< యెహొషువ 21 >
1 ౧ లేవీయుల వంశపు పెద్దలు యాజకుడు ఎలియాజరు దగ్గరికీ నూను కుమారుడు యెహోషువ దగ్గరికీ ఇశ్రాయేలీయుల గోత్రాల, కుటుంబాల పెద్దల దగ్గరికీ వచ్చారు.
೧ಲೇವಿ ಕುಲಾಧಿಪತಿಗಳು ಕಾನಾನ್ ದೇಶದ ಶೀಲೋವಿನಲ್ಲಿದ್ದ ಮಹಾಯಾಜಕನಾದ ಎಲ್ಲಾಜಾರ, ನೂನನ ಮಗನಾದ ಯೆಹೋಶುವ ಮತ್ತು ಇಸ್ರಾಯೇಲ ಕುಲಾಧಿಪತಿಗಳು ಇವರ ಬಳಿಗೆ ಬಂದು,
2 ౨ అప్పుడు వారు కనాను దేశంలోని షిలోహులో వారిని కలిసి “మేము నివసించడానికి పట్టణాలనూ మా పశువులకు పచ్చిక మైదానాలనూ ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు” అన్నారు.
೨“ನಮ್ಮ ನಿವಾಸಕ್ಕೆ ಪಟ್ಟಣಗಳನ್ನೂ ಪಶುಗಳಿಗೆ ಗೋಮಾಳಗಳನ್ನೂ ಕೊಡಬೇಕೆಂದು ಯೆಹೋವನು ಮೋಶೆಯ ಮೂಲಕ ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾನಲ್ಲವೆ?” ಅನ್ನಲು
3 ౩ ఇశ్రాయేలీయులు యెహోవా మాట ప్రకారం తమ స్వాస్థ్యంలో ఈ పట్టణాలను, వాటి పచ్చిక మైదానాలను లేవీయులకు ఇచ్చారు.
೩ಅವರು ಯೆಹೋವನ ಆಜ್ಞೆಯಂತೆ ತಮ್ಮ ಸ್ವತ್ತಿನಿಂದ ಕೆಳಗೆ ಬರೆದಷ್ಟು ಪಟ್ಟಣಗಳನ್ನೂ ಅವುಗಳಿಗೆ ಸೇರಿದ ಗೋಮಾಳಗಳನ್ನೂ ಅವರಿಗೆ ಕೊಟ್ಟರು.
4 ౪ కహాతీయుల వంశాల చీటి వచ్చింది. లేవీయుల్లో యాజకుడైన అహరోను వంశం వారికి యూదా, షిమ్యోను, బెన్యామీను, గోత్రాల స్వాస్థ్యాల నుండి చీట్ల వలన పదమూడు పట్టణాలు వచ్చాయి.
೪ಕೆಹಾತ್ಯರಿಗೋಸ್ಕರ ಚೀಟುಹಾಕಿದಾಗ ಆರೋನನ ವಂಶದವರಾದ ಲೇವಿಯರಿಗೆ ಯೆಹೂದ, ಸಿಮೆಯೋನ್, ಬೆನ್ಯಾಮೀನ್ ಕುಲಗಳಿಂದ ಹದಿಮೂರು ಪಟ್ಟಣಗಳು ದೊರೆತವು.
5 ౫ మిగిలిన కహాతీయులకు ఎఫ్రాయిము, దాను, మనష్షే అర్థ గోత్ర కుటుంబాల నుండి చీట్ల వలన పది పట్టణాలు వచ్చాయి.
೫ಉಳಿದ ಕೆಹಾತ್ಯರಿಗೆ ಎಫ್ರಾಯೀಮ್ ದಾನ್ ಕುಲಗಳಿಂದ ಮನಸ್ಸೆಯ ಅರ್ಧಕುಲದಿಂದಲೂ ಹತ್ತು ಪಟ್ಟಣಗಳು ಸಿಕ್ಕಿದವು.
6 ౬ గెర్షోనీయులకు ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులో ఉన్న మనష్షే అర్థ గోత్ర కుటుంబాల నుండి చీట్ల వలన పదమూడు పట్టణాలు వచ్చాయి.
