< యెహొషువ 13 >
1 ౧ యెహోషువ వయసు మళ్ళిన వృద్ధుడు అయ్యాడు. యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు బాగా వృద్ధుడివయ్యావు. స్వాధీనం చేసుకోడానికి ఇంకా అతి విస్తారమైన దేశం మిగిలి ఉంది.
Ɛberɛ a Yosua bɔɔ akɔkoraa no, Awurade ka kyerɛɛ no sɛ, “Worebɔ akɔkoraa nso nsase pii wɔ hɔ a ɛsɛ sɛ woko di so.
2 ౨ ఆ ప్రాంతాలేవంటే, ఫిలిష్తీయుల ప్రదేశాలన్నీ గెషూరీయుల దేశమంతా ఐగుప్తుకు తూర్పున ఉన్న షీహోరు నుండి
“Ɛsɛ sɛ nnipa no tena Filistifoɔ ne Gesur,
3 ౩ కనానీయులవైన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకూ, ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారులకు సంబంధించిన గాజీయుల, అష్డోదీయుల, అష్కెలోనీయుల, గాతీయుల, ఎక్రోనీయుల దేశాలూ
“nsase a na ɛyɛ Kanaanfoɔ dea no so. Saa asase yi firi asuo Sihor a ɛda Misraim ɛhyeɛ so a ɛtene fa atifi fam kɔsi Ekron ɛhyeɛ so,
4 ౪ దక్షిణ దిక్కున ఆవీయుల దేశమూ కనానీయుల దేశమంతా సీదోనీయుల మేరా నుండి ఆఫెకు వరకూ ఉన్న అమోరీయుల సరిహద్దు వరకూ
a Filistifoɔ nkuropɔn enum a ɛyɛ Gasa, Asdod, Askelon, Gat ne Ekron nso ka ho. Awifoɔ asase a ɛda anafoɔ fam no nso, wɔnnko nnii so. Atifi fam nso, wɔnnko nnii saa nsase yi so; Kanaan asase nyinaa a Meara a ɛyɛ Sidonfoɔ dea no, de kɔsi Afek, kɔduru Amorifoɔ ɛhyeɛ so
5 ౫ గిబ్లీయుల దేశమూ హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు నుండి హమాతుకు పోయే మార్గం వరకూ లెబానోను ప్రదేశమంతా లెబానోను నుండి మిశ్రేపొత్మాయిము వరకూ దేశం ఇంకా మిగిలి ఉంది.
ne Gebalfoɔ asase ne Lebanon nyinaa wɔ apueeɛ fam, de firi Baal-Gad a ɛda Hermon bepɔ ase, de kɔsi Hamat fam.
6 ౬ సీదోను ప్రజలతో సహా పర్వత ప్రాంతం ప్రజలందరినీ నేను ఇశ్రాయేలీయుల ముందు నుండి వెళ్లగొడతాను. కాబట్టి నేను ఆజ్ఞాపించిన విధంగా నీవు ఇశ్రాయేలీయులకు దాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాలి.
“Mmepɔ asase a ɛfiri Lebanon kɔsi Misrefot-Maim nyinaa a Sidonfoɔ nsase nyinaa ka ho. Mɛtu saa nnipa no nyinaa afiri asase no so na mede ama Israelfoɔ. Enti hwɛ na fa saa asase no ma Israelfoɔ sɛ agyapadeɛ sononko sɛdeɛ mahyɛ wo no.
7 ౭ తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్థ గోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు.”
Fa saa asase yi nyinaa sɛ Israelfoɔ agyapadeɛ wɔ ɛberɛ a worekyekyɛ mu ama mmusuakuo nkron no ne Manase abusua fa no.”
8 ౮ యెహోవా సేవకుడు మోషే వారికిచ్చిన విధంగా రూబేనీయులూ గాదీయులూ తూర్పుదిక్కున, అంటే యొర్దాను అవతల స్వాస్థ్యం పొందారు.
Manase abusua no mu fa ne Rubenfoɔ ne Gadfoɔ deɛ, na wɔanya wɔn agyapadeɛ wɔ Yordan apueeɛ fam, ɛfiri sɛ na Mose a ɔyɛ Awurade ɔsomfoɔ no de saa asase no ama wɔn dada.
9 ౯ అదేమంటే, అర్నోను ఏటిలోయ దగ్గర ఉన్న అరోయేరు మొదలు ఆ లోయమధ్య ఉన్న పట్టణం నుండి దీబోను వరకూ మేదెబా మైదానమంతా, అమ్మోనీయుల సరిహద్దు వరకూ
Wɔn asase no firi Aroer a ɛda Arnon Subɔnhwa no ano (ne kuro a ɛda nsuka no mfimfini) de kɔ ɛserɛ a ɛtoa Medeba so kɔsi Dibon.
