< యెహొషువ 19 >

1 రెండవ చీటి షిమ్యోనుకు, అంటే వారి వంశాల ప్రకారం షిమ్యోను గోత్రికులకు వచ్చింది. వారి స్వాస్థ్యం యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య ఉంది.
둘째로 시므온 곧 시므온 자손의 지파를 위하여 그 가족대로 제비를 뽑았으니 그 기업은 유다 자손의 기업 중에서라
2 వారి స్వాస్థ్యం ఏమిటంటే, బెయేర్షెబా, షెబ, మోలాదా,
그 얻은 기업은 브엘세바 곧 세바와, 몰라다와,
3 హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా,
하살 수알과, 발라와, 에셈과,
4 సిక్లగు, బేత్, మార్కాబోదు, హజర్సూసా,
엘돌랏과, 브둘과, 호르마와,
5 బేత్లబాయోతు, షారూహెను అనేవి,
시글락과, 벧 말가봇과, 하살수사와,
6 వాటి పల్లెలు కాకుండా పదమూడు పట్టణాలు.
벧 르바옷과, 사루헨이니 십 삼 성읍이요 또 그 촌락이며
7 అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, అనేవి. వాటి పల్లెలు కాకుండా నాలుగు పట్టణాలు.
또 아인과 림몬과, 에델과 아산이니 네 성읍이요 또 그 촌락이며
8 దక్షిణంగా రామతు అనే బాలత్బెయేరు వరకూ ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలన్నీ. ఇవి షిమ్యోను గోత్రం వారి వంశాల ప్రకారం కలిగిన స్వాస్థ్యం.
또 남방 라마 곧 바알랏 브엘까지 이 성들을 둘러 있는 모든 촌락이니 이는 시므온 자손의 지파가 그 가족대로 얻은 기업이라
9 షిమ్యోను వారి స్వాస్థ్యం యూదా వారి ప్రదేశంలోనే ఉంది. ఎందుకంటే యూదా వారి భాగం వారికి ఎక్కువయింది కాబట్టి వారి స్వాస్థ్యంలోనే షిమ్యోను గోత్రం వారికి కూడా స్వాస్థ్యం వచ్చింది.
시므온 자손의 이 기업은 유다 자손의 기업 중에서 취하였으니 이는 유다 자손의 분깃이 자기들에게 너무 많으므로 시므온 자손이 자기의 기업을 그들의 기업 중에서 얻음이었더라
10 ౧౦ మూడవ చీటి వారి వంశం ప్రకారం జెబూలూను గోత్రం వారికి వచ్చింది. వారి స్వాస్థ్యం సరిహద్దు శారీదు వరకూ వెళ్ళింది.
세째로 스불론 자손을 위하여 그 가족대로 제비를 뽑았으니 그 기업의 경계는 사릿에 미치고
11 ౧౧ వారి సరిహద్దు పడమటి వైపు మళ్లీ వరకూ, దబ్బాషతు వరకూ సాగి యొక్నెయాముకు ఎదురుగా ఉన్న వాగు వరకూ వ్యాపించి
서편으로 올라가서 마랄라에 이르러 답베셋에 미치고 욕느암 앞 시내에 미치며
12 ౧౨ శారీదు నుండి తూర్పుగా కిస్లోత్తాబోరు సరిహద్దు వరకూ, దాబెరతు నుండి యాఫీయకు ఎక్కింది.
사릿에서부터 동편으로 돌아 해 뜨는 편을 향하고 기슬롯 다볼의 경계에 이르고 다브랏으로 나가서 야비아로 올라가고
13 ౧౩ అక్కడ నుండి తూర్పుగా గిత్తహెపెరుకు, ఇత్కాచీను వరకూ సాగి రిమ్మోను వరకూ వెళ్లి నేయా వైపు తిరిగింది.
또 거기서부터 동편으로 가드 헤벨을 지나 엣 가신에 이르고 네아까지 연한 림몬으로 나아가서
14 ౧౪ దాని సరిహద్దు హన్నాతోను వరకూ ఉత్తరం వైపు చుట్టుకుని అక్కడనుండి ఇప్తాయేలు లోయలో అంతమయింది.
북으로 돌아 한나돈에 이르고 입다엘 골짜기에 이르러 끝이 되며
15 ౧౫ వాటి పల్లెలు కాక కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లెహేము అనే పన్నెండు పట్టణాలు.
또 갓닷과, 나할랄과, 시므론과, 이달라와, 베들레헴이니 모두 십 이성읍이요 또 그 촌락이라
16 ౧౬ ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం జెబూలూను గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం.