೬ಪುನಃ ಚೀಟು ಹಾಕಿದಾಗ ಗೇರ್ಷೋನ್ಯರಿಗೆ ಇಸ್ಸಾಕಾರ್, ಆಶೇರ್, ನಫ್ತಾಲಿ ಎಂಬ ಕುಲಗಳಿಂದ ಮತ್ತು ಬಾಷಾನಿನಲ್ಲಿರುವ ಮನಸ್ಸೆಯ ಅರ್ಧ ಕುಲದಿಂದಲೂ ಹದಿಮೂರು ಪಟ್ಟಣಗಳು ದೊರಕಿದವು.
7 ౭ మెరారీయులకు రూబేను, గాదు, జెబూలూను గోత్రాల నుండి పన్నెండు పట్టణాలు వచ్చాయి.
೭ಮೆರಾರೀ ಗೋತ್ರದವರಿಗೆ ರೂಬೇನ್, ಗಾದ್, ಜೆಬುಲೂನ್ ಕುಲಗಳಿಂದ ಹನ್ನೆರಡು ಪಟ್ಟಣಗಳು ಸಿಕ್ಕಿದವು
8 ౮ యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చీట్లు వేసి ఆ పట్టణాలను, పచ్చిక మైదానాలను లేవీయులకు ఇచ్చారు.
೮ಯೆಹೋವನು ಮೋಶೆಯ ಮೂಲಕ ಆಜ್ಞಾಪಿಸಿದಂತೆ ಇಸ್ರಾಯೇಲರು ಚೀಟು ಹಾಕಿ ಲೇವಿಯರಿಗೆ ಇಷ್ಟು ಪಟ್ಟಣಗಳನ್ನು ಅವುಗಳಿಗೆ ಸೇರಿದ ಗೋಮಾಳಗಳನ್ನೂ ಕೊಟ್ಟರು.
9 ౯ యూదా, షిమ్యోను గోత్రాల్లో ఈ కింద చెప్పిన పట్టణాలను వారికిచ్చారు.
೯ಲೇವಿ ಕುಲದವರು ಕೆಹಾತ್ಯರ ಗೋತ್ರದವರೂ ಆದ ಆರೋನನ ಕುಟುಂಬದವರಿಗೆ ಮೊದಲು ಚೀಟು ಬಿದ್ದಿತು.
10 ౧౦ వాటిని లేవీయులైన అహరోను వంశంలోని కహాతీయుల కుటుంబాలకు ఇచ్చారు, ఎందుకంటే మొదట పడిన చీటి ప్రకారం వంతు వారిది.
೧೦ಆದ್ದರಿಂದ ಇಸ್ರಾಯೇಲ್ಯರು ಅವರಿಗೆ ಯೆಹೂದ ಸಿಮೆಯೋನ್ ಕುಲಗಳಿಂದ ಕೆಳಗೆ ಹೇಳಿರುವ ಪಟ್ಟಣಗಳನ್ನು ಕೊಟ್ಟರು.
11 ౧౧ యూదా కొండసీమలో వారికి కిర్యతర్బా, అంటే హెబ్రోను (అర్బా అనాకు తండ్రి) దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు ఇచ్చారు.
೧೧ಇವುಗಳಲ್ಲಿ ಯೆಹೂದ ಬೆಟ್ಟದ ಸೀಮೆಯ ಹೆಬ್ರೋನೆಂಬ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಕಿರ್ಯತರ್ಬವೂ ಸೇರಿರುತ್ತದೆ. (ಕಿರ್ಯಾತ ಅರ್ಬ ಎಂದರೆ ಅನಾಕನ ತಂದೆಯಾದ ಅರ್ಬನ ಪಟ್ಟಣ) ಅದರ ಸುತ್ತಲಿರುವ ಉಪನಗರಗಳನ್ನೂ ಅವರಿಗೆ ಕೊಟ್ಟರು.
12 ౧౨ అయితే ఆ పట్టణ పొలాలూ దాని పల్లెలు యెఫున్నె కుమారుడు కాలేబుకు ఆస్తిగా ఇచ్చారు.
