< యెహొషువ 10 >

1 యెహోషువ యెరికోనూ, దాని రాజునూ నిర్మూలం చేసినట్టు హాయినీ దాని రాజునూ నిర్మూలం చేసిన సంగతీ గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలిసిపోయిన సంగతీ యెరూషలేం రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు అతడూ అతని ప్రజలూ చాలా భయపడ్డారు.
А кад чу Адониседек цар јерусалимски да је Исус узео Гај и раскопао га као што је учинио с Јерихоном и његовим царем, тако да је учинио и с Гајем и његовим царем, и да су Гаваоњани учинили мир с Израиљем и стоје усред њих,
2 ఎందుకంటే గిబియోనును నాటి రాజధానుల్లో ప్రధాన పట్టణంగా ఎంచేవారు. అది హాయి కంటే పెద్దది, అక్కడి ప్రజలందరూ శూరులు. కాబట్టి యెరూషలేము రాజైన అదోనీసెదెకు “గిబియోనీయులు యెహోషువతో ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు. మీరు నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేస్తే మనం వారి పట్టణాన్ని నాశనం చేద్దాం” అని
Уплаши се врло; јер Гаваон беше велик град као какав царски град, и беше већи од Гаја, и сви људи у њему беху храбри.
3 హెబ్రోను రాజు హోహాముకూ యర్మూతు రాజు పిరాముకూ
Зато посла Адониседек цар јерусалимски к Оаму цару хевронском и к Пираму цару јармутском и к Јафији цару лахиском и к Давиру цару јеглонском, и поручи:
4 లాకీషురాజు యాఫీయకూ ఎగ్లోను రాజు దెబీరుకూ వార్త పంపాడు.
Ходите к мени, и помозите ми да ударимо на Гаваон, јер учини мир с Исусом и са синовима Израиљевим.
5 కాబట్టి అమోరీయుల ఐదుగురు రాజులూ కలిసి, తమ సేనలతో బయలుదేరి, గిబియోను ముందు దిగి, గిబియోనీయులతో యుద్ధం చేశారు.
И скупи се и пође пет царева аморејских, цар јерусалимски, цар хевронски, цар јармутски, цар лахиски, цар јеглонски, они и сва војска њихова, и ставши у логор под Гаваоном почеше га бити.
6 అప్పుడు “గిబియోనీయుల కొండ ప్రాంతాల్లో నివసించే అమోరీయుల రాజులందరూ ఏకమై మాపైకి దండెత్తి వచ్చారు, కాబట్టి నీ దాసుల చెయ్యి విడిచిపెట్టక త్వరగా వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించు” అని గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువకు వార్త పంపారు.
Тада Гаваоњани послаше к Исусу у логор у Галгал и рекоше: Немој дигнути руку својих са слуга својих; ходи брзо к нама, избави нас и помози нам, јер се скупише на нас сви цареви аморејски који живе у горама.
7 వెంటనే యెహోషువ, అతని దగ్గరున్న యోధులూ, పరాక్రమవంతులైన శూరులూ అందరూ గిల్గాలు నుండి బయలుదేరారు.
И изађе Исус из Галгала, он и с њим сав народ што беше за бој, сви јунаци.
8 అప్పుడు యెహోవా “వారికి భయపడవద్దు, వారిని నీ చేతికి అప్పగించాను, వారిలో ఎవరూ నీ ముందు నిలబడలేరు” అని యెహోషువతో చెప్పగానే,
И Господ рече Исусу: Не бој их се; јер их дадох теби у руке, ниједан их се неће одржати пред тобом.
9 యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతా నడచి వారి మీద హఠాత్తుగా దాడి చేశాడు.
И Исус удари на њих изненада, ишавши целу ноћ од Галгала,
10 ౧౦ అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజల ముందు వారిని గందరగోళానికి గురి చెయ్యగానే యెహోషువ గిబియోను ముందే మహా ఘోరంగా వారిని హతం చేశాడు. బేత్‌హోరోనుకు పైకి వెళ్ళే మార్గంలో అజేకా వరకూ, మక్కేదా వరకూ, యోధులు వారిని తరిమి హతం చేస్తూనే ఉన్నారు.
