< యోనా 1 >
1 ౧ యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు.
I було́ слово Господнє до Йо́ни, Аміттаєвого сина, таке:
2 ౨ “నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.”
„Устань, іди до Ніневі́ї, великого міста, і проповідуй проти нього, бо їхнє зло прийшло перед лице Моє“.
3 ౩ కానీ యోనా యెహోవా సన్నిధినుంచి పారిపోయి తర్షీషు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. యొప్పేకు వెళ్లి తర్షీషుకు వెళ్ళే ఒక ఓడ చూశాడు. ప్రయాణానికి డబ్బులిచ్చి, యెహోవా సన్నిధినుంచి దూరంగా తర్షీషు వెళ్లి పోవడానికి ఆ ఓడ ఎక్కాడు.
І встав Йо́на, щоб утекти до Тарші́шу з-перед Господнього лиця. І зійшов він до Яфи, і знайшов корабля́, що йшов до Тарші́шу, і дав заплату його, і ввійшов у нього, щоб відпли́сти з ними до Таршішу з-перед Господнього лиця.
4 ౪ అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది.
А Госпо́дь кинув сильного вітра на море, — і зняла́ся на морі велика буря, і вже ду́мали, що корабель буде розбитий.
5 ౫ అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు.
І налякалися моряки́, і кликали кожен до своїх богі́в, і викидали ті речі, що були́ на кораблі, до моря, щоб полегши́ти себе. А Йо́на зійшов до спо́ду корабля́, і ліг, і заснув.
6 ౬ అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు.
І приступив до нього керівни́к корабля, та й сказав йому: „Чого ти спиш? Уставай, заклич до свого Бога, — може згадає цей Бог про нас, і ми не зги́немо“.
7 ౭ అంతలో నావికులు “ఎవర్ని బట్టి ఇంత కీడు మనకు వచ్చిందో తెలుసుకోడానికి మనం చీట్లు వేద్దాం రండి” అని ఒకరితో ఒకరు చెప్పుకుని, చీట్లు వేశారు. చీటీ యోనా పేరున వచ్చింది.
І сказали вони один до о́дного: „Ідіть, і киньмо жеребки́, та й пізна́ємо, через ко́го нам оце лихо“. І кинули вони жеребки́, — і впав жеребо́к на Йо́ну.
8 ౮ కాబట్టి వాళ్ళు “ఎవరి కారణంగా ఈ కీడు మనకు వచ్చిందో మాకు చెప్పు. నీ ఉద్యోగం ఏంటి? నువ్వెక్కడనుంచి వచ్చావు? నీది ఏ దేశం? ఏ జనం నుంచి వచ్చావు?” అని యోనాని అడిగారు.
І сказали до нього: „Об'яви ж нам, через що́ нам це лихо? Яке твоє зайня́ття, і звідки ти йдеш? Який твій край, і з якого ти наро́ду?“
9 ౯ అతడు వాళ్ళతో ఇలా అన్నాడు. “నేను హెబ్రీయుణ్ణి. సముద్రానికీ భూమికీ సృష్టికర్త, ఆకాశంలో ఉన్న దేవుడు అయిన యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాణ్ణి.”
І сказав він до них: „Я євре́й, і боюся я Го́спода, Небесного Бога, що вчинив море та суході́л“.
10 ౧౦ వాళ్ళు మరింత భయపడి అతనితో “నువ్వు చేసిన పని ఏమిటి?” అన్నారు. ఎందుకంటే తాను యెహోవా సన్నిధినుంచి పారిపోతున్నట్టు అతడు వాళ్లకు చెప్పాడు.
І налякалися ті люди великим стра́хом, і сказали до нього: „Що́ це ти наробив?“Бо ці люди дові́далися, що він утікає з-перед Господнього лиця, бо він це їм об'яви́в.
11 ౧౧ అప్పుడు వాళ్ళు యోనాతో “సముద్రం మాకోసం నిమ్మళించేలా మేము నీకేం చెయ్యాలి?” అని అడిగారు. ఎందుకంటే సముద్రం ఇంకా భీకరమౌతూ ఉంది.
І вони сказали до нього: „Що́ ми зробимо тобі, щоб утихоми́рилось море, щоб не залива́ло нас?“Бо море бушува́ло все більше.
12 ౧౨ యోనా “నా కారణంగానే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిందని నాకు తెలుసు. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మళిస్తుంది” అని వాళ్లకు జవాబిచ్చాడు.
І сказав він до них: „Візьміть мене, і киньте мене до моря, і втихоми́риться море перед вами; бо я знаю, що через мене оця велика буря на вас“.
13 ౧౩ అయినా వాళ్ళు ఓడను సముద్రం ఒడ్డుకు చేర్చడానికి తెడ్లు చాలా బలంగా వేశారు. సముద్రం ఇంకా చెలరేగుతూ ఉండడం వలన అలా చెయ్య లేకపోయారు.
І міцно гребли́ ці люди, щоб дістатися до суходо́лу, та не могли, бо море бушувало все більш проти них.
14 ౧౪ కాబట్టి వాళ్ళు యెహోవాకు ఇలా మొర్రపెట్టారు. “ఈ మనిషిని బట్టి మమ్మల్ని నాశనం చెయ్యవద్దు. అతని చావుకు మా మీద దోషం మోప వద్దు. ఎందుకంటే యెహోవా, నువ్వే నీ ఇష్టప్రకారం ఇలా జరిగించావు.”
І вони кли́кнули до Господа та й сказали: „О Господи, нехай же не згинемо ми за душу цього чоловіка, і не давай на нас непови́нної крови, бо Ти, Господи, чиниш, як бажаєш!“
15 ౧౫ ఇలా అని వాళ్ళు యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. పడేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది.
І підняли́ вони Йону, і кинули його до моря, — і спини́лося море від своєї лю́тости.
16 ౧౬ అప్పుడు వాళ్ళు యెహోవాకు ఎంతో భయపడి, ఆయనకు బలులు అర్పించి మొక్కుబళ్లు చేశారు.
І налякалися ці люди Господа великим стра́хом, і прино́сили Господе́ві жертви, і складали обі́тнищі.
17 ౧౭ ఒక పెద్ద చేప యోనాను మింగడానికి యెహోవా నియమించాడు. యోనా మూడు రోజులు, మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు.
І призна́чив Госпо́дь велику рибу, щоб вона проковтну́ла Йону. І був Йона в сере́дині цієї риби три дні та три ночі.