೧೨ಆದರೆ ಇದರ ಹೊಲಗಳನ್ನೂ, ಇದಕ್ಕೆ ಸೇರಿದ ಗ್ರಾಮಗಳನ್ನೂ ಯೆಫುನ್ನೆಯ ಮಗನಾದ ಕಾಲೇಬನಿಗೆ ಕೊಟ್ಟರು.
13 ౧౩ హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న హెబ్రోను, దాని పచ్చిక మైదానాలు యాజకుడైన అహరోను సంతానపు వారికి ఇచ్చారు.
೧೩ಮಹಾಯಾಜಕನಾದ ಆರೋನನ ವಂಶದವರಿಗೆ ಮೇಲೆ ಹೇಳಿದ ಎರಡು ಕುಲಗಳಿಂದ ಹೆಬ್ರೋನೆಂಬ ಆಶ್ರಯ ನಗರವಾದ ಲಿಬ್ನಾ,
14 ౧౪ లిబ్నా, దాని పచ్చిక మైదానాలనూ యత్తీరు, దాని పచ్చిక మైదానాలనూ ఎష్టేమోయ, దాని పచ్చిక మైదానాలనూ హోలోను, దాని పచ్చిక మైదానాలనూ
೧೪ಯತ್ತೀರ್, ಎಷ್ಟೆಮೋಹ,
15 ౧౫ దెబీరు, దాని పచ్చిక మైదానాలనూ ఆయిని, దాని పచ్చిక మైదానాలనూ యుట్టయు, దాని పచ్చిక మైదానాలనూ బేత్షెమెషు, దాని పచ్చిక మైదానాలనూ
೧೫ಹೋಲೋನ್, ದೆಬೀರ್,
16 ౧౬ అంటే ఆ రెండు గోత్రాల నుండి తొమ్మిది పట్టణాలనూ ఇచ్చారు.
೧೬ಅಯಿನ್, ಯುಟ್ಟಾ, ಬೇತ್ಷೆಮೆಷ್ ಎಂಬ ಒಂಭತ್ತು ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಪಟ್ಟಣಗಳು
17 ౧౭ బెన్యామీను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే గిబియోను, దాని పచ్చిక మైదానాలనూ గెబను, దాని పచ్చిక మైదానాలనూ
೧೭ಹಾಗೂ ಬೆನ್ಯಾಮೀನನ ಕುಲದಿಂದ ಗಿಬ್ಯೋನ್, ಗೆಬ,
18 ౧౮ అనాతోతు, దాని పచ్చిక మైదానాలనూ అల్మోను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
೧೮ಅನಾತೋತ್, ಅಲ್ಮೋನ್ ಎಂಬ ನಾಲ್ಕು ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಪಟ್ಟಣಗಳೂ ದೊರಕಿದವು.
19 ౧౯ యాజకులైన అహరోను వంశం వారి పట్టణాలన్నీ వాటి పచ్చిక మైదానాలు పోతే పదమూడు పట్టణాలు.
೧೯ಮಹಾಯಾಜಕನಾದ ಆರೋನನ ವಂಶದವರ ಪಾಲಿಗೆ ಬಂದಂಥ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಪಟ್ಟಣಗಳು ಹದಿಮೂರು.
20 ౨౦ కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అంటే కహాతు వంశాల్లో మిగిలినవారికి చీట్ల ద్వారా ఎఫ్రాయిం గోత్రం నుండి పట్టణాలు వచ్చాయి.
೨೦ಲೇವಿಯರಾದ ಕೆಹಾತ್ಯರ ಉಳಿದ ಕುಟುಂಬಗಳಿಗೆ
21 ౨౧ నాలుగు పట్టణాలను, అంటే ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతంలో అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న షెకెం, దాని పచ్చిక మైదానాలనూ గెజెరు, దాని పచ్చిక మైదానాలనూ
೨೧ಎಫ್ರಾಯೀಮ್ಯರ ಸ್ವತ್ತಿನಿಂದ ಬೆಟ್ಟದಲ್ಲಿರುವ ಶೆಕೆಮ್ ಎಂಬ ಆಶ್ರಯ ನಗರ,
22 ౨౨ కిబ్సాయిం, దాని పచ్చిక మైదానాలనూ బేత్ హోరోను, దాని పచ్చిక మైదానాలనూ వారికిచ్చారు.