И смете их Господ пред Израиљем, који их љуто поби код Гаваона, па их потера путем како се иде у Вет-Орон, и секоше их до Азике и до Макиде.
11 ౧౧ వారు ఇశ్రాయేలీయుల నుండి బేత్‌హోరోనుకు దిగిపోయే తోవలో పారిపోతుండగా, వారు అజేకాకు వచ్చే వరకూ యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగళ్ళను వారి మీద కురిపించాడు. కాబట్టి వారు దాని వల్ల చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తితో చంపిన వారికంటే ఆ వడగండ్ల వలన చచ్చినవారు ఎక్కువమంది అయ్యారు.
А кад бежаху испред Израиља и беху низ врлет вет-оронску, баци Господ на њих камење велико из неба дори до Азике, те гињаху: и више их изгибе од камења градног него што их побише синови Израиљеви мачем.
12 ౧౨ యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు, “సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో.”
Тада проговори Исус Господу онај дан кад Господ предаде Аморејца синовима Израиљевим, и рече пред синовима Израиљевим: Стани сунце над Гаваоном, и месече над долином елонском.
13 ౧౩ “ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనే వరకూ సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు” అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి ఇంచుమించు ఒక రోజంతా అస్తమించ లేదు.
И стаде сунце и устави се месец, докле се не освети народ непријатељима својим. Не пише ли то у књизи Истинитог? И стаде сунце насред неба и не наже к западу скоро за цео дан.
14 ౧౪ యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు, దాని ముందు గానీ దాని తరువాత గానీ లేదు, ఆ రోజు యెహోవా, ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు.
И не би таквог дана ни пре ни после, да Господ послуша глас човечји, јер Господ војева за Израиља.
15 ౧౫ అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.
И врати се Исус и сав Израиљ с њим у логор у Галгал.
16 ౧౬ ఆ రాజులు ఐదు గురూ పారిపోయి మక్కేదాలో ఉన్న గుహలో దాక్కున్నారు.
А оних пет царева утекоше и сакрише се у пећину код Макиде.
17 ౧౭ మక్కేదా గుహలో దాక్కున్న ఐదుగురు ఆ రాజులు దొరికారని యెహోషువకు తెలిసినప్పుడు,
И дође глас Исусу: Нађе се пет царева сакривених у пећини код Макиде.
18 ౧౮ యెహోషువ “ఆ గుహ ద్వారానికి అడ్డంగా పెద్ద రాళ్ళు దొర్లించి వారిని కాపలా కాయడానికి మనుషులను ఉంచండి.
А Исус рече: Привалите велико камење на врата пећине, и наместите људе код ње да их чувају.
19 ౧౯ మీరు అక్కడే ఆగిపోకండి. మీ దేవుడు యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించాడు కాబట్టి వారిని తమ పట్టణాల్లోకి తిరిగి వెళ్లనీయకుండా వారిని తరిమి, వెనుక ఉన్న వారిని కూల్చండి” అని చెప్పాడు.
А ви не стојте, него гоните непријатеље своје и бијте остатак њихов, не дајте им да уђу у градове своје, јер вам их даде у руке Господ Бог ваш.
20 ౨౦ వారు పూర్తిగా నశించే వరకూ యెహోషువ, ఇశ్రాయేలీయులు గొప్ప జనసంహారం చేసి వారిని వధించిన తరువాత వారిలో తప్పించుకొన్న కొద్దిమంది, ప్రాకారాలు ఉన్న పట్టణాల్లోకి చొరబడిపోయారు.
А кад Исус и синови Израиљеви престаше бити их у боју врло великом, разбивши их сасвим, а који их осташе живи, утекоше у тврде градове,
21 ౨౧ ప్రజలందరూ మక్కేదాలో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడటానికి ఎవరికీ గుండెల్లేక పోయాయి.
Врати се сав народ здраво у логор к Исусу у Макиду, и нико не маче језиком својим на синове Израиљеве, ни на једног.
22 ౨౨ యెహోషువ “ఆ గుహకు అడ్దం తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నాదగ్గరికి తీసుకు రండి” అని చెప్పగానే,
Тада рече Исус: Отворите врата од оне пећине, и изведите к мени оних пет царева из пећине.
