< యెహొషువ 12 >
1 ౧ ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ తూర్పు మైదానమంతటిలో ఉన్న వారిని ఓడించి వారి దేశాలను ఆక్రమించుకొన్న రాజులు ఎవరంటే,
Estes são os reis da terra que os filhos de Israel feriram, e cuja terra possuíram da outra parte do Jordão ao oriente, desde o ribeiro de Arnom até o monte Hermom, e toda a planície oriental:
2 ౨ అమోరీయుల రాజు సీహోను. అతడు హెష్బోనులో నివసిస్తూ అర్నోను నదీ తీరంలోని అరోయేరు నుండి, అంటే ఆ నదీ లోయ మధ్య నుండి గిలాదు అర్థభాగమూ అమ్మోనీయులకు సరిహద్దుగా ఉన్న యబ్బోకు నది లోయ వరకూ
Seom rei dos amorreus, que habitava em Hesbom, e senhoreava desde Aroer, que está à beira do ribeiro de Arnom, e desde em meio do ribeiro, e a metade de Gileade, até o ribeiro Jaboque, o termo dos filhos de Amom;
3 ౩ తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రం వరకూ తూర్పు దిక్కున బెత్యేషీమోతు మార్గంలో ఉప్పు సముద్రంగా నున్న అరాబా సముద్రం వరకూ దక్షిణం వైపున పిస్గాకొండ చరియల కింద ఉన్న మైదానం వరకూ పరిపాలించాడు.
E desde a campina até o mar de Quinerete, ao oriente; e até o mar da planície, o mar Salgado, ao oriente, pelo caminho de Bete-Jesimote; e desde o sul debaixo das encostas do Pisga.
4 ౪ ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగును పట్టుకున్నారు. అతడు రెఫాయీయుల్లో మిగిలిన వారిలో ఒకడు. అతడు అష్తారోతులో ఎద్రెయిలో నివసించి గెషూరీయుల, మాయకాతీయుల సరిహద్దు వరకూ బాషాను అంతటా సల్కా,
E os termos de Ogue rei de Basã, que havia restado dos refains, o qual habitava em Astarote e em Edrei,
5 ౫ హెర్మోను, హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకూ గిలాదు అర్థభాగంలో పాలించినవాడు.
E senhoreava no monte de Hermom, e em Salcá, e em todo Basã até os termos de Gessuri e dos maacatitas, e a metade de Gileade, termo de Seom rei de Hesbom.
6 ౬ యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలీయులూ వారిని ఓడించారు. యెహోవా సేవకుడు మోషే, ఆ భూమిని రూబేనీయులకూ గాదీయులకూ మనష్షే అర్థగోత్రపు వారికీ స్వాస్థ్యంగా ఇచ్చాడు.
A estes feriram Moisés servo do SENHOR e os filhos de Israel; e Moisés servo do SENHOR deu aquela terra em possessão aos rubenitas, gaditas, e à meia tribo de Manassés.
7 ౭ యొర్దానుకు అవతల, అంటే పడమరగా లెబానోను లోయలో ఉన్న బయల్గాదు నుండి శేయీరు వరకూ వ్యాపించిన హాలాకు కొండవరకూ ఉన్న దేశాల రాజులను యెహోషువ, ఇశ్రాయేలీయులు జయించారు. యెహోషువ దాన్ని ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం స్వాస్థ్యంగా ఇచ్చాడు.
E estes são os reis da terra que feriu Josué com os filhos de Israel, desta parte do Jordão ao ocidente, desde Baal-Gade na planície do Líbano até o monte de Halaque que sobe a Seir; a qual terra deu Josué em possessão às tribos de Israel,
8 ౮ కొండ ప్రాంతాల్లో, లోయలో షెఫేలా ప్రదేశంలో చరియల ప్రదేశాల్లో అరణ్యంలో దక్షిణ దేశంలో ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ అనేవారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకున్నారు.
Em montes e em vales, em planícies e em encostas, ao deserto e ao sul; os heteus, e os amorreus, e os cananeus, e os ferezeus, e os heveus, e os jebuseus.
9 ౯ వారెవరంటే, యెరికో రాజు, బేతేలు పక్కన ఉన్న హాయి రాజు, యెరూషలేము రాజు,
O rei de Jericó, um: o rei de Ai, que está ao lado de Betel, outro:
10 ౧౦ హెబ్రోను రాజు, యర్మూతు రాజు,
O rei de Jerusalém, outro: o rei de Hebrom, outro:
11 ౧౧ లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
O rei de Jarmute, outro: o rei de Laquis, outro:
12 ౧౨ గెజెరు రాజు, దెబీరు రాజు,
O rei de Eglom, outro: o rei de Gezer, outro:
13 ౧౩ గెదెరు రాజు, హోర్మా రాజు,
O rei de Debir, outro: o rei de Geder, outro:
14 ౧౪ అరాదు రాజు, లిబ్నా రాజు,
O rei de Hormá, outro: o rei de Arade, outro:
15 ౧౫ అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
O rei de Libna, outro: o rei de Adulão, outro:
16 ౧౬ బేతేలు రాజు, తప్పూయ రాజు,
O rei de Maquedá, outro: o rei de Betel, outro:
17 ౧౭ హెపెరు రాజు, ఆఫెకు రాజు,
O rei de Tapua, outro: o rei de Héfer, outro:
18 ౧౮ లష్షారోను రాజు, మాదోను రాజు,
O rei de Afeque, outro: o rei de Lasarom, outro:
19 ౧౯ హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,
O rei de Madom, outro: o rei de Hazor, outro:
20 ౨౦ అక్షాపు రాజు, తానాకు రాజు,
O rei de Sinrom-Merom, outro: o rei de Acsafe, outro:
21 ౨౧ మెగిద్దో రాజు, కెదెషు రాజు.
O rei de Taanaque, outro: o rei de Megido, outro:
22 ౨౨ కర్మెలులో యొక్నెయాము రాజు, దోరు మెరక ప్రాంతాల్లో ఉన్న దోరు రాజు,
O rei de Quedes, outro: o rei de Jocneão do Carmelo, outro:
23 ౨౩ గిల్గాలులో గోయీయుల రాజు, తిర్సా రాజు.
O rei de Dor, da província de Dor, outro; o rei de nações em Gilgal, outro:
24 ౨౪ వారంతా కలిసి ముప్ఫై ఒక్క మంది రాజులు.
O rei de Tirsa, outro: trinta e um reis ao todo.