೨೨ಗೆಜೆರ್, ಕಿಬ್ಚೈಮ್ ಹಾಗೂ ಬೇತ್ಹೋರೋನ್ ಎಂಬ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ನಾಲ್ಕು ಪಟ್ಟಣಗಳು,
23 ౨౩ దాను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే ఎత్తెకేను, దాని పచ్చిక మైదానాలనూ గిబ్బెతోను, దాని పచ్చిక మైదానాలనూ
೨೩ದಾನ್ಯರ ಸ್ವತ್ತಿನಿಂದ ಎಲ್ತೆಕೇ, ಗಿಬ್ಬೆತೋನ್,
24 ౨౪ అయ్యాలోను, దాని పచ్చిక మైదానాలనూ గత్రిమ్మోను, దాని పచ్చిక మైదానాలనూ వారికిచ్చారు.
೨೪ಅಯ್ಯಾಲೋನ್, ಗತ್ರಿಮ್ಮೋನ್ ಎಂಬ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ನಾಲ್ಕು ಪಟ್ಟಣಗಳು,
25 ౨౫ రెండు పట్టణాలు, అంటే మనష్షే అర్థగోత్ర కుటుంబాల నుండి తానాకు, దాని పచ్చిక మైదానాలనూ గత్రిమ్మోను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
೨೫ಮನಸ್ಸೆ ಕುಲದ ಅರ್ಧಜನರ ಸ್ವತ್ತಿನಿಂದ ತಾನಾಕ್, ಗತ್ರಿಮ್ಮೋನ್, ಎಂಬ ಎರಡು ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಪಟ್ಟಣಗಳು ಚೀಟಿನಿಂದ ದೊರಕಿದವು.
26 ౨౬ వాటి పచ్చిక మైదానాలు గాక కహాతు సంబంధుల్లో మిగిలినవారికి వచ్చిన పట్టణాలన్నీ పది.
೨೬ಒಟ್ಟಾರೆ ಕೆಹಾತ್ಯರಿಗೆ ಸಿಕ್ಕಿದಂಥ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಪಟ್ಟಣಗಳು ಹತ್ತು.
27 ౨౭ లేవీయుల వంశాల్లో గెర్షోనీయులకు రెండు పట్టణాలను, అంటే అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న బాషానులోని గోలాను, దాని పచ్చిక మైదానాలనూ బెయెష్టెరా, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
೨೭ಗೆರ್ಷೋನ್ಯರ ಕುಟುಂಬಗಳಿಗೆ ಅರ್ಧ ಮನಸ್ಸೆಯವರ ಸ್ವತ್ತಿನಿಂದ ದೊರಕಿದ ಪಟ್ಟಣಗಳು ಇವು: ಕೊಲೆ ಮಾಡಿದವನಿಗೆ ಆಶ್ರಯ ನಗರವಾದ ಬಾಷಾನಿನ ಗೋಲಾನ್, ಬೆಯೆಷ್ಟೆರಾ ಎಂಬ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಎರಡು ಪಟ್ಟಣಗಳು;
28 ౨౮ ఇశ్శాఖారు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే కిష్యోను, దాని పచ్చిక మైదానాలనూ దాబెరతు, దాని పచ్చిక మైదానాలనూ యర్మూతు, దాని పచ్చిక మైదానాలనూ
೨೮ಇಸ್ಸಾಕಾರ್ ಸ್ವತ್ತಿನಿಂದ ಕಿಷ್ಯೋನ್, ದಾಬೆರತ್,
29 ౨౯ ఏన్గన్నీము, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
೨೯ಯರ್ಮೂತ್, ಏಂಗನ್ನೀಮ್, ಎಂಬ ನಾಲ್ಕು ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಪಟ್ಟಣಗಳು;
30 ౩౦ ఆషేరు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే మిషెయలు, దాని పచ్చిక మైదానాలనూ అబ్దోను, దాని పచ్చిక మైదానాలనూ
೩೦ಆಶೇರ್ ಕುಲದಿಂದ ಮಿಷಾಲ್, ಅಬ್ದೋನ್,
