< యెహొషువ 10 >
1 ౧ యెహోషువ యెరికోనూ, దాని రాజునూ నిర్మూలం చేసినట్టు హాయినీ దాని రాజునూ నిర్మూలం చేసిన సంగతీ గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలిసిపోయిన సంగతీ యెరూషలేం రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు అతడూ అతని ప్రజలూ చాలా భయపడ్డారు.
Et lorsque Adonibézec, roi de Jérusalem, ouït dire que Josué, après avoir pris Haï, l'avait détruite, qu'il avait traité cette ville et son roi de la même manière que Jéricho et le roi de Jéricho, et que les Gabaonites s'étaient livrés à Josué et à Israël,
2 ౨ ఎందుకంటే గిబియోనును నాటి రాజధానుల్లో ప్రధాన పట్టణంగా ఎంచేవారు. అది హాయి కంటే పెద్దది, అక్కడి ప్రజలందరూ శూరులు. కాబట్టి యెరూషలేము రాజైన అదోనీసెదెకు “గిబియోనీయులు యెహోషువతో ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు. మీరు నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేస్తే మనం వారి పట్టణాన్ని నాశనం చేద్దాం” అని
Lui et les siens eurent aussi d'eux une grande crainte; car ils n'ignoraient pas que la ville de Gabaon était grande comme l'une des métropoles, et que tous ses gens de guerre étaient vaillants.
3 ౩ హెబ్రోను రాజు హోహాముకూ యర్మూతు రాజు పిరాముకూ
Adonibézec, roi de Jérusalem, envoya donc vers Elam, roi d'Hébron, vers Phidon, roi de Jérimuth, vers Jéphré, roi de Lachis, vers Dabin, roi d'Odollam, disant:
4 ౪ లాకీషురాజు యాఫీయకూ ఎగ్లోను రాజు దెబీరుకూ వార్త పంపాడు.
Venez, montez près de moi, soyez mes auxiliaires et allons prendre Gabaon, car ses habitants se sont livrés à Josué et aux fils d'Israël.
5 ౫ కాబట్టి అమోరీయుల ఐదుగురు రాజులూ కలిసి, తమ సేనలతో బయలుదేరి, గిబియోను ముందు దిగి, గిబియోనీయులతో యుద్ధం చేశారు.
Et les cinq rois des Jébuséens se mirent en marche, le roi de Jérusalem, le roi d'Hébron, le roi de Jérimuth, le roi de Lachis et le roi d'Odollam, eux et tous leurs peuples, et ils investirent Gabaon, et ils l'assiégèrent.
6 ౬ అప్పుడు “గిబియోనీయుల కొండ ప్రాంతాల్లో నివసించే అమోరీయుల రాజులందరూ ఏకమై మాపైకి దండెత్తి వచ్చారు, కాబట్టి నీ దాసుల చెయ్యి విడిచిపెట్టక త్వరగా వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించు” అని గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువకు వార్త పంపారు.
Alors, les Gabaonites envoyèrent à Josué dans le camp d'Israël, en Galgala, disant: Ne retire pas tes mains de tes serviteurs; monte auprès de nous rapidement; viens à notre secours et délivre-nous. Car tous les rois des Amorrhéens qui habitent la montagne se sont réunis contre nous.
7 ౭ వెంటనే యెహోషువ, అతని దగ్గరున్న యోధులూ, పరాక్రమవంతులైన శూరులూ అందరూ గిల్గాలు నుండి బయలుదేరారు.
Et Josué partit de Galgala, et avec lui tous les gens de guerre, tous les hommes dans la force de l'âge.
8 ౮ అప్పుడు యెహోవా “వారికి భయపడవద్దు, వారిని నీ చేతికి అప్పగించాను, వారిలో ఎవరూ నీ ముందు నిలబడలేరు” అని యెహోషువతో చెప్పగానే,
Et le Seigneur dit à Josué: Ne les crains pas, car je les ai livrés à tes mains, et pas un d'eux ne subsistera devant vous.
9 ౯ యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతా నడచి వారి మీద హఠాత్తుగా దాడి చేశాడు.
Josué marcha donc toute la nuit, au sortir de Galgala, et parut devant eux à l'improviste.
10 ౧౦ అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజల ముందు వారిని గందరగోళానికి గురి చెయ్యగానే యెహోషువ గిబియోను ముందే మహా ఘోరంగా వారిని హతం చేశాడు. బేత్‌హోరోనుకు పైకి వెళ్ళే మార్గంలో అజేకా వరకూ, మక్కేదా వరకూ, యోధులు వారిని తరిమి హతం చేస్తూనే ఉన్నారు.
