< యెహొషువ 16 >
1 ౧ యోసేపు సంతతి వారికి వచ్చిన వంతు యెరికో దగ్గర యొర్దాను నుండి
A los synów Józefa przypadł od Jordanu przy Jerychu do wód Jerycha na wschodzie, do pustyni, która rozciąga się od Jerycha przez górę Betel;
2 ౨ తూర్పున ఉన్న యెరికో నీటి ఊటలు వరకూ, యెరికో నుండి బేతేలు కొండ సీమ వరకూ ఉంది.
Od Betel biegnie do Luz i dalej do granic Archy, do Atarot.
3 ౩ అది బేతేలు నుండి లూజు వరకూ పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకూ సాగి కింద బేత్‌హోరోను వరకూ గెజెరు వరకూ పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకూ వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం దగ్గర అంతం అయింది.
Potem ciągnie się ku zachodowi do granicy Jaflety, aż do granicy dolnego Bet-Choron i aż do Gezer, i kończy się przy morzu.
4 ౪ అక్కడ యోసేపు కుమారులు, మనష్షే ఎఫ్రాయిం సంతతి వారు స్వాస్థ్యాన్ని పొందారు.
Tak więc synowie Józefa, Manasses i Efraim, wzięli dziedzictwo.
5 ౫ ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అంటే వారి వంశాల ప్రకారం వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి ఎగువ బేత్ హోరోను వరకూ తూర్పుగా వ్యాపించింది.
A granica synów Efraima według ich rodzin – granica ich dziedzictwa na wschodzie – była [od] Atarot-Addar aż do górnego Bet-Choron.
6 ౬ వారి సరిహద్దు మిక్మెతాతు దగ్గర ఉన్న సముద్రం వరకూ పశ్చిమోత్తరంగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్ షిలోహు వరకూ తూర్పువైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకూ తూర్పున దాని దాటి
I ta granica biegła w kierunku morza do Mikmetat na północy, potem skręcała na wschód do Taanat-Szilo i przechodziła obok jej wschodniej strony aż do Janocha;
7 ౭ యానోహా నుండి అతారోతు వరకూ, నారా వరకూ యెరికోకు తగిలి యొర్దాను దగ్గర అంతమయింది.
I ciągnęła się od Janocha do Atarot i Naarat, i dochodziła do Jerycha, a kończyła się przy Jordanie.
8 ౮ తప్పూయ మొదలు ఆ సరిహద్దు కానా వాగు వరకూ పశ్చిమంగా వ్యాపించింది. అది వారి వంశాల ప్రకారం ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం.
Od Tappuach granica biegła na zachód do potoku Kana, a kończyła się przy morzu. Takie było dziedzictwo pokolenia synów Efraima według ich rodzin.
9 ౯ ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడ ఇవ్వబడిన పట్టణాలు పోతే ఆ పట్టణాలన్నీ వాటి పల్లెలు మనష్షీయుల స్వాస్థ్యంలో ఉన్నాయి.
Synowie Efraima [mieli] też wydzielone miasta pośrodku dziedzictwa synów Manassesa – wszystkie te miasta wraz z przyległymi do nich wioskami.
10 ౧౦ అయితే గెజెరులో నివసించిన కనానీయులను వారు వెళ్ళగొట్ట లేదు. ఇప్పటి వరకూ ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ వారికి దాస్యం చేస్తూ ఉన్నారు.
I nie wygnali Kananejczyków, mieszkających w Gezer. I mieszkają Kananejczycy pośród Efraimitów aż do dziś, i stali się sługami składającymi daninę.