31 ౩౧ హెల్కతు, దాని పచ్చిక మైదానాలనూ రెహోబు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
೩೧ಹೆಲ್ಕಾತ್ ರೆಹೋಬ್ ಎಂಬ ನಾಲ್ಕು ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಪಟ್ಟಣಗಳು;
32 ౩౨ నఫ్తాలి గోత్రం నుండి మూడు పట్టణాలను, అంటే అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న గలిలయలోని కెదెషు, దాని పచ్చిక మైదానాలనూ హమ్మోత్దోరు, దాని పచ్చిక మైదానాలనూ కర్తాను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
೩೨ನಫ್ತಾಲಿ ಸ್ವತ್ತಿನಿಂದ, ಕೊಲೆ ಮಾಡಿದವನಿಗೆ ಆಶ್ರಯ ನಗರವಾದ ಗಲಿಲಾಯದ ಕೆದೆಷ್ ಹಮ್ಮೋತ್ ದೋರ್, ಕರ್ತಾನ್ ಎಂಬ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಮೂರು ಪಟ್ಟಣಗಳು ದೊರಕಿದವು.
33 ౩౩ వారి వంశాల ప్రకారం గెర్షోనీయుల పట్టణాలన్నీ వాటి పచ్చిక మైదానాలు కలుపుకుని పదమూడు పట్టణాలు.
೩೩ಗೇರ್ಷೊನ್ಯರಿಗೆ ಸಿಕ್ಕಿದ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಪಟ್ಟಣಗಳು ಹದಿಮೂರು.
34 ౩౪ లేవీయుల్లో మిగిలిన మెరారీయుల వంశాలకు జెబూలూను గోత్రాల నుండి నాలుగు పట్టణాలను, అంటే యొక్నెయాము, దాని పచ్చిక మైదానాలనూ
೩೪ಮಿಕ್ಕ ಲೇವಿಯರಾದ ಮೆರಾರೀ ಗೋತ್ರದವರಿಗೆ ಜೆಬುಲೂನ್ ಸ್ವತ್ತಿನಿಂದ ಯೊಕ್ನೆಯಾಮ್,
35 ౩౫ కర్తా, దాని పచ్చిక మైదానాలనూ దిమ్నా, దాని పచ్చిక మైదానాలనూ నహలాలు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
೩೫ಕರ್ತಾ, ದಿಮ್ನಾ ಹಾಗೂ ನಹಲಾಲ್ ಎಂಬ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ನಾಲ್ಕುಪಟ್ಟಣಗಳು.
36 ౩౬ రూబేను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే బేసెరు, దాని పచ్చిక మైదానాలనూ యాహసు, దాని పచ్చిక మైదానాలనూ
೩೬ರೂಬೇನ್ಯರ ಸ್ವತ್ತಿನಿಂದ ಬೆಚೆರ್, ಯಹಚಾ,
37 ౩౭ కెదెమోతు, దాని పచ్చిక మైదానాలనూ మేఫాతు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
೩೭ಕೆದೇಮೋತ್ ಹಾಗೂ ಮೇಫಾಗತ್ ಎಂಬ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ನಾಲ್ಕು ಪಟ್ಟಣಗಳು;
38 ౩౮ గాదు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న గిలాదులోని రామోతు, దాని పచ్చిక మైదానాలనూ మహనయీము, దాని పచ్చిక మైదానాలనూ
೩೮ಗಾದ್ಯರ ಸ್ವತ್ತಿನಿಂದ ಕೊಲೆ ಮಾಡಿದವನಿಗೆ ಆಶ್ರಯ ನಗರವಾಗಿರುವ ಗಿಲ್ಯಾದಿನ ರಾಮೋತ್, ಮಹನಯಿಮ್,
39 ౩౯ హెష్బోను, దాని పచ్చిక మైదానాలనూ యాజెరు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
೩೯ಹೆಷ್ಬೋನ್, ಯಗ್ಜೇರ್ ಎಂಬ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ನಾಲ್ಕುಪಟ್ಟಣಗಳು ದೊರಕಿದವು.