Et le Seigneur les frappa de stupeur à l'aspect des fils d'Israël; le Seigneur à Gabaon en fit un grand massacre, et Israël les poursuivit par le chemin qui descend le mont Oronin, les taillant en pièces jusqu'à Azéca et Macéda.
11 ౧౧ వారు ఇశ్రాయేలీయుల నుండి బేత్‌హోరోనుకు దిగిపోయే తోవలో పారిపోతుండగా, వారు అజేకాకు వచ్చే వరకూ యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగళ్ళను వారి మీద కురిపించాడు. కాబట్టి వారు దాని వల్ల చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తితో చంపిన వారికంటే ఆ వడగండ్ల వలన చచ్చినవారు ఎక్కువమంది అయ్యారు.
Pendant qu'ils fuyaient devant les fils d'Israël, sur les pentes du mont Oronin, le Seigneur jeta sur eux, du haut du ciel, des pierres de grêle jusqu'à Azeca, et ces pierres de grêle en tuèrent plus que les fils d'Israël n'en avaient fait périr par le glaive dans le combat.
12 ౧౨ యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు, “సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో.”
Alors, Josué parla au Seigneur, le jour même où Dieu avait livré l'Amorrhéen au bras d'Israël, lorsqu'il les eut accablés en Gabaon, et qu'ils furent écrasés devant les fils d'Israël. Et Josué dit: Que le soleil s'arrête sur Gabaon, et la lune sur le val d'Aïlon.
13 ౧౩ “ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనే వరకూ సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు” అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి ఇంచుమించు ఒక రోజంతా అస్తమించ లేదు.
Et le soleil s'arrêta, et la lune se tint en repos, jusqu'à ce que le Seigneur eut tiré vengeance des ennemis. Le soleil resta au milieu du ciel, et il ne s'avança pas du côté de l'occident, durant le cours de toute une journée.
14 ౧౪ యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు, దాని ముందు గానీ దాని తరువాత గానీ లేదు, ఆ రోజు యెహోవా, ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు.
Et il n'y eut jamais, avant ou après, pareil jour où le Seigneur écoutât ainsi un homme, parce que le Seigneur combattait avec Israël.
15 ౧౫ అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.
16 ౧౬ ఆ రాజులు ఐదు గురూ పారిపోయి మక్కేదాలో ఉన్న గుహలో దాక్కున్నారు.
Cependant, les cinq rois s'étaient échappés; ils s'étaient cachés dans la caverne de Macéda.
17 ౧౭ మక్కేదా గుహలో దాక్కున్న ఐదుగురు ఆ రాజులు దొరికారని యెహోషువకు తెలిసినప్పుడు,
Et des gens en informèrent Josué, disant: On a trouvé les cinq rois cachés dans la caverne qui est en Macéda.
18 ౧౮ యెహోషువ “ఆ గుహ ద్వారానికి అడ్డంగా పెద్ద రాళ్ళు దొర్లించి వారిని కాపలా కాయడానికి మనుషులను ఉంచండి.
Et Josué dit: Roulez des pierres à l'entrée de la caverne, et placez des hommes pour la garder.
19 ౧౯ మీరు అక్కడే ఆగిపోకండి. మీ దేవుడు యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించాడు కాబట్టి వారిని తమ పట్టణాల్లోకి తిరిగి వెళ్లనీయకుండా వారిని తరిమి, వెనుక ఉన్న వారిని కూల్చండి” అని చెప్పాడు.
Pour vous, ne cessez pas de poursuivre vos ennemis; serrez de près leur arrière-garde, et ne souffrez pas qu'ils entrent dans leurs villes, car le Seigneur Dieu les a livrés à nos mains.
20 ౨౦ వారు పూర్తిగా నశించే వరకూ యెహోషువ, ఇశ్రాయేలీయులు గొప్ప జనసంహారం చేసి వారిని వధించిన తరువాత వారిలో తప్పించుకొన్న కొద్దిమంది, ప్రాకారాలు ఉన్న పట్టణాల్లోకి చొరబడిపోయారు.
Lorsque Josué et les fils d'Israël eurent achevé cet immense carnage, ils s'arrêtèrent enfin, et ceux qui avaient pu fuir se réfugièrent dans leurs places fortifiées.
21 ౨౧ ప్రజలందరూ మక్కేదాలో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడటానికి ఎవరికీ గుండెల్లేక పోయాయి.
