< యెహొషువ 21 >

1 లేవీయుల వంశపు పెద్దలు యాజకుడు ఎలియాజరు దగ్గరికీ నూను కుమారుడు యెహోషువ దగ్గరికీ ఇశ్రాయేలీయుల గోత్రాల, కుటుంబాల పెద్దల దగ్గరికీ వచ్చారు.
Then came near the heads of the fathers of the Levites to Eleazar the priest, and to Joshua the son of Nun, and to the heads of the fathers of the tribes of the children of Israel;
2 అప్పుడు వారు కనాను దేశంలోని షిలోహులో వారిని కలిసి “మేము నివసించడానికి పట్టణాలనూ మా పశువులకు పచ్చిక మైదానాలనూ ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు” అన్నారు.
And they spoke to them at Shiloh in the land of Canaan, saying, The LORD commanded by the hand of Moses to give us cities to dwell in, with their common lands for our cattle.
3 ఇశ్రాయేలీయులు యెహోవా మాట ప్రకారం తమ స్వాస్థ్యంలో ఈ పట్టణాలను, వాటి పచ్చిక మైదానాలను లేవీయులకు ఇచ్చారు.
And the children of Israel gave to the Levites out of their inheritance, at the commandment of the LORD, these cities and their common lands.
4 కహాతీయుల వంశాల చీటి వచ్చింది. లేవీయుల్లో యాజకుడైన అహరోను వంశం వారికి యూదా, షిమ్యోను, బెన్యామీను, గోత్రాల స్వాస్థ్యాల నుండి చీట్ల వలన పదమూడు పట్టణాలు వచ్చాయి.
And the lot came out for the families of the Kohathites: and the children of Aaron the priest, who were of the Levites, had by lot out of the tribe of Judah, and out of the tribe of Simeon, and out of the tribe of Benjamin, thirteen cities.
5 మిగిలిన కహాతీయులకు ఎఫ్రాయిము, దాను, మనష్షే అర్థ గోత్ర కుటుంబాల నుండి చీట్ల వలన పది పట్టణాలు వచ్చాయి.
And the rest of the children of Kohath had by lot out of the families of the tribe of Ephraim, and out of the tribe of Dan, and out of the half tribe of Manasseh, ten cities.
6 గెర్షోనీయులకు ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులో ఉన్న మనష్షే అర్థ గోత్ర కుటుంబాల నుండి చీట్ల వలన పదమూడు పట్టణాలు వచ్చాయి.
And the children of Gershon had by lot out of the families of the tribe of Issachar, and out of the tribe of Asher, and out of the tribe of Naphtali, and out of the half tribe of Manasseh in Bashan, thirteen cities.
7 మెరారీయులకు రూబేను, గాదు, జెబూలూను గోత్రాల నుండి పన్నెండు పట్టణాలు వచ్చాయి.
The children of Merari by their families had out of the tribe of Reuben, and out of the tribe of Gad, and out of the tribe of Zebulun, twelve cities.
8 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చీట్లు వేసి ఆ పట్టణాలను, పచ్చిక మైదానాలను లేవీయులకు ఇచ్చారు.
And the children of Israel gave by lot to the Levites these cities with their common lands, as the LORD commanded by the hand of Moses.
9 యూదా, షిమ్యోను గోత్రాల్లో ఈ కింద చెప్పిన పట్టణాలను వారికిచ్చారు.
And they gave out of the tribe of the children of Judah, and out of the tribe of the children of Simeon, these cities which are here mentioned by name,
10 ౧౦ వాటిని లేవీయులైన అహరోను వంశంలోని కహాతీయుల కుటుంబాలకు ఇచ్చారు, ఎందుకంటే మొదట పడిన చీటి ప్రకారం వంతు వారిది.
Which the children of Aaron, being of the families of the Kohathites, who were of the children of Levi, had: for theirs was the first lot.
11 ౧౧ యూదా కొండసీమలో వారికి కిర్యతర్బా, అంటే హెబ్రోను (అర్బా అనాకు తండ్రి) దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు ఇచ్చారు.
And they gave them the city of Arba the father of Anak, which city is Hebron, in the hill country of Judah, with its common lands around it.
12 ౧౨ అయితే ఆ పట్టణ పొలాలూ దాని పల్లెలు యెఫున్నె కుమారుడు కాలేబుకు ఆస్తిగా ఇచ్చారు.
But the fields of the city, and its villages, they gave to Caleb the son of Jephunneh for his possession.
13 ౧౩ హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న హెబ్రోను, దాని పచ్చిక మైదానాలు యాజకుడైన అహరోను సంతానపు వారికి ఇచ్చారు.