10 ౧౦ హెష్బోనులో పాలిస్తున్న అమోరీయుల రాజైన సీహోనుకు చెందిన సమస్త పట్టణాలు,
Amorifoɔhene Sihon a ɔdii adeɛ wɔ Hesbon kɔsi Amonfoɔ ɛhyeɛ so nkuro nyinaa nso ka ho.
11 ౧౧ గిలాదూ గెషూరీయుల, మాయకాతీయుల దేశమూ హెర్మోను మన్యమంతా సల్కావరకూ బాషాను దేశమంతా
Gilead, asase a ɛwɔ Gesur ne Maaka ahemman mu, Bepɔ Hermon nyinaa, Basan nyinaa de kɔsi Saleka ka ho,
12 ౧౨ రెఫాయీయుల్లో మిగిలి ఉన్నవారిలో అష్తారోతులో ఎద్రెయీలో పరిపాలిస్తున్న ఓగు రాజ్యమంతా మిగిలి ఉంది. మోషే ఆ రాజులను జయించి వారి దేశాన్ని పట్టుకున్నాడు.
ɛnna Basanhene Og a ɔdii ɔhene wɔ Astarot ne Edrei nsase nyinaa nso ka ho. Ɔhene Og yɛ Rafatni a ɔtwa toɔ, ɛfiri sɛ na Mose ne wɔn ako apamo wɔn.
13 ౧౩ కానీ ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశాన్ని గానీ మాయకాతీయుల దేశాన్ని గానీ పట్టుకోలేదు కాబట్టి గెషూరీయులు మాయకాతీయులు ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయుల మధ్యలో నివసిస్తున్నారు.
Nanso, Israelfoɔ no antu Gesurfoɔ ne Maakafoɔ enti wɔtenaa Israelfoɔ no mu de bɛsi ɛnnɛ.
14 ౧౪ లేవి గోత్రానికే అతడు స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మోషేతో చెప్పినట్టు “ప్రజలు ఆయనకు అర్పించే దహన బలులే” వారికి స్వాస్థ్యం.
Na Lewi abusuakuo no deɛ, wamma wɔn agyapadeɛ biara. Wɔn agyapadeɛ firi afɔrebɔdeɛ a wɔhye wɔ afɔrebukyia so ma Awurade, Israel Onyankopɔn no.
15 ౧౫ వారి వంశాలను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చాడు.
Mose de saa beaeɛ yi maa mmusua a ɛwɔ Ruben abusuakuo mu.
16 ౧౬ వారి సరిహద్దు ఏదంటే, అర్నోను నది లోయ పక్కన ఉన్న అరోయేరు మొదలు ఆ లోయలోని పట్టణం నుండి మేదెబా దగ్గర మైదానమంతా.
Wɔn asase no firi Aroer a ɛda Arnon Subɔnhwa no ano (ne kuro a ɛda nsuka no mfimfini) de kɔ ɛserɛ a ɛtoa Medeba so.
17 ౧౭ ఇది గాక రూబేను గోత్రికులు హెష్బోను, దాని మైదానంలోని పట్టణాలన్నీ, దీబోను, బామోత్బయలు, బేత్బయల్మెయోను,
Nkuro ne nkuraase a ɛkeka hoɔ nie: Hesbon ne nkuro a ɛdeda ɛserɛ so te sɛ Dibon, Bamot-Baal ne Bet-Baal-Meon,
18 ౧౮ యాహసు, కెదేమోతు, మేఫాతు,
Yahas, Kedemot, Mefaat,
19 ౧౯ కిర్యతాయిము, సిబ్మాలోయ లోని కొండ మీది శెరెత్షహరు ప్రాంతాలు దక్కించుకున్నారు.
Kiriataim, Sibma ne Seret-Sahar, a ɛdeda bɔnhwa no kokoɔ so,
20 ౨౦ అంతేకాక, బేత్పయోరు, పిస్గా కొండచరియలు, బెత్యేషీమోతు,
Bet-Peor, Pisga nsianeɛ mu ne Bet-Yesimot.
21 ౨౧ మైదానంలోని పట్టణాలు అన్నీ, ఇంకా ఎవీరేకెము, సూరు, హోరు, రేబ, అనే మిద్యాను రాజుల దేశాన్నీ అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతటినీ వారికి మోషే స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇవి హెష్బోనులో పరిపాలించే సీహోను అధికారం కింద ఉన్న ప్రాంతాలు. ఇతన్నిమోషే ఓడించాడు.
Nkuro a ɛwɔ tata so nyinaa ne Sihon ahemman nyinaa nso ka Ruben asase no ho. Sihon yɛ Amorifoɔhene a na ɔdi adeɛ wɔ Hesbon, deɛ Mose kumm no ne Midian ahemfo a wɔn ne Ewi, Rekem, Sur, Hur, Reba ne ahenemma a wɔwɔ mpɔtam hɔ a wɔne Sihon yɛ baako.