De son côté, tout le peuple d'Israël retourna sain et sauf en Macéda, et rejoignit Josué; pas un des fils d'Israël ne souffla mot.
22 ౨౨ యెహోషువ “ఆ గుహకు అడ్దం తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నాదగ్గరికి తీసుకు రండి” అని చెప్పగానే,
Alors, Josué dit: Ouvrez la caverne, faites-en sortir les cinq rois, et me les amenez.
23 ౨౩ వారు అలా చేసి, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు-ఈ ఐదుగురినీ ఆ గుహలో నుండి అతని దగ్గరికి తీసుకువచ్చారు.
Et l'on amena de la caverne les cinq rois: le roi de Jérusalem, le roi d'Hébron, le roi de Jérimuth, le roi de Lachis et le roi d'Odollam.
24 ౨౪ వారు ఆ రాజులను యెహోషువ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, తనతో యుద్ధానికి వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో “మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడలపై మీ పాదాలను ఉంచండి” అని చెప్పగా, వారు దగ్గరికి వచ్చి వారి మెడలపై తమ పాదాలను ఉంచారు.
Lorsqu'on les eut amenés devant Josué, il convoqua tout Israël, et il dit aux chefs des combattants, à ceux qui marchaient auprès de lui: Avancez, et mettez-leur le pied sur le cou. Et ils s'avancèrent, et ils mirent le pied sur le cou des cinq rois.
25 ౨౫ అప్పుడు యెహోషువ వారితో “మీరు భయపడవద్దు, జడియవద్దు, ధీరత్వంతో ధైర్యంగా ఉండండి, మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు” అన్నాడు.
Et Josué dit aux siens: N'ayez ni crainte ni faiblesse; soyez forts, agissez en hommes, car le Seigneur traitera de même tous les ennemis que vous aurez à combattre.
26 ౨౬ తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరితీశాడు, వారి శవాలు సాయంకాలం వరకూ ఆ చెట్ల మీద వేలాడుతూనే ఉన్నాయి.
Puis, Josué tua les rois; il les suspendit à cinq croix, et ils y restèrent jusqu'au soir.
27 ౨౭ పొద్దుగుంకే సమయంలో యెహోషువ అనుమతి ఇయ్యగా ప్రజలు చెట్ల మీద నుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడేసి ఆ గుహ ద్వారం దగ్గర పెద్ద రాళ్లను వేశారు. ఆ రాళ్లు ఈ రోజు వరకూ ఉన్నాయి.
Vers le coucher du soleil, Josué ordonna de les détacher; on les jeta dans la caverne où ils s'étaient enfuis, et l'on roula devant la caverne des pierres qui y sont encore aujourd'hui.
28 ౨౮ ఆ రోజు యెహోషువ మక్కేదాను వశం చేసుకుని దాని రాజుతో సహా అందులోని వారందరినీ కత్తితో చంపేశాడు. అతడు దానిలో ఎవరినీ ప్రాణాలతో వదలకుండా నిర్మూలం చేసాడు. యెరికో రాజుకు చేసినట్టు మక్కేదా రాజుకూ చేశాడు.
Ce jour-là même, Israël prit Macéda, où il passa au fil de l'épée et extermina tout ce qui avait souffle de vie; nul n'y fut épargné, nul ne s'en échappa; et Israël traita le roi de Macéda comme il avait traité le roi de Jéricho.
29 ౨౯ యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నావారితో యుద్ధం చేశారు.
Après cela, Josué, et avec lui tout Israël, partirent de Macéda pour Lebna, qu'ils assiégèrent.
30 ౩౦ యెహోవా దానినీ, దాని రాజునూ, ఇశ్రాయేలీయులకు అప్పగించగా వారు ఎవ్వరూ మిగలకుండా దాన్నీ, దానిలో ప్రాణాలతో ఉన్నవారందరినీ కత్తితో చంపేశారు. అతడు యెరికో రాజుకు చేసినట్టు దాని రాజుకూ చేశారు.
Et le Seigneur la livra aux mains d'Israël; ils la prirent, et prirent son roi; ils passèrent au fil de l'épée tout ce qui avait souffle de vie; nul n'y fut épargné, nul ne s'en échappa, et ils traitèrent le roi de Lebna comme ils avaient traité le roi de Jéricho.
31 ౩౧ తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులందరితో లిబ్నా నుండి లాకీషుకు వచ్చి అక్కడ దిగి లాకీషు వారితో యుద్దం చేయగా
Après cela, Josué, et avec lui tout Israël, partirent de Lebna pour Lachis, qu'ils investirent et assiégèrent.