Thus they gave to the children of Aaron the priest Hebron with its common lands, to be a city of refuge for the slayer; and Libnah with its common lands,
14 ౧౪ లిబ్నా, దాని పచ్చిక మైదానాలనూ యత్తీరు, దాని పచ్చిక మైదానాలనూ ఎష్టేమోయ, దాని పచ్చిక మైదానాలనూ హోలోను, దాని పచ్చిక మైదానాలనూ
And Jattir with its common lands, and Eshtemoa with its common lands,
15 ౧౫ దెబీరు, దాని పచ్చిక మైదానాలనూ ఆయిని, దాని పచ్చిక మైదానాలనూ యుట్టయు, దాని పచ్చిక మైదానాలనూ బేత్షెమెషు, దాని పచ్చిక మైదానాలనూ
And Holon with its common lands, and Debir with its common lands,
16 ౧౬ అంటే ఆ రెండు గోత్రాల నుండి తొమ్మిది పట్టణాలనూ ఇచ్చారు.
And Ain with its common lands, and Juttah with its common lands, and Bethshemesh with its common lands; nine cities out of those two tribes.
17 ౧౭ బెన్యామీను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే గిబియోను, దాని పచ్చిక మైదానాలనూ గెబను, దాని పచ్చిక మైదానాలనూ
And out of the tribe of Benjamin, Gibeon with its common lands, Geba with its common lands,
18 ౧౮ అనాతోతు, దాని పచ్చిక మైదానాలనూ అల్మోను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
Anathoth with its common lands, and Almon with its common lands; four cities.
19 ౧౯ యాజకులైన అహరోను వంశం వారి పట్టణాలన్నీ వాటి పచ్చిక మైదానాలు పోతే పదమూడు పట్టణాలు.
All the cities of the children of Aaron, the priests, were thirteen cities with their common lands.
20 ౨౦ కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అంటే కహాతు వంశాల్లో మిగిలినవారికి చీట్ల ద్వారా ఎఫ్రాయిం గోత్రం నుండి పట్టణాలు వచ్చాయి.
And the families of the children of Kohath, the Levites who remained of the children of Kohath, even they had the cities of their lot out of the tribe of Ephraim.
21 ౨౧ నాలుగు పట్టణాలను, అంటే ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతంలో అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న షెకెం, దాని పచ్చిక మైదానాలనూ గెజెరు, దాని పచ్చిక మైదానాలనూ
For they gave them Shechem with its common lands in mount Ephraim, to be a city of refuge for the slayer; and Gezer with its common lands,
22 ౨౨ కిబ్సాయిం, దాని పచ్చిక మైదానాలనూ బేత్‌ హోరోను, దాని పచ్చిక మైదానాలనూ వారికిచ్చారు.
And Kibzaim with its common lands, and Bethhoron with its common lands; four cities.
23 ౨౩ దాను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే ఎత్తెకేను, దాని పచ్చిక మైదానాలనూ గిబ్బెతోను, దాని పచ్చిక మైదానాలనూ
And out of the tribe of Dan, Eltekeh with its common lands, Gibbethon with its common lands,
24 ౨౪ అయ్యాలోను, దాని పచ్చిక మైదానాలనూ గత్రిమ్మోను, దాని పచ్చిక మైదానాలనూ వారికిచ్చారు.
Aijalon with its common lands, Gathrimmon with its common lands; four cities.
25 ౨౫ రెండు పట్టణాలు, అంటే మనష్షే అర్థగోత్ర కుటుంబాల నుండి తానాకు, దాని పచ్చిక మైదానాలనూ గత్రిమ్మోను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
And out of the half tribe of Manasseh, Tanach with its common lands, and Gathrimmon with its common lands; two cities.
26 ౨౬ వాటి పచ్చిక మైదానాలు గాక కహాతు సంబంధుల్లో మిగిలినవారికి వచ్చిన పట్టణాలన్నీ పది.
All the cities were ten with their common lands for the families of the children of Kohath that remained.
27 ౨౭ లేవీయుల వంశాల్లో గెర్షోనీయులకు రెండు పట్టణాలను, అంటే అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న బాషానులోని గోలాను, దాని పచ్చిక మైదానాలనూ బెయెష్టెరా, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
And to the children of Gershon, of the families of the Levites, out of the other half tribe of Manasseh they gave Golan in Bashan with its common lands, to be a city of refuge for the slayer; and Beeshterah with its common lands; two cities.
28 ౨౮ ఇశ్శాఖారు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే కిష్యోను, దాని పచ్చిక మైదానాలనూ దాబెరతు, దాని పచ్చిక మైదానాలనూ యర్మూతు, దాని పచ్చిక మైదానాలనూ
And out of the tribe of Issachar, Kishon with its common lands, Dabareh with its common lands,
29 ౨౯ ఏన్గన్నీము, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
Jarmuth with its common lands, Engannim with its common lands; four cities.
