< యెహొషువ 6 >
1 ౧ ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల భయం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేశారు.
Now Jericho was shut up tight because of the sons of Israel. None went out, and none came in.
2 ౨ అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తున్నాను.
And Jehovah said to Joshua, See, I have given Jericho into thy hand, and the king of it, and the mighty men of valor.
3 ౩ మీరంతా యుద్ధసన్నద్ధులై పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి.
And ye shall encompass the city, all the men of war, going around the city once. Thus shall thou do six days.
4 ౪ అలా ఆరు రోజులు చేయాలి. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని ముందుగా నడవాలి. ఏడవ రోజున మీరు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ యాజకులు బూరలు ఊదాలి.
And seven priests shall bear seven trumpets of rams' horns before the ark. And the seventh day ye shall encompass the city seven times, and the priests shall blow the trumpets.
5 ౫ మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూండగా మీరు ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలిపోతుంది. యోధులు ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వారు చక్కగా ఎక్కుతూ దాని మీద దాడి చెయ్యాలి” అన్నాడు.
And it shall be, that, when they make a long blast with the ram's horn, and when ye hear the sound of the trumpet, all the people shall shout with a great shout. And the wall of the city shall fall down flat, and the people shall go up every man straight before him.
6 ౬ నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిపించి “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని మోయండి. ఏడుగురు యాజకులు యెహోవా మందసానికి ముందుగా ఏడు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి” అని వారితో చెప్పాడు.
And Joshua the son of Nun called the priests, and said to them, Take up the ark of the covenant, and let seven priests bear seven trumpets of rams' horns before the ark of Jehovah.
7 ౭ తరువాత అతడు “మీరు ముందుకు వెళ్ళి పట్టణం చుట్టూ ముట్టడి వేయండి, యోధులు యెహోవా మందసానికి ముందుగా నడవండి” అని ప్రజలతో చెప్పాడు.
And they said to the people, Pass on, and encompass the city, and let the armed men pass on before the ark of Jehovah.
8 ౮ యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు, ఏడు పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ, ఆ బూరలు ఊదుతుండగా యెహోవా నిబంధన మందసం కూడా వారి వెంట నడిచింది.
And it was so, that, when Joshua had spoken to the people, the seven priests bearing the seven trumpets of rams' horns before Jehovah passed on, and blew the trumpets. And the ark of the covenant of Jehovah followed them.
9 ౯ యోధులు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. సైన్యం వెనక భాగం మందసం వెంట వచ్చింది. యాజకులు వెళ్తూ బూరలు ఊదుతున్నారు.
And the armed men went before the priests who blew the trumpets, and the rearward went behind the ark, the priests blowing the trumpets as they went.
10 ౧౦ యెహోషువ “మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి” అని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు.
And Joshua commanded the people, saying, Ye shall not shout, nor let your voice be heard, neither shall any word proceed out of your mouth until the day I bid you shout. Then ye shall shout.
11 ౧౧ ఆ విధంగా యెహోవా మందసం ఆ పట్టణం చుట్టూ ఒకసారి తిరిగిన తరువాత వారు శిబిరంలోకి వెళ్ళి రాత్రి గడిపారు.
So he caused the ark of Jehovah to encompass the city, going around it once. And they came into the camp, and lodged in the camp.
12 ౧౨ యెహోషువ ఉదయాన్నే లేచిన వెంటనే యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తికుని మోశారు.
And Joshua rose early in the morning, and the priests took up the ark of Jehovah.
13 ౧౩ ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలుకొమ్ము బూరలు పట్టుకుని, ఆపకుండా యెహోవా మందసానికి ముందుగా నడుస్తూ బూరలు ఊదుతూ వచ్చారు. యోధులు వారికి ముందు నడిచారు. వెనక ఉన్న సైనికులు యెహోవా మందసాన్ని వెంబడిస్తూ వచ్చారు. యాజకులు వెళ్తూ మానకుండా బూరలు ఊదుతూ వచ్చారు.
And the seven priests bearing the seven trumpets of rams' horns before the ark of Jehovah went on continually, and blew the trumpets. And the armed men went before them, and the rearward came behind the ark of Jehovah, the priests blowing the trumpets as they went.
14 ౧౪ ఆ విధంగా రెండవ రోజు వారు ఒకసారి పట్టణం చుట్టూ తిరిగి వారి శిబిరానికి మరలి వచ్చారు. ఆరు రోజులు వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు.
And the second day they encompassed the city once, and returned into the camp. So they did six days.
15 ౧౫ ఏడవ రోజున వారు ఉదయాన చీకటితోనే లేచి ఏడుసార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగారు. ఆ రోజు మాత్రమే వారు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరిగారు.
And it came to pass on the seventh day, that they rose early at the dawning of the day, and encompassed the city according to the same manner seven times. Only on that day they encompassed the city seven times.