스불론 자손이 그 가족대로 얻은 기업은 이 성읍들과 그 촌락이었더라
17 ౧౭ నాలుగవ చీటి వారి వంశం ప్రకారం ఇశ్శాఖారు గోత్రం వారికి వచ్చింది.
네째로 잇사갈 곧 잇사갈 자손을 위하여 그 가족대로 제비를 뽑았으니
18 ౧౮ వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను,
그 지경 안은 이스르엘과, 그술롯과, 수넴과,
19 ౧౯ అబెసు, రెమెతు, ఏన్గన్నీము,
하바라임과, 시온과, 아나하랏과,
20 ౨౦ ఏన్‌హద్దా, బేత్పస్సెసు, అనే ప్రదేశాల వరకూ
랍빗과, 기시온과, 에베스와,
21 ౨౧ వెళ్లి తాబోరు, షహచీమా, బేత్షెమెషు
레멧과, 언간님과, 엔핫다와, 벧 바세스며,
22 ౨౨ చేరి యొర్దాను దగ్గర అంతమయింది.
그 경계는 다볼과 사하수마와 벧 세메스에 미치고 그 끝은 요단이니 모두 십 육 성읍이요 또 그 촌락이라
23 ౨౩ వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణాలు వారికి వచ్చాయి. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారు గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.
잇사갈 자손 지파가 그 가족대로 얻은 기업은 이 성읍들과 그 촌락이었더라
24 ౨౪ అయిదవ చీటి వారి వంశం ప్రకారం ఆషేరు గోత్రం వారికి వచ్చింది.
다섯째로 아셀 자손의 지파를 위하여 그 가족대로 제비를 뽑았으니
25 ౨౫ వారి సరిహద్దు హెల్కతు, హలి, బెతెను, అక్షాపు,
그 지경 안은 헬갓과, 할리와, 베덴과, 악삽과,
26 ౨౬ అలమ్మేలెకు, అమాదు, మిషెయలు. పడమటగా అది కర్మెలు, షీహోర్లిబ్నాతు వరకూ వెళ్లి
알람멜렉과, 아맛과, 미살이며 그 경계의 서편은 갈멜에 미치며 시홀 림낫에 미치고
27 ౨౭ తూర్పు వైపు బేత్ దాగోను వరకూ తిరిగి జెబూలూను ప్రదేశాన్ని యిప్తాయేలు లోయ దాటి బేతేమెకుకు నెయీయేలుకు ఉత్తరంగా వెళ్తూ
꺾여 해 돋는 편을 향하여 벧 다곤에 이르며 스불론에 달하고 북편으로 입다 엘 골짜기에 미쳐서 벧에멕과 느이엘에 이르고 가불 좌편으로 나가서
28 ౨౮ ఎడమవైపు అది కాబూలు వరకూ హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకూ వెళ్ళింది.
에브론과, 르홉과, 함몬과, 가나를 지나 큰 시돈까지 이르고
29 ౨౯ అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, తూరు అనే ప్రాకార పట్టణం వరకూ వెళ్ళింది. అక్కడ నుండి హోసాకు మళ్ళి సముద్ర తీరాన ఉన్న అక్జీబు దగ్గర అంతమయింది.
돌아서 라마와 견고한 성읍 두로에 이르고 돌아서 호사에 이르고 악십 지방 곁 바다가 끝이 되며
30 ౩౦ ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరవై రెండు పట్టణాలు.
또 움마와, 아벡과, 르홉이니 모두 이십 이 성읍과 그 촌락이라
31 ౩౧ వాటి పల్లెలతో కూడ ఆ పట్టణాలు వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం.
아셀 자손의 지파가 그 가족대로 얻은 기업은 이 성읍들과 그 촌락이었더라
32 ౩౨ ఆరవ చీటి వారి వంశం ప్రకారం నఫ్తాలి గోత్రం వారికి వచ్చింది.
여섯째로 납달리 자손을 위하여 납달리 자손의 가족대로 제비를 뽑았으니
33 ౩౩ వారి సరిహద్దు హెలెపు, జయనన్నీము దగ్గర ఉన్న సింధూర వృక్షం నుండి అదామినికెబ్కు, యబ్నేలు వెళ్లి లక్కూము వరకూ సాగింది.
그 경계는 헬렙과 사아난님의 상수리나무에서부터 아다미 네겝과 얍느엘을 지나 락굼까지요 그 끝은 요단이며
34 ౩౪ అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరుకు వెళ్లి అక్కడనుండి హుక్కోకు వరకూ సాగింది. దక్షిణం వైపు జెబూలూను, పడమట ఆషేరు దాటి తూర్పున యొర్దాను నది దగ్గర యూదా సరిహద్దు తాకింది.
