< యెహొషువ 23 >
1 ౧ చుట్టూ ఉన్న వారి శత్రువుల నుండి యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ చేసిన తరువాత చాలా రోజులకు యెహోషువ ముసలివాడై పోయాడు.
以後上主使以色列同四周敵人平安無事,這樣過弓很長的時間,若蘇厄已年老,上了年紀,
2 ౨ యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ వారి పెద్దలనూ వారి నాయకులనూ వారి న్యాయాధిపతులనూ వారి అధికారులనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు, “నేను ముసలివాడినైపోయాను.
便將全以色列人,他們的長老、首領、判官和官長召來,對他們說:「我已年老,上了年紀
3 ౩ మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ రాజ్యాలన్నిటికీ చేసినదంతా మీరు చూశారు. మీ తరఫున యుద్ధం చేసింది మీ దేవుడు యెహోవాయే!
你們都親眼見了上主你們的天主,為了你們對有的民族所做的一切;因為是上你們的天主在替你們作戰。
4 ౪ చూడండి, యొర్దాను నుండి పడమరగా మహాసముద్రం వరకూ నేను నాశనం చేసిన అన్ని రాజ్యాలతో పాటు, మీ గోత్రాల స్వాస్థ్యం మధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాన్ని మీకు చీట్లు వేసి పంచిపెట్టాను.
你們看,我己用抽籤方式,將由約旦河起,直到日落之處的大海之間,所消滅和所剩下的各民族的土地,按照你們各支派,都分了你們作產業。
5 ౫ మీ దేవుడైన యెహోవాయే వారిని వెళ్ళగొడతాడు. ఆయనే వాళ్ళను పారదోలతాడు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీరు వారి దేశాన్ని స్వాధీన పరచుకుంటారు.
上主你們的天主入將他們由你們面前趕走,使他們離開你們,叫你們承受他們的土地,一如上主你們的天主向你們所應許的。
6 ౬ కాబట్టి మీరు నిలకడగా ఉండి మోషే ధర్మశాస్త్రగ్రంథంలో రాసినదాన్నంతా పాటిస్తూ దాని ప్రకారం ప్రవర్తించండి. మనస్సు దృఢం చేసుకుని, దానినుండి ఎడమకు గాని కుడికి గాని తొలగిపోవద్దు.
因此,你們要更忠實謹守奉行梅瑟法律書上所記載的一切,不可偏左偏右,
7 ౭ మీ దగ్గర మిగిలి ఉన్న ఈ రాజ్యాలతో కలిసిపోవద్దు. వారి దేవుళ్ళ పేరులు ఎత్తవద్దు, వాటి తోడని ప్రమాణం చేయవద్దు, వాటిని పూజించవద్దు. వాటికి నమస్కరించవద్దు.
不可與你們中間的異族往來,不可提起你們的神名,不可指著他們起誓,不可事奉那些神袛,也不可在你們面前跪拜。
8 ౮ దానికి బదులు, మీరు యిప్పటి వరకూ ఉన్నట్టు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండండి.
反之,你們應依照你們直到到今天所行的,依附上主你們的天主,
9 ౯ బలీయమైన గొప్ప రాజ్యాలను యెహోవా మీ ముందు పారదోలాడు. ఇప్పటివరకూ మీముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు.
因為是上主從你們中間趕走了那些強大的異族,直到今天,沒有人能抵抗你們,
10 ౧౦ మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటప్రకారం తానే మీ తరఫున యుద్ధం చేసేవాడు కాబట్టి మీలో ఒక్కడు వెయ్యిమందిని తరుముతాడు.
你們一人能趕走千人,是因為上主你們的天主,照衪所應許的,親自為你們作戰。
11 ౧౧ కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ ఉండడానికి శ్రద్ధ వహించండి.
你們要盡心盡力,愛慕上主你們的天主。
12 ౧౨ అయితే మీరు వెనక్కి తగ్గి మీమధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాల ప్రజలతో ఏకమైపోయి వాళ్ళతో వియ్యమందుకుని, పరస్పర సంబంధాలు కలిగించుకుంటే
如果你們背棄上主,依戀你們中間所剩餘的異族,同他們結婚,互相往來,
13 ౧౩ మీ దేవుడైన యెహోవా మీ దగ్గరనుండి ఈ రాజ్యాలను వెళ్ళగొట్టడం మానుకుంటాడని మీరు తెలుసుకోవాలి. దానికి బదులు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి ప్రదేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యే వరకూ వారు మీకు ఉరిగా బోనుగా మీపక్కలో కొరడాలాగా మీ కళ్ళలో ముళ్లులాగా ఉంటారు.
你們就當知道,上主你們的天主必不從你們面前,趕走這個異族,你們必將成為你們的羅網和陷阱,打你們腰的鞭子,扎你們眼的芒刺,直到從上主你們的天主所賜給你們的這福地上,全被消滅。
14 ౧౪ ఇప్పుడు మనుషులందరిలాగే నేనూ పోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయంలో చేసిన వాగ్దానాల్లో ఒక్కటికూడా తప్పిపోలేదని మీ అందరి హృదయాలకూ మనసులకూ తెలుసు. అవన్నీ మీకు జరిగాయి. వాటిలో ఒక్కటికూడా తప్పిపోలేదు.
看我今天就要走世人必走的路,你們要一心一意地承認,上主你們的天主應許所賜給你們的話,沒有一句落空。
15 ౧౫ అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేరినట్టుగా మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేసే వరకూ యెహోవా మీ మీదికి కీడులన్నీ రప్పిస్తాడు.
上主你們的天主對你們所應許的一切幸福,怎樣實行在你們身上,直到將你們從上主你們天主所賜與你們的這土地上消滅。
16 ౧౬ మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి, ఇతర దేవుళ్ళను పూజించి వాటికి నమస్కరిస్తే యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది. ఆయన మీకిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండాా మీరు త్వరగా నాశనమవుతారు.”
如果你們違犯上主你們的天主與你們訂立的盟約,去事奉敬其他的神,上主必向你們大發忿怒,使你們迅速從你們的福地上消滅。