16 ౧౬ ఏడవసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు “కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు.”
And it came to pass at the seventh time, when the priests blew the trumpets, Joshua said to the people, Shout, for Jehovah has given you the city.
17 ౧౭ “ఈ పట్టణాన్నీ, దీనిలో ఉన్నవాటన్నిటినీ యెహోవా శపించాడు. రాహాబు అనే వేశ్య మనం పంపిన వేగులవారిని దాచిపెట్టింది కాబట్టి ఆమె, ఆ ఇంట్లో ఉన్న వారందరు మాత్రమే బ్రదుకుతారు.
And the city shall be set apart, even it and all that is in it, to Jehovah. Only Rahab the harlot shall live, she and all who are with her in the house, because she hid the messengers that we sent.
18 ౧౮ శాపానికి గురైన దానిలో కొంచెమైనా మీరు తీసికొంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల శిబిరానికి శాపం తెప్పించి దానికి బాధ కలిగించిన వారవుతారు కాబట్టి శపించిన దాన్ని మీరు ముట్టుకోకూడదు.
But as for you, only keep yourselves from what is set apart, lest when ye have set it apart, ye take from what is set apart. So ye would make the camp of Israel accursed, and trouble it.
19 ౧౯ వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి.”
But all the silver, and gold, and vessels of brass and iron, are holy to Jehovah. They shall come into the treasury of Jehovah.
20 ౨౦ యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల శబ్దం విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినపుడు ఆ ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ఆ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు.
So the people shouted, and the priests blew the trumpets. And it came to pass, when the people heard the sound of the trumpet, that the people shouted with a great shout, and the wall fell down flat, so that the people went up into the city, every man straight before him, and they took the city.
21 ౨౧ వారు పురుషులనూ స్త్రీలనూ చిన్న పెద్దలనందరినీ యెద్దులనూ గొర్రెలనూ గాడిదలనూ ఆ పట్టణంలోని సమస్తాన్నీ కత్తితో చంపి వేశారు.
And they utterly destroyed all that was in the city, both man and woman, both young and old, and ox, and sheep, and donkey, with the edge of the sword.
22 ౨౨ అయితే యెహోషువ “ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసిన విధంగా ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తీసుకు రండి” అని ఆ దేశాన్ని వేగు చూసిన ఆ ఇద్దరు మనుషులతో చెప్పాడు.
And Joshua said to the two men who had spied out the land, Go into the harlot's house, and bring out from there the woman, and all that she has, as ye swore to her.
23 ౨౩ వారు వెళ్ళి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సోదరులను, ఆమె బంధువులందరిననీ బయటికి తోడుకుని వచ్చారు. వారందరినీ తెచ్చి ఇశ్రాయేలీయుల శిబిరం బయట వారికి నివాసం ఏర్పాటు చేశారు.
And the young men, the spies, went in, and brought out Rahab, and her father, and her mother, and her brothers, and all that she had. They also brought out all her kindred, and they set them outside the camp of Israel.
24 ౨౪ తరువాత వారు ఆ పట్టణాన్ని, దానిలో ఉన్నవాటన్నిటినీ అగ్నితో కాల్చివేశారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనపపాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచారు.
And they burnt the city with fire, and all that was in it. Only the silver, and the gold, and the vessels of brass and of iron, they put into the treasury of the house of Jehovah.
25 ౨౫ రాహాబు అనే వేశ్య యెరికోను వేగు చూడ్డానికి యెహోషువ పంపిన గూఢచారులను దాచిపెట్టింది కాబట్టి అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటివారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బతకనిచ్చాడు. ఆమె ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యలోనే నివసిస్తూ ఉంది.
But Joshua saved alive Rahab the harlot, and her father's household, and all that she had. And she dwelt in the midst of Israel to this day, because she hid the messengers whom Joshua sent to spy out Jericho.
26 ౨౬ అప్పుడు యెహోషువ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించి వారికిలా ఆజ్ఞాపించాడు “ఎవడు యెరికో పట్టణాన్ని కట్టించడానికి పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. దాని పునాది వేసిన వాడి పెద్దకొడుకు చనిపోతాడు. దాని తలుపులు నిలబెట్టినపుడు వాడి చిన్నకొడుకు మరణిస్తాడు.”
And Joshua charged them with an oath at that time, saying, Cursed be the man before Jehovah who rises up and builds this city Jericho. With the loss of his firstborn he shall lay the foundation of it, and with the loss of his youngest son he shall set up the gates of it.
27 ౨౭ యెహోవా యెహోషువకు తోడై ఉండడం వలన అతని కీర్తి ఆ కనాను దేశమంతటా వ్యాపించింది.
So Jehovah was with Joshua, and his fame was in all the land.