서편으로 돌아 아스놋 다볼에 이르고 그 곳에서부터 나가 훅곡에 이르러는 남은 스불론에 접하였고 서는 아셀에 접하였으며 해 돋는 편은 유다에 달한 요단이며
35 ౩౫ ప్రాకారాలున్న పట్టణాలు ఏవంటే జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు,
그 견고한 성읍들은 싯딤과, 세르와, 함맛과, 락갓과, 긴네렛과,
36 ౩౬ అదామా, రామా, హాసోరు,
아다마와, 라마와, 하솔과,
37 ౩౭ కెదెషు, ఎద్రెయీ, ఏన్‌హాసోరు,
게데스와, 에드레이와, 엔 하솔과,
38 ౩౮ ఇరోను, మిగ్దలేలు, హొరేము, బేత్నాతు, బేత్షెమెషు అనేవి. వాటి పల్లెలు గాక పంతొమ్మిది పట్టణాలు.
이론과, 믹다렐과, 호렘과, 벧 아낫과, 벧 세메스니 모두 십 구 성읍이요 또 그 촌락이라
39 ౩౯ ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.
납달리 자손의 지파가 그 가족대로 얻은 기업은 이 성읍들과 그 촌락이었더라
40 ౪౦ ఏడవ చీటి వారి వంశం ప్రకారం దాను గోత్రం వారికి వచ్చింది.
일곱째로 단 자손의 지파를 위하여 그 가족대로 제비를 뽑았으니
41 ౪౧ వారి స్వాస్థ్యం సరిహద్దు జొర్యా,
그 기업의 지경은 소라와, 에스다올과, 이르세메스와,
42 ౪౨ ఎష్తాయోలు, ఇర్షెమెషు, షెయల్బీను,
사알랍빈과, 아얄론과, 이들라와,
43 ౪౩ అయ్యాలోను, యెతా, ఏలోను,
엘론과, 딤나와, 에그론과,
44 ౪౪ తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను,
엘드게와, 깁브돈과, 바알랏과,
45 ౪౫ బాలాతా, యెహుదు, బెనేబెరకు,
여훗과, 브네브락과, 가드 림몬과,
46 ౪౬ గాత్ రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యాపో ముందున్న ప్రాంతం.
메얄곤과, 락곤과, 욥바 맞은편 경계까지라
47 ౪౭ దాను గోత్రం వారి భూభాగం ఈ సరిహద్దుల నుండి అవతలకు వ్యాపించింది. దాను గోత్రంవారు బయలుదేరి లెషెము మీద యుద్ధం చేసి దాన్ని జయించి కత్తితో దాని నివాసులను చంపి దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించి తమ పూర్వీకుడు దాను పేరుతో లెషెముకు దాను అనే పేరు పెట్టారు.
그런데 단 자손의 지경이 더욱 확장되었으니 이는 단 자손이 올라가서 레센을 쳐서 취하여 칼날로 치고 그것을 얻어 거기 거하였음이라 그 조상 단의 이름을 따라서 레센을 단이라 하였더라
48 ౪౮ వాటి పల్లెలుగాక ఈ పట్టణాలు వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.
단 자손의 지파가 그 가족대로 얻은 기업은 이 성읍들과 그 촌락이었더라
49 ౪౯ సరిహద్దుల ప్రకారం ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పంచి పెట్టడం ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడు యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చారు.
이스라엘 자손이 그 경계를 따라서 기업의 땅 나누기를 마치고 자기들 중에서 눈의 아들 여호수아에게 기업을 주었으되
50 ౫౦ యెహోవా ఆజ్ఞను అనుసరించి అతడు అడిగిన పట్టణాన్ని, అంటే ఎఫ్రాయిము కొండ ప్రదేశంలో ఉన్న తిమ్నత్సెరహును వారు అతనికి ఇచ్చారు. అతడు ఆ పట్టణాన్ని కట్టించి దానిలో నివసించాడు.
곧 여호와의 명령대로 여호수아의 구한 성읍 에브라임 산지 딤낫 세라를 주매 여호수아가 그 성읍을 중건하고 거기 거하였었더라
51 ౫౧ యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ ఇశ్రాయేలు గోత్రాల పూర్వీకుల కుటుంబాల్లో ముఖ్యులను షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారం దగ్గర యెహోవా సమక్షంలో చీట్ల వేసి పంపకం చేసిన స్వాస్థ్యాలివి. అప్పుడు వాళ్ళు దేశాన్ని పంచిపెట్టడం ముగించారు.
제사장 엘르아살과 눈의 아들 여호수아와 이스라엘 자손 지파의 족장들이 실로에서 회막문 여호와 앞에서 제비 뽑아 나눈 기업이 이러하니라 이에 땅 나누는 일이 마쳤더라

< యెహొషువ 19 >