22 ౨౨ ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడు, సోదెగాడు అయిన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపారు.
Israelfoɔ no kumm Beor babarima nkonyaayifoɔ bi a na wɔfrɛ no Balaam.
23 ౨౩ యొర్దాను ప్రదేశమంతా రూబేనీయులకు సరిహద్దు. అదీ, దానిలోని పట్టణాలూ, గ్రామాలూ రూబేనీయుల వంశాల ప్రకారం వారికి కలిగిన స్వాస్థ్యం.
Yordan Asubɔnten no yɛ Ruben asase no ɛhyeɛ wɔ atɔeɛ fam. Wɔde nkuro ne nkuraase a ɛwɔ saa beaeɛ yi maa mmusua a ɛwɔ Ruben abusuakuo no mu sɛ wɔn agyapadeɛ.
24 ౨౪ మోషే గాదు గోత్రానికి, అంటే గాదీయులకు వారి వంశాల ప్రకారం స్వాస్థ్యమిచ్చాడు.
Mose de saa asase yi maa mmusua a ɛwɔ Gad abusuakuo mu:
25 ౨౫ వారి సరిహద్దు యాజెరు, గిలాదు పట్టణాలన్నీ, రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేరు వరకూ అమ్మోనీయుల దేశంలో సగభాగం.
Wɔn asase no yɛ Yaser, Gilead nkuro nyinaa, ne Amon asase no fa, kɔsi Aroer kuro a ɛwɔ Raba atɔeɛ fam pɛɛ.
26 ౨౬ హెష్బోను మొదలు రామత్మిజ్బెతు బెతోనిము వరకూ, మహనయీము మొదలు దెబీరు సరిహద్దు వరకూ.
Na ɛfiri Hesbon de kɔsi Ramat-Mispe ne Betonim de firi Mahanaim de kɔsi Debir.
27 ౨౭ లోయలో బేతారాము బేత్నిమ్రా, సుక్కోతు, సాపోను, అంటే హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషం, తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నెరెతు సముద్రతీరం వరకూ ఉన్న యొర్దాను ప్రదేశం.
Bɔnhwa no mu na na Bet-Haram ne Bet-Nimra ne Sukot ne Safon ne Hesbonhene Sihon ahemman no nkaeɛ wɔ; Asubɔnten Yordan na na ɛyɛ atɔeɛ fam hɔ ɛhyeɛ na ɛtoa so de kɔsi Galilea ɛpo no mu.
28 ౨౮ ఇవీ, వారి వంశాల ప్రకారం గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణాలు, గ్రామాలు.
Nkuro ne nkuraaseɛ a ɛwɔ saa beaeɛ yi na wɔde maa mmusua a ɛwɔ Gad abusuakuo mu sɛ wɔn agyapadeɛ.
29 ౨౯ మోషే మనష్షే అర్థగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. అది వారి వంశాల ప్రకారం మనష్షీయుల అర్థగోత్రానికి స్వాస్థ్యం.
Mose de saa beaeɛ yi maa mmusua a ɛwɔ Manase abusuakuo fa no mu.
30 ౩౦ వారి సరిహద్దు మహనయీము మొదలు బాషాను అంతా, బాషాను రాజైన ఓగు రాజ్యమంతా, బాషానులోని యాయీరు పురాలు అయిన అరవై పట్టణాలు,
Na wɔn asase no firi Mahanaim, Basan nyinaa, ɔhene Og kane tete ahemman nyinaa ne nkuro aduosia a ɛwɔ Yair a ɛwɔ Basan no.
31 ౩౧ గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయి అనే బాషానులోని ఓగు రాజ్య పట్టణాలు. ఇవన్నీ మనష్షే కుమారుడు మాకీరు, అనగా మాకీరీయుల్లో సగం మందికి వారి వంశాల ప్రకారం కలిగాయి.
Gilead fa ne ɔhene Og ahenkuro, Astarot ne Edrei ka ho. Wɔde yeinom nyinaa maa Makir a na ɔyɛ Manase babarima no asefoɔ.
32 ౩౨ ఇవీ, యెరికో దగ్గర తూర్పు దిక్కున యొర్దాను అవతల ఉన్న మోయాబు మైదానంలో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యాలు.
Yeinom yɛ nkyekyɛmu a Mose yɛɛ ɛberɛ a na ɔwɔ Moab tata so, wɔ Asubɔnten Yordan akyi, Yeriko apueeɛ fam.
33 ౩౩ లేవీ గోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్ట లేదు, ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టుగా ఆయనే వారికి స్వాస్థ్యం.
Nanso, Mose amma Lewi abusuakuo no asase biara, ɛfiri sɛ, na Awurade, Israel Onyankopɔn ahyɛ bɔ sɛ ɔno na ɔbɛyɛ wɔn agyapadeɛ.