30 ౩౦ ఆషేరు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే మిషెయలు, దాని పచ్చిక మైదానాలనూ అబ్దోను, దాని పచ్చిక మైదానాలనూ
And out of the tribe of Asher, Mishal with its common lands, Abdon with its common lands,
31 ౩౧ హెల్కతు, దాని పచ్చిక మైదానాలనూ రెహోబు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
Helkath with its common lands, and Rehob with its common lands; four cities.
32 ౩౨ నఫ్తాలి గోత్రం నుండి మూడు పట్టణాలను, అంటే అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న గలిలయలోని కెదెషు, దాని పచ్చిక మైదానాలనూ హమ్మోత్దోరు, దాని పచ్చిక మైదానాలనూ కర్తాను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
And out of the tribe of Naphtali, Kedesh in Galilee with its common lands, to be a city of refuge for the slayer; and Hammothdor with its common lands, and Kartan with its common lands; three cities.
33 ౩౩ వారి వంశాల ప్రకారం గెర్షోనీయుల పట్టణాలన్నీ వాటి పచ్చిక మైదానాలు కలుపుకుని పదమూడు పట్టణాలు.
All the cities of the Gershonites according to their families were thirteen cities with their common lands.
34 ౩౪ లేవీయుల్లో మిగిలిన మెరారీయుల వంశాలకు జెబూలూను గోత్రాల నుండి నాలుగు పట్టణాలను, అంటే యొక్నెయాము, దాని పచ్చిక మైదానాలనూ
And to the families of the children of Merari, the rest of the Levites, out of the tribe of Zebulun, Jokneam with its common lands, and Kartah with its common lands,
35 ౩౫ కర్తా, దాని పచ్చిక మైదానాలనూ దిమ్నా, దాని పచ్చిక మైదానాలనూ నహలాలు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
Dimnah with its common lands, Nahalal with its common lands; four cities.
36 ౩౬ రూబేను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే బేసెరు, దాని పచ్చిక మైదానాలనూ యాహసు, దాని పచ్చిక మైదానాలనూ
And out of the tribe of Reuben, Bezer with its common lands, and Jahazah with its common lands,
37 ౩౭ కెదెమోతు, దాని పచ్చిక మైదానాలనూ మేఫాతు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
Kedemoth with its common lands, and Mephaath with its common lands; four cities.
38 ౩౮ గాదు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న గిలాదులోని రామోతు, దాని పచ్చిక మైదానాలనూ మహనయీము, దాని పచ్చిక మైదానాలనూ
And out of the tribe of Gad, Ramoth in Gilead with its common lands, to be a city of refuge for the slayer; and Mahanaim with its common lands,
39 ౩౯ హెష్బోను, దాని పచ్చిక మైదానాలనూ యాజెరు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
Heshbon with its common lands, Jazer with its common lands; four cities in all.
40 ౪౦ వారి వారి వంశాల ప్రకారం, అంటే లేవీయుల మిగిలిన వంశాల ప్రకారం అవన్నీ మెరారీయులకు వచ్చిన పట్టణాలు. చీటి ద్వారా వారికి వచ్చిన పట్టణాలు పన్నెండు.
So all the cities for the children of Merari by their families, which were remaining of the families of the Levites, were by their lot twelve cities.
41 ౪౧ ఇశ్రాయేలీయుల స్వాస్థ్యంలో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణాలన్నీ నలభై ఎనిమిది.
All the cities of the Levites within the possession of the children of Israel were forty and eight cities with their common lands.
42 ౪౨ ఆ పట్టణాలన్నింటికీ పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ అలాగే ఉన్నాయి.
These cities were every one with their common lands surrounding them: thus were all these cities.
43 ౪౩ యెహోవా ప్రమాణం చేసి ఇశ్రాయేలీయుల పూర్వీకులకిస్తానని చెప్పిన దేశమంతా ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. వాళ్ళు దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించారు.
And the LORD gave to Israel all the land which he swore to give to their fathers; and they possessed it, and dwelt in it.
44 ౪౪ యెహోవా వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్నివైపులా వారికి విశ్రాంతి కలగచేశాడు. యెహోవా వారి శత్రువులందరిని వారికి అప్పగించాడు కాబట్టి వాళ్ళలో ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకపోయారు.
And the LORD gave them rest on all sides, according to all that he swore to their fathers: and there stood not a man of all their enemies before them; the LORD delivered all their enemies into their hand.
45 ౪౫ యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పలేదు, అన్నీ నెరవేరాయి.
There failed nothing of any good thing which the LORD had spoken to the house of Israel; all came to pass.

< యెహొషువ 21 >