నప్పుడు, అవమానకరంగా మాట్లాడలేదు, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు. “ప్రభువు నిన్ను గద్దించు గాక” అన్నాడు.
Но архангел Михаил, когото в борба с дявола се препираше за Моисеевото тяло, не смея да произнесе против него хулителна присъда, но рече: Господ да те смъмри.
10 ౧౦ కాని వీరు, తమకు అర్థం కాని వాటిని దూషిస్తారు. తెలివిలేని జంతువుల్లాగా ప్రకృతి సిద్ధంగా తెలుసుకోగలిగే వాటివల్లే తమను తాము నాశనం చేసుకుంటున్నారు.
Тия, обаче, хулят всичко, което не знаят; а което знаят естествено, както животните без разум, в това развращават себе си.
11 ౧౧ వీరికి బాధ! వీరు కయీను మార్గంలో నడుస్తున్నారు. జీతం కోసం బిలాము దోషంలో పడిపోయారు. కోరహు తిరుగుబాటులో నశించిపోయారు.
Горко им! защото ходят по Каиновия път, заради печалба се впускат във Валаамовата заблуда, и погиват в Кореевото упорство.
12 ౧౨ వీరు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్లలాంటివారు.
Тия са подводни скали, когато пируват с вас в дружелюбните ви гощавки, и без страх напасват себе си; безводни облаци, носени от ветровете; есенни дървета, безплодни, дваж умрели, изкоренени;
13 ౧౩ సముద్రంలోని అలల నురగలాగా వారి సొంత అవమానం ఉంటుంది. వీరు దిక్కు తెలియక తిరుగుతున్న చుక్కల్లా ఉన్నారు. శాశ్వత గాడాంధకారం వారికోసం సిద్ధంగా ఉంది. (aiōn g165)
свирепи морски вълни; които изпущат като пяна своите безсрамни дела; скитащи звезди, за които се пази мрачна тъмнина до века. (aiōn g165)
14 ౧౪ ఆదాము నుండి ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు.
За тях пророкува и Енох, седмият от Адама, като рече: Ето Господ иде с десетки хиляди Свои светии,
15 ౧౫ వారిలో భక్తి లేనివారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటి గురించీ నేరం రుజువు చేయడానికి, భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించీ అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.”
да извърши съдба на всички, и да обяви за виновни всичките нечестиви дела, които в нечестие са сторили, и за всичките жестоки думи, които нечестивите грешници са говорили против Него.
16 ౧౬ వారు తమ దురాశలను బట్టి నడచుకుంటూ, లాభం కోసం మనుషులను పొగుడుతూ, తమకు ఉన్న స్థితిని బట్టి సణుగుతూ, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.
Тия са роптатели, оплаквачи, които ходят по страстите си, (и устата им говорят надуто), и заради печалба ласкаят човеците.
17 ౧౭ కాని ప్రియులారా, అంతకు ముందు మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి.
Но, вие, възлюбени, помнете думите изговорени по-напред от апостолите на нашия Господ Исус Христос, как ви казваха:
18 ౧౮ చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు.
В последно време ще има присмивачи, които ще ходят по своите нечестиви страсти.
19 ౧౯ వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు.
Тия са, които правят разцепления, плътски, които нямат Духа.
20 ౨౦ కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ
А вие възлюбени, като назидавате себе си в нашата пресвята вяра и се молите на Святия Дух,
21 ౨౧ మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి. (aiōnios g166)
пазете себе си в Божията любов, ожидайки милостта на нашия Господ Исус Христос за вечен живот. (aiōnios g166)
22 ౨౨ అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి.
И към едни, които са в съмнение, бивайте милостиви;
23 ౨౩ అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి.
други спасявайте, като ги изтръгвате из огъня; а към други показвайте милост, със страх, като се гнусите даже и от осквернената от плътта дреха.
24 ౨౪ మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా ఉంచగలవాడు.
А на Онзи, Който може да ви предпази от препъване, и да ви постави непорочни в радост пред Своята слава,
25 ౨౫ ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్. (aiōn g165)
на единствения Бог наш Спасител, чрез Исуса Христа нашия Господ, да бъде слава и величие, и преди всичките векове, и сега, и до всичките векове. Амин. (aiōn g165)

< యూదా 1 >