23 ౨౩ వారు అలా చేసి, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు-ఈ ఐదుగురినీ ఆ గుహలో నుండి అతని దగ్గరికి తీసుకువచ్చారు.
И учинише тако, и изведоше к мени оних пет царева из пећине: цара јерусалимског, цара хевронског, цара јармутског, цара лахиског, цара јеглонског.
24 ౨౪ వారు ఆ రాజులను యెహోషువ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, తనతో యుద్ధానికి వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో “మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడలపై మీ పాదాలను ఉంచండి” అని చెప్పగా, వారు దగ్గరికి వచ్చి వారి మెడలపై తమ పాదాలను ఉంచారు.
А кад изведоше те цареве к Исусу, сазва Исус све људе Израиљце, и рече војводама од војске који беху ишли с њим: Приступите и станите ногама својим на вратове овим царевима. И они приступише и стадоше им на вратове ногама својим.
25 ౨౫ అప్పుడు యెహోషువ వారితో “మీరు భయపడవద్దు, జడియవద్దు, ధీరత్వంతో ధైర్యంగా ఉండండి, మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు” అన్నాడు.
А Исус им рече: Не бојте се и не плашите се; будите слободни и храбри, јер ће тако учинити Господ свим непријатељима вашим на које завојштите.
26 ౨౬ తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరితీశాడు, వారి శవాలు సాయంకాలం వరకూ ఆ చెట్ల మీద వేలాడుతూనే ఉన్నాయి.
Потом их поби Исус и погуби их, и обеси их на пет дрвета, и осташе висећи на дрветима до вечера.
27 ౨౭ పొద్దుగుంకే సమయంలో యెహోషువ అనుమతి ఇయ్యగా ప్రజలు చెట్ల మీద నుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడేసి ఆ గుహ ద్వారం దగ్గర పెద్ద రాళ్లను వేశారు. ఆ రాళ్లు ఈ రోజు వరకూ ఉన్నాయి.
А о заходу сунчаном заповеди Исус те их скидоше с дрвета и бацише их у пећину, у коју се беху сакрили, и метнуше велико камење на врата пећине, које оста онде до данас.
28 ౨౮ ఆ రోజు యెహోషువ మక్కేదాను వశం చేసుకుని దాని రాజుతో సహా అందులోని వారందరినీ కత్తితో చంపేశాడు. అతడు దానిలో ఎవరినీ ప్రాణాలతో వదలకుండా నిర్మూలం చేసాడు. యెరికో రాజుకు చేసినట్టు మక్కేదా రాజుకూ చేశాడు.
Истог дана узе Исус и Макиду, и све у њој исече оштрим мачем, и цара њеног и њих поби, све душе које беху у њој, не остави ниједног живог; и учини с царем макидским као што учини с царем јерихонским.
29 ౨౯ యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నావారితో యుద్ధం చేశారు.
Потом оде Исус и сав Израиљ с њим из Макиде у Ливну, и стаде бити Ливну.
30 ౩౦ యెహోవా దానినీ, దాని రాజునూ, ఇశ్రాయేలీయులకు అప్పగించగా వారు ఎవ్వరూ మిగలకుండా దాన్నీ, దానిలో ప్రాణాలతో ఉన్నవారందరినీ కత్తితో చంపేశారు. అతడు యెరికో రాజుకు చేసినట్టు దాని రాజుకూ చేశారు.
Па и њу предаде Господ у руке Израиљу и цара њеног; и исече све оштрим мачем, све душе које беху у њој, не остави у њој ниједног живог; и учини с царем њеним као што учини с царем јерихонским.
31 ౩౧ తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులందరితో లిబ్నా నుండి లాకీషుకు వచ్చి అక్కడ దిగి లాకీషు వారితో యుద్దం చేయగా
Потом оде Исус и сав Израиљ с њим из Ливне на Лахис, и стаде у логор пред њим, и стаде га бити.
32 ౩౨ యెహోవా లాకీషుని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు. వారు రెండవ రోజు దాన్ని ఆక్రమించుకుని తాము లిబ్నాకు చేసినట్టే దాన్నీ, దానిలో ఉన్న వారందరినీ కత్తితో చంపేశారు.
