< యోనా 4 >
1 ౧ కాని, ఇది యోనా దృష్టిలో చాలా తప్పుగా అనిపించింది. అతడు కోపంతో మండిపడ్డాడు.
És igen rossznak látszék ez Jónás előtt, és megharaguvék.
2 ౨ కాబట్టి యోనా యెహోవాను ఇలా ప్రార్ధించాడు. “నేను నా దేశంలో ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందని చెప్పాను గదా! అందుకే నేనే మొదట తర్షీషుకు పారిపోడానికి ప్రయత్నించాను. ఎందుకంటే, నువ్వు కృపగల దేవుడివనీ, జాలిగల వాడివనీ, త్వరగా కోపగించే వాడివి కాదనీ, పూర్తిగా నమ్మదగిన వాడివనీ, నశింపజేయడానికి వెనుకంజ వేసేవాడివనీ నాకు తెలుసు.
Könyörge azért az Úrhoz, és mondá: Kérlek, Uram! Avagy nem ez vala-é az én mondásom, mikor még az én hazámban valék? azért siettem, hogy Tarsisba futnék, mert tudtam, hogy te irgalmas és kegyelmes Isten vagy, nagy türelmű és nagy irgalmasságú és a gonosz miatt is bánkódó.
3 ౩ కాబట్టి, యెహోవా, ఇప్పుడు నా ప్రాణం తీసెయ్యమని బతిమాలుతున్నాను. ఎందుకంటే నేను బతకడం కంటే చావే మేలు.”
Most azért Uram, vedd el, kérlek, az én lelkemet én tőlem, mert jobb meghalnom, mintsem élnem!
4 ౪ అందుకు యెహోవా “నువ్వు అంతగా కోపించడం న్యాయమా?” అని అడిగాడు.
Az Úr pedig mondá: Avagy méltán haragszol-é?
5 ౫ అప్పుడు యోనా ఆ పట్టణం నుంచి వెళ్లి దానికి తూర్పుగా ఒకచోట కూర్చున్నాడు. అక్కడ ఒక పందిరి వేసుకుని, పట్టణానికి ఏమి సంభవిస్తుందో చూద్దామని, ఆ పందిరి నీడలో కూర్చున్నాడు.
Majd kiméne Jónás a városból, és üle a város keleti része felől, és csinála ott magának hajlékot, és üle az alatt az árnyékban, a míg megláthatná, mi lészen a városból?
6 ౬ యెహోవా దేవుడు ఒక మొక్కను సిద్ధం చేసి, అతనికి కలిగిన బాధ పోగొట్టడానికి, అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చేలా చేశాడు. ఆ మొక్కను బట్టి యోనా చాలా సంతోషించాడు.
Az Úr Isten pedig egy tököt rendele, és felnöve az Jónás fölé, hogy árnyékot tartson feje fölött és megoltalmazza őt a hévség bántásától. És nagy örömmel örvendezék Jónás a tök miatt.
7 ౭ మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధంచేసి ఉంచాడు. అది ఆ మొక్కను పాడు చేయగా అది వాడిపోయింది.
De másnapra férget rendele az Isten hajnal-költekor, és megszúrá az a tököt, és elszárada.
8 ౮ ఆ తరువాత రోజు సూర్యోదయం అయినప్పుడు, దేవుడు తూర్పునుండి వీచే వడగాలిని సిద్ధం చేశాడు. యోనాకు ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయాడు. “బతకడం కంటే చావడమే నాకు మేలు” అని తనలో తాను అనుకున్నాడు.
És lőn napköltekor, hogy tikkasztó keleti szelet rendele Isten, és a nap rátűzött a Jónás fejére, és ő elbágyada. Kiváná azért magának a halált, és monda: Jobb halnom, mint élnem!
9 ౯ అప్పుడు దేవుడు యోనాతో “ఈ మొక్క గురించి నువ్వు అంతగా కోపపడడం భావ్యమేనా?” అన్నాడు. యోనా “చచ్చి పోయేటంతగా కోపపడడం భావ్యమే” అన్నాడు.
És monda az Isten Jónásnak: Avagy méltán haragszol-é a tök miatt? És monda: Méltán haragszom, mind halálig!
10 ౧౦ అందుకు యెహోవా “నువ్వేమాత్రం కష్టపడకుండా, పెంచకుండా దానికదే పెరిగిన మొక్క మీద నువ్వు జాలిపడుతున్నావే. అది ఒక రాత్రిలోనే పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయింది.
Az Úr pedig monda: Te szánod a tököt, a melyért nem fáradtál és a melyet nem neveltél, a mely egy éjjel támadt és más éjjel elveszett:
11 ౧౧ అయితే నీనెవె మహా పట్టణంలో కుడి ఎడమలు తెలియని లక్షా ఇరవై వేల కంటే ఎక్కువమంది ప్రజలున్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. దాని గురించి నేను జాలిపడవద్దా?” అని అతనితో అన్నాడు.
Én pedig ne szánjam Ninivét, a nagy várost, a melyben több van tizenkétszer tízezer embernél, a kik nem tudnak különbséget tenni jobb- és balkezük között, és barom is sok van?!