40 ౪౦ వారి వారి వంశాల ప్రకారం, అంటే లేవీయుల మిగిలిన వంశాల ప్రకారం అవన్నీ మెరారీయులకు వచ్చిన పట్టణాలు. చీటి ద్వారా వారికి వచ్చిన పట్టణాలు పన్నెండు.
೪೦ಮಿಕ್ಕ ಲೇವಿಯರಾದ ಮೆರಾರೀ ಗೋತ್ರಗಳಿಗೆ ಚೀಟಿಯಿಂದ ದೊರಕಿದ ಪಟ್ಟಣಗಳು ಒಟ್ಟು ಹನ್ನೆರಡು.
41 ౪౧ ఇశ్రాయేలీయుల స్వాస్థ్యంలో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణాలన్నీ నలభై ఎనిమిది.
೪೧ಲೇವಿಯರಿಗೆ ಇಸ್ರಾಯೇಲರ ಮಧ್ಯದಲ್ಲಿ ದೊರಕಿದ ಗೋಮಾಳ ಸಹಿತವಾದ ಪಟ್ಟಣಗಳು ನಲವತ್ತೆಂಟು.
42 ౪౨ ఆ పట్టణాలన్నింటికీ పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ అలాగే ఉన్నాయి.
೪೨ಈ ಪಟ್ಟಣಗಳಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ಗೋಮಾಳಗಳಿದ್ದವು. ಎಲ್ಲಾ ಪಟ್ಟಣಗಳಿಗೂ ಹೀಗೆಯೇ ಇದ್ದಿತು.
43 ౪౩ యెహోవా ప్రమాణం చేసి ఇశ్రాయేలీయుల పూర్వీకులకిస్తానని చెప్పిన దేశమంతా ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. వాళ్ళు దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించారు.
೪೩ಯೆಹೋವನು ಇಸ್ರಾಯೇಲರ ಪೂರ್ವಿಕರಿಗೆ ಪ್ರಮಾಣಪೂರ್ವಕವಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ದೇಶವನ್ನು ಇಸ್ರಾಯೇಲಿಗೆ ಕೊಟ್ಟನು. ಅವರು ಅದನ್ನು ಸ್ವತಂತ್ರಪಡಿಸಿಕೊಂಡು ಅದರಲ್ಲಿ ವಾಸಮಾಡಿದರು.
44 ౪౪ యెహోవా వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్నివైపులా వారికి విశ్రాంతి కలగచేశాడు. యెహోవా వారి శత్రువులందరిని వారికి అప్పగించాడు కాబట్టి వాళ్ళలో ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకపోయారు.
೪೪ಯೆಹೋವನು ಅವರ ಪೂರ್ವಿಕರಿಗೆ ಆಣೆಯಿಟ್ಟು ಹೇಳಿದಂತೆ ಅವರಿಗೆ ಎಲ್ಲಾ ಕಡೆಗಳಿಂದಲೂ ಸಮಾಧಾನವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದನು. ವೈರಿಗಳಲ್ಲಿ ಒಬ್ಬನೂ ಅವರೆದುರು ನಿಲ್ಲಲಿಲ್ಲ. ಆತನು ಎಲ್ಲರನ್ನೂ ಅವರ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿದನು.
45 ౪౫ యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పలేదు, అన్నీ నెరవేరాయి.
೪೫ಯೆಹೋವನು ಇಸ್ರಾಯೇಲ್ಯರಿಗೆ ಮಾಡಿದ ಅತಿ ಶ್ರೇಷ್ಠ ವಾಗ್ದಾನಗಳಲ್ಲಿ ಒಂದೂ ತಪ್ಪಿ ಹೋಗಲಿಲ್ಲ. ಎಲ್ಲವೂ ನೆರವೇರಿದವು.