< యెహొషువ 1 >
1 ౧ యెహోవా తన సేవకుడు మోషే చనిపోయిన తరువాత, నూను కుమారుడు, మోషే పరిచారకుడు అయిన యెహోషువకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. “నా సేవకుడు మోషే చనిపోయాడు.
Ngemva kokufa kukaMosi inceku kaThixo, uThixo wathi kuJoshuwa indodana kaNuni, umsekeli kaMosi:
2 ౨ కాబట్టి నీవు లేచి, నీవూ ఈ ప్రజలందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న దేశానికి వెళ్ళండి.
“UMosi inceku yami usefile. Ngakho-ke, wena labantu bonke laba, lungiselelani ukuchapha umfula uJodani liye elizweni esengizalinika lona, abako-Israyeli.
3 ౩ నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్నీ మీకు ఇచ్చాను.
Ngizalinika zonke izindawo lapho elizanyathela khona ngezinyawo zenu njengokuthembisa engakwenza kuMosi.
4 ౪ ఈ అరణ్యం, లెబానోను నుండి యూఫ్రటీసు మహానది వరకూ, హిత్తీయుల దేశమంతా, పడమట మహాసముద్రం వరకూ మీకు సరిహద్దు.
Ilizwe lenu lizasukela enkangala yeLebhanoni lasemfuleni omkhulu uYufrathe, ilizwe lonke lamaHithi, lize liyekhawula olwandle olukhulu entshonalanga.
5 ౫ నీవు జీవించే రోజులన్నిటిలో ఎవ్వరూ నీ ముందు నిలవలేరు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడుగా ఉంటాను. నిన్ను విడిచి పెట్టను, వదిలెయ్యను.
Kakulamuntu ozenelisa ukumelana lani zonke insuku zokuphila kwenu. Njengoba ngangiloMosi, ngizakuba lawe; kangisoze ngikutshiye, kangisoze ngikudele.
6 ౬ నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.
Qina ube lesibindi ngenxa yokuthi uzakhokhela abantu laba ukuze bayethatha ilizwe elilifa labo engafunga kubokhokho babo ukuthi ngizabanika lona.
7 ౭ అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు.
Qina ube lesibindi. Ugcine yonke imithetho owayiphiwa nguMosi inceku yami, ungaze waphambuka kuyo uye kwesokunene kumbe kwesokhohlo ukuze uphumelele kuzozonke izindawo ozakuya kuzo.
8 ౮ ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు.
INcwadi yoMthetho le kayingasuki emlonyeni wakho, cabanga ngayo emini lebusuku ukuze unanzelele ukugcina konke okulotshwe kuyo. Ngokwena njalo uzaphumelela.
9 ౯ నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”
Angikulayanga na? Qina ube lesibindi, ungethuki njalo ungalahli ithemba, ngoba uThixo uNkulunkulu wakho uzakuba lawe loba kungaphi lapho oya khona.”
10 ౧౦ అప్పుడు యెహోషువ ప్రజల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు “మీరు శిబిరంలోకి వెళ్లి ప్రజలతో ఈ మాట చెప్పండి,
Ngakho-ke uJoshuwa walaya iziphathamandla zabantu wathi:
11 ౧౧ ‘మీరు స్వంతం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మూడు రోజుల్లోపు ఈ యొర్దాను నది దాటాలి. కాబట్టి ఆహారం సిద్ధపరచుకోండి.’”
“Dabulani phakathi kwezihonqo litshele abantu ukuthi, ‘Lungisani imiphako yenu. Ensukwini ezintathu kusukela lamhla lizachapha uJodani lapha ukuze lingene liyethatha ilizwe uThixo uNkulunkulu wenu alinika lona ukuba libe ngelenu!’”
12 ౧౨ రూబేనీయులకు గాదీయులకు మనష్షే అర్థగోత్రపువారికి యెహోషువ ఇలా ఆజ్ఞాపించాడు,
UJoshuwa wathi kwabakoRubheni, labakoGadi lengxenye yesizwana sikaManase,
13 ౧౩ “యెహోవా సేవకుడు మోషే మీ కు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. అదేమంటే, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలిగించబోతున్నాడు, ఆయన ఈ దేశాన్ని మీకిస్తాడు.
“Khumbulani umlayo uMosi inceku kaThixo alinika wona owokuthi: ‘UThixo uNkulunkulu wenu uzaliphumuza ngokulinika ilizwe leli.’
14 ౧౪ మీ భార్యలూ మీ పిల్లలూ మీ పశువులూ యొర్దాను అవతల మోషే మీకిచ్చిన దేశంలో నివసించాలి. అయితే పరాక్రమ వంతులు, శూరులైన మీరంతా యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా
Amakhosikazi enu, abantwabenu lezifuyo zenu zingahlala elizweni elalinikwa nguMosi empumalanga yeJodani, kodwa ibutho lenu lonke, lihlome liphelele, kumele lichaphe ngaphambi kwabafowenu. Kuzamele lincedise abafowenu,
15 ౧౫ నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకూ విశ్రాంతి దయచేసే వరకూ, అంటే మీ దేవుడైన యెహోవా వారికిచ్చే దేశాన్ని స్వాధీనపరచుకొనే వరకూ మీరూ సహాయం చేయాలి. ఆ తరువాతే తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడు మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశంలోకి మీరు తిరిగి వచ్చి దాన్ని స్వంతం చేసుకుంటారు.”
uThixo aze abaphumuze, njengalokho alenzele khona lina, labo baze bathathe ilizwe lelo uThixo uNkulunkulu wenu abanika lona. Ngemva kwalokho selingabuyela liyehlala elizweni lenu, uMosi inceku kaThixo alinika lona ngempumalanga yeJodani.”
16 ౧౬ దానికి వారు “నీవు మా కాజ్ఞాపించినదంతా చేస్తాం. నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపినా అక్కడికి వెళ్తాం.
Baphendula uJoshuwa bathi, “Konke osilaya khona sizakwenza, lalapho osithuma khona sizahamba.
17 ౧౭ మోషే చెప్పిన ప్రతి మాటా మేము విన్నట్టు నీ మాటా వింటాం. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడై ఉంటాడు గాక.
Njengalokhu salalela uMosi ngokupheleleyo, lawe sizakulalela. Sifisa ukuthi uThixo uNkulunkulu wakho abe lawe njengoba wayeloMosi.
18 ౧౮ నీమీద తిరగబడి నీవు ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారంతా మరణశిక్ష పొందుతారు, నీవు నిబ్బరంగా ధైర్యంగా ఉండు” అని యెహోషువతో చెప్పారు.
Yiloba ngubani ohlamukela ilizwi lakho njalo engalaleli lokho okutshoyo, lalokho oyabe ukulaya, kumele abulawe. Kumele uqine ube lesibindi!”