И Господ предаде Лахис у руке Израиљу, и он га узе сутрадан, и исече све оштрим мачем, све душе што беху у њему, исто онако како учини с Ливном.
33 ౩౩ లాకీషుకు సహాయం చేయడానికి గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ అతన్నీ అతని ప్రజలనూ హతం చేశాడు.
Тада дође Орам цар гезерски у помоћ Лахису; али поби Исус њега и народ његов да не оста ниједан жив.
34 ౩౪ తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ముందు దిగి దాని నివాసులతో యుద్ధం చేసి
Потом пође Исус и сав Израиљ с њим из Лахиса на Јеглон, и ставши у логор према њему ударише на њ;
35 ౩౫ ఆ రోజు దాన్ని ఆక్రమించుకుని, కత్తితో వారిని హతం చేశారు. అతడు లాకీషుకు చేసినట్టే వారు దానిలో ఉన్నవారందరినీ ఆ రోజు నిర్మూలం చేశారు.
И узеше га исти дан, и исекоше све оштрим мачем; све душе што беху у њему поби тај дан исто онако како учини с Лахисом.
36 ౩౬ అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని ప్రజలతో యుద్ధం చేసి
Потом се подиже Исус и сав Израиљ с њим из Јеглона на Хеврон, и стадоше га бити;
37 ౩౭ దాన్ని స్వాధీనం చేసుకుని దాన్నీ దాని రాజునూ దాని పట్టణాలన్నిటినీ దానిలో ఉన్న వారందరినీ కత్తితో హతం చేశారు. అతడు ఎగ్లోనుకు చేసినట్టే దాన్నీ దానిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేశారు.
И узеше га и исекоше оштрим мачем, и цара његовог и све градове његове, све душе што беху у њима; не остави ниједног живог исто онако како учини с Јеглоном; затре га са свим душама што беху у њему.
38 ౩౮ అక్కడి నుండి యెహోషువ, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరు దెబీరు వైపు తిరిగి దానితో యుద్ధం చేసి
Потом се обрати Исус и сав Израиљ с њим на Давир, и стаде га бити;
39 ౩౯ దానినీ దాని రాజునూ దాని సమస్త పట్టణాలనూ పట్టుకుని కత్తి చేత హతం చేసి దానిలో ఉన్న వారినందరినీ నిర్మూలం చేశారు. అతడు హెబ్రోనుకూ లిబ్నాకూ దాని రాజుకూ చేసినట్లు, దెబీరుకూ దాని రాజుకూ చేశాడు.
И узе га и цара његовог и све градове његове, и исекоше их оштрим мачем и згубише све душе што беху у њима; не остави ниједног живог; као што учини с Хевроном, тако учини с Давиром и царем његовим, и као што учини с Ливном и царем њеним.
40 ౪౦ తరువాత యెహోషువ పర్వత ప్రాంతాలనూ, దక్షిణ ప్రదేశాన్నీ షెఫేలా ప్రదేశాన్నీ చరియల ప్రదేశాన్నీ వాటి రాజులందరినీ జయించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన విధంగా అతడు ఏదీ మిగలకుండా ఊపిరిగల సమస్తాన్నీ నిర్మూలం చేశాడు.
Тако поби Исус сву земљу, горе и јужну страну и равнице и долине, и све цареве њихове; не остави ниједног живог, него све душе живе згуби, као што беше заповедио Господ Бог Израиљев.
41 ౪౧ కాదేషు బర్నేయ మొదలు గాజా వరకూ గిబియోను వరకూ గోషేను దేశమంతటినీ యెహోషువ జయించాడు.
И поби их Исус од Кадис-Варније до Газе, и сву земљу госенску до Гаваона.
42 ౪౨ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ సమస్త రాజులనూ వారి దేశాలనూ యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకున్నాడు.
А све те цареве и земљу њихову узе Исус уједанпут; јер Господ Бог Израиљев војеваше за Израиља.
43 ౪౩ తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.
Потом се врати Исус и сав Израиљ с њим у логор у Галгал.

< యెహొషువ 10 >