< యెహొషువ 9 >
1 ౧ యొర్దాను అవతల ఉన్న కొండ ప్రాంతంలో, లోయ ప్రాంతాల్లో, లెబానోను ముందు ఉన్న మహా సముద్ర తీర ప్రాంతమంతా ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ మొదలైన రాజులంతా జరిగిన దాన్ని విన్నప్పుడు
Afei, ahemfo a wɔwɔ Yordan atɔeɛ fam no nyinaa tee nsɛm a asisi. (Yeinom ne Hetifoɔ, Amorifoɔ, Kanaanfoɔ, Perisifoɔ, Hewifoɔ ne Yebusifoɔ ahemfo a na wɔtete mmepɔ nsase a ɛwɔ atɔeɛ fam mmepɔ ayaase ne Ɛpo Kɛseɛ no mpoano kɔsi Lebanon atifi fam mmepɔ so tɔnn.)
2 ౨ వారు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు.
Saa ahemfo yi boaa wɔn akodɔm ano ntɛm so sɛ wɔbɛko atia Yosua ne Israelfoɔ.
3 ౩ యెహోషువ యెరికోకి, హాయికీ చేసినదాన్ని గిబియోను ప్రజలు విన్నప్పుడు
Nanso Gibeonfoɔ tee asɛm a ato Yeriko ne Ai no,
4 ౪ వారు కుయుక్తితో, రాయబారుల్లాగా వేషం వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెసంచులు కట్టి, పాతగిలి మాసికలు వేసిన ద్రాక్షారసం తిత్తులు తీసుకుని,
wɔfaa nnaadaa kwan so de gyee wɔn ho nkwa. Wɔsomaa ananmusifoɔ kɔɔ Yosua nkyɛn. Wɔde nkotokuo a atete ne mmoa nwoma nsã nkotokuo a ayɛ dada na wɔatetɛ mu soaa wɔn mfunumu.
5 ౫ పాతబడి పిగిలిపోయిన చెప్పులు తొడుక్కుని, పాతబట్టలు కట్టుకుని వచ్చారు. వారు ఆహారంగా తెచ్చుకొన్న రొట్టెలన్నీ ఎండిన ముక్కల్లాగా ఉన్నాయి.
Wɔhyehyɛɛ ntadeɛ dada ne mpaboa a akyɛre na wɔapempam. Afei wɔfaa burodo a abɔ ntu sɛ wɔn aduane.
6 ౬ వారు గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి “మేము దూర దేశం నుండి వచ్చాం, మాతో ఒక ఒప్పందం చేయండి” అని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ అన్నారు.
Wɔduruu Israelfoɔ atenaeɛ wɔ Gilgal no, wɔka kyerɛɛ Yosua ne Israel mmarimma no sɛ, “Yɛfiri akyirikyiri ɔman bi so na aba rebɛsrɛ mo sɛ mo ne yɛn nyɛ asomdwoeɛ apam.”
7 ౭ అప్పుడు ఇశ్రాయేలీయులు “మీరు మా మధ్య నివసిస్తున్న వారేనేమో, మేము మీతో ఎలా ఒప్పందం చేస్తాం?” అని ఆ హివ్వీయులతో అన్నారు.
Israelfoɔ no buaa saa Hewifoɔ yi sɛ, “Ɛbɛyɛ dɛn na yɛahunu sɛ monnte mmɛn ha? Ɛfiri sɛ, sɛ ɛte saa a, yɛrentumi ne mo nnyɛ apam.”
8 ౮ వారు “మేము నీ దాసులం” అని యెహోషువతో చెప్పారు. యెహోషువ “మీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చారు?” అని వారిని అడిగాడు.
Wɔbuaa sɛ, “Yɛbɛyɛ mo asomfoɔ.” Yosua bisaa wɔn sɛ, “Moyɛ ɛhefoɔ na mofiri he?”
9 ౯ వారు “నీ దేవుడైన యెహోవా నామాన్నిబట్టి నీ దాసులమైన మేము బహు దూరం నుండి వచ్చాం. దానికి కారణం ఆయన కీర్తినీ, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తాన్నీ,
Wɔbuaa sɛ, “Yɛfiri akyirikyiri asase bi so. Yɛate Awurade, mo Onyankopɔn no kɛseyɛ ne deɛ ɔyɛɛ wɔ Misraim nyinaa.
10 ౧౦ యొర్దాను తీరంలో ఉన్న హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులో ఉన్న బాషాను రాజైన ఓగు అనే ఇద్దరు అమోరీయుల రాజులకు ఆయన చేసినదంతా మేము విన్నాం.
Afei yɛate deɛ ɔyɛɛ Amorifoɔ ahemfo baanu wɔ Asubɔnten Yordan apueeɛ fam, Hesbonhene Sihon ne Basanhene Og (a ɔtenaa Astarot no).
11 ౧౧ అప్పుడు మా పెద్దలూ మా దేశ ప్రజలంతా మాతో, మీరు ప్రయాణం కోసం ఆహారం తీసుకుని వారికి ఎదురు వెళ్లి వారితో ‘మేము మీ దాసులం కాబట్టి మాతో ఒక ఒప్పందం చేయండి’ అని మీతో చెప్పమన్నారు.
Ɛno enti, yɛn mpanimfoɔ ne ɔmanfoɔ no ka kyerɛɛ yɛn ɔhyɛ so sɛ, ‘Monsiesie mo ho mma akwantuo tenten. Monkɔhyia Israelfoɔ na mompae mu nka sɛ, “Yɛn nkurɔfoɔ bɛyɛ wɔn asomfoɔ na mompere asomdwoeɛ.”’
12 ౧౨ మీ దగ్గరికి రావాలని బయలుదేరిన రోజు మేము సిద్ధం చేసుకుని మా ఇళ్ళనుండి తెచ్చుకొన్న వేడి ఆహార పదార్ధాలు ఇవే, ఇప్పటికి అవి యెండిపోయి ముక్కలయ్యాయి.
Yɛresi mu no, na burodo yi yɛ hyeehyeehye a ɛfiri fononoo mu. Nanso sɛdeɛ mohunu no, akyenkyene na abɔ ntu.
13 ౧౩ ఈ ద్రాక్షారసపు తిత్తులు మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పుడు అవి చినిగిపోయాయి. బహుదూర ప్రయాణం చేయడం వల్ల మా బట్టలు, చెప్పులు పాతవైపోయాయి” అని అతనితో చెప్పారు.
Saa mmoa nwoma nsã nkotokuo yi, ɛberɛ a yɛde nsã guu mu no na ɛyɛ foforɔ, nanso seesei, apaapae ayɛ dada. Na yɛn ntadeɛ ne mpaboa nso, ɛsiane akwantuo tenten enti, atete.”
14 ౧౪ ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర అనుమతి తీసుకోకుండానే వారి ఆహారంలో కొంత తీసుకున్నారు.
Enti, Israelfoɔ no hwehwɛɛ wɔn burodo no ho nanso wɔammisa Awurade.
15 ౧౫ యెహోషువ ఆ వచ్చిన వారితో సంధి చేసి వారు చావకుండేలా వారితో ఒప్పందం చేశాడు. సమాజ ప్రధానులు కూడా వారితో ప్రమాణం చేశారు.
Yosua kɔɔ so ne wɔn yɛɛ asomdwoeɛ apam no na Israel mpanimfoɔ no kekaa ntam a emu yɛ den nam so gye too mu.
16 ౧౬ అయితే వారితో ఒప్పందం చేసి మూడు రోజులైన తరువాత, వారు తమకు పొరుగు వారేననీ, తమ మధ్య నివసించే వారేననీ ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు.
Nnansa akyi no, nokorɛ no daa adi sɛ saa nnipa a wɔyɛ Gibeonfoɔ no te bɛn.
17 ౧౭ ఇశ్రాయేలీయులు ముందుకు సాగి మూడవరోజు వారి పట్టణాలకు వచ్చారు. గిబియోనీయుల పట్టణాలు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము.
Enti, Israelfoɔ no anna so koraa na wɔyɛɛ sɛ wɔbɛyɛ nhwehwɛmu. Nnansa akyi no wɔduruu wɔn nkuro no so. Saa nkuro no ne Gibeon, Kefira, Beerot ne Kiriat-Yearim.
18 ౧౮ ఇశ్రాయేలీయులు వారిని చంపలేదు. ఎందుకంటే వారి నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేశారు. అయితే, సమాజమంతా నాయకులకు వ్యతిరేకంగా సణగడం మొదలుపెట్టారు.
Nanso, Israelfoɔ no anto anhyɛ nkuro no so, ɛfiri sɛ, na wɔn mpanimfoɔ aka ntam akyerɛ Awurade, Israel Onyankopɔn. Esiane Apam no enti, Israelfoɔ no nwiinwii hyɛɛ wɔn mpanimfoɔ no.
19 ౧౯ దానికి ఆ సమాజ ప్రధానులంతా ప్రజలతో ఇలా అన్నారు. “మనం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడు అని వారితో ప్రమాణం చేశాం కాబట్టి మనం వారికి హాని చేయకూడదు.
Na mpanimfoɔ no buaa sɛ, “Yɛaka ntam wɔ Awurade, Israel Onyankopɔn anim. Yɛrentumi mfa yɛn nsa nka wɔn.
20 ౨౦ మనం వారితో చేసిన ప్రమాణం వల్ల మనమీదికి ఉగ్రత రాకుండ ఆ ప్రమాణం గురించి వారిని బతకనియ్యాలి” అని చెప్పారు.
Ɛsɛ sɛ yɛma wɔtena. Sɛ yɛbu yɛn ntam no so a, Onyankopɔn bo bɛfu yɛn.
21 ౨౧ నాయకులు “వారిని బతకనియ్యండి” అని చెప్పినందుకు గిబియోనీయులు ఇశ్రాయేలు సమాజమంతటికీ కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు తోడేవారుగా అయ్యారు.
Momma wɔntena. Nanso, yɛbɛma wɔabu nnua, akɔ asuo ama asafo no nyinaa.” Enti Israelfoɔ no dii ɛbɔ a wɔahyɛ Gibeonfoɔ no so.
22 ౨౨ యెహోషువ వారిని పిలిపించి ఇలా చెప్పాడు. “మీరు మా మధ్య నివసించేవారే అయినా చాలా దూరం నుండి వచ్చామని మీరెందుకు మమ్మల్ని మోసం చేశారు?
Na Yosua frɛɛ Gibeonfoɔ mpanimfoɔ no bisaa wɔn sɛ, “Adɛn enti na motwaa atorɔ kyerɛɛ yɛn? Adɛn enti na mokaa sɛ mote akyirikyiri asase so wɔ ɛberɛ a mote yɛn mu pɛɛ?
23 ౨౩ ఆ కారణం వల్ల మీరు శాపగ్రస్తులౌతారు, నా దేవుని ఆలయానికి కట్టెలు నరకడానికీ నీళ్లు తోడడానికీ మీలో కొంతమంది ఎప్పటికీ బానిసలుగానే ఉంటారు” అన్నాడు.
Nnome mmra mo so! Ɛfiri ɛnnɛ rekorɔ, mobɛbu nnua, atwe nsuo de akɔ me Onyankopɔn fie.”
24 ౨౪ అందుకు వారు యెహోషువను చూసి “నీ దేవుడు యెహోవా ఈ దేశాన్నంతా మీకిచ్చి, మీ ముందు నిలవకుండా ఈ దేశ ప్రజలందరినీ నాశనం చేయమని తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించాడని నీ దాసులమైన మాకు రూఢిగా తెలిసింది. కాబట్టి మేము మా ప్రాణాల గురించి చాలా భయపడి ఈ విధంగా చేశాం.
Wɔbuaa Yosua sɛ, “Yɛyɛɛ saa, ɛfiri sɛ, wɔka kyerɛɛ yɛn sɛ, Awurade, mo Onyankopɔn hyɛɛ ne ɔsomfoɔ Mose sɛ ɔmmɛko nni saa asase yi nyinaa so na ɔnsɛe nnipa a wɔte so nyinaa. Yɛsuroo sɛ mobɛkum yɛn. Ɛno enti na ɛma yɛyɛɛ saa.
25 ౨౫ కాబట్టి మేము నీ వశంలో ఉన్నాం, నీ దృష్టికి ఏది న్యాయమో, ఏది మంచిదో, అదే మాకు చెయ్యి” అని యెహోషువకు జవాబిచ్చారు.
Seesei yɛdan mo. Deɛ mosusu sɛ ɛyɛ ma mo biara no, monyɛ.”
26 ౨౬ కాబట్టి యెహోషువా ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల్లోనుండి విడిపించాడు.
Yosua amma Israelfoɔ no ankum wɔn.
27 ౨౭ అయితే సమాజం కోసమూ యెహోవా నిర్ణయించిన చోట ఉండే బలిపీఠం కోసమూ కట్టెలు నరికే వారుగా నీళ్లు తోడేవారుగా యెహోషువ ఆ రోజే వారిని నియమించాడు. ఇప్పటివరకూ వారు ఆ పని చేస్తూనే ఉన్నారు.
Na ɛda no, ɔmaa Gibeonfoɔ no yɛɛ nnuabufoɔ ne asukɔfoɔ maa Israelfoɔ ne Awurade afɔrebukyia no wɔ baabiara a Awurade bɛka sɛ wɔnsi no no. Saa nhyehyɛeɛ no wɔ hɔ bɛsi ɛnnɛ.