32 ౩౨ యెహోవా లాకీషుని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు. వారు రెండవ రోజు దాన్ని ఆక్రమించుకుని తాము లిబ్నాకు చేసినట్టే దాన్నీ, దానిలో ఉన్న వారందరినీ కత్తితో చంపేశారు.
Et le Seigneur livra Lachis aux mains d'Israël; ils la prirent le second jour; ils la passèrent au fil de l'épée, et ils la détruisirent comme ils avaient détruit Lebna.
33 ౩౩ లాకీషుకు సహాయం చేయడానికి గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ అతన్నీ అతని ప్రజలనూ హతం చేశాడు.
Alors, Elam, roi de Gazer, s'avança au secours de Lachis; mais Josué la passa, ainsi que tout son peuple, au fil de l'épée, au point de ne pas laisser un seul survivant ni un seul fuyard.
34 ౩౪ తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ముందు దిగి దాని నివాసులతో యుద్ధం చేసి
Après cela, Josué, et avec lui tout Israël, partirent de Lachis pour Odollam, qu'ils investirent et assiégèrent.
35 ౩౫ ఆ రోజు దాన్ని ఆక్రమించుకుని, కత్తితో వారిని హతం చేశారు. అతడు లాకీషుకు చేసినట్టే వారు దానిలో ఉన్నవారందరినీ ఆ రోజు నిర్మూలం చేశారు.
Et le Seigneur la livra aux mains d'Israël; il la prit ce jour-là même, et il passa au fil de l'épée tout ce qui avait souffle de vie, comme il avait fait à Lachis.
36 ౩౬ అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని ప్రజలతో యుద్ధం చేసి
En suite, Josué, et avec lui tout Israël, partirent pour Hébron, qu'ils investirent.
37 ౩౭ దాన్ని స్వాధీనం చేసుకుని దాన్నీ దాని రాజునూ దాని పట్టణాలన్నిటినీ దానిలో ఉన్న వారందరినీ కత్తితో హతం చేశారు. అతడు ఎగ్లోనుకు చేసినట్టే దాన్నీ దానిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేశారు.
Ils y passèrent au fil de l'épée tout ce qui avait souffle de vie; nul ne fut épargné; comme à Odollam, ils détruisirent la ville et tout ce qu'elle renfermait.
38 ౩౮ అక్కడి నుండి యెహోషువ, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరు దెబీరు వైపు తిరిగి దానితో యుద్ధం చేసి
Ensuite, Josué, et avec lui tout Israël, se tournèrent sur Dabir, qu'ils investirent,
39 ౩౯ దానినీ దాని రాజునూ దాని సమస్త పట్టణాలనూ పట్టుకుని కత్తి చేత హతం చేసి దానిలో ఉన్న వారినందరినీ నిర్మూలం చేశారు. అతడు హెబ్రోనుకూ లిబ్నాకూ దాని రాజుకూ చేసినట్లు, దెబీరుకూ దాని రాజుకూ చేశాడు.
Ils la prirent ainsi que son roi et ses bourgades; ils la passèrent au fil de l'épée; ils détruisirent la ville et tout ce qui en elle avait souffle de vie; ils n'y laissèrent pas un seul survivant; ils la traitèrent, elle et son roi, comme ils avaient traité Hébron et le roi d'Hébron.
40 ౪౦ తరువాత యెహోషువ పర్వత ప్రాంతాలనూ, దక్షిణ ప్రదేశాన్నీ షెఫేలా ప్రదేశాన్నీ చరియల ప్రదేశాన్నీ వాటి రాజులందరినీ జయించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన విధంగా అతడు ఏదీ మిగలకుండా ఊపిరిగల సమస్తాన్నీ నిర్మూలం చేశాడు.
Et Josué frappa toute la contrée montagneuse, et Nageb, et le plat pays, et Asedoth, et leurs rois; il n'y laissa pas un être vivant, il extermina tout ce qui avait souffle de vie, comme le lui avait prescrit le Seigneur Dieu d'Israël.
41 ౪౧ కాదేషు బర్నేయ మొదలు గాజా వరకూ గిబియోను వరకూ గోషేను దేశమంతటినీ యెహోషువ జయించాడు.
Depuis Cadès-Barné jusqu'à Gaza, et Gosom tout entière jusqu'à Gabaon,
42 ౪౨ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ సమస్త రాజులనూ వారి దేశాలనూ యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకున్నాడు.
Josué dévasta de fond en comble toute la terre, et il fit périr ses rois, parce que le Seigneur Dieu d'Israël combattait avec son peuple.
